ఫైనల్ చేరిన అమన్ సెహ్రావత్
ఇస్తాన్‌బుల్: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు తొలి బెర్త్ లభించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో అమన్ సెహ్రావత్ ఫైనల్‌కు చేరడంతో భారత్‌నుంచి ఒక రెజ్లర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయమైంది. 57 కేజీల విభాగంలో అమన్ 12–2 స్కోరుతో హాన్ చాంగ్‌సాంగ్ (కొరియా)ను చిత్తు చేశాడు. మరో సెమీఫైనల్లో భారత రెజ్లర్ సుజీత్ (65 కేజీలు) 1–6 తేడాతో తుల్గా తుమూర్ (మంగోలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
అయితే అతని అవకాశాలు పూర్తిగా పోలేదు. నేడు మూడో స్థానంలో కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో గెలిచినా సుమీత్ భారత్‌కు రెండో బెర్త్ అందిస్తాడు. మరో వైపు బరిలోకి దిగిన మిగిలిన నలుగురు భారత రెజ్లర్లకు మాత్రం చుక్కెదురైంది. వీరందరిలోకి అత్యంత అనుభవజు్ఞడైన దీపక్ పూనియా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
86 కేజీల విభాగంలో 4–6 తేడాతో చైనాకు చెందిన జూషెన్ లిన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. జూషెన్ ఆ తర్వాత క్వార్టర్స్‌లో పరాజయంపాలవడంతో పూనియా ‘రెపిచెజ్’ ఆశలు కూడా గల్లంతయ్యాయి. 74 కేజీల విభాగంలో జైదీప్ 0–3తో తైమురాజ్ సల్కజనోవ్ (స్లొవేకియా) చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా...దీపక్ (97 కేజీలు) 1–5తో ఒమర్‌బిబిరోవిచ్ (మాసిడోనియా) చేతిలో, ఆంథోనీ జాన్సన్ (జమైకా) చేతిలో సుమీత్ మాలిక్ (125 కేజీలు) పరాజయంపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment