లక్నో: రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 11 వరకు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత మహిళల రెజ్లింగ్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. ట్రయల్స్‌లో సాక్షి మలిక్ 18 ఏళ్ల సోనమ్ చేతిలో ఓడింది. 62 కేజీల బౌట్‌లో సోనమ్ 8–7తో సాక్షిని ఓడించి భారత జట్టులో చోటు దక్కించుకుంది.
క్వాలిఫయింగ్ టోర్నీలో సోనమ్ ఫైనల్‌కు చేరుకుంటే ‘టోక్యో’ బెర్త్ ఖాయమవుతుంది. ఒకవేళ సోనమ్ ఫైనల్ చేరని పక్షంలో సాక్షికి వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి అవకాశం మిగిలి ఉంటుంది. సోనమ్‌తోపాటు సీమా (50 కేజీలు), అన్షు (57 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) కూడా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో బరిలోకి దిగుతారు.
Comments
Please login to add a commentAdd a comment