
భారత్ కు తొలి పతకం
రియో డి జెనీరో: ఎప్పుడెప్పుడు మన ప్లేయర్లు పతకాల ఖాతా తెరుస్తారా? అనే సగటు భారతీయుడి ఎదురుచూపుకి తెరపడింది. విమెన్స్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ పతకాల ఖాతాను తెరించింది. కిర్గిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను ఓడించి.. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
ఒలింపిక్స్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు కొనసాగిన మ్యాచ్ ప్రథమార్ధమైన మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-5తో వెనుకంజలో నిలించింది. ద్వితియార్ధంలో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత చివరి 20 సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి 8-5తో విజయపతాకాన్ని ఎగురవేసింది.