Sumit Nagal
-
‘నంబర్ వన్’గా సహజ.. సుమిత్, బోపన్నలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల విరామం తర్వాత తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి(Sahaja Yamalapalli) మళ్లీ టాప్–300లోకి దూసుకు వచ్చింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ-WTA) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సహజ ఏకంగా 21 స్థానాలు పురోగతి సాధించి 294వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ సహజదే కావడం విశేషం. ఫలితంగా ఆమె మళ్లీ భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచింది. తొమ్మిది స్థానాలు పడిపోయిన అంకిత రైనా 295వ ర్యాంక్‌కు చేరుకోగా... తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 332వ ర్యాంక్‌లో ఉంది. ఇక 2024 నవంబర్ 286వ స్థానంలో నిలిచిన సహజ ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో పడిపోయి 300 నుంచి బయటకు వచ్చింది. అయితే గతవారం బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. నగాల్ ర్యాంక్ 106 న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్(Sumit Nagal) ర్యాంక్ దిగజారింది. పది నెలల తర్వాత అతను టాప్–100లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నగాల్ 15 స్థానాలు పడిపోయి 106వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఫిబ్రవరిలో టాప్–100లోకి వచ్చిన నగాల్ గత వారం వరకు వందలోపు కొనసాగాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో నగాల్ ర్యాంక్ పడిపోయింది. భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 365వ ర్యాంక్‌లో, రామ్‌కుమార్ రామనాథన్ 406వ ర్యాంక్‌లో, కరణ్ సింగ్ 496వ ర్యాంక్‌లో ఉన్నారు.టాప్–20లో చోటు కోల్పోయిన బోపన్న మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) ఐదు స్థానాలు పడిపోయి 21వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన బోపన్న ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడం అతని ర్యాంక్‌పై ప్రభావం చూపింది. టాప్–100లో భారత్ నుంచి ఆరుగురు ఉండటం విశేషం. యూకీ బాంబ్రీ 47వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. శ్రీరామ్ బాలాజీ 64వ ర్యాంక్‌లో ఉండగా... హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఏడు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అర్జున్ ఖడే 83వ ర్యాంక్‌లో, జీవన్ నెడుంజెళియన్ సరిగ్గా 100వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 91వ ర్యాంకర్ నగాల్ 3–6, 1–6, 5–7తో ఓడిపోయాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 20 అనవసర తప్పిదాలు చేశాడు. 19 విన్నర్స్ కొట్టిన నగాల్ తన సరీ్వస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన నగాల్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 69 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్ తూఫాన్స్ విజయం రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 5–1 గోల్స్ తేడాతో గెలిచింది. తూఫాన్స్ తరఫున గొంజాలో పిలాట్ (6వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మైకో కసెల్లా (21వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (47వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కళింగ లాన్సర్స్ జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (5వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు ఆడుతుంది. ఒడిశా వారియర్స్ బోణీ రాంచీలో ఆదివారం మొదలైన తొలి మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఒడిశా వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. ఒడిశా వారియర్స్ 4–0 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఒడిశా వారియర్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ, 37వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... బల్జీత్ కౌర్ (42వ నిమిషంలో), ఫ్రీక్ మోయిస్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ తలపడుతుంది. -
సుమిత్... మళ్లీ తొలి రౌండ్లోనే...
మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 66వ ర్యాంకర్ కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)తో ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను 5–7తో కోల్పోయి, రెండో సెట్లో 0–4తోవెనుకబడ్డాడు. ఈ దశలో సుమిత్‌కు గాయం కావడంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.సుమిత్‌కు 6,215 యూరోలు (రూ. 5 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా దక్కాయి. సుమిత్ ఆడిన గత పది టోర్నీలలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందడం గమనార్హం. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ 71వ ర్యాంకర్ క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆ్రస్టేలియా)తో జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్ లో 81వ ర్యాంకర్ సుమిత్ 4–6, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సుమిత్‌కు 6,380 యూరోల (రూ. 5 లక్షల 79 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
నగాల్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డ 27 ఏళ్ల నగాల్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 3–6, 3–6తో ప్రపంచ 564వ ర్యాంకర్ యిబింగ్ వు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. కేవలం రెండు విన్నర్స్ కొట్టిన నగాల్ ఎనిమిది అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 23,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 52 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత నగాల్ గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. స్వీడన్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఆడాల్సిన సమయంలో నగాల్ వెన్నునొప్పి కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. నగాల్ గైర్హాజరీ అంశం వివాదాస్పదమైంది. డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాలంటే 50 వేల డాలర్ల వార్షిక ఫీజు తనకు చెల్లించాలని నగాల్ డిమాండ్ చేసినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఆరోపించింది. -
క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ ఓడిపోయాడు. ప్రపంచ 63వ ర్యాంకర్ పావెల్ కొటోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 6–7 (5/7)తో ఓటమి పాలయ్యాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 8,340 డాలర్ల (రూ. 6 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
