రజతంతో సరిపెట్టుకున్న సాక్షి | India Got Medals In Asian Senior Wrestling Championship | Sakshi
Sakshi News home page

రజతంతో సరిపెట్టుకున్న సాక్షి

Published Sat, Feb 22 2020 2:00 AM | Last Updated on Sat, Feb 22 2020 2:00 AM

India Got Medals In Asian Senior Wrestling Championship - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌ పతకాల వేటను కొనసాగిస్తోంది. గురువారం మూడు పసిడి, ఒక రజత పతకాలను గెల్చుకున్న భారత్‌... శుక్రవారం ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. మహిళల 65 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ తుది మెట్టుపై బోల్తా పడి రజతంతో సరిపెట్టుకుంది. ఆమె ఫైనల్‌ బౌట్‌లో 0–2తో నయోమి రుకే (జపాన్‌) చేతిలో ఓడింది. ఇక కాంస్య పతక పోరుల్లో వినేశ్‌ ఫోగట్‌ (53 కేజీలు) 10–0తో తి లై కియు (వియత్నాం)పై, అన్షు మాలిక్‌ (57 కేజీలు) 4–1తో సెవర ఇష్‌మురతోవ (ఉజ్బెకిస్తాన్‌)పై, గుర్‌శరణ్‌ ప్రీత్‌ కౌర్‌ (72 కేజీలు) 5–2తో త్సెవెగ్‌మెడ్‌ ఎంక్‌బయార్‌ (మంగోలియా)పై గెలుపొందగా... సోనమ్‌ మాలిక్‌ (62 కేజీలు) 11–0తో ఐసులూ తైన్‌బెకోవ (కిర్గిస్తాన్‌) చేతిలో ఓడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement