అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది.
ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్‌ను విరమించుకుంది.
These are the areas in #Assam claimed by ULFA (I) where bombs have been allegedly planted
1. In an old car lying at the DTO office in Shivsagar
2. Shivsagar BG Road ONGC 5th gate crossing the old ambulance on the roadside
3. Lakua Tin Ali, near the police station
4. Assam… pic.twitter.com/QijCEdFMFD— Nibir Deka (@nibirdeka) August 15, 2024
పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.
కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment