రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
రోహ్‌తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.
రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గాడు.