
రెజ్లర్ సాక్షి మాలిక్‌కు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో తొలి మహిళ రెజ్లర్
గా సాక్షి మాలిక్ భారత్‌కు తొలి పతకం సాధించడం భారత జాతికి ఎంతో గర్వకారణమని వైఎస్ జగన్ కొనియాడారు.
మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గిన విషయం తెలిసిందే.
Hearty congrats to our first woman wrestler to win a #RioOlympics2016 medal. You've made us proud, Sakshi Malik!
— YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016