థాంక్యూ అమ్మ‌.. నీ వ‌ల్లే ఇదంతా: మను భాకర్‌ | Manu Bhaker Sends Emotional Message To Mother After Historic Run In Paris Olympics 2024 | Sakshi
Sakshi News home page

Manu Bhaker Emotional Message: థాంక్యూ అమ్మ‌.. నీ వ‌ల్లే ఇదంతా

Published Sat, Aug 3 2024 8:07 PM | Last Updated on Sat, Aug 3 2024 8:36 PM

Manu Bhaker sends emotional message to mother after historic Olympics 2024

ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప‌త‌కాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత స్టార్ షూటర్ మను భాకర్‌కు నిరాశే ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో మూడో పతకాన్ని మను భాకర్ చేజార్చుకుంది.

శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 4వ స్థానంతో మను సరిపెట్టుకుంది. ఏదమైనప్పటకి మను తన పేరును ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది.  ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా మను రికార్డులకెక్కింది.

మను బాకర్‌ తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకోగా .. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. 

ఇక మూడో పతకం చేజారిన అనంతరం  ఆధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్ భావోద్వేగానికి లోనయ్యంది. తన తల్లి సహకారంతోనే ఇదింతా సాధించానని మను తెలిపింది.

'ఈ సందర్భంగా మా అమ్మకు ఓ సందేశం పంపాలనుకుంటున్నాను. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు.  నీ సహకారంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను.

నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వీలైనంత ఎక్కువ కాలం నాతో పాటే ఉండాలని  నేను ఆశిస్తున్నా అని మను బాకర్‌ పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement