ఒలింపిక్స్ ఫుట్‌బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్‌తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.
ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment