Independence Day 2024
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతో విలువైనవి: సీజేఐ
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. -
Independence Day 2024: ఐదో వరుసలో రాహుల్
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ముందు వరుసలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మండిపడింది. ‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్ షా, జేపీ నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది. -
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్‌కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
ఒలింపిక్స్-2036 ఆతిథ్యానికి భారత్ సన్నద్ధం: ప్రధాని మోదీ
భారత్ వేదికగా విశ్వ క్రీడలు నిర్వహించాలన్న ఆశయానికి చేరువవుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ప్యారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే విశ్వ క్రీడలు నిర్వహించాలన్న భారత్ కల సమీప భవిష్యత్తులో నెరవేరనుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.వారికి అభినందనలుఈ మేరకు.. ‘‘ఒలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేసిన యువ అథ్లెట్లు ఈరోజు మనతో ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారందరికీ అభినందనలు. మరికొన్ని రోజుల్లో భారత్ నుంచి మరో అతిపెద్ద బృందం ప్యారిస్‌కు వెళ్లబోతోంది. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు భాగం కాబోతున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు.జీ20 సమావేశం నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. తద్వారా ప్రపంచస్థాయి ఈవెంట్లను మనం సమర్థవంతంగా పూర్తిచేయగలమని నిరూపించబోతున్నాం. అదే విధంగా.. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఆరు పతకాలకు పరిమితంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పది పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రీడా బృందం కేవలం ఆరింటికే పరిమితమైంది. షూటింగ్లో మనూ భాకర్‌కు వ్యక్తిగత కాంస్యంతో పాటు.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మరో కాంస్య పతకం దక్కింది. అదే విధంగా.. త్రీ రైఫిల్ పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్యం, రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం లభించాయి. ఇక టోక్యో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానానికి పరిమితమై రజతం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి ప్యారిస్ వేదికగా పారాలింపిక్స్ మొదలుకానున్నాయి. ఇక ఒలింపిక్స్-2028కు అమెరికాలో జరుగనున్నాయి.చదవండి: వినేశ్‌కు చుక్కెదురు -
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు.. 77 మంది మహిళా పైలట్ల నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్‌బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్‌బస్ ఫ్లీట్‌కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్‌కు 5 మంది మహిళా పైలట్లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు -
అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా
అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది. ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్‌ను విరమించుకుంది. These are the areas in #Assam claimed by ULFA (I) where bombs have been allegedly planted1. In an old car lying at the DTO office in Shivsagar2. Shivsagar BG Road ONGC 5th gate crossing the old ambulance on the roadside3. Lakua Tin Ali, near the police station4. Assam… pic.twitter.com/QijCEdFMFD— Nibir Deka (@nibirdeka) August 15, 2024పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది. -
మహిళా ఉద్యోగులకు శుభవార్త.. నెలసరి సెలవులపై కీలక ప్రకటన!
దేశంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కటక్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని అన్నారు. Menstrual LeaveDeputy CM @PravatiPOdisha announces 1-day menstrual leave for working women in both Government & Private sectors pic.twitter.com/D2L91YXtqr— Soumyajit Pattnaik (@soumyajitt) August 15, 2024 ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాదు, నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని గత నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. -
ఎర్రకోట వేదికగా కేంద్రం రాహుల్ గాంధీని అవమానించిందా?
ఢిల్లీ : ఎర్రకోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరుదైన ఘనత సాధించారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేంద్రం సరైన గౌరవం ఇవ్వలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడకలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ చివరి వరుసలో ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నట్లు కనిపించారు. ముందు వరుసలో ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ ఉన్నారు. ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్,పీఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ కంటే ముందు భాగంలో కూర్చున్నారు.For first time in 10yrs a leader of opposition attended the Independence Day celebrations in Delhi, but he wasn't offered the front row seat as per protocol@RahulGandhi was made to sit in 2nd last row behind Olympians, even though the Leader of opposition rank is equivalent to… pic.twitter.com/7tF9GZsUTe— Nabila Jamal (@nabilajamal_) August 15, 2024 ప్రోటోకాల్ ప్రకారం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి, క్యాబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయించబడుతుంది. ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్,అమిత్ షా,ఎస్ జైశంకర్ ఉన్నారు.స్పందించిన కేంద్రం రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో చర్చలు జరగడంతో, ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో రాహుల్ గాంధీ సీటును వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత.అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూఅటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ.. ఆ తరువాత బీజేపీ హయాంలోనూ.. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానం 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఎందుకంటే దిగువ సభ బలంలో పదో వంతు మెజారిటీని ఏ పార్టీ సాధించడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2014, 2019 ఎన్నికలలో 543 మంది సభ్యుల సభ కాంగ్రెస్ వరుసగా 44,52 స్థానాలను గెలుచుకుంది. దీంతో దశాబ్ధ కాలం పాటు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి తగ్గలేదు. మొత్తానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినా సరే..రాహుల్ సీటును ఎన్డీఏ చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Independence Day: త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi— Prashant rai (@prashantrai280) August 15, 2024 -
ప్రపంచంలోనే బలమైన బ్యాంకులు
భారతదేశ 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతకాన్ని ఎగరవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించిన ప్రసంగించారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వ కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. గతంలో బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొన్నా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలోని కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులున్నాయన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న భారతీయ బ్యాంకులు బలంగా మారాయి. గతంలో బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. వృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు తీసుకొచ్చింది. నేడు ఆ సంస్కరణల కారణంగా బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులు ఉన్నాయి. మధ్యతరగతి, రైతులు, గృహ కొనుగోలుదారులు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈ రంగాల అవసరాలను తీర్చడానికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకంగా మారింది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం -
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ఎన్సీసీ.. దేశ సేవకు మేము సైతం..!
నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సంస్థ. ఇది భారత సాయుధ దళాల అంతర్భాగం. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది పాఠశాల స్థాయిలో మొదలై డిగ్రీ విద్యార్థులను కేడెట్స్‌గా సెలెక్ట్ చేసుకొని శిక్షణ అందిస్తారు. వీరికి డ్రిల్, ఆయుధాల వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చి ఏ, బీ, సీ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌వింగ్‌లో ఎన్సీసీ పూర్తి చేసిన వారికి రిజర్వేషన్ కల్పిస్తారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశసేవకు మేముసైతం అంటున్న ఎన్సీసీ క్యాడెట్లపై సాక్షి ప్రత్యేక కథనం.. – రసూల్పురాస్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్యం, నావిక దళం, ఎయిర్‌ఫోర్స్ ట్రై సరీ్వసెస్‌లో శిక్షణ అందజేయడం కోసం ఏర్పడిన భారత సాయుధ దళాల యువ విభాగం నేషనల్ క్యాడేట్ కార్ప్స్(ఎన్సీసీ). మన భారత దేశ సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో భారత రక్షణ చట్టం ప్రకారం 1948లో ఎన్సీసీ ఏర్పాటైంది. 1949లో బాలికల విభాగం, 1950లో ఎయిర్‌వింగ్, 1952లో నేవీ వింగ్ ఏర్పడ్డాయి. 1962 చైనా– ఇండియా యుద్ధం తర్వాత దేశం అవసరాన్ని తీర్చడానికి 1963లో ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాల్లో, డ్రిల్ తదితర అంశాల్లో శిక్షణ తప్పనిసరి చేశారు. తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్‌లో 9 గ్రూపులు..1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్సీసీ స్థాపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టివోలీ థియేటర్ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ కమోడోర్ వీఎం.రెడ్డి ఉన్నారు.ఎన్సీసీ క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ..తొమ్మిది గ్రూపుల పరిధిలోని వివిధ బెటాలియన్లు, పాఠశాల, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ లేదా బాటిల్ క్రాఫ్ట్, ఫైరింగ్‌తో పాటు క్రమశిక్షణ, యోగా, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విషయాలపై నిపుణులతో ఉపన్యాసాలు, క్రీడా పోటీలు, వ్యర్థాలను రిసైక్లింగ్ చేసే పద్ధతులు, కెరీర్ కౌన్సిలింగ్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్, రక్తదానం, వివిధ అంశాలపై అవగాహన ర్యాలీలు తదితర వాటిల్లో క్యాడెట్లకు తర్ఫీదు అందజేస్తారు.ఎన్సీసీ క్యాడెట్లకు ప్రయోజనాలు..ఏ-సర్టిఫికెట్ – జూనియర్ వింగ్ లేదా జూనియర్ క్యాడెట్ల విభాగంలో 2 సంవత్సరాల ఎన్సీసీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు ఏ సరి్టఫికెట్ అందజేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు జరుగుతాయి.బీ-సర్టిఫికెట్ – పాఠశాల, కళాశాలల తరఫున సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్లకు రెండు సంవత్సరాల కోర్సు పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు బి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు.సీ-సర్టిఫికెట్ – ఎన్సీసీలో సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్ల విభాగంలో మూడు సంవత్సరాల కోర్సు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు సీ సర్టిఫికెట్ జారీచేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. డిఫెన్స్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు సీ సరి్టఫికెట్ ఉపయోగపడుతుంది. వీరికి ఆర్మీ వింగ్‌లో 3–15 శాతం, నేవీలో 05–08, ఎయిర్‌వింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఇక క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అకాడమిక్ ఇయర్లో క్యాడెట్లకు రూ.6 వేల ఉపకార వేతనం, అత్యుత్తమ క్యాడెట్‌కు రూ.4,500, ద్వితియ అత్యుత్తమ క్యాడెట్లకు రూ.3,500 ప్రోత్సహకాలు అందజేస్తున్నారు.అవకాశాలు ఉంటాయి.. శిక్షణ పొంది వివిధ ఎన్సీసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఎన్సీసీ క్యాడెట్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాలు అందజేస్తోంది. సీ సరి్టఫికెట్లు సాధించిన క్యాడెట్లకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిజర్వేషన్లు ఉంటాయి. ఏ, బీ సరి్టఫికెట్లు పొందిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.– వి.ఎం.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించి స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెండా ఎగురవేశారు.తూర్పు నావికా దళంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ: తూర్పు నావికా దళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేవీ మార్చ్, నేవీ బెటాలియన్ బ్యాండ్ కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను నేవీ అధికారులు స్మరించుకున్నారు. న తూర్పు నావికా దళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశం మొత్తం నావికా దళంలో తూర్పు నావికా దళం చాలా కీలకమని రాజేష్ పెందర్కర్ అన్నారు.‘‘దేశ సేవ చేసే గొప్ప అవకాసం రావటం మన అదృష్టం. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి ఉండాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు దుసుకెళ్తున్నాం. క్రమశిక్షణ, పట్టుదల, విజయం నేవీ సొంతం. దేశ ప్రగతిలో నేవీ స్థానం కీలకం’’ అని రాజేష్ పెందర్కర్ చెప్పారు. -
Independence Day: ప్రధాని మోదీ తలపాగా ప్రత్యేకత ఇదే
దేశంలోని వాడవాడలా ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ తన వేషధారణ, ప్రత్యేక తలపాగాతో వార్తల్లో నిలుస్తుంటారు.ప్రధాని మోదీ తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మోదీ తన మొదటి టర్మ్ (2014) నుండి తన మూడవ టర్మ్ (2024) వరకు ప్రతి సంవత్సరం వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని మోదీ కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.ప్రధాని మోదీ తలపాగాలో పలు రంగులు ఉన్నప్పటికీ, కాషాయ రంగు ఎక్కువగా కనిపిస్తోంది. కాషాయ వర్ణం శ్రీరామునికి ఇష్టమైన రంగుగా చెబుతారు. మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ తలపాగా ధరించి శ్రీరామునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. -
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి... స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని పేర్కొన్నారు.రాజ్‌భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఇరిగేషన్, ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకు వెళ్తుందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.అహింస, సత్యాగ్రహం అనే శక్తివంతమైన ఆయుధాల వల్ల దేశానికి స్వాతంత్ర సాధన సాధ్యమైంది. గాంధీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడింది. బ్రిటిష్ రూల్ నుంచి విముక్తి లభించింది. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఎదగడం మనందరికీ గర్వకారణం’’ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. -
18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అరుదైన రికార్డు సాధించారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్ కుమార్ 18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి బీహార్ సీఎంగా ఆయన ఘనత సాధించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం ఆయన ఆ జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా సీంఎ నితీష్ కుమార్ మాట్లాడుతూ నేడు మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, కొన్ని వందల మంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అనంతం ఆయన బీహార్ ప్రభుత్వం సాధించిన అభిృద్ధి గురించి వివరించారు. బాలికల విద్య, పోలీసుశాఖలో మహిళల నియామకం, ఉపాధ్యాయుల నియామకంలో ప్రభుత్వం ఎంతో చొరవచూపిందన్నారు. బీపీఎస్సీ ద్వారా రెండు లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు.రోగులకు ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో దీదీకి రసోయ్‌ను ప్రారంభించామని సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాట్నాలో ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపారని, దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. పట్నాలో ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలతో సహా అనేక కొత్త రోడ్లను నిర్మించామని తెలిపారు. Patna, Bihar: On the occasion of the 78th Independence Day, Chief Minister Nitish Kumar hoisted the flag at his residence on 1 Anne Marg pic.twitter.com/I8CqqCULsO— IANS (@ians_india) August 15, 2024 -
పంద్రాగస్టు వేడుకలు : జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వాట్సప్ స్టేటస్లు కాదు..వీరి గురించి తెలుసా..
స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఒకరోజు సెలవు.. స్కూల్లో చాక్లెట్లు.. వాట్సప్‌లో స్టేటస్లు అనుకుంటున్నారేమో. ఇంట్లో విభిన్న మనస్తత్వాలున్న కుటుంబ సభ్యులను ఒప్పించి మనకు ఇష్టమైన పని చేయాలంటే ఎంత కష్టమో తెలుసుకదా. అలాంటిది మన ఊరు..పట్టణం..జిల్లా..రాష్ట్రం..దేశంలోని కోట్ల ప్రజలను ఏకధాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహానుభావులకు వందనాలు. వారి కష్టఫలానికి గుర్తుగా కొందరు వ్యక్తులు బాగా చదివి వ్యాపారంలో రాణించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. భారత్ పేరును ప్రపంచానికి చాటుతున్నారు. అందులో కొందరి గురించి తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా..ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కలిగిన వారికి భారత్ నెలవుగా మారింది. దాంతో గ్లోబల్‌గా ఆధిపత్యం చలాయిస్తున్న కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవల్, మేనేజర్ స్థాయి ఉద్యోగులుగా వెళ్లినవారు కంపెనీల్లో టాప్ స్థాయికి చేరి ఏకంగా సీఈఓలు, ఛైర్మన్లుగా ఎదుగుతున్నారు.అల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈవో, సుందర్పిచాయ్సుందర్పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్.తమిళనాడులోని అశోక్ నగర్లో 1972 జులై 12న జన్మించారు.ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంగా బీటెక్ చేశారు.1993లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.గూగుల్‌లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో పనిచేశారు.2004లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు.2015లో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు.నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్హైదరాబాద్లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి.సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు.సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.ఆన్లైన్ సర్వీసెస్ విభాగానికి ఆర్ అండ్ డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రోసాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత కంపెనీ చరిత్రలో మూడో సీఈఓగా 4 ఫిబ్రవరి 2014న నియమితులయ్యారు.శాంతను నారాయణ్, అడోబ్ ఇంక్ ఛైర్మన్, సీఈవోహైదరాబాద్లో 1963లో జన్మించారు.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.1998లో అడోబ్‌లో వరల్డ్‌వైడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.2001 నుంచి 2005 వరకు అడోబ్ ప్రపంచవ్యాప్త ఉత్పత్తులకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.2005లో ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.నవంబర్ 2007లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.అజయ్‌పాల్ సింగ్ బంగా, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్అజయ్ బంగా 1959 నవంబరు 10న మహారాష్ట్ర పుణెలోని ఖడ్కీ కంటోన్మెంట్లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు.ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఆర్మీ అధికారి.అజయ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) నుంచి మేనేజ్మెంట్లో పీజీపీ(ఎంబీఏతో సమానం) పూర్తి చేశారు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ అందించింది.ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా 2023 మే 3న ఎన్నికయ్యారు.గీతా గోపీనాథ్, డిప్యూటీ ఎండీ ఐఎంఎఫ్గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పుట్టారు.2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.2019-2022 వరకు ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు.అరవింద్ కృష్ణ, ఐబీఎం ఛైర్మన్, సీఈవోఅరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1962లో జన్మించారు.ఆయన తండ్రి మేజర్ జనరల్ వినోద్ కృష్ణ భారత సైన్యంలో ఆర్మీ అధికారిగా చేశారు.అరవింద్ 1985లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.1990లో ఐబీఎంలో చేరారు.ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవోగా, తర్వాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు.ఇంద్రా నూయి, పెప్సికో సీఈఓఇంద్రా అక్టోబర్ 28, 1955న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.1975లో మద్రాస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కతా నుంచి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డిప్లొమా పూర్తి చేశారు.జాన్సన్ & జాన్సన్, బార్డ్సెల్ లిమిటెడ్‌లో ప్రొడక్ట్ మేనేజర్ హోదాలతో తన కెరీర్‌ను ప్రారంభించారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా చేరారు.మోటొరోలాలో వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.1994లో పెప్సికోలో చేరారు. 2006లో సీఈఓగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓఅద్వైతి 1990లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.2005లో థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుండి MBA సంపాదించారు.2019లో ఫ్లెక్స్‌లో చేరడానికి ముందు ఈటన్, హనీవెల్‌లో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు. -
మహాకాళేశ్వరునికి విశేష హారతి.. మువ్వన్నెల వస్త్రం
నేడు(పంద్రాగస్టు) దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష హారతి ఇవ్వడంతోపాటు మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.ఈరోజు తెల్లవారుజామునే మహాకాళేశ్వరుని ముంగిట భస్మహారతి కూడా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భస్మహారతి అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నుంచే ఆలయం అంతటా ఆకర్షణీయమైన లైట్లను అలంకరించారు. దీంతో ఆలయం మూడు రంగుల కాంతితో వెలుగొందింది. ఆలయం పైభాగంలో జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని హిందూ పండుగలతో పాటు జాతీయ పండుగలను కూడా ఆలయంలో నిర్వహిస్తారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
ఇది.. సైనికుల సంగ్రామం!
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి యువకులు సైన్యం బాట పట్టారు. ఒకే ఊరి నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున సుమారుగా 92 మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు పీపుల్స్‌వార్ ఖిల్లాగా ఉన్న ఆ ఊరిని ఇప్పుడు ఆర్మీ జవాన్ల పుట్టినిల్లుగా పిల్చుకుంటున్నారు. ఆ ఊరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామం. ఆ ఊరి ముచ్చట్లలోకి వెళదామా?సుమారు 40 ఏళ్ల క్రితం కట్కూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల డేనియల్ మిలిటరీలో జవాన్ గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆర్మీలో చేరారు. జవాన్ స్థాయి నుంచి లాన్స్‌నాయక్, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం 92 మంది ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో జిల్లాలో కట్కూరు గ్రామం అంటే ఆర్మీజవాన్ ల గ్రామంగా గుర్తింపు ΄÷ందింది. ఈ గ్రామంలో 1,014 కుటుంబాలుండగా జనాభా సుమారుగా 3,045 ఉన్నారు. అందులో మొత్తం గ్రామంలో 175 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరిలో కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. – మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేటదేశసేవ ఇష్టం...దేశసేవ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 1998లో భారతసైన్యంలో చేరాను. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ బెంగళూర్‌లో ట్రైనింగ్ చేశాను. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కాశ్మీర్లో రాష్ట్రీయ విభాగంలో సేవలు అందించి అనేక టెర్రరిస్ట్ ఆపరేషన్ లలో పాల్గొన్నాను. కాశ్మీర్ సేవలను గుర్తించి నాకు సుబేదార్ మేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. – పంజా సదయ్య, సుబేదార్గర్వపడుతున్నా...దేశరక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది. – కొయ్యడ శ్రీనివాస్, ఆర్మీ జవాన్ -
పోస్టల్ స్టాంపులు.. యుద్ధం ముద్రలు!
మహిళలు ఇల్లు విడిచి బయట అడుగు పెడితే వింతగా చూసే కాలంలో సాహసమే వెన్నెముకగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది మహిళలు. వారి త్యాగాల వెలుగు చరిత్రకే పరిమితమైనది కాదు, వర్తమానంలోనూ స్ఫూర్తిని ఇస్తుంటుంది. ఎంతోమంది మహిళా స్వాతంత్య్ర సమరయో«ధుల పోస్టల్ స్టాంప్స్ విడుదల అయ్యాయి. ఈ చిన్న స్టాంప్‌లు వారి త్యాగాలు, పోరాట పటిమను ప్రతిఫలిస్తాయి. పోస్టల్ స్టాంప్స్‌పై మెరిసిన కొందరు మహిళా స్వాతంత్య్ర సమరయోధుల గురించి...రుక్మిణీ లక్ష్మీపతిఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో పుట్టింది రుక్మిణీ. గాంధీజీ ‘హరిజన సంక్షేమ ని«ధి’ కోసం తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేసింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచింది.సుభద్రా జోషిగాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితం అయిన సుభద్రా జోషి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ‘హమారా సంగ్రామ్’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసింది. సుభత్రను అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో భాగం అయింది. సుభద్ర అంకితభావాన్ని నె్రçహూ ప్రశంసించారు.రాణి మా గైడిన్లియుబ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ‘హెరాక’ ఉద్యమంలో పదమూడు సంవత్సరాల వయసులోనే పాల్గొంది రాణి మా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి మహిళగా చరిత్రకెక్కింది. ‘హెరాక’ ఉద్యమంతో పాటు ఎదుగుతూ వచ్చిన రాణి మా ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, ఆధ్యాత్మిక గురువుగా ప్రఖ్యాతి పొందింది.బేగం హజ్రత్ మహల్తొలి తరం మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్. బేగం హజ్రత్ ఇతర సంస్థానాధీశులతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించింది. ఆ తరువాత కాలంలో మాత్రం ఓటమికి గురైంది. బ్రిటిష్ వారికి చిక్కకుండా అడవుల్లో తలదాచుకొని పోరాడేది.కమలానెహ్రూజవహర్లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రూ మహిళా సాధికారత కోసం గళం విప్పిన యోధురాలు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అరెస్టై జైలుకు వెళ్లింది. ‘దేశ సేవిక’ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది.సుభద్రాకుమారి చౌహాన్సుభద్రాకుమారి చౌహాన్ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన తరువాత నాగపూర్ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహిగా చరిత్రలో నిలిచింది. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతత్య్ర పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింది.అరుణా అసఫ్ అలిభర్త అసఫ్ అలీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది అరుణ. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. కాంగ్రెస్‌పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత బ్రిటిష్ వారు విరుచుకుపడ్డారు. ప్రముఖ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో అరుణా అసఫ్ అలి కార్యకర్తలకు అండగా ఉంది. బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకునేలా చేసింది.దుర్గాబాయి దేశ్ముఖ్దుర్గాబాయి దేశ్‌ముఖ్ సాహసవంతురాలైన సామాజిక కార్యకర్త, చిన్నతనం నుంచే మహిళల హక్కుల కోసం పోరాడింది. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది. గాంధీజీ ప్రభావంతో దుర్గాబాయి మాత్రమే కాదు ఆమె కుటుంబం మొత్తం అన్ని రకాల పాశ్చాత్య దుస్తులను విడిచిపెట్టి, ఖాదీని మాత్రమే ధరించేవారు. మద్రాస్‌లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించింది.రాజ్‌కుమారీ అమృత్ కౌర్రాజ్కుమారీ అమృత్ కౌర్ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. గాంధీజీ కార్యదర్శిగా పని చేసిన ఆమె దండి మార్చ్‌లాంటి ఎన్నో జాతీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమారి ఇరవై నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. రాచరిక కుటుంబంలో పుట్టినప్పటికీ మహాత్ముడి ఆశ్రమంలో సాధారణ జీవితాన్ని గడిపింది. -
శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు... వైరల్ వీడియో
భారతదేశం నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్‌ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది. #WATCH | #IndependenceDay2024 | Lal Chowk in Jammu & Kashmir's Srinagar is all decked up as India celebrates its 78th Independence Day. pic.twitter.com/SVmzg7iqdX— ANI (@ANI) August 15, 2024 -
పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024 -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండే రోజు..: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. -
Independence Day- 2024: ఆ 13 గ్రామాల్లో తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలు
భారతదేశంలో నేటివరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలిస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో నేటి వరకూ జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఈరోజు (పంద్రాగస్టు) ఈ గ్రామాల్లో మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది.ఈ వివరాలను రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ గ్రామాల్లో నూతన భద్రతా బలగాల శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. బస్తర్ రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్రాజ్ ఈరోజు (గురువారం) నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.గత ఏడాది గణతంత్ర దినోత్సవాల అనంతరం ఈ ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. కొత్త క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం ఉదయం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేయనున్నారని అధికారులు తెలిపారు. -
భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలన్ని ప్రధాని.. దేశ అభివృద్ధి కోసం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలలకు ఓసారి ఎన్నికలు వస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధికి, వనరులకు విఘాతం కలుగుతుందన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలని ప్రజలకు సూచించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు ప్రధాని మోదీ. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబాలను నుంచి లక్షల మంది రావాలన్నారు. ఏ పార్టీ నుంచి అయినా వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికన పక్షంలో కొత్త ఆలోచనలు, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. తద్వారా వారసత్వ రాజకీయాలు, కుల, మత రాజకీయాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు👉భారత్ ప్రస్థానం ప్రపంచానికి స్పూర్తిదాయకం 👉అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగింది👉భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారత్ సంకల్పం తీసుకుంది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ నినాదం👉వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం దేశ ఆర్ధిక వ్యవ్యస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉సర్జికల్ స్ట్రైక్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు👉తయారీ రంగంలో భారత్ గ్లోబుల్ హబ్‌గా మారాలి👉భారత్ తర్వలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది👉మౌలిక సదుపాయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. 👉విదేశాలకు వెళ్లి చదివే దుస్థితిని తగ్గిస్తాం👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉దేశంలో అత్యాచారం ఘటనలను తీవ్రంగా ఖండిస్తాం👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది #WATCH | PM Narendra Modi says, "...I would like to express my pain once again, from the Red Fort today. As a society, we will have to think seriously about the atrocities against women that are happening - there is outrage against this in the country. I can feel this outrage.… pic.twitter.com/2gQ53VrsGk— ANI (@ANI) August 15, 2024👉దోషులను అంత కఠినంగా శిక్షిస్తే అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు 👉దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినా మీడియా హైలెట్ చేస్తోంది👉మాతృభాషను ఎవరు విస్మరించొద్దు👉ఉపాధి కల్పనలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం #WATCH | On the 78th Independence Day, PM Modi urges all levels of government, from panchayat to central government, to work on improving ease of living at a mission mode(Video source: PM Modi/YouTube) pic.twitter.com/zT9zVN7uNX— ANI (@ANI) August 15, 2024👉జల్ జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరరింది👉బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత వృద్దిని సాధిస్తుంది 👉ప్రపంచ స్థాయిలో మన బ్యాంకుల్ని బలోపేతం చేశాం👉యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి 👉మరో 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సంఘాల్లో చేరారు 👉కోటిమంది మహిళలను లక్షాదికారులుగా మారుస్తాం#IndependenceDay2024 | From the ramparts of Red Fort, PM Modi says, "For Viksit Bharat 2047, we invited suggestions from the countrymen. The many suggestions we received reflect the dreams and aspirations of our citizens. Some people suggested making India the skill capital, some… pic.twitter.com/vR8aG79uVw— ANI (@ANI) August 15, 2024 During his #IndependenceDay2024 speech, PM Modi says, "Be it tourism, education, health, MSME, transport, farming and agriculture sectors- in every sector a new modern system is being created. We want to move forward by adopting best practices by integration of technology."… pic.twitter.com/TNUUlcSSy0— ANI (@ANI) August 15, 2024👉దళితులు, పీడితులు,పండితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి👉జీ.20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం👉ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి భారత్ ఎదగాలి👉దేశాభివృద్దికి పాలనా సంస్కరణలు అవసరం👉అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ కల సాకరం కావాలి👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉గత కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి👉ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం👉 40కోట్ల మంది స్వాతంత్య్రం సంపాదిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.👉లక్ష్యాన్ని నిర్ధేవించుకొని ముందుకు సాగాలి👉ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టారు. 👉దేశం కోసం పోరాడిన మహనీయుల్ని స్మరించుకుందాం #WATCH | PM Modi as he left from his official residence for Red Fort to address the nation on 78th #IndependenceDay pic.twitter.com/wrPo7v9znm— ANI (@ANI) August 15, 2024 -
Independence Day- 2024: త్రివర్ణాలతో వెలిగిపోతున్న ముంబై ఎయిర్ పోర్టు
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పలు నగరాలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపధ్యంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక అద్భుతమైన వీడియో షేర్ చేశారు. త్రివర్ఱాలతో వెలిగిపోతున్న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో షేర్ చేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాన్ని ఎలా అలంకరించారో ఈ వీడియోలో చూడవచ్చు. విమానాశ్రయం అంతా త్రివర్ణ పతాకాలతో మెరిసిపోతోంది. టెర్మినల్ వెలుపల, లాబీ, లైట్ హౌస్ మొదలైనవన్నీ వెలుగులమయంగా మారాయి.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ అదానీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘మన విమానాశ్రయ టెర్మినల్స్ త్రివర్ణాలతో సగర్వంగా నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం తలుపులు మాత్రమే కాదు.. మన దేశ ప్రగతికి ప్రతీకలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా నిలుస్తామని చెప్పేందుకు, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో కొనసాగేందుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు. విమానాశ్రయంలో పలు స్తంభాలను ఎంత వైభవంగా అలంకరించారో గౌతమ్ అదానీ షేర్ చేసిన వీడియోలలో చూడవచ్చు. ఢిల్లీ తర్వాత దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ముంబై విమానాశ్రయం. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల పరంగా ఈ విమానాశ్రయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. As our nation celebrates 77 years of freedom, our airport terminals stand tall, wrapped in the proud Tricolour! Far more than just gateways, they symbolise our nation's soaring spirit, resilience and the optimism for a brighter future. @CSMIA_Official pic.twitter.com/66g0DqGYdD— Gautam Adani (@gautam_adani) August 14, 2024 -
మాటలకు అందని ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
Durgawati Devi: మూడేళ్ల కొడుకును పణంగా పెట్టి... భగత్‌సింగ్‌ను కాపాడిన భాభీ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్వీర్... వీరంతా ఆమెను ‘దుర్గా భాభీ’ అని పిలిచేవారు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో పిస్తోల్ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను హత్య చేసిన భగత్‌సింగ్‌ను లాహోర్ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తిందామె. చరిత్ర పుటలలో కనుమరుగై పోయిన ఆ త్యాగమయి గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...‘సైమన్ గోబ్యాక్’ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్ మీద బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్‌లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు ‘హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ (హెచ్ఎస్ఆర్ఏ) సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్ ఓహ్రా నడుపుతున్న గ్రూప్. చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితరులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి లాఠీచార్జిని ఆర్డర్ వేసిన బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్‌ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు పరచడమే తరువాయి.స్కాట్ బదులు సాండర్స్భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఈ ముగ్గురు 17 డిసెంబర్ 1928న లాహోర్‌లో పోలీస్ ఆఫీసర్ స్కాట్‌ను హతమార్చడానికి సిద్ధమయ్యారు. అయితే బైక్ మీద రావాల్సిన స్కాట్ కారులో, కారులోనూ రావాల్సిన మరో అధికారి సాండర్స్ బైక్ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్‌పై మొదట రాజ్‌గురు, ఆ తర్వాత భగత్ సింగ్ తుపాకీ పేల్చి అతణ్ణి హతమార్చారు. లాహోర్ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు... బస్టాండ్లు... రైల్వేస్టేషన్లు కమ్ముకున్నారు. లాహోర్‌లో ఉండటం భగత్‌సింగ్‌కు ఏ మాత్రం మంచిది కాదు. అతణ్ణి తప్పించేవారు ఎవరు?ఆమె వచ్చిందిభగవతి చరణ్ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాభాభీ అని పిలిచేవారు. సాండర్స్‌ని హత్య చేశాక భగత్‌సింగ్, రాజ్‌గురు నేరుగా దుర్గావతి దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆమె భర్త వేరే పని మీద కలకత్తా వెళ్లి ఉన్నాడు. జరిగింది తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్‌సింగ్‌ను లాహోర్ దాటించడానికి సిద్ధమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్ పెట్టి రూపం మార్చిన భగత్‌సింగ్‌కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో మరుసటి రోజు సాయంత్రం లాహోర్ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరదీసింది. వందలాది నిఘా కళ్ల మీద ఈ పని చేయడం చాలా ప్రమాదం... మూడేళ్ల కొడుక్కు కూడా ఏదైనా కావచ్చు అని భగత్‌సింగ్ ఆమెతో అన్నాడు. ‘నా కొడుక్కు మరణం సంభవిస్తే ఒక దేశభక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది’ అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్‌సింగ్ ఆధునికవేషంలో ఉన్న అధికారిగా, దుర్గావతి అతని భార్యగా, రాజ్‌గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటిష్ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్‌సింగ్‌ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కు వచ్చింది దుర్గావతి.గొప్ప దేశభక్తురాలుస్వతంత్ర పోరాటం చేస్తున్న భగవతి చరణ్ ఓహ్రాను వివాహం చేసుకునేనాటికి దుర్గావతికి 13 ఏళ్లు. పెళ్లి తర్వాతనే చదువుకుంది. ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. సాయుధ పోరాటం చేయాలన్న భర్త ఆశయానికి మద్దతుగా నిలిచిందామె. భగత్‌సింగ్‌ను తన కన్నబిడ్డలా భావించింది. భగత్‌సింగ్ పార్లమెంట్లో బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాక ఆ తర్వాతగాని అతడే సాండర్స్ హత్యలో ఉన్నాడన్న సంగతి పోలీసులకు తెలియలేదు. ఆ కేసు వాదనలను బ్రిటిష్ ప్రభుత్వం హడావిడిగా ముగించి అక్టోబర్ 7, 1930న తీర్పు వెలువరించి భగత్‌సింగ్‌కు మరణశిక్ష విధించింది. అయితే లాహోర్‌లో ఈ విచారణ జరుగుతున్నప్పుడు భగత్‌సింగ్‌ను తీసుకెళ్లే వ్యానుపై బాంబుదాడి చేసి అతణ్ణి కాపాడాలని ప్లాన్ చేసింది దుర్గావతి. వీలు కాలేదు.భర్తను కోల్పోయిభగత్సింగ్ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఞానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది దుర్గావతి. భగత్‌సింగ్ మరణశిక్ష విధించాక ఆగ్రహంతో బొంబాయి వెళ్లి బ్రిటిష్ గవర్నర్‌ను చంపాలనుకుంది. అయితే గవర్నర్ దొరకలేదు. మరో బ్రిటిష్ అధికారి మీద స్వయంగా గుళ్ల వర్షం కురిపించి పగ చల్లార్చుకుంది. భగత్ సింగ్ ఉరి (1931 మార్చి 23) తర్వాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం, పోలీసుల వెతుకులాట ఎక్కువ కావడంతో తనే వెళ్లి లొంగిపోయింది. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం మొదట లక్నో ఆ తర్వాత ఘజియాబాద్‌లో పెద్దగా పబ్లిక్‌లో ఉండటానికి ఇష్టపడక స్కూల్ నడుపుతూ 1999లో తన 92వ ఏట మరణించిందా గొప్ప దేశభక్తురాలు, భారత తొలి సాయుధ పోరాట సమరయోధురాలు దుర్గాభాభీ. -
Independence Day 2024: మేరా భారత్ మహాన్
దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.భూతల్లిపై ఒట్టేయ్... ‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు. హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారత్ మాతా కీ జై ‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు. పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.మార్టిన్... ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.అమరన్ ‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.సరిహద్దు యుద్ధం దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు. ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
26 మందికి శౌర్య, సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి. అగ్నిమాపక సర్వీస్‌కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.ప్రతిభాపూర్వక సేవా పతకాలువిష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్ఎస్జే (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రమేష్‌బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్‌కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు» ఎం.రవిప్రకాష్ (ఐజీ)» డి.డి.గంగరాజు (ఇన్స్పెక్టర్) శౌర్య పతకాలు» షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్)» సవ్వన అరుణ్‌కుమార్ (సబ్ ఇన్స్పెక్టర్)» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్) -
మనం సాధించిందీ తక్కువేమీ కాదు!
భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. వికసిత్ భారత్–2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథం ఉండటమే కాదు, దాన్ని తు.చ. అనుసరించడం అవసరం. వికసిత్ భారత్ అనేది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన వంటి వివిధ అంశాల ఆధారంగా ఉంటుంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించు కోవడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ కలలను మనం ఎంతవరకు సాధించాము? భారతదేశం తన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందా? ఇవన్నీ ఈ సందర్భంగా చర్చ నీయాంశాలే.మన దేశం 3.937 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం 2023–24లో తలసరి ఆదాయం రూ. 2.12 లక్షలు. కానీ ఇప్పటికీ మనం 5 శాతం పేదరికంతో బాధపడుతున్నాము. 2023 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం (సీఎంఐఈ) ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగం రేటు 2024 మేలో 7 శాతం ఉంటే ఆ మరుసటి నెల (జూన్)లో 9.2 శాతానికి పెరిగింది. ఒక శాతం జనాభా సంపద వాటా 2022–23లో 40.1 శాతంగా ఉంది. 2023–24లో దేశంలోని పొదుపులో 92 శాతం సంపన్నులైన 20 శాతం మంది కలిగి ఉన్నారు.వీటితో పాటు 2023లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నే షనల్ యొక్క ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం 100కి 40 శాతం అవినీతి భారంతో భారతదేశం ఉంది. భారతదేశం 2023 నాటికి తన స్థూల దేశీ యోత్పత్తిలో దాదాపు 3–4 శాతం విద్యపై ఖర్చు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై 1.2–1.5 శాతం ఖర్చు చేస్తోంది. మానవాభివృద్ధి–సంబంధిత అంశాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6–8 శాతంగా అంచనా వేయబడింది. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. సరళీకరణ ఆర్థిక వ్యవస్థలో ‘రెడ్ టేపిజం’ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగా లలో కనిపిస్తుంది. అయితే ఇది వ్యాపారం, రాజకీ యాలు, క్రీడలు, వినోద రంగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వర కట్నం, ఆడ శిశుహత్య, లింగ అసమానత్వం, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచా రాలతో కునారిల్లుతున్నాం.మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో; మొబైల్ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ ర్యాంక్ కలిగి ఉంది. బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్‌పుట్ మరియు స్పేస్‌లో 5వ స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది, 14వ అతిపెద్ద ఎగుమతిదారు మన దేశం. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐటీ పరిశ్రమ పోటీ తత్వంలో18వ ర్యాంక్, హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో 30వ ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానాన్ని భారత్ నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఫిన్‌టెక్, పునరు త్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్ లావా దేవీలు ఉన్నాయి.సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి మరియు విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన ప్లాట్‌ఫారమ్‌లు, చట్టాల గురించి తెలుసుకోవాలి. పౌరుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం లభిస్తాయి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని సాధించగలుగుతాం.డా‘‘ పి ఎస్. చారి వ్యాసకర్త మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఆచార్యులుమొబైల్ : 83090 82823 -
President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి
న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు. -
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వాతంత్య్రానికి ముందే పుట్టి.. నేటికీ మేటి!!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ 78 ఏళ్లలో దేశ వ్యాపార రంగం ఎంతో పురోగమించింది. భారతీయ వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగానూ శాసిస్తున్నాయి. అయితే స్వాతంత్య్రానికి పూర్వమే భారతీయుల వ్యాపార పటిమ ఏంటన్నది ఎందరో దిగ్గజాలు ప్రపంచానికి చాటి చెప్పారు. అలా స్వాతంత్య్రానికి ముందే పుట్టి మార్కెట్లో నేటికీ మేటిగా కొనసాగుతున్న కొన్ని భారతీయ వ్యాపార సంస్థల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..వాడియా గ్రూప్దేశంలో పురాతన వ్యాపార సామ్రాజ్యాల్లో వాడియా గ్రూప్ కూడా ఒకటి. 1736లో లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా దీన్ని స్థాపించారు. దీని అనుబంధ సంస్థ ది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1863లో స్థాపితమైంది. గో ఫస్ట్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరికొన్ని అనుబంధ సంస్థలు.టాటా గ్రూప్టాటా గ్రూప్ అనేది 150కి పైగా దేశాలలో ఉత్పత్తులు, సేవలు అందిస్తూ 100 దేశాలలో కార్యకలాపాలున సాగిస్తున్న భారతదేశపు అతిపెద్ద సమ్మేళనం. దీన్ని 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా మరెన్నో అనుబంధ సంస్థలు దీనికి ఉన్నాయి.డాబర్ ఇండియాడాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థను ఎస్కే బర్మన్ 1884లో స్థాపించారు. ఆయుర్వేద ఉత్పత్తులు, వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులను తయారు చేసే ఈ సంస్థ మార్కెట్లో అగ్ర సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.కిర్లోస్కర్ గ్రూప్1888లో స్థాపించిన కిర్లోస్కర్ గ్రూప్ దేశంలో పురాతనమైన ఇంజినీరింగ్ సమ్మేళనాల్లో ఒకటి. లక్ష్మణరావు కిర్లోస్కర్ దీని వ్యవస్థాపకులు. ఈ సంస్థ తయారు చేసే యంత్ర పనిముట్లు ఆఫ్రికా, ఆగ్నేయాసియా, యూరప్‌లోని దాదాపు 70 దేశాలకు ఎగుమతవుతున్నాయి.గోద్రెజ్ గ్రూప్ గోద్రెజ్ గ్రూప్‌ను అర్దేషిర్ గోద్రేజ్ 1897లో స్థాపించారు. మొదట తాళాల తయారీలో గుర్తింపు పొందిన ఈ సంస్థ తర్వాత అనేక ఉత్పత్తులకు విస్తరించింది. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆధిపత్యాన్ని చాటుతోంది.లక్ష్మీ మిల్స్దేశంలోని టెక్స్టైల్ రంగంలో లక్ష్మీ మిల్స్ పురాతన కంపెనీ. కోయంబత్తూరు కేంద్రంగా 1910లో జి.కుప్పుస్వామి నాయుడు దీన్ని స్థాపించారు. దేశ విదేశాల్లో నూలు దారాలు, వస్త్రాల ఉత్పత్తిలో ఇప్పటికీ రాణిస్తోంది.జేకే గ్రూప్ జేకే ఆర్గనైజేషన్ భారతీయ పారిశ్రామిక సమ్మేళనం. 1918లో లాలా కమ్లాపత్ సింఘానియా స్థాపించారు. ఈ గ్రూప్‌నకు చెందిన జేకే లక్ష్మి సిమెంట్ నిర్మాణ రంగంలో ప్రధానంగా ఉంది. అలాగే జేకే టైర్స్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది.బజాజ్ గ్రూప్బజాజ్ గ్రూప్ అనేది 1926లో జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన భారతీయ బహుళజాతి సమ్మేళనం. ఈ సమూహంలో 40 కంపెనీలు ఉన్నాయి. దీని ప్రధాన సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, త్రి-వీలర్ తయారీదారుగా పేరు పొందింది. -
ఆగస్టు 15.. ఓటీటీలో ఈ మూవీస్ మిస్ అవ్వొద్దు!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. చాలామందికి ఈ రోజు సెలవు. మరోవైపు థియేటర్లలో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', 'ఆయ్' తదితర మూవీస్ రిలీజ్. సరే ఇవేం చూస్తాంలే. ఇంట్లోనే ఎంటర్ టైన్మెంట్ కావాలా? అయితే ఈ సినిమాలు మీకోసమే. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కాస్తంత దేశభక్తిని గుర్తొచేసే చిత్రాలివి. ఇంతకీ ఇవన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయి? అనేది తెలియాలంటే దిగువన లిస్ట్ చూసేయండి.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చూడాల్సిన మూవీస్ఖడ్గం - సన్ నెక్స్ట్, యూట్యూబ్ (తెలుగు)మేజర్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఘాజీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గగనం - హాట్ స్టార్, యూట్యూబ్ (తెలుగు)భారతీయుడు - నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ (తెలుగు డబ్బింగ్)మేజర్ చంద్రకాంత్ - యూట్యూబ్, సన్ నెక్స్ట్ (తెలుగు)అల్లూరి సీతారామరాజు - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ (తెలుగు)ఆర్ఆర్ఆర్ - జీ5, హాట్‌స్టార్ (తెలుగు)సర్దార్ పాపారాయుడు - అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)రాజన్న - హాట్ స్టార్ (తెలుగు)ఉరి - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)షేర్షా - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)సామ్ బహదూర్ - జీ5 (హిందీ)రాజీ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)బోస్: ద ఫర్గాటెన్ హీరో - యూట్యూబ్ (హిందీ)ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ - యూట్యూబ్ (హిందీ)బోర్డర్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)కేసరి - అమెజాన్ ప్రైమ్ (హిందీ)చక్ దే - అమెజాన్ ప్రైమ్ (హిందీ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్‌గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్‌ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.1947లో రూ.88.62 రెట్టింపు అయింది.1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.2023లో రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది.2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావంభౌగోళిక, రాజకీయ అనిశ్చితులుఆర్థికమాంద్యం భయాలుఆర్థిక, రాజకీయ పరిస్థితులుప్రభుత్వ విధానాలుడాలర్ విలువద్రవ్యోల్బణంభారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్ల్యాండ్ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా, గినియా ఉంటాయి.ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యంఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..పెళ్లిళ్లుపుట్టినరోజుపెళ్లిరోజుదీపావళిఆక్షయ తృతియదంతేరాస్ఇతర ప్రత్యేక రోజులు, పండగలు -
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
Independence Day 2024: ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన ఘనత..
భారతదేశం రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతకుముందు ఈ ఘనతను పండిట్ జవహర్లాల్ నెహ్రూ సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒలింపిక్ అథ్లెట్లను కలిసే అవకాశం ఉంది.వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. అతిథుల పూర్తి జాబితా... విభాగం అతిథుల సంఖ్య వ్యవసాయం , రైతు సంక్షేమం 1,000 మంది అతిథులు యువజన వ్యవహారాలు 600 మంది క్రీడా విభాగానికి సంబంధించినవారు 150 మంది మహిళా, శిశు అభివృద్ధి శాఖ 300 మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 300 మంది గిరిజన వ్యవహారాలశాఖ 350 మంది పాఠశాల విద్య, అక్షరాస్యత రంగాలకు చెందినవారు 200 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 200 మంది ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి.. 150 మంది నీతి ఆయోగ్‌కు చెందినవారు 1,200 మంది -
రూపాయి 78 ఏళ్ల ప్రస్థానం..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 78 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.83.92కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2024 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది.ఇదీ చదవండి: మూడు నెలల్లో మూడు కోట్ల అమ్మకాలుసంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 43.47 2010 46.21 2015 62.30 2020 73.78 2021 73.78 2022 81.32 2023 82.81 2024 83.92 -
History of 15th August: ఆగస్టు 15న ఏమేం జరిగాయంటే..
బ్రిటీష్ వారి నుంచి భారతదేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం పొంది, స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. ఇదొక్కటే కాదు చరిత్రలో ఆగస్టు 15న పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.1972, ఆగస్టు 15న భారత పోస్టల్ సర్వీస్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం మొదలయ్యింది. ఆ రోజున ‘పోస్టల్ ఇండెక్స్ నంబర్’ అంటే పిన్ కోడ్ ఆవిర్భావమయ్యింది. నాటి నుంచి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పిన్ కోడ్ అమలులోకి వచ్చింది.1854: ఈస్ట్ ఇండియా రైల్వే కలకత్తా నుంచి హుగ్లీకి మొదటి ప్యాసింజర్ రైలును నడిపింది. ఈ రైలు అధికారికంగా 1855 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.1866: లీచ్టెన్స్టెయిన్ దేశానికి జర్మన్ పాలన నుండి విముక్తి లభించింది.1872: భారతీయ తత్వవేత్త అరబిందో జననం.1886: రామకృష్ణ పరమహంస కన్నుమూత1945: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండూ స్వతంత్రంగా మారాయి.1947: రక్షణ శౌర్య పురస్కారాలైన పరమవీర చక్ర, మహావీర చక్ర, వీరచక్రల ప్రధాన ప్రకటన.1975: బంగ్లాదేశ్‌లో సైనిక విప్లవం.1950: భారతదేశంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 30 వేల మంది మృతి.1960: ఫ్రెంచ్ బానిసత్వం నుండి కాంగోకు స్వాతంత్య్రం.1971: బ్రిటీష్ పాలన నుండి బహ్రెయిన్‌కు స్వాతంత్య్రం.1982: రంగులలో జాతీయ టీవీ ప్రసారాలు ప్రారంభం.1990: ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి ఆకాష్ ప్రయోగం విజయవంతం2007: దక్షిణ అమెరికా దేశం పెరూలోని మధ్య తీర ప్రాంతంలో 8.0 తీవ్రతతో భూకంపం. 500 మంది మృతి.2021: తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. దేశం విడిచిపెట్టిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.2021: హైతీ దేశంలో భూకంపం కారణంగా 724 మంది మృతి. -
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట (ఫొటోలు)
-
హైదరాబాద్ : సగర్వంగా..‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
పంద్రాగస్టున ప్రతి ముస్లిం ఇంటిపై త్రివర్ణ పతాకం
దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్‌లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంద్రాగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామన్నారు. మదర్సాలు, విద్యాసంస్థలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లిం సంఘాలు సహకారం మరువరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందన్నారు. పంద్రాగస్టున ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టాలని ఆయన సూచించారు. -
...అలా పంచుకున్నారు!
1947. బ్రిటిష్ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్... ముందుగానే కమిటీ విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్ 16న ‘పంజాబ్ పారి్టషన్ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్ కౌన్సిల్)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్ తరఫున కాంగ్రెస్ నేతలు సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్; పాక్ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్ ఇండియా మ్యాప్‌ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్‌క్లిఫ్ రేఖగా పిలుస్తారు. ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్...కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు, ఒక వంతు పాక్‌కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్‌కు దక్కాయి. పాక్‌కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్ సైనికాధికారుల్లో జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్ భారత్‌కు, జనరల్ సర్ ఫ్రాంక్ మెసెర్వీ పాక్‌కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!...బగ్గీ భారత్‌కే! భారత్, పాక్ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్ వేశారు! అందులో భారత్ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!80:20 నిష్పత్తిలో చరాస్తులు ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు! ఆస్తులు, అప్పులు ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్ భీషి్మంచుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నారు. కశీ్మర్ పూర్తిగా భారత్‌కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్‌పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్ బాకీ ఉందని భారత్ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్ వాదన!జోయ్‌మొనీ, ద ఎలిఫెంట్! జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్‌మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్‌కు (తూర్పు బెంగాల్‌కు, అంటే నేటి బంగ్లాదేశ్‌కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్‌కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్‌మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్ (పశి్చమబెంగాల్) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్‌కే మిగిలిపోయింది.కొసమెరుపుభారత్, పాక్ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం
‘నైట్ ఈజ్ అవర్స్’ పేరుతో ఆగస్టు 14 అర్ధరాత్రి కోల్‌కతాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు.అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన.కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో రాత్రిని చూసి భయపడుతూ బతకవలసిందేనా అని నిలదీస్తున్నారు స్త్రీలు.ఈ నిరసన, గతంలో ఇలాంటి ప్రతిఘటనలపై కథనం.‘ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అన్నారు గాంధీజీ. ఆయన కలలుగన్న స్వాతంత్య్రం ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో అర్ధరాత్రి ఒక నిర్భయ దారుణంగా లైంగికదాడికి లోనై మరణిస్తే మొన్న గురువారం (ఆగస్టు 8) అర్ధరాత్రి కోల్‌కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక ట్రయినీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికీ హత్యకూ లోనైంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యబృందాలు భగ్గుమన్నాయి. నిరసనలు సాగుతున్నాయి. వైద్యులు వైద్యసేవలు మాని ఈ అన్యాయానికి జవాబేమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.అర్ధరాత్రి నిరసన‘ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు తమ ఇంట్లో, పని చోట, బహిరంగ ప్రదేశాల్లో రాత్రుళ్లు ఎటువంటి స్వేచ్ఛ లేని బానిసత్వమే మిగిలింది. కోల్‌కతాలో జరిగిన దారుణకాండ కు నిరసనగా ఈ ఆగస్టు 14 అర్ధరాత్రి మహిళలందరం నిరసన చేయనున్నాం’ అని కోల్‌కతాలోని మహిళలు తెలియచేస్తున్నారు. ఈ నిరసకు స్త్రీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మనదేశంలో సూర్యుడు అస్తమించగానే స్త్రీలలో, వారి కుటుంబ సభ్యుల్లో ఆ స్త్రీలు ఇంటికి చేరే వరకు ఆందోళన ఉంటుంది. వారి మీద ఏదోవిధమైన దాడి జరిగే వాతావరణం ఉండటమే ఇందుకు కారణం. ఒంటరి స్త్రీ బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే ఆమెతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే తెగింపు కొన్ని మూకలలో ఈ సమాజంలో ఉంది. స్త్రీలకు పరిమిత సమయాలలో పరిమిత స్థలాలలోనే రక్షణ. లేదంటే లేదు. అయితే నిర్భయ ఘటన ఆమె రోడ్డు మీద ఉన్నప్పుడు జరిగితే కోల్‌కతాలో బాధితురాలు ఆస్పత్రిలో తన డ్యూటీలో ఉండగా దాడి జరగడం తీవ్రమైన ప్రశ్నను లేవదీసేలా ఉంది.మీట్ టు స్లీప్నిర్భయ ఘటన జరిగాక ఆమెను తలుచుకుంటూ ప్రతి డిసెంబర్ 16న పార్కుల్లో మహిళలు బృందాలుగా నిదురించే కార్యక్రమం ‘మీట్ టు స్లీప్’ నిర్వహించాలని బెంగళూరుకు చెందిన ‘బ్లాక్ నాయిస్’ అనే సంస్థ పిలుపునిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ‘పబ్లిక్ ప్లేసులపై మా హక్కు కూడా ఉంది. మేము అక్కడ సురక్షితంగా ఉంచే పరిస్థితిని డిమాండ్ చేస్తున్నాం’ అని ఈ కార్యక్రమం కోరుతోంది. బ్లాక్ నాయిస్ ఫౌండర్ జాస్మిన్ పతేజా దీని రూపకర్త.విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్:ఢిల్లీ రోడ్ల మీద అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచే హక్కు స్త్రీలకు ఉంది అని ‘విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్’ పేరుతో అక్కడి మహిళా బృందాలు రాత్రుళ్లు నడిచి తమ గళాన్ని వినిపించాయి. మల్లికా తనేజా అనే థియేటర్ ఆర్టిస్ట్ ఇందుకు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘రాత్రిపూట ఖాళీ ఫుట్‌పాత్ మీద స్వేచ్ఛగా కూచునే అనుభూతి ఇప్పుడు పొందాను’ అని ఈ అర్ధరాత్రి నడకలో పాల్గొన్న ఒక మహిళ అంది.సమాజంలో స్త్రీకి గౌరవం దక్కాలన్నా ఆమె సురక్షితంగా ఉండాలన్నా ఇంటిలో బడిలో పని చోట్ల ప్రభుత్వ విధానాలలో సినిమాలలో కళల్లో ఆమెను గౌరవించే వాతావరణం, బౌద్ధిక శిక్షణ అవసరం. కఠినమైన చట్టాలతో పాటు విలువల ఔన్నత్యం కూడా అవసరం. స్త్రీలను కించపరిచే భావజాలం ఎక్కడ ఉన్నా దానిని నిరసించడం అందరూ నేర్వాలి. లేని పక్షంలో అర్ధరాత్రి నిరసనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉంటాయి. -
స్వాతంత్ర దినోత్సవం స్పెషల్.. అకాన్ ఆహ్వానం ఇదే..
హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా అకాన్ రెస్టారెంట్ ప్రత్యేకమైన ఫండ్ రైజింగ్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. నిరుపేదల శిశువులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక విందులో పాల్గొనాలని ఆహ్వానించింది. ఇక్కడ మధ్యాహ్నం అందించే పసందైన భోజనంతో పాటు.. చెఫ్‌లు, కళాకారులు ఒక మరపురాని అనుభూతిని అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి రూపాయి.. ఎన్ఐసీయూ యూనిట్లలో నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులకు మద్దతు ఇవ్వడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్‌కు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు రుచికరమైన భోజనంతో పాటు, ఆహ్లాదకరమైన సితార్ ప్రదర్శన ఏర్పాటు చేసి అద్భుతమై అనుభవాన్ని అందిస్తాం.ఈవెంట్స్ వివరాలు.. అగ్రశ్రేణి చెఫ్‌లు రూపొందించిన మాస్టర్‌పీస్ వంటలో పాల్లొని ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం పొందండి లైవ్ సితార్ ప్రదర్శనలో పాల్గొని సంగీతాన్ని ఎంజాయ్ చేయండి.ఇక్కడికి వచ్చిన వారు తమకు నచ్చిన విధంగా నిధులు చెల్లించవచ్చు.నెలలు నిండని శిశువుల జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ఓ గొప్ప సహాయక కార్యక్రమానికి మద్దతు ఇవ్వవచ్చు.వెరైటీ వంటకాలు రుచి చూడాలని, ఆనందంగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి, సామాజిక బాధ్యత కలిగి ఉన్నవారంతా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాతో చేరండి.వివరాలు..తేదీ: స్వాతంత్ర దినోత్సవం( ఆగస్ట్ 15)సమయం: 12-4 PMవేదిక: అకాన్, హైదరాబాద్మరింత సమాచారం, రిజర్వేషన్ల కోసం సంప్రదించండి: 9649652222https://akanhyd.com/aahvaanam/ -
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఎర్రకోట : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ (ఫొటోలు)
-
17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు
రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (ఎఫ్‌ఓజీ),ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం కనిపించనుంది. ఇండియా డే పరేడ్, ఫెయిర్‌లో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెల్నెస్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ, హిప్-హాప్ తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ అమెరికాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. -
పంద్రాగస్టు: తెలుసుకోవలసిన 10 విషయాలు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్‌బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్‌కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
Independence Day- 2024: అమరవీరులను గుర్తుచేసే ఆరు ప్రాంతాలు
1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఆరోజు నుంచి ప్రతీయేటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పలువురు సమరయోధులు పోరాటాలు సాగించారు. వీరి త్యాగానికి గుర్తుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారకాలు ఉన్నాయి. ఇదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆగస్టు 15న ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.1. కార్గిల్ వార్ మెమోరియల్ (లధాఖ్)పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైనవారి గౌరవార్థం 1990ల చివరలో భారత సైన్యం కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించింది. ఈ స్మారక చిహ్నంపై యుద్ధంలో వీరమరణం పొందిన భారతీయ సైనికులందరి పేర్లను చెక్కారు.2. ఎర్రకోట (ఢిల్లీ)ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి ప్రసంగించారు.ఈ ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు. ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించినందున దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు.3. జలియన్ వాలా బాగ్ (అమృత్సర్)1919లో జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎటువంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరపాలని ఆదేశించాడు. నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందల మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం జలియన్‌వాలాబాగ్‌లో స్మారక చిహ్నం నిర్మించారు.4. ఇండియా గేట్(ఢిల్లీ)దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన 82 వేల మంది భారతీయ ఆర్మీ సైనికుల గౌరవార్థం నిర్మితమయ్యింది. ఈ అమరవీరుల పేర్లు ఇండియా గేట్ గోడలపై కనిపిస్తాయి.5. పోరుబందర్(గుజరాత్)గుజరాత్‌లోని పోర్బందర్ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. కీర్తి మందిర్, మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని గాంధీ జీవితంతో పాటు ఆయన రచనలను వివరించే మ్యూజియంలుగా మార్చారు.6. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ (ప్రయాగ్‌రాజ్)1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఈ ప్రయాగ్‌రాజ్ పార్కులో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. అతను తన 25 ఏళ్ల వయస్సులోనే జీవితాన్ని త్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారి తూటాలకు బలికావడం ఇష్టం లేక ఈ పార్కులో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఈ పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంది. -
పంద్రాగస్టుకు ఎర్రకోటపై నారీశక్తి ప్రదర్శన
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. -
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్‌ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్‌నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్‌కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్‌వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్‌వైకే షిప్‌లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్‌తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్‌ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్‌కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్‌సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్‌కు తిరిగి పంపించి టాటా లైన్‌ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్‌తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి.