Sakshi Malik
-
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్‌గా మారింది. సాక్షి మాలిక్‌ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్‌తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్‌ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్‌ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్‌లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్‌ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్‌లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్‌ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
ఆమె నిజాయితీని అమ్ముకుంది: మండిపడ్డ బబిత
ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌పై మాజీ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు.హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్నెస్’ను మార్కెట్లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.వినేశ్తో సాక్షి మాలిక్స్వార్థంగా ఆలోచించారుఇందులో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్ ఫొగట్, బజరంగ్ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.బబిత నటనకు కారణం అదేఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్, బజరంగ్లను రెచ్చగొట్టి ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.తాము బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్భూషణ్ స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్ విమర్శించారు.నీ బాధ నాకు అర్థమవుతుందిలేఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు బబిత.వినేశ్ స్పందన ఇదేఅంతకు ముందు వినేశ్ ఫొగట్ సైతం సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?నేను, సాక్షి, బజరంగ్ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.రాజకీయాల్లో ఫొగట్ కుటుంబంఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు’ -
ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’
‘‘ఆరోజు మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడిస్తానని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే ఆయన గదికి వెళ్లాను. అపుడు సింగ్.. నిజంగానే మా పేరెంట్స్‌కు కాల్ చేసి.. వాళ్లతో మాట్లాడించాడు. నా మ్యాచ్ గురించి, మెడల్ గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పాను. అక్కడ ఊహించని ఘటన జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు.అంతాబాగానే ఉంది.. ప్రమాదమేమీ లేదనిపించింది. అయితే, ఒక్కసారి కాల్ కట్ చేసిన తర్వాత.. అతడి ప్రవర్తన మారిపోయింది. నేను అతడి బెడ్‌మీద కూర్చుని ఉన్నపుడు నన్ను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని వెనక్కి తోసి ఏడ్చేశాను. అతడు చేసే పనులకు బదులివ్వడానికి నేను సిద్ధంగా లేనని గ్రహించి ఒక అడుగు వెనక్కి వేశాడు.నా భుజాల చుట్టూ చేతులు వేసి.. ‘తండ్రి లాంటి వాడిని’ అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతడి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. ఏడుస్తూ.. అక్కడి నుంచి బయటకు పరిగెత్తి నా గదికి వెళ్లిపోయాను’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. హోటల్ గదిలో లైంగిక వేధింపులుభారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ తనతో ప్రవర్తించిన తీరును.. తన ఆటోబయోగ్రఫీ ‘విట్నెస్’లో ప్రస్తావించింది. కజక్‌స్తాన్‌లో 2021 నాటి ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా హోటల్ గదిలో బ్రిజ్‌భూషణ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడుఅంతేకాదు.. బాల్యంలోనూ తనకు ఇలాంటి ఘటన ఎదురైందని సాక్షి మాలిక్ తన పుస్తకంలో పేర్కొంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. నా చిన్నపుడు కూడా ఇలాగే వేధింపుల బారినపడ్డాను. నా ట్యూషన్ టీచర్ నన్ను వేధిస్తూ ఉండేవాడు. వేళ కాని వేళ ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడు. అక్కడికి వెళ్లిన కాసేపటి తర్వాత ట్యూషన్ గురించి పక్కనపెట్టి నన్ను తాకాలని చూసేవాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెబితే.. తప్పు నాదే అంటారేమోనన్న భయంతో మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అమ్మకు కూడా చెప్పే ధైర్యం లేకపోయింది. చాలా ఏళ్లు అతడి వేధింపులను మౌనంగానే భరించాను.కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనిఅయితే, అమ్మ విషయం అర్థం చేసుకుంది. నాకు అండగా నిలబడింది. ట్యూషన్ టీచర్, సింగ్ లాంటి వాళ్ల గురించి మర్చిపోయి.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని.. అలాంటి చెత్త మనుషుల గురించి భయపడాల్సిన పనిలేదని.. ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది. ఇలాంటి చేదు అనుభవాల తర్వాత కూడా నా తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు కాబట్టే నేను ఇక్కడిదాకా చేరుకోగలిగాను’’ అని సాక్షి మాలిక్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు రాసుకొచ్చింది. కాగా కొన్నాళ్ల క్రితం.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.నాటి రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు ఈ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్నారు. అయితే, రెజ్లింగ్ సంఘం ఎన్నికల నుంచి బ్రిజ్‌భూషణ్ తప్పుకొన్నా.. అతడి అనుచరుడు సంజయ్ సింగ్‌ను గెలిపించుకున్నాడు. దీంతో ఆవేదన చెందిన సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలికింది. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది! -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
ఒలింపిక్ పతక విజేతలకు షాకిచ్చిన రెజ్లింగ్ సమాఖ్య!
భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్‌లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్‌పై ప్రకటన చేశారు.షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్యఅయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) లీగ్‌కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్‌కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్‌గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంఅదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్‌లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్‌తో రెజ్లింగ్‌కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్‌మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.లీగ్‌కు గుర్తింపు లేదు కానీ డబ్ల్యూఎఫ్ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్‌కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్‌తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. చదవండి: కొరియాను కొట్టేసి... ఫైనల్లో భారత్ -
కాంగ్రెస్‌లోకి వినేశ్, బజరంగ్: సాక్షి మాలిక్ వ్యాఖ్యలు వైరల్
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ నాయకులుగా తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. హర్యానాకు చెందిన వీరిరువురు శుక్రవారం హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించింది.వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని.. తాను మాత్రం మహిళా రెజ్లర్ల తరఫున పోరాడేందుకు అంకితమవుతానని స్పష్టం చేసింది. తనకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. అయితే, బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశం తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో నిద్రాహారాలు మాని నిరసనకాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు బాధితులకు మద్దతుగా ఢిల్లీలో నిరసనకు దిగారు. నెలలపాటు పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం చేశారు.అయితే, ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వీరి ఉద్యమంపై స్పందించలేదు. దీంతో పతకాలు, ప్రభుత్వ పురస్కారాలు వెనక్కి ఇచ్చేందుకు రెజ్లర్లు సిద్ధపడిన తరుణంలో ఎట్టకేలకు రెజ్లింగ్ సమాఖ్యకకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్ పదవి నుంచి దిగిపోయినప్పటికీ అతడి అనుచరుడు సంజయ్ గద్దెనెక్కాడు.ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. వినేశ్, బజరంగ్ సైతం సంజయ్ ఎన్నికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, వీరిద్దరు రెజ్లర్లుగా కొనసాగుతూనే ఉద్యమానికి అండగా ఉండగా.. సాక్షి మాత్రం బ్రిజ్‌భూషణ్ విషయంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించింది.త్యాగాలకు సిద్ధపడాలిఈ నేపథ్యంలో వినేశ్, బజరంగ్ రాజకీయాల్లో చేరడంపై సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘అది వారి వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఒక లక్ష్యంతో పోరాడే వారు త్యాగాలకు సిద్ధపడాలి. నేను అదే చేస్తున్నా. మహిళా రెజ్లర్లకు మద్దతుగా మేము సాగించిన పోరాటంపై విమర్శలు వచ్చేలా, వక్రభాష్యాలు ఆపాదించేందుకు ఆస్కారమిచ్చేలా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.నిస్వార్థ పోరాటం ఆగదువారికి అండగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఆలోచలన్నీ రెజ్లింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాకు కూడా రాజకీయ పార్టీల ఆహ్వానాలు అందాయి. కానీ నేను ఉద్యమ బాటనే ఎంచుకున్నాను. బాధితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే, వారి ప్రయోజనాల కోసమే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను.మహిళా రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టల నుంచి విముక్తి లభించేదాకా నా పోరాటం ఆగదు. మా పోరాటం నిస్వార్థమైనది.. అది కొనసాగుతూనే ఉంటుంది’’ అని సాక్షి మాలిక్ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించింది.సాక్షి మాలిక్ సాధించిన ఘనతలు ఇవీకామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలుఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలురియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం -
Sakshi Malik: నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను
కొన్నాళ్ల క్రితం బౌట్లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్నెస్’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్‌నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది.బౌట్లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్తక్లోని అఖాడాలో రెజ్లింగ్ నేర్చుకోవడం, దాన్ని కెరీర్‌గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి. వెన్నుచూపని తీరుఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది. పురుషాధిక్య భారత రెజ్లింగ్ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్ తెలిపింది. -
‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్‌కు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
సస్పెండ్ చేస్తే సరిపోతుందా?
డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్‌పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా? భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు. మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్‌తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది. దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్దబా థా... దబ్దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఊహించిన ఫలితమే! ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్‌కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్‌గా వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి. నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్భూషణ్సింగ్పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది. నిబంధనలను ఉల్లంఘించి... అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని నందిని నగర్‌ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం. చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్‌పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం. అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం. – జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు; – ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్‌కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్‌పై.. బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్‌భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్‌సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్‌భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్‌పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్‌కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్‌భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్‌బై ‘బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్‌భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్‌భూషణ్ క్యాంప్‌లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్‌కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్‌భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్‌కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్‌నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
మెల్టింగ్ పోజుల్లో మాళవిక.. వయ్యారంగా హాట్ బ్యూటీ
బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్ ఒంపుసొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న సాక్షి మాలిక్ జిమ్‌లో హాట్ బ్యూటీ అన్వేషి జైన్ సెల్ఫీ పోజులు దేశీ ఔట్ఫిట్లో బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతు వింత పోజుల్లో 'ఆదిపురుష్' కృతి సనన్ ఎల్లో డ్రస్‌లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ నుపుర్ నవ్వుతో చంపేస్తున్న 'గుంటూరు కారం' మీనాక్షి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఇకపై రోడ్డెక్కం... కోర్టులోనే తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్‌భూషణ్‌పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్తో పాటు సాక్షి మలిక్ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. -
సాక్షి మాలిక్ పై బబితా ఫోగట్ ఫైర్.. ఇదీ మీ అసలు రంగు..
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, బబితా ఫోగట్ మాటల యుద్ధానికి తెరతీశారు. సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ తో కలిసి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో వారు మాట్లాడుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురై చేసింది కాదు. రెజ్లింగ్ సమాఖ్యలో 90 శాతం మందికి 10-12 ఏళ్లుగా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలుసు. మాలో ఐక్యత లేకపోయినా కొంతమంది మాత్రం నిరసన తెలపడానికి ముందుకు వచ్చారు. దీక్ష చేయడానికి అనుమతి తీసుకుంది కూడా బీజేపీ నాయకులైన బబితా ఫోగట్, తీరథ్ రాణాలేనని తెలిపారు. అనంతరం ఆ అనుమతి లేఖను కూడా చూపించారు. బబితా కౌంటర్.. ఈ వీడియోకు కామన్ వెల్త్ బంగారు పతక విజేత బబితా ఫోగట్ ట్విట్టర్లో కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ వీడియో చూశాక మిమ్మల్నిద్దరినీ చూసి నాకు కొంచెం బాధగా అనిపించింది. తర్వాత కాసేపు నవ్వుకున్నాను కూడా. ఇలాంటి ఒక విషయాన్ని చెప్పి దాక్కుంటామంటే సరికాదు మిత్రమా. మీరు చూపించిన లేఖలో నా పేరు గానీ నా సంతకం గానీ లేదు. పరోక్షంగా కూడా నా ప్రస్తావన ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నాకు ప్రధానిపైనా, మన న్యాయ వ్యవస్థపైనా నమ్మకముందని నేను మొదటిరోజు నుంచే చెబుతున్నాను. ఒక మహిళగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నా సహచరులపై నాకు కూడా ప్రేమ, పట్టింపులు ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని మొదట ప్రధాన మంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించాను. కానీ వారు మాత్రం కాంగ్రెస్ లీడర్లు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితులైన దీపేందర్ హుడాలను ఆశ్రయించారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మీ అసలు రూపాన్ని చూస్తున్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున మీరు చేసిన హడావుడి, గంగానదిలో పతకాలను విసిరేస్తామని చెప్పడం చూస్తుంటే ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న ఆటని అందరికీ అర్ధమవుతోందని తెలిపారు. एक कहावत है कि ज़िंदगी भर के लिये आपके माथे पर कलंक की निशानी पड़ जाए। बात ऐसी ना कहो दोस्त की कह के फिर छिपानी पड़ जाएँ । मुझे कल बड़ा दुःख भी हुआ और हँसी भी आई जब मैं अपनी छोटी बहन और उनके पतिदेव का विडीओ देख रही थी , सबसे पहले तो मैं ये स्पष्ट कर दूँ की जो अनुमति का काग़ज़… https://t.co/UqDMAF0qap — Babita Phogat (@BabitaPhogat) June 18, 2023 దీనికి మళ్ళీ సాక్షి మాలిక్ గట్టిగ కౌంటర్ ఇచ్చింది. సహచరులంతా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం ప్రభుత్వం ఒడిలో చల్లగా సేదదీరుతున్నారు. మీ స్వప్రయోజనాల కోసం సహచరులకు ఎటువంటి సాయం చేయకపోగా ఇలా హేళన చేయడం సరికాదని అన్నారు. वीडियो में हमने तीरथ राणा और बबीता फोगाट पर तंज कसा था कि कैसे वे अपने स्वार्थ के लिए पहलवानों को इस्तेमाल करना चाह रहे थे और कैसे पहलवानों पर जब विपदा पड़ी तो वे जाकर सरकार की गोद में बैठ गये. हम मुसीबत में ज़रूर हैं लेकिन हास्यबोध इतना कमज़ोर नहीं हो जाना चाहिए कि ताकतवर को… https://t.co/xGn81uHyav — Sakshee Malikkh (@SakshiMalik) June 18, 2023 ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? -
'రాజీకి రావాలని మాపై ఒత్తిడి ఉంది'.. రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు..
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో నిరసనలు కొనసాగిస్తున్న తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. రాజీకి రావాలని నిందితుని మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చారని అన్నారు. 'నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి మేం కోరుతున్నాం.. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆమె ఆరోపించారు. బ్రిజ్ భూషణ్‌పై చేసింది తప్పుడు ఫిర్యాదని బాధిత మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలిపడంతో అంతా అవాక్కయ్యారు. 2022లో అండర్-17 ఛాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో సమావేశమైన అనంతరం జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని ప్రకటించారు. అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. అలా అయితే.. ఆసియా గేమ్స్ ఆడబోము.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఏడాది వచ్చే ఆసియా గేమ్స్ ఆడబోమని రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు.ప్రతిరోజూ మానసికంగా తాము వేదనను అనుభవిస్తున్నామని తెలిపారు. హరియాణాలోని సోనిపట్‌లో ఈ రోజు నిర్వహించిన కాప్ పంచాయత్‌లో టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఐదు డిమాండ్లను వారు కోరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి:రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా? -
నిరసన నుంచి తప్పుకున్నట్లు వార్తలు.. రెజ్లర్ సాక్షి మాలిక్ క్లారిటీ
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు గత రెండు నెలలగా ఆందోళన చేస్తున్న విషయం విధితమే. అయితే ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రెజర్లు కలిసారు. ఈ క్రమంలో అమిత్ షాను కలిసిన తర్వాత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ పోరాటం నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆమె తిరిగి రైల్వేలో తన విధుల్లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సాక్షి మాలిక్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలే అని ఆమె కొట్టిపారేసింది. "ఇవన్నీ రూమర్స్ మాత్రమే. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గే ఆలోచన కూడా మాకు లేదు. మేము ఉద్యోగాల్లో చేరనంత మాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్లు కాదు. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఆమె ట్విటర్లో పేర్కొంది. కాగా స్టార్ రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు. ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC — Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023 చదవండి: మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..! -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్‌నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్‌ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్‌లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం?