ఐజీ రవిప్రకాష్, ఇన్‌స్పెక్టర్ దండు గంగరాజుకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పతకాలు ప్రకటించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి.
అగ్నిమాపక సర్వీస్‌కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్‌ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్‌ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.
ప్రతిభాపూర్వక సేవా పతకాలు
విష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్‌ఎస్‌జే (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్‌స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), రమేష్‌బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్‌స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్‌కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
» ఎం.రవిప్రకాష్ (ఐజీ)
» డి.డి.గంగరాజు (ఇన్‌స్పెక్టర్) శౌర్య పతకాలు
» షేక్ సర్దార్ ఘనీ (ఇన్‌స్పెక్టర్)
» సవ్వన అరుణ్‌కుమార్ (సబ్ ఇన్‌స్పెక్టర్)
» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్)
» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్)
Comments
Please login to add a commentAdd a comment