పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్-సరబ్‌జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.
నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్ ఇలా..
షూటింగ్- పృథ్వీరాజ్ తొండైమాన్ (ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకు
శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (ట్రాప్ వుమెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకు
కాంస్య పతక పోరు: మనూ భాకర్, సరబ్‌జోత్ సింగ్ వర్సెస్ కొరియా టీమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్)- మధ్యాహ్నం ఒంటి గంటకు
రోయింగ్- బల్‌రాజ్ పన్వర్ (మెన్స్ సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్)- మధ్యాహ్నం 1:40 గంటలకు
హాకీ- ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (మెన్స్ పూల్-బి)- సాయంత్రం 4:45 గంటలకు
ఆర్చరీ- అంకిత భకత్ వర్సెస్ వియోలెట మిస్జోర్ (పోలాండ్)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:14 గంటలకు
భజన్ కౌర్ వర్సెస్ సైఫా నూరాఫిఫా కమల్ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:27 గంటలకు
బ్యాడ్మింటన్- సాత్విక్‌సాయిరాజ్/చిరాగ్ షెట్టి వర్సెస్ అల్ఫియాన్ ఫజర్/ముహహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకు
అశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్- సాయంత్రం 6:20 గంటలకు
బాక్సింగ్- జాస్మిన్ లంబోరియా వర్సెస్ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32- రాత్రి 9:24 గంటలకు
ఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర వర్సెస్ ఆడమ్ లి (చెకియా) మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్ రౌండ్- రాత్రి 10:46 గంటలకు
బాక్సింగ్- ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment