ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్‌! | Sakshi Malik is marrying a fellow wrestler this year | Sakshi
Sakshi News home page

ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్‌!

Published Sun, Aug 28 2016 4:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్‌!

ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్‌!

రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది రెజ్లర్‌ సాక్షి మాలిక్‌. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దేశాన్ని ఆనందంలో ముంచెత్తిన ఈ అమ్మడు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నది. అది కూడా సహచర రెజ్లింగ్‌ ఆటగాడినే. బెంగాలీ దినపత్రిక 'ఆనంద్‌బజార్ పత్రిక'కు ఇంటర్వ్యూ వచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది.

'అతను చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. నా కలలను తన కలలుగా భావిస్తాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకో మంచి స్నేహితుడు దొరికినట్టే' అని సాక్షి తెలిపింది. అయితే, తనకు కాబోయే భర్త పేరు మాత్రం 'సీక్రెట్‌' అని చెప్పింది. ఈ ఏడాదే తాము పెళ్లి చేసుకుంటామని వివరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు తన పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్‌ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement