40 రోజుల తర్వాత విడుదల
న్యూఢిల్లీ: అసోంలో గతనెలలో ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన బీజేపీ నేత రత్నేశ్వర్ మోరన్ కొడుకు కుల్దీప్ మోరన్ (27) ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఉల్ఫా తీవ్రవాదులు శుక్రవారం కుల్దీప్ను మయన్మార్-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద విడుదల చేశారు.
ఆగస్టు 1న ఉల్ఫా ఉగ్రవాదులు అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కుల్దీప్ను కిడ్నాప్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో ఐదుగురు గన్మెన్ చుట్టూ నిలబడి ఉండగా, మధ్యలో ఉన్న కుల్దీప్ తనను విడిపించాల్సిందిగా కోరినట్టు ఉంది. కాగా ఉల్ఫా తీవ్రవాదులు డిమాండ్ చేసినట్టు కుల్దీప్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించారా లేదా అన్న విషయం తెలియరాలేదు. కుల్దీప్ సమీప బంధువు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.