tynybekova
-
'నా పన్నేండేళ్ల శ్రమ నేడు ఫలించింది'
-
జయహో సాక్షి
-
'నా పన్నేండేళ్ల శ్రమ నేడు ఫలించింది'
రియోడిజనిరో: తన పన్నేండళ్ల కష్టానికి ఫలితమే ఈ ఒలింపిక్స్ పతకం అని భారత్ కు రియోడిజనిరోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని సాధించిపెట్టిన సాక్షి మాలిక్ చెప్పింది. చివరి వరకు తాను గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని ఆమె చెప్పింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించి ఈ పతకాన్ని గెలిచి భారత్ తరుపున ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని సాధించింది. దీంతో రియో ఒలింపిక్స్ ఎట్టకేలకు భారత్ పతకాల ఖాతా తెరిచినట్లయింది. ఈ పతకం గెలిచిన సందర్భంగా సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా పన్నేండేళ్ల కఠోర శ్రమ నేడు ప్రతిఫలించింది. చివరి అంకం వరకు పతకం నాదే అని నా గుండె నాకు బలంగా చెప్పింది' అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడింది. భారత్‌కు ఒలింపిక్స్ నుంచి పతకం తీసుకొచ్చిన సాక్షి నాలుగో మహిళకాగా.. రెజ్లర్ గా తొలి మహిళ. -
రెజ్లర్ సాక్షి మాలిక్‌కు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్‌కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో తొలి మహిళ రెజ్లర్ గా సాక్షి మాలిక్ భారత్‌కు తొలి పతకం సాధించడం భారత జాతికి ఎంతో గర్వకారణమని వైఎస్ జగన్ కొనియాడారు. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గిన విషయం తెలిసిందే. Hearty congrats to our first woman wrestler to win a #RioOlympics2016 medal. You've made us proud, Sakshi Malik! — YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016 -
జయహో సాక్షి
భారత్‌కు తొలి పతకం రియో డి జనీరో: ఎట్టకేలకు రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సాక్షి.. భారత్ అభిమానుల పతక నిరీక్షణకు తెరదించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా విజయ బావుటా ఎగురేసి బ్రెజిల్ వీధుల్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది. -
భారత్ కు తొలి పతకం
రియో డి జెనీరో: ఎప్పుడెప్పుడు మన ప్లేయర్లు పతకాల ఖాతా తెరుస్తారా? అనే సగటు భారతీయుడి ఎదురుచూపుకి తెరపడింది. విమెన్స్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ పతకాల ఖాతాను తెరించింది. కిర్గిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను ఓడించి.. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు కొనసాగిన మ్యాచ్ ప్రథమార్ధమైన మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-5తో వెనుకంజలో నిలించింది. ద్వితియార్ధంలో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత చివరి 20 సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి 8-5తో విజయపతాకాన్ని ఎగురవేసింది.