భారతదేశం రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతకుముందు ఈ ఘనతను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒలింపిక్ అథ్లెట్లను కలిసే అవకాశం ఉంది.
వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. అతిథుల పూర్తి జాబితా...
విభాగం అతిథుల సంఖ్య
వ్యవసాయం , రైతు సంక్షేమం 1,000 మంది అతిథులు
యువజన వ్యవహారాలు 600 మంది
క్రీడా విభాగానికి సంబంధించినవారు 150 మంది
మహిళా, శిశు అభివృద్ధి శాఖ 300 మంది
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 300 మంది
గిరిజన వ్యవహారాలశాఖ 350 మంది
పాఠశాల విద్య, అక్షరాస్యత రంగాలకు చెందినవారు 200 మంది
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 200 మంది
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి.. 150 మంది
నీతి ఆయోగ్‌కు చెందినవారు 1,200 మంది
Comments
Please login to add a commentAdd a comment