లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం | The Leela Palace Chennai Welcomes Manu Bhaker, The Olympic Champion | Sakshi
Sakshi News home page

లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం

Published Wed, Aug 28 2024 12:24 PM | Last Updated on Wed, Aug 28 2024 1:29 PM

The Leela Palace Chennai Welcomes Manu Bhaker, The Olympic Champion

చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లీలా ప్యాలెస్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్‌ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్‌ రూమ్స్‌లో టవల్స్‌, పిల్లోస్‌, న్యాప్కిన్స్‌ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్‌ నిర్వహకులు. హోటల్‌ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్‌లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. 

హోటల్‌ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్‌ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

కాగా, మనూ భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్‌ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లోని రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement