యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్‌పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు.
గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్‌లో ఓడిన సుమిత్‌కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్‌లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment