ULFA Militant Group
-
అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా
అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది. ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్‌ను విరమించుకుంది. These are the areas in #Assam claimed by ULFA (I) where bombs have been allegedly planted1. In an old car lying at the DTO office in Shivsagar2. Shivsagar BG Road ONGC 5th gate crossing the old ambulance on the roadside3. Lakua Tin Ali, near the police station4. Assam… pic.twitter.com/QijCEdFMFD— Nibir Deka (@nibirdeka) August 15, 2024పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది. -
అస్సాంలో కీలక పరిణామం.. ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), కేంద్రంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో శాంతి కోసం యూఎల్ఎఫ్ఏ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూఎల్ఎఫ్ఏ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా జరుగుతున్న (తిరుగుబాటు చర్యలకు) హింసాకాండకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అస్సాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ‘కాగా వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్) నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా, ప్రత్యేక అస్సాం డిమాండ్‌తో 1979లో ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. దీంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధిత సంస్థగా ప్రకటించింది. అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా కొనసాగుతుంది. చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం.. అయితే ఫిబ్రవరి 2011లో అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని వర్గం హింసను విడిచిపెట్టి, ప్రభుత్వంతో బేషరతు చర్చలకు అంగీకరించడంతో ఉల్ఫా రెండు గ్రూపులుగా విడిపోయింది. అరబింద సారథ్యంలోని ఉల్ఫా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2011 సెప్టెంబర్ 3న తొలిసారి శాంతి చర్చలు జరిపింది. అయితే పరేశ్ బారుహ్ నేతృత్వం వహిస్తున్న ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేశ్.. చైనా-మయన్మార్ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం. ఈరోజు అస్సాంకు చారిత్రాత్మకమైన రోజని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయిందన్నారు. 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని అమిత్ షా తెలిపారు. -
40 రోజుల తర్వాత విడుదల
న్యూఢిల్లీ: అసోంలో గతనెలలో ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన బీజేపీ నేత రత్నేశ్వర్ మోరన్ కొడుకు కుల్దీప్ మోరన్ (27) ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఉల్ఫా తీవ్రవాదులు శుక్రవారం కుల్దీప్ను మయన్మార్-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద విడుదల చేశారు. ఆగస్టు 1న ఉల్ఫా ఉగ్రవాదులు అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కుల్దీప్ను కిడ్నాప్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో ఐదుగురు గన్‌మెన్ చుట్టూ నిలబడి ఉండగా, మధ్యలో ఉన్న కుల్దీప్ తనను విడిపించాల్సిందిగా కోరినట్టు ఉంది. కాగా ఉల్ఫా తీవ్రవాదులు డిమాండ్ చేసినట్టు కుల్దీప్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కుల్దీప్ సమీప బంధువు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.