medals
-
భారత బాక్సర్లకు 17 పతకాలు
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ప్లస్ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్ విక్టోరియా గాట్ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్‌ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల్లో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ తెచ్చి పెట్టాడు. రాహుల్ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్ (50 కేజీలు), క్రిష్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్షయ్ రాఠి (ప్లస్ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
బరువైపోయిందా ?
రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్‌లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఒలింపిక్ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.మెరిసిన ఆణిముత్యాలు.. ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్ చాంపియన్‌గా నిలిచింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆదరణ లేకే.. ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు. నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్‌గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్‌ను నియమించలేదు. దీంతో సీనియర్ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఆ వైభవం గతమే.. ఆమదాలవలసలో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్‌ను ఏర్పాటు చేయాలి. – చిగురుపల్లి రాజ్యలక్ష్మి, వెయిట్ లిప్టర్, ఆమదాలవలసక్రీడాకారులు కరువు వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్‌లిఫ్టర్ -
‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’
న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేకంగా అభినందించారు. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్లుగా నిలిచి భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ప్లేయర్లను మన్‌సుఖ్‌తోపాటు కేంద్ర క్రీడా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే గురువారం న్యూఢిల్లీలో సన్మానించారు. ‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం ద్వారా దేశ ప్రజలను గర్వపడేలా చేశారు. దీంతో పాటు వారసత్వ క్రీడలో మన సత్తా ఏంటో నిరూపించారు. ఏ ఆటలోనైనా నైపుణ్యాన్ని గుర్తించి వారికి అండగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న క్రమంలో క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించే విజయాలు దేశానికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయి. ఒలింపియాడ్‌లో పతకాలు నెగ్గిన ప్లేయర్లు దేశంలో యువతరానికి బ్రాండ్ అంబాసిడర్ల వంటి వాళ్లు’ అని మాండవీయ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాగా.. ఈ ప్రదర్శనతో దేశంలో చిన్నారులు, యువతలో ఆటల పట్ల ఆకర్శణ మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొమ్మరాజు గుకేశ్, ద్రోణవల్లి హారికలతో మాండవీయ సరదాగా చెస్ ఆడారు. స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్ల సభ్యులకు కేంద్ర క్రీడా శాఖ రూ. 20 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని చెక్‌ల రూపంలో అందించింది. -
సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అశ్విత పోలీస్ సత్తా చాటింది. ఫ్రాన్స్‌లోని లియాన్‌లో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్–2024లో అశ్విత బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్ సెట్లలో 4 కాంస్య పతకాలు, 12 మెడలియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకుంది. ‘పాటిస్సేరీ–కన్ఫెక్షనరీ’లో అశ్విత పోలీస్, ‘ఇండస్ట్రీ 4.0’లో గుజరాత్‌కు చెందిన ధ్రుమిల్‌కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీ, సత్యజిత్ బాలకృష్ణన్, ‘హోటల్ రిసెప్షన్’లో ఢిల్లీకి చెందిన జోతిర్ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్, ‘రెన్యూవబుల్ ఎనర్జీ’లో ఒడిశాకు చెందిన అమరేష్ కుమార్ సాహు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. వీటితోపాటు భారతీయ బృందం 12 మెడలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సంపాదించింది. ‘పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ’లో పోటీ చేసిన అశ్విత టీమ్ ఇండియా నుంచి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును కూడా గెలుచుకుంది.అశ్విత చిన్నప్పటి నుంచి స్వీట్స్ తయారుచేయడం, టీవీ షోల ద్వారా పాకశాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకుంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యారి్థని అయిన అశ్విత.. చెఫ్ వినేష్ జానీ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అశ్విత విజయం ప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభ పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఔత్సాహిక చెఫ్‌లను ప్రేరేపిస్తుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ మంత్రిత్వ శాఖ కొనియాడింది. పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ విభాగంలో 21 దేశాలతో పోటీపడి కాంస్యం సాధించిన అశ్విత పోలీస్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్నది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలనే కల నిజమైంది. కానీ నమ్మశక్యంగా లేదు’అని అన్నారు. వరల్డ్ స్కిల్స్ 2024లో 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్ 52 నైపుణ్య విభాగాల్లో పోటీపడింది. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్‌లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్‌పుట్‌లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్‌లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్‌కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్‌లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్‌లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్‌లోనే విఫలమైన ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
26 మందికి శౌర్య, సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి. అగ్నిమాపక సర్వీస్‌కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.ప్రతిభాపూర్వక సేవా పతకాలువిష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్ఎస్జే (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రమేష్‌బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్‌కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు» ఎం.రవిప్రకాష్ (ఐజీ)» డి.డి.గంగరాజు (ఇన్స్పెక్టర్) శౌర్య పతకాలు» షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్)» సవ్వన అరుణ్‌కుమార్ (సబ్ ఇన్స్పెక్టర్)» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్) -
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్‌ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్‌జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు.. మనుభాకర్ సరికొత్త రికార్డు
-
ఒలింపిక్స్‌లో నేటి (జులై 30) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్ ఇలా..షూటింగ్- పృథ్వీరాజ్ తొండైమాన్ (ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుశ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (ట్రాప్ వుమెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుకాంస్య పతక పోరు: మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ వర్సెస్ కొరియా టీమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్)- మధ్యాహ్నం ఒంటి గంటకురోయింగ్- బల్రాజ్ పన్వర్ (మెన్స్ సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్)- మధ్యాహ్నం 1:40 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (మెన్స్ పూల్-బి)- సాయంత్రం 4:45 గంటలకుఆర్చరీ- అంకిత భకత్ వర్సెస్ వియోలెట మిస్జోర్ (పోలాండ్)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:14 గంటలకుభజన్ కౌర్ వర్సెస్ సైఫా నూరాఫిఫా కమల్ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:27 గంటలకుబ్యాడ్మింటన్- సాత్విక్‌సాయిరాజ్/చిరాగ్ షెట్టి వర్సెస్ అల్ఫియాన్ ఫజర్/ముహహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకుఅశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్- సాయంత్రం 6:20 గంటలకుబాక్సింగ్- జాస్మిన్ లంబోరియా వర్సెస్ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32- రాత్రి 9:24 గంటలకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర వర్సెస్ ఆడమ్ లి (చెకియా) మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్ రౌండ్- రాత్రి 10:46 గంటలకుబాక్సింగ్- ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు -
Olympics: చేరువై... దూరమై!
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్‌కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు! ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే... ఫుట్‌బాల్‌తో మొదలు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో సెమీస్‌లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది. మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో... 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు. మహిళల హాకీలో ఇలా.. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్‌పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్‌పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పరుగుల రాణికి తీరని వ్యథ! 1984 లాస్ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. జాయ్దీప్కు నిరాశ 2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్దీప్ కర్మాకర్‌కు అర్జున్‌లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీపా కర్మాకర్ త్రుటిలో... 2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్‌కు దీపా కర్మాకర్‌కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మహిళల హాకీ జట్టు మరోసారి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు. కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్‌తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈసారి ఇద్దరు.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత్.. హాకీలో అత్యధికంగా..!
విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్‌లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్‌తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్‌లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్‌లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్‌లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో సాధించింది. ఆ ఎడిషన్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టించింది.ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెజ్లింగ్‌లో పతకం సాధించింది. ఆ ఎడిషన్‌లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం ఇదే.1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.1976 మాంట్రియాల్ ఒలింపిక్స్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్‌లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్‌లో రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ భారత్‌కు ఆ ఎడిషన్‌లో ఏకైక పతకాన్ని అందించాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్‌లో భారత్ ఓ గోల్డ్ మెడల్‌తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.2012 లండన్ ఒలింపిక్స్‌లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్లో విజయ్‌కుమార్, పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్‌లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్‌లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం. -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్‌జర్గాల్ డొల్గొర్‌జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు. 2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్‌శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్‌కుమార్, వి.కిరణ్‌కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్‌ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్‌లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్‌లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
‘పారిస్’ పతకాల్లో ఈఫిల్ టవర్!
పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్‌కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్‌ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్‌కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్‌ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్‌లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్‌లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం. పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్‌ఫాఫుమ్ (థాయ్‌లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత షూటర్లకు ఐదు పతకాలు
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పతకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవా, 42 మందికి కఠిన సేవా, 435 మందికి సేవా పతకాలు లభించాయి. 9 మందికి మహోన్నత సేవా పతకాలు లభించాయి. ఏసీబీలో ఐదుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా, ఏడుగురికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలు పొందారు. ఎస్పీఎఫ్లో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్‌కు శౌర్య పతకం లభించింది. -
జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏపీకి పతకాలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. బాక్సింగ్‌లో ఆరు పతకాలు శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బాలుర బాక్సింగ్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్ (ఎస్వీఎల్ఎన్ఎస్ విద్యాపీఠ్ జూనియర్ కాలేజీ) రజతం, దాసరి ప్రవీణ్ కుమార్ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరావు (శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్ కుమార్ (సోఫియా జూనియర్ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్ (ఎంఏబీ పీ జూనియర్ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్ (జేఎన్పురం, విజయనగరం జిల్లా) కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్‌ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్‌కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్‌కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్‌కుమార్, ఎస్.ప్రేమ్‌కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్‌కుమార్ (ఎస్పీ, నాన్‌కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్‌కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్‌పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్‌కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్‌కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్‌భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్‌స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది.