పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు (ఆగస్ట్ 1) భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న కొందరు అథ్లెట్లు అనూహ్య ఓటములు ఎదుర్కొని ఇంటిబాట పట్టారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మహిళల బాక్సింగ్‌లో నిఖత్ జరీన్.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు ప్రత్యర్ధుల చేతుల్లో ఓడి పతక ఆశలను నీరుగార్చారు. ఏడో రోజు భారత్ పలు క్రీడాంశాల్లో పతకాలపై ఆశలు పెట్టుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ (క్వార్టర్ ఫైనల్స్).. మహిళ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మనూ భాకర్ పోటీపడనున్నారు.
ఒలింపిక్స్‌లో ఇవాల్టి భారత షెడ్యూల్ ఇలా ఉంది.
గోల్ఫ్- శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ (పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2)- మధ్యాహ్నం 12:30 గంటలకు
షూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్)- మధ్యాహ్నం 12:30 గంటలకు
అనంత్‌జీత్ సింగ్ నరుకా (పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1)- మధ్యాహ్నం ఒంటి గంటకు
ఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ వర్సెస్ దియానంద కొయిరున్నిసా/ఆరిఫ్ పంగెస్తు (రికర్వ్ మిక్సడ్ టీమ్ 1/8 ఎలిమినేషన్స్)- మధ్యాహ్నం 1:19 గంటలకు
జూడో- తులికమన్ వర్సెస్ ఇడాలిస్ ఓర్టిజ్ (మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32)- మధ్యాహ్నం 1:32 నుంచి
షూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ (ర్యాపిడ్))- మధ్యాహ్నం 3:30 గంటలకు
సెయిలింగ్- నేత్రా కుమనన్ (మహిళల డింఘీ రేస్ 3 మరియు 4)- మధ్యాహ్నం 3:45 గంటలకు
హాకీ- ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (పురుషుల హాకీ పూల్ బి)- సాయంత్రం 4:45 గంటలకు
బ్యాడ్మింటన్- లక్ష్యసేన్ వర్సెస్ చౌ టిన్ చెన్ (పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్)- 6:30 గంటలకు
సెయిలింగ్- విష్ణు శరవణన్ (పురుషుల డింగీ రేస్ 3 అండ్ 4)- రాత్రి 7:05 గంటలకు
అథ్లెటిక్స్- అంకిత ధయాని (మహిళల 5000 మీటర్ల హీట్ 1)- రాత్రి 9:40 గంటలకు
పారుల్ చౌధరి (మహిళల 5000 మీటర్ల హీట్ 2)- రాత్రి 10:06 గంటలకు
తజిందర్ పాల్ సింగ్ తూర్ (పురుషుల షాట్ పుట్ క్వాలిఫికేషన్)- రాత్రి 11:40 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment