టెక్‌బాల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం | India Secure Historic First Medal In Teqball Championships, Declan Gonsalves And Anas Baig Win Bronze | Sakshi
Sakshi News home page

టెక్‌బాల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం

Published Fri, Dec 13 2024 7:14 PM | Last Updated on Sat, Dec 14 2024 5:32 PM

India Secure Historic First Medal In Teqball Championships, Declan Gonsalves And Anas Baig Win Bronze

టెక్‌బాల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2024లో భారత్‌కు తొలి పతకం లభించింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో అనాస్‌ బేగ్‌, డెక్లన్‌ గొంజాల్వెస్‌ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. టెక్‌బాల్‌ క్రీడలోకి ఇటీవలే ప్రవేశించిన బేగ్‌-గొంజాల్వెస్‌ జోడీ అంచనాలకు మించి రాణించి అభిమానులను ఆకట్టుకుంది. 

తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్‌-గొంజాల్వెస్‌ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్‌లాండ్‌ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్‌బాల్‌లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్‌ రికార్డుల్లోకెక్కింది.

టెక్‌బాల్‌ అంటే.. 
టెక్‌బాల్‌ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్‌డ్‌ (వంగిన) టేబుల్‌పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్‌బాల్‌ తరహా బంతిని వాడతారు. టెక్‌బాల్‌ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్‌గా ఆడవచ్చు. 

ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్‌బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement