grand slam tennis tounrment
-
Australian Open 2024: భళా బ్లింకోవా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఐదో రోజు గురువారం టాప్–10లోని ఇద్దరు క్రీడాకారిణులు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)... ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రస్తుతం టాప్–10లో నలుగురు క్రీడాకారిణులు టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మాత్రమే బరిలో నిలిచారు. 42 పాయింట్ల టైబ్రేక్... రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 2 గంటల 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6–4, 4–6, 7–6 (22/20)తో రిబాకినాపై గెలుపొందగా... క్లారా బురెల్ (ఫ్రాన్స్) 70 నిమిషాల్లో 6–4, 6–2తో పెగూలాను ఓడించి తమ కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. బ్లింకోవా–రిబాకినా మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నిర్ణాయక మూడో సెట్లో జరిగిన టైబ్రేక్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా నిలిచింది. 31 నిమిషాలపాటు సాగిన 42 పాయింట్ల టైబ్రేక్‌లో చివరకు బ్లింకోవా 22–20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మూడో సెట్ ఏకంగా 93 నిమిషాలు సాగింది. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో లెసియా సురెంకో (ఉక్రెయిన్)–అనా బొగ్డాన్ (రొమేనియా) మధ్య మూడో రౌండ్ మ్యాచ్‌లోని మూడో సెట్లో టైబ్రేక్ 38 పాయింట్లపాటు జరిగింది. చివరకు సురెంకో ఈ టైబ్రేక్‌ను 20–18 పాయింట్లతో గెల్చుకుంది. రిబాకినాతో జరిగిన మ్యాచ్‌లో బ్లింకోవా ఏకంగా ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మరోవైపు రిబాకినా తొమ్మిదిసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా పదోసారి పరాజయం తప్పలేదు. శ్రమించి నెగ్గిన స్వియాటెక్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్ చేరడానికి 3 గంటల 14 నిమిషాలు శ్రమించింది. ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్వియాటెక్ రెండో రౌండ్లో 6–4, 3–6, 6–4తో 2022 రన్నరప్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ కసత్కినా 6–4, 3–6, 3–6తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) 4–6, 6–4, 4–6తో యాఫాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–0, 3–6, 6–4తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా)పై, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–3, 6–3తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో తొమోవా (బల్గేరియా)పై గెలిచారు. హోల్గర్ రూనెకు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) రెండో రౌండ్లో ని్రష్కమించాడు. ఆర్థర్ కజాక్స్ (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–4, 4–6, 6–3తో రూనెపై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో సొనెగో (ఇటలీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో లుకాస్ క్లీన్ (స్లొవేకియా)పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచారు. పోరాడి ఓడిన సుమిత్ నగాల్ భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది. -
యాష్లే బార్టీ జోరు
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో బార్టీ 6–1, 7–5తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో బార్టీ 11 ఏస్‌లు కొట్టి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... క్లారా రెండు ఏస్‌లను సంధించి మూడు డబుల్ ఫాల్ట్‌లను చేసింది. ఆమెతో పాటు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై, రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో కోకో గాఫ్ (అమెరికా)పై గెలుపొందారు. సిట్సిపాస్, మెద్వెదేవ్ ముందంజ... పురుషుల విభాగంలో గ్రీస్ ప్లేయర్, మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, ఈ టోర్నీ రెండు సార్లు రన్నరప్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) మూడో రౌండ్లో ప్రవేశించారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 3–6, 6–4, 7–6 (7/4), 6–0తో అడ్రియాన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్ ఏకంగా 27 ఏస్‌లు సంధించాడు. మెద్వెదేవ్ 6–4, 6–1, 6–2తో డొమినిక్ కొఫెర్ (జర్మనీ)పై గెలిచి మూడు రౌండ్‌కు చేరుకున్నాడు. -
డిఫెండింగ్ చాంపియన్ నాదల్ కూడా...
న్యూయార్క్: అమెరికాలో ఇంకా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో... ఈనెల 31 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభం కావాల్సిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనడంలేదని పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కోవిడ్–19 కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారిపై మనకింకా నియంత్రణ రాలేదనిపిస్తోంది. ఆడకూడదనే నిర్ణయం నేను తీసుకోవద్దనుకున్నాను. కానీ నా మనసు మాట విన్నాకే ఈసారి న్యూయార్క్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను’ అని కెరీర్లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 34 ఏళ్ల నాదల్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్, నాదల్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశం లభించనుంది. నిర్వాహకులు వెల్లడించిన తాజా జాబితా ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–10 ఆటగాళ్లలో ఏడుగురు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ మినహా టాప్–10లోని తొమ్మిది మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. -
జైకోవిచ్...
కుడి మోచేతి గాయం కారణంగా గత ఏడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలిగిన నొవాక్ జొకోవిచ్... సంవత్సరం తిరిగేలోపే అదే వేదికపై చాంపియన్‌గా అవతరించాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి వెనుకబడిపోయిన ఈ సెర్బియా స్టార్ తాజా విజయంతో నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా మళ్లీ పైకెగిశాడు. లండన్: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ‘గ్రాండ్’ విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ జొకోవిచ్ 6–2, 6–2, 7–6 (7/3)తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్‌కాగా... కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక జొకోవిచ్ సాధించిన మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ అండర్సన్‌కు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో ఇవానిసెవిచ్ (క్రొయేషియా) తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తక్కువ ర్యాంక్ ఆటగాడు జొకోవిచ్ (21వ ర్యాంక్) కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై, సెమీఫైనల్లో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై ఐదు సెట్ల సుదీర్ఘ పోరాటాల్లో అద్భుత విజయాలు సాధించిన అండర్సన్ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 92 కేజీల బరువున్న అండర్సన్‌పై తొలి గేమ్ నుంచే ఆధిపత్యం చలాయించిన జొకోవిచ్ తొలి సెట్లో రెండు... రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లు సాధించి అలవోకగా సెట్లను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అండర్సన్ తేరుకోవడం... జొకోవిచ్ తన జోరును కొనసాగించడంతో ఒక్క బ్రేక్ పాయింట్ రాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజయానంతరం జొకోవిచ్ సరదాగా సెంటర్కోర్టులోని పచ్చికను నోట్లో వేసుకున్నాడు. నాకివి అద్భుతమైన క్షణాలు. నా భార్య, కుమారుడి ముందు గెలిచిన ఈ టైటిల్ నా జీవితంలోనే మధురానుభూతిగా మిగలనుంది. నా దృష్టిలో టెన్నిస్‌కు వింబుల్డన్ పవిత్రమైన వేదిక. టైటిల్‌తో పునరాగమనం చేసేందుకు ఇంతకుమించిన వేదిక ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడ ట్రోఫీని సగర్వంగా అందుకోవాలని నేను బాల్యంలోనే కలలు కనేవాణ్ని. ఇంత గొప్ప వేదికపై నాలుగోసారి టైటిల్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జొకోవిచ్ ఈ పచ్చిక ఎంతో తీయన... -
క్విటోవా, డెల్ పొట్రోలకు షాక్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఆరో రోజు అగ్రశ్రేణి క్రీడాకారులకు కలసిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో 2009 చాంపియన్, ఆరో సీడ్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్లో... మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 14వ సీడ్ మరియా కిరిలెంకో (రష్యా), 2004 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) మూడో రౌండ్లో ఇంటిదారి పట్టారు. చాలా రోజుల తర్వాత ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. 2001 యూఎస్ చాంపియన్ హెవిట్ రెండో రౌండ్లో 6-4, 5-7, 3-6, 7-6 (7/2), 6-1తో డెల్ పొట్రో (అర్జెంటీనా)ను బోల్తా కొట్టించాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అన్‌సీడెడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) 6-3, 6-0తో ప్రపంచ 10వ ర్యాంకర్ క్విటోవాపై; సిమోనా హలెప్ (రుమేనియా) 6-1, 6-0తో కిరిలెంకోపై; ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 7-5, 6-1తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. డెల్ పొట్రోతో 4 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హెవిట్ దూకుడుగా ఆడి తన పాతరోజులను గుర్తుకు తెచ్చాడు. తరచూ గాయాల బారిన పడి ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 66వ స్థానంలో ఉన్న 32 ఏళ్ల ఈ వింబుల్డన్ మాజీ చాంపియన్ కెరీర్లో 32వ సారి ఐదు సెట్ల మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేశాడు. 2006 తర్వాత తొలిసారి యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నిష్ర్కమించిన డెల్ పొట్రో ఏకంగా 70 అనవసర తప్పిదాలు, 8 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కెరీర్లో 13వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతోన్న హెవిట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను 8 సార్లు బ్రేక్ చేశాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/2), 6-2, 6-2తో బెంజమిన్ బెకర్ (జర్మనీ)పై, మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-5, 6-1, 3-6, 6-1తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై, ఐదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 7-6 (7/3), 7-6 (7/3), 6-3తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-5, 7-6 (10/8), 6-4తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై, 12వ సీడ్ టామీ హాస్ (జర్మనీ) 6-3, 6-4, 7-6 (7/3)తో యెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గి మూడో రౌండ్‌కి చేరారు. లిసికి పరాజయం మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) మూడో రౌండ్లోనే ఓడిపోయింది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన లిసికి 4-6, 5-7తో 24వ సీడ్ మకరోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-3, 6-1తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.