డబ్బు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్
భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అతడు ఫీజును డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు నగాల్ కూడా దీన్ని తోసిపుచ్చలేదు. ‘స్టాండర్డ్ ప్రాక్టీస్’ కోసమే అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు కూడా!‘ఐటా’ విమర్శలుకాగా నగాల్ ఈ ఏడాది అదేపనిగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టైలకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఆడేందుకు నిరాకరించిన అతను ఇటీవల స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం సాకుతో దూరంగా ఉన్నాడు. అయితే చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడంపై ‘ఐటా’ బాహాటంగా విమర్శలు గుప్పించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సాకులు చెబుతున్న ఆటగాడు ఏటీపీ టోర్నీ ఆడేందుకు సై అంటున్నాడని నగాల్‌ను ఉద్దేశించి ‘ఐటా’ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లు కూడా డేవిస్ కప్ ఆడలేదు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడంతో భారత్ 0–4తో చిత్తుగా ఓడింది. రూ.45 లక్షలు అడిగాడుఈ నేపథ్యంలో.. ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ధూపర్ మాట్లాడుతూ ‘ఎవరైనా దేశానికి ఆడేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా చెప్పండి. సుమిత్ నగాల్ తనకు వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. చెల్లింపులు జరగలేదు కాబట్టే అతను ఆడటం లేదు.ఇదేం పద్ధతి. ఇది తప్పా ఒప్పా అనేది జాతి తెలుసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఆటగాళ్లకు ‘టాప్స్’ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు నిర్ణీత మొత్తం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి డేవిస్ కప్‌లో ఆడుతున్నందుకు పార్టిసిపేషన్ ఫీజుగా సుమారు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే చెల్లిస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ‘ఐటా’ వద్ద ఉంటున్నాయి’ అని వివరించారు. ఇదీ సుమిత్ వాదన... అందుకే ఫీజు అడిగాను‘ఐటా’ వ్యాఖ్యల్ని టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఖండించలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వాదన వినిపించాడు. ‘ఫీజు అడిగిన మాట వాస్తవమే. దీనిపై మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయి. నేను డిమాండ్ చేసిన పరిహారం కూడా ఆ కోవకే చెందుతుంది.స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే నేను డిమాండ్ చేశాను తప్ప... డబ్బులు గుంజాలనే ఉద్దేశం కాదు. దేశానికి ఆడటమనేది ఎవరికైనా గర్వకారణమే. అదో గొప్ప గౌరవం. అయితే నేను వెన్నునొప్పి వల్లే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేకపోయాను. ఇప్పుడు కూడా ఇదే సమస్య వల్ల చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాను’ అని వివరణ ఇచ్చాడు.చదవండి: చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం -
నగాల్ కావాలనే ఆడలేదు!
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్ ఉద్దేశపూర్వకంగానే వరుసగా డేవిస్ కప్ పోటీలకు దూరమవుతున్నాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆరోపించింది. గాయాలు, ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది నగాల్... పాకిస్తాన్, స్వీడెన్లతో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టై లకు గైర్హాజరయ్యాడు. ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన పోరులో భారత్ 0–4తో స్వీడెన్‌తో చిత్తుగా ఓడింది. సుమిత్, యూకీ బంబ్రీలాంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగితే కచ్చితంగా ఫలితాలు మరోలా ఉండేవని ‘ఐటా’ కార్యదర్శి అనిల్ ధూపర్ వివరించారు. స్టాక్‌హోమ్‌కు వెళ్లిన భారత జట్టులో ఒక్క రామ్‌కుమార్ రామనాథన్ మాత్రమే అనుభవజు్ఞడని, డబుల్స్ స్పెషలిస్టు శ్రీరామ్ బాలాజీని సింగిల్స్‌లో ఆడించామని చెప్పారు. ఆర్యన్ షా, సిద్ధార్థ్ విశ్వకర్మ అరంగేట్రం చేసిన ఆటగాళ్లని... అందువల్లే భారత్ చిత్తుగా ఓడిందని ఆయన అన్నారు. వెన్ను గాయాన్ని కారణంగా చూపించిన నగాల్ అదే సమయంలో చైనాలో ఏటీపీ టోర్నీ ఆడుతున్నాడని దుయ్యబట్టారు. డేవిస్ కప్ అనేది కేవలం ఒక టెన్నిస్ టోర్నమెంట్ కాదని... దేశానికి ప్రాతినిధ్యం వహించడమని చెప్పుకొచ్చారు. ముకుంద్ శశికుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని, వచ్చి డేవిడ్ కప్ ఆడాలని విజ్ఞప్తి చేసినా...అతనూ పట్టించుకోలేదని ధూపర్ విమర్శించారు. -
భారత జట్టుకు ఎదురుదెబ్బ.. నంబర్ వన్ ప్లేయర్ దూరం
స్వీడన్‌తో ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో సతమతమవుతున్న అతను ఈ ఏడాది వరుసగా రెండోసారి డేవిస్ కప్ టోర్నీకి గైర్హాజరు కానున్నాడు. పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్లోనూ అతను బరిలోకి దిగలేదు. దీంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆర్యన్ షాను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. అదే విధంగా.. మానస్ ధామ్నేను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా స్టాక్‌హోమ్‌లో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో ఆతిథ్య స్వీడన్‌తో భారత్ తలపడుతుంది. ఇదివరకే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) భారత జట్టును ప్రకటించింది. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్‌ను కోచ్‌గా నియమించింది. అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా‘స్వీడన్‌తో జరిగే పోరుకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని వారాలుగా వెన్నునొప్పి బాధిస్తోంది. దీంతో డాక్టర్లు కనీసం రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నద్ధమయ్యేందుకు సరైన సమయంలేదు. కాబట్టే స్వీడన్ ఈవెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇటీవల యూఎస్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కూడా వెన్ను సమస్య వేధించింది. ఏదేమైనా డేవిస్ కప్ టోర్నీకి దూరమవడం చాలా బాధగా ఉంది. ఆ టోర్నీలో ఆడబోయే జట్టు రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని నగాల్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. -
US Open 2024: తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సుమిత్ నగాల్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ 40వ ర్యాంకర్ టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 73వ ర్యాంకర్ సుమిత్ 1-6, 3-6, 6-7 (6/8)తో ఓడిపోయాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 1,00,000 డాలర్లు (రూ. 83 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూఎస్ ఓపెన్‌లో ఆడటం ద్వారా సుమిత్ తన కెరీర్లో తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయిన సుమిత్ ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
టీపీఎల్‌లో సుమిత్ నగాల్
ముంబై: భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఈ సీజన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్ 3 నుంచి 8 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని టెన్నిస్ కోర్టుల్లో ఆరో సీజన్ పోటీలు జరుగుతాయి. హైదరాబాద్ స్ట్రయికర్స్, పుణే జాగ్వార్స్, బెంగాల్ విజార్డ్స్, పంజాబ్ పేట్రియా ట్స్, గుజరాత్ పాంథర్స్, ముంబై లియోన్ ఆర్మీ, బెంగళూరు పైపర్స్ ఈ లీగ్‌లో ఆడనున్నాయి. -
భారత డేవిస్ కప్ జట్టులో నగాల్
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టాప్‌స్టార్ సుమిత్ నగాల్ తిరిగి డేవిస్ కప్ జట్టులోకి వచ్చేశాడు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్ వచ్చే నెల స్వీడన్‌తో తలపడనుంది. సెపె్టంబర్ 14, 15 తేదీల్లో స్టాక్‌హోమ్‌లోని ఇండోర్ హార్డ్ కోర్ట్ వేదికపై జరిగే ఈ పోటీలకు డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో నగాల్... ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరుకు దూరంగా ఉన్నాడు. అక్కడ గ్రాస్కోర్ట్పై అనాసక్తి కనబరిచిన సుమిత్ ఇప్పుడు హార్డ్‌కోర్ట్‌లో జరిగే పోటీలకు అందుబాటులోకి వచ్చాడు. భారత టాప్–3 ప్లేయర్, ప్రపంచ 476 ర్యాంకర్ శశికుమార్ ముకుంద్‌పై రెండు ‘టై’ల సస్పెన్షన్ ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. వరుసగా డేవిస్ కప్ టోరీ్నలకు గైర్హాజరు అవుతుండటంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐటా సెలక్షన్ కమిటీ సుమిత్ నగాల్, రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, నికీ పునాచా, సిద్ధార్థ్ విశ్వకర్మలను ఎంపిక చేసింది. రోహిత్ రాజ్‌పాల్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టుకు ఆర్యన్ షా రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటాడు. యూకీ అందుబాటులో లేకపోవడంతో రామ్‌కుమార్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగుతాడు. యూకీ తన గైర్హాజరుకు గల కారణాలు బయటికి వెల్లడించనప్పటికీ... పారిస్ ఒలింపిక్స్‌కు రోహన్ బోపన్నకు జోడీగా తనను పంపకపోవడంపై కినుక వహించినట్లు తెలిసింది. అయితే ఇందులో ‘ఐటా’ చేసిందేమీ లేదని వెటరన్ స్టార్ బోపన్న తన భాగస్వామిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకోవడంతో అతన్నే పంపాల్సివచ్చిందని ఐటా వర్గాలు వెల్లడించాయి. జీషాన్ అలీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో మాజీ ఢిల్లీ ప్లేయర్ అశుతోశ్ సింగ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.బాలచంద్రన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఐటా సెలక్షన్ కమిటీ అశుతోశ్ వైపు మొగ్గుచూపుతోంది. ప్రస్తుతానికి భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేశామని కోచ్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని ఐటా కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. -
సుమిత్ తొలి రౌండ్లోనే...
ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం తడబడ్డాడు. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సుమిత్ శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 2–6, 6–2, 5–7తో ప్రపంచ 68వ ర్యాంకర్ కొరెన్టీన్ మౌటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 36 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’
పారిస్: భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 68వ ర్యాంకర్ ముటెట్ కొరెన్‌టిన్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరు 2–2తో సమంగా ఉన్నారు. ఒకవేళ తొలి రౌండ్లో సుమిత్ గెలిస్తే రెండో రౌండ్లో ప్రపంచ 6వ ర్యాంకర్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో ఆడాల్సి ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే రెండో రౌండ్లో ముఖాముఖిగా తలపడతారు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీకి కూడా కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో ఫాబియన్ రెబూల్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)లతో బోపన్న–బాలాజీ తలపడతారు. 44 ఏళ్ల బోపన్న వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
జెనరాలి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీనలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. ఆ్రస్టియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 5–7, 5–7తో ప్రపంచ 45వ ర్యాంకర్ పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 పాయింట్లు లభించాయి. -
సుమిత్ శుభారంభం
బస్టాడ్ (స్వీడన్): నోర్డియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 68వ ర్యాంకర్ సుమిత్ 6–4, 6–3తో ఇలియాస్ యామెర్ (స్వీడన్)పై గెలుపొందాడు. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ రెండు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 36వ ర్యాంకర్ మరియానో నవోన్ (అర్జెంటీనా)తో సుమిత్ తలపడతాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సుమిత్ నగాల్
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ ఐదు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు.1973లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న మూడో భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. తొలి రెండు స్థానాల్లో విజయ్ అమృత్‌రాజ్ (1980లో 18వ ర్యాంక్), సోమ్‌దేవ్ వర్మ (2011లో 62వ ర్యాంక్) ఉన్నారు. -
పారిస్ ఒలింపిక్స్‌కు నగాల్ క్వాలిఫై
భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నగాల్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నాడు. తాను పారిస్ ఒలింపిక్స్‌కు అధికారికంగా అర్హత సాధించినట్లు నగాల్ స్వయంగా వెల్లడించాడు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేను అర్హత సాధించాననే విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి ఇది చెప్పుకోదగ్గ క్షణం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం నా కెరీర్ విశేషాల్లో చెప్పుకోదగ్గ అంశం. ఆ తర్వాతినుంచి పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా శ్రమించాను. మెగా ఈవెంట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నా’ అని నగాల్ ట్వీట్ చేశాడు. గత ఏడాది కాలంగా మంచి ఫామ్‌తో వరుస విజయాలు సాధించిన నగాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానానికి ఎగబాకాడు. రెండు చాలెంజర్ టైటిల్స్ గెలవడంతో పాటు ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించి రెండో రౌండ్ వరకు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న – శ్రీరామ్ బాలాజీ జోడి భారత్ తరఫున బరిలోకి దిగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బోపన్న ప్రస్తుతం టాప్–10లో ఉండటంతో తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం అతనికి కలిగింది. -
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఏటీపీ మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానంలో నిలిచాడు.గత వారంలో కెరీర్ బెస్ట్ 77వ ర్యాంకు సాధించిన సుమిత్.. తాజాగా ఆరు స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచి.. మొత్తంగా 777 ఏటీపీ పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నగాల్... ఇప్పటికే సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెనర్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించిన చరిత్ర సృష్టించిన సుమిత్ నగాల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. భారత నంబర్ వన్‌గా ఉన్న సుమిత్ నగాల్.. ఇటీవల హీల్బ్రాన్ నెకార్కప్-2024 మెన్స్ సింగిల్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత చెన్నై ఓపెన్‌లోనూ విజయం సాధించాడు. ఈ క్రమంలో ఇలా కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు.చదవండి: T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్ -
ఫైనల్లో సుమీత్ నగాల్
పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో శనివారం ఆరో సీడ్ నగాల్ 7–6 (7/2), 1–6, 6–2 స్కోరుతో బెర్నెబ్ జపటా మిరాల్స్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 38 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఐదు సార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసిన నగాల్...తన సర్విస్‌ను 6 సార్లు నిలబెట్టుకున్నాడు. -
సెమీస్‌లో సుమిత్
పెరూగియా ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ సుమిత్ 6–4, 7–5తో మాక్స్ కస్నికౌస్కీ (పోలాండ్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్..
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ తన కెరీర్లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు నేరుగా అర్హత సాధించాడు.గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభానికి ఆరు వారాల ముందు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–104లో ఉన్న క్రీడాకారులకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభిస్తుంది. సుమిత్ నగాల్ ప్రస్తుతం 94వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2019లో చివరిసారి భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వింబుల్డన్ టోరీ్నలో పాల్గొన్నాడు.ఇవి చదవండి: రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి... -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్..
జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 6–7 (7/9), 3–6తో ప్రపంచ 19వ ర్యాంకర్ సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.ఒక గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 6,215 యూరోల (రూ. 5 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.ఇవి చదవండి: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు -
రష్మిక ఓటమి.. సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. సుమిత్ నగాల్ ర్యాంక్ 93... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్‌లో నిలిచాడు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్‌లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. -
పోరాడి ఓడిన సుమిత్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందుతాడు. -
Monte Carlo Masters Series: సుమిత్ సంచలనం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో అర్నాల్డి సర్వీస్‌లను బ్రేక్ చేసి తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు. రెండో రౌండ్లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
Monte Carlo Masters: 42 ఏళ్ల తర్వాత...
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ... భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రతిష్టాత్మక మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 7–5, 2–6, 6–2తో ప్రపంచ 55వ ర్యాంకర్ ఫాసుండో డియాజ్ అకోస్టా (అర్జెంటీనా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ టోరీ్నలో 42 ఏళ్ల తర్వాత సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. చివరిసారి భారత్ తరఫున 1982లో రమేశ్ కృష్ణన్ మోంటెకార్లో టోరీ్నలో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
పోరాడి ఓడిన సుమిత్
మరాకెష్ (మొరాకో): గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూకీ జోడీ శుభారంభం ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది. -
సుమిత్ నగాల్ శుభారంభం
గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 4–6, 6–3, 6–2తో కొరెంటిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో సుమిత్ ఆడతాడు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో సుమిత్ 6–2, 2–6, 6–7 (4/7)తో సియోంగ్చన్ హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక టైబ్రేక్‌లో సుమిత్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్‌కు 14,400 డాలర్ల (రూ. 11 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీ, 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మెయిన్ ‘డ్రా’కు గెలుపు దూరంలో...
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నీయాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 101వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో ప్రపంచ 580వ ర్యాంకర్ స్టెఫాన్ డొస్టానిక్ (అమెరికా)పై గెలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో కొరియా ప్లేయర్ సియోంగ్చన్ హాంగ్‌తో సుమిత్ తలపడతాడు. -
సూపర్ సుమీత్..
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం.. న్యూయార్క్‌లో టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్. ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ బరిలోకి దిగాడు. అతని ఎదురుగా ఉన్న 22 ఏళ్ల కుర్రాడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకి అర్హత సాధించాడు. అంతకు ముందెప్పుడూ అతను అంత పెద్ద స్టేడియంలో ఆడలేదు. సహజంగానే ఎవరూ ఆ మ్యాచ్‌లో ఫెడరర్ ప్రత్యర్థి గురించి పట్టించుకోలేదు. కానీ ఒక సెట్ ముగిసే సరికి అందరిలో చర్చ మొదలైంది. ఆ యువ ఆటగాడు తొలి సెట్‌ను 6–4తో గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఫెడరర్ కోలుకొని ఆ తర్వాత తన స్థాయి ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ గ్రాండ్‌స్లామ్‌లో ఒక కొత్త ఆటగాడు అలా అందరూ గుర్తుంచుకునేలా పరిచయమయ్యాడు. ఆరంభం గుర్తుంచుకునేలా ఉన్నా.. ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆటలో ఓటములతో పాటు గాయాలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. టెన్నిస్‌ను కొనసాగించేందుకు కనీస స్థాయిలో కూడా డబ్బుల్లేని స్థితి. ఆటను వదిలిపెట్టేందుక్కూడా అతను సిద్ధమయ్యాడు. కానీ అతనిలోని పట్టుదల మళ్లీ పోరాడేలా చేసింది. సన్నిహితుల సహకారం మళ్లీ ఆటపై దృష్టి పెట్టేలా చేసింది. దాంతో వరుసగా చాలెంజర్ టోర్నీల్లో విజయాలు.. ఇప్పుడు సింగిల్స్‌లో వరల్డ్ టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు. ఆ కుర్రాడి పేరే సుమీత్ నగాల్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ ఆటగాడు మరిన్ని పెద్ద ఘనతలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ అబ్దుల్ హాది ‘నా బ్యాంకు ఖాతాలో 80 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏడాదంతా కలిపి 24 టోర్నీలు ఆడినా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోవడం లేదు. నా జీతం, కొన్ని సంస్థలు చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా టెన్నిస్‌లోనే పెట్టేశా. అంతర్జాతీయ టెన్నిస్‌లో విజయాలు, రికార్డుల సంగతి తర్వాత.. కనీసం ఒక ఆటగాడిగా కొనసాగాలన్నా ఏడాదికి రూ. 80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లను పెట్టుకునే స్థాయి లేక కేవలం ఒకే ఒక ట్రావెలింగ్ కోచ్‌తో టోర్నీలకు వెళుతున్నా. మన దేశంలో టెన్నిస్‌కు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం చాలా తక్కువ!’ కొన్నాళ్ల క్రితమే సుమీత్ నగాల్ వెలిబుచ్చిన ఆవేదన అది. ఆ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయ టెన్నిస్ చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. శిక్షణ, సాధన మొదలు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టోర్నీల్లో ఆడాలంటే చాలా డబ్బు కావాలి. టోర్నీల్లో ఆడితేనే ఫలితాలు, ర్యాంకింగ్స్ వస్తాయి. స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగానే చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. నగాల్ తన కెరీర్లో ఇలాంటి దశను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌ను అమితంగా ప్రేమిస్తూ ఆటపైనే దృష్టి పెట్టాడు. అందుకే ఇప్పుడు అతను సాధించిన రికార్డు, గెలిచిన టోర్నీలు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభంలోనే వేగంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 130కి చేరి ఆపై రెండేళ్ల వ్యవధిలో 638కి పడిపోయిన నగాల్.. ప్రస్తుతం టాప్–100లోకి రావడం అతని ఆటలోని పురోగతిని చూపిస్తోంది. ప్రతిభాన్వేషణతో వెలుగులోకి వచ్చి.. నగాల్ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝఝర్ అతని స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఆరంభంలో తన ఈడు పిల్లల్లాగే క్రికెట్‌నే అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మిత్రులతో కలసి గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో టీమ్ ఈవెంట్ కాకుండా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో అతడిని చేర్పించాలనే తండ్రి ఆలోచన నగాల్‌ను టెన్నిస్ వైపు నడిపించింది. రెండేళ్లు స్థానిక క్లబ్లో అతను టెన్నిస్ నేర్చుకున్నాడు. అయితే పదేళ్ల వయసులో ఒక ఘటన నగాల్ కెరీర్‌ను మార్చింది. అప్పటికే భారత టాప్ టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ భూపతి తన అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభాన్వేషణ కార్యక్రమం నిర్వహించాడు. చాలా మందితో పాటు అతను కూడా సెలక్షన్స్‌కు హాజరయ్యాడు. అందరిలాగే హిట్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ భూపతి దృష్టి నగాల్‌పై పడలేదు. చాలాసేపటి తర్వాత ఆ పదేళ్ల కుర్రాడు ధైర్యం చేసి నేరుగా భూపతి వద్దకే వెళ్లాడు. ‘సర్, కాస్త నా ఆట కూడా చూడండి’ అని కోరాడు. ఆశ్చర్యపడ్డ భూపతి అతనిలోని పట్టుదలను గమనించి ప్రత్యేకంగా నగాల్‌తో ప్రాక్టీస్ చేయించాడు. వెంటనే అతని ఆట ఆకట్టుకోవడంతో తన ఎంపిక పూర్తయింది. ‘నేను ఆ ఒక్క మాట ఆ రోజు అనకుండా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోకపోయేవారేమో. ఎందుకంటే అంత డబ్బు పెట్టి మావాళ్లు టెన్నిస్ నేర్పించలేకపోయేవారు’ అని నగాల్ గుర్తు చేసుకుంటాడు. అది ఆ అకాడమీకి మొదటి బ్యాచ్. బెంగళూరులో రెండేళ్ల శిక్షణ తర్వాత భూపతి అకాడమీ కార్యకలాపాలు ఆగిపోయినా.. అప్పటికే మెరుగుపడ్డ నగాల్ ప్రదర్శన అతనికి సరైన దిశను చూపించింది. కుటుంబ మిత్రుల సహకారంతో విదేశాల్లో మరింత మెరుగైన శిక్షణతో అతని ఆట రాటుదేలింది. క్రికెట్‌పై తన చిన్ననాటి ఇష్టాన్ని వదులుకోని నగాల్.. తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నెట్స్‌లో క్రికెట్ ఆడి తన సరదా తీర్చుకోగలిగాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్‌తో.. 18 ఏళ్ల వయసులో నగాల్ ప్రొఫెషనల్‌గా మారాడు. హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో విజయం సాధించి కెరీర్లో తొలి టైటిల్‌ని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక మేజర్ టోర్నీ విజయం నగాల్‌కు గుర్తింపు తెచ్చింది. 2015 జూనియర్ వింబుల్డన్ డబుల్స్‌లో (భాగస్వామి వియత్నాం ఆటగాడు హోంగా నామ్) నగాల్ విజేతగా నిలిచాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఆరో భారత ఆటగాడిగా పేరొందాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో మూడేళ్ల వ్యవధిలో 9 ఐటీఎఫ్ ఫ్యూచర్ టైటిల్స్‌ను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చెప్పుకోదగ్గ మలుపు ఏటీపీ చాలెంజర్ టోర్నీ రూపంలో వచ్చింది. 2017లో బెంగళూరులో నగాల్ తన తొలి చాలెంజర్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిరీస్ టోర్నీ రెండో టైటిల్ రూపంలో చేరింది. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. పరాజయాల బాటను వీడి.. నాలుగేళ్ల పాటు నగాల్ కెరీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండేళ్లు కోవిడ్ సమయంలోనే వెళ్లిపోగా.. మిగిలిన రెండేళ్లలో అతనికి గాయాలు, వాటికి శస్త్రచికిత్సలు. ఫామ్ కోల్పోయి మానసికంగా కూడా కుంగుబాటుకు గురైన స్థితి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. వీటికి తోడు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నుంచి క్రమశిక్షణరాహిత్యం ఆరోపణలు. ఇలాంటివాటిని దాటి గత ఏడాది నగాల్ మళ్లీ సరైన దారిలో పడ్డాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 2023లో నగాల్ సాధించిన విజయాలు అతని కెరీర్లో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి. ఇటలీ, ఫిన్లండ్ చాలెంజర్ టోర్నీ టైటిల్స్, మరో రెండు టోర్నీలు ఆస్ట్రియా, హెల్సింకీలలో రన్నరప్ నగాల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఈ ఏడాదికి వచ్చే సరికి అతని ఆట మరింత పదునెక్కింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ బబ్లిక్‌పై సంచలన విజయం సాధించిన నగాల్.. 1989 (రమేశ్ కృష్ణన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక సీడెడ్æఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం. ఆపై కొద్దిరోజులకే చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో చాంపియన్‌గా సొంతగడ్డపై తొలి టైటిల్‌తో నగాల్ విజయనాదం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఆటనే వదిలేయాలనుకున్న వ్యక్తి.. ప్రతికూలతలపై పోరాడి ఇప్పుడు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. ఆ పట్టుదలకున్న పదును అర్థమవుతోంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా నగాల్ తన ప్రదర్శనతో మరిన్ని అద్భుతాలు చేయగలడని భారత టెన్నిస్ ప్రపంచం విశ్వసిస్తోంది. -
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్ నగాల్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 98వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో జెఫ్రీ బ్లాంకానెక్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వి స్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో గంటా సాయికార్తీక్ రెడ్డి–మనీశ్ సురేశ్‌కుమార్ (భారత్) జోడీ 2–6, 6–7 (8/10)తో కుజ్మయిన్–జా న్విర్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఐదేళ్ల తర్వాత...
న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్‌లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్‌గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో, డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. -
చెన్నై ఓపెన్ చాంపియన్ సుమిత్ నగాల్
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ స్వదేశంలో తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సుమిత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 121వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–4తో 114వ ర్యాంకర్ లుకా నార్డీ (ఇటలీ)పై గెలిచి తన కెరీర్లో నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు. విజేతగా నిలిచిన సుమిత్‌కు 18,230 డాలర్ల (రూ. 15 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Australian Open: పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
అప్పుడు బ్యాంక్ ఖాతాలో కేవలం 80 వేలు.. ఇప్పుడు కోటి దాకా ప్రైజ్‌మనీ!
Australian Open 2024- మెల్బోర్న్: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడితే అద్భుతం చేయవచ్చని భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 26 ఏళ్ల సుమిత్ చిరస్మరణీయ విజయంతో శుభారంభం చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 137వ స్థానంలో ఉన్న సుమిత్ వరుస సెట్లలో 6–4, 6–2, 7–6 (7/5)తో ప్రపంచ 27వ ర్యాంకర్, 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించి ఈ టోర్నీలో తొలిసారి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌పై గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. 1989 ఆ్రస్టేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో టాప్ సీడ్ మాట్స్ విలాండర్ (స్వీడన్)పై రమేశ్ కృష్ణన్ గెలుపొందాడు. బుబ్లిక్‌తో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక ఏస్ కొట్టిన సుమిత్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 29 విన్నర్స్ షాట్లతో రాణించిన సుమిత్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు దక్కించుకున్నాడు. మరోవైపు 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్ 13 ఏస్‌లతో విరుచుకుపడ్డా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఏఐటీఏ సహకరించకపోయినా... ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరగాల్సిన డేవిస్ కప్ మ్యాచ్‌లో తాను ఆడలేనని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు గత నెలలో సుమిత్ నగాల్ సమాచారం ఇచ్చాడు. దాంతో సుమిత్‌పై ఏఐటీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆసియా కోటా నుంచి భారత్‌కు అందుబాటులో ఉన్న ‘వైల్డ్ కార్డు’ కోసం సుమిత్ పేరును పంపించకూడదని ఏఐటీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నీలో బరిలోకి దిగాడు. ఏఐటీఏ తనకు సహకరించకపోయినా సుమిత్ నిరాశపడకుండా తన శక్తినంతా ధారపోసి, ఏకాగ్రతతో, పట్టుదలతో ఆడి క్వాలిఫయింగ్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందాడు. క్వాలిఫయర్ హోదాలో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 2021లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సుమిత్ ఈసారి మాత్రం గొప్ప విజయంతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ చేతిలో ఓడిపోయిన సుమిత్ 2020 యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 900 యూరోలతో... గత ఏడాది ఆరంభంలో సుమిత్ బ్యాంక్ ఖాతాలో కేవలం 900 యూరోలు (రూ. 80 వేలు) ఉన్నాయి. దాంతో తొలి మూడు నెలలపాటు తాను జర్మనీలో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే అకాడమీకి వెళ్లలేకపోయాడు. ఈ దశలో అతని మిత్రులు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, క్రిస్టోఫర్ మార్కస్, మహా టెన్నిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. గతంలో తాను గెల్చుకున్న ప్రైజ్‌మనీ, తన ఉద్యోగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా లభించే వేతనాన్ని ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలు ఆడేందుకు సుమిత్ వెచ్చించాడు. తాను పాల్గొన్న 24 టోర్నీలలో నిలకడగా రాణించి సుమిత్ రూ. 65 లక్షల వరకు ప్రైజ్‌మనీ సంపాదించాడు. కొత్త ఏడాదిలో కాన్బెర్రా చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా ... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా సుమిత్‌కు కనీసం 1,85,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 1 కోటి) ప్రైజ్‌మనీగా రావడం ఖాయమైంది. యూకీ బాంబ్రీ జోడీ ఓటమి పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ–హాస్ ద్వయం 6–1, 6–7 (8/10), 6–7 (7/10)తో నికోలస్ బారిన్టోస్ (కొలంబియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్, స్వియాటెక్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్ 7–6 (7/5), 6–1, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... స్వియాటెక్ 7–6 (7/2), 6–2తో సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)... మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్
Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్-2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో 137వ ర్యాంకర్ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్ నెంబర్ 27 అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్ రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ తాజా ఎడిషన్‌లో భాగంగా తొలి రౌండ్లో.. సుమిత్ నాగల్.. కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బబ్లిక్‌తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్‌కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్. రెండో రౌండ్లో అడుగుపెట్టిన సుమిత్ మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్ మూడో సెట్లో మాత్రం సుమిత్‌ను చెమటోడ్చేలా చేశాడు. ఈ క్రమంలో టై బ్రేకర్‌లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు. రమేశ్ క్రిష్ణన్ తర్వాత అదే విధంగా.. రమేశ్ క్రిష్ణన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్ నాగల్ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్ క్రిష్ణన్ ఆనాటి నంబర్ వన్ ప్లేయర్ మ్యాట్స్ విలాండర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్ ఆ ఫీట్‌ను నమోదు చేశాడు. పదేళ్ల వయసులోనే.. హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్ నాగల్ 10వ ఏటనే టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. మహేశ్ భూపతి మిషన్ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు. వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ పోరులో తన వియత్నాం పార్ట్నర్ లీ హొంగ్ నామ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్ నాగల్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. Well played Sumit Nagal💐💐💐.Although Sumit Nagal lost, But surely it was an exciting match . Winning a set against @rogerfederer is nothing less than an achievement. #FederervsNagal #USOpen pic.twitter.com/XN3WVuHDiq — Mahesh Kanakaraj🇮🇳 (@maheshmech06) August 27, 2019 ఏకంగా ఫెడరర్తోనే నాటి యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్.. తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్‌కు పోటీనిచ్చిన యంగ్‌స్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG — #AusOpen (@AustralianOpen) January 16, 2024 -
మరొకటి గెలిస్తే మెయిన్ ‘డ్రా’లోకి...
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. మెల్బోర్న్లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 6–2తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ ఎడ్వర్డ్ వింటర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 64 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 12 విన్నర్స్ కొట్టిన సుమిత్ 11 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచాడు. 118వ ర్యాంకర్ మోల్కన్ (స్లొవేకియా)తో నేడు జరిగే ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో సుమిత్ నెగ్గితే రెండోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. సుమిత్ 2019, 2020 యూఎస్ ఓపెన్‌లో, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. -
Australian Open Qualifier: రెండో రౌండ్లో సుమిత్ నగాల్
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 7–5తో జెఫ్రీ బ్లాన్కనెక్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అంకిత రైనా (భారత్) 1–6, 5–7తో సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. -
పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్లు సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద్ పాకిస్తాన్లో డేవిస్ కప్ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’లో భాగంగా భారత్ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో తలపడాల్సివుంది. అయితే భారత్ తరఫున ఉత్తమ సింగిల్స్ ప్లేయర్లు అయిన సుమిత్ నగాల్ (141 ర్యాంకు), శశికుమార్ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు. అదే కారణమా? ఇక హార్డ్ కోర్టుల్లో రాణించే సుమిత్ ఈ కారణంతో పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్ ముకుంద్ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇలా చేయడం తప్పు ‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు. సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై సునాయాస విజయం సాధించింది. సెమీస్‌లో రష్మిక థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్ డిలెటా చెరుబిని (ఇటలీ)ని ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్‌కు చెందిన ఐదో సీడ్ జిబెక్ కులంబయెవాను కంగుతినిపించింది. -
సెమీఫైనల్లో సుమిత్
Sumit Nagal: హెల్సింకి ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 69వ ర్యాంకర్ ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 169వ ర్యాంకర్ సుమిత్ నెగ్గాడు. తొలి సెట్‌ను 6–3తో నెగ్గి, రెండో సెట్లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఎమిల్ గాయంతో వైదొలిగాడు. దాంతో సుమిత్‌ను విజేతగా ప్రకటించారు. రన్నరప్ నైశిక్ రెడ్డి జోడీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జూనియర్ సర్క్యూట్ టోరీ్నలో తెలంగాణకు చెందిన గనగామ నైశిక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఢాకాలో జరిగిన ఈ టోరీ్నలో నైశిక్ రెడ్డి–ప్రబీర్ ముకేశ్ చావ్డా (భారత్) ద్వయం బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో ఓటమి చవిచూసింది. తుది పోరులో నైశిక్–ప్రబీర్ జోడీ 2–6, 3–6తో భారత్‌కే చెందిన తవీశ్ పావా–అర్ణవ్ యాదవ్ జంట చేతిలో ఓటమి పాలైంది. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్‌లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
Rome Challenger: సెమీఫైనల్లో సుమిత్ నగాల్
రోమ్ గార్డెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ సుమిత్ నగాల్ వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 7-5, 6-0తో మాక్స్ హూక్స్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు
రోమ్: ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానిక ప్రత్యర్ధిని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 6–2, 6–4 స్కోరుతో ఇటలీ ప్లేయర్, ప్రపంచ 172వ ర్యాంకర్ ఫ్రాన్సెస్కో మాసరెలీపై విజయం సాధించాడు. 1 గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నగాల్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదు. అయితే తన చక్కటి సర్వీస్‌తో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా లేకుండా చూసుకున్నాడు. ఇటలీ ఆటగాడు 3 ఏస్‌లు సంధించినా...6 డబుల్‌ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించాడు. -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. -
భారత డేవిస్ జట్టులో నగాల్‌కు చోటు
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులోకి సుమిత్ నగాల్ తిరిగి ఎంపికయ్యాడు. గతేడాది మార్చిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో పోటీపడిన నగాల్ తర్వాత డేవిస్ బరిలో దిగలేదు. తుంటి గాయంతో గత సెప్టెంబర్‌లో ఫిన్లాండ్తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. నవంబర్‌లో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్తోనూ బరిలోకి దిగలేకపోయాడు. ఏప్రిల్‌లో ఏటీపీ సర్క్యూట్లో ఆడటం మొదలుపెట్టిన 24 ఏళ్ల హరియాణా టెన్నిస్ స్టార్ సుమిత్ ఈ సీజన్లో ఎనిమిది టోర్నీల్లో తలపడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాడు. సుమిత్ డేవిస్ జట్టులోకి రావడంతో డబుల్స్ స్పెషలిస్టు దివిజ్ శరణ్‌ను పక్కన బెట్టారు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో నార్వేతో భారత్ తలపడుతుంది. మ్యాచ్‌లు నార్వేలో జరుగుతాయి. రోహిత్ రాజ్‌పాల్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల భారత డేవిస్ జట్టును గురువారం ఎంపిక చేశారు. రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గునేశ్వరన్, యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లతో పాటు వెటరన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత్, నార్వే జట్లు తలపడటం డేవిస్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే–ఆఫ్‌లో భారత్ 4–0తో డెన్మార్క్‌పై ఘనవిజయం సాధించింది. -
సుమిత్ నగాల్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 2–6తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. -
సుమిత్‌కు భలే చాన్సులే!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు భలే అవకాశం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో అతనికి సింగిల్స్ విభాగంలో బెర్త్ దక్కింది. కరోనా భయాందోళనలు, ఆంక్షల నేపథ్యంలో చాలామంది ఆటగాళ్లు ప్రతిష్టాత్మక విశ్వక్రీడల నుంచి తప్పుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ‘విత్‌డ్రా’లు ఉండటంతో అనూహ్యంగా లోయర్ ర్యాంక్‌లో ఉన్న నగాల్‌కు ‘టోక్యో’ స్వాగతం చెప్పింది. కటాఫ్ తేదీ జూన్ 14 నాటికి సుమిత్ ర్యాంక్ 144. ఇతని కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న యూకీ బాంబ్రీ (127) గాయంతో తప్పుకున్నాడు. కటాఫ్ తేదీ వరకు 148వ ర్యాంక్‌లో ఉన్న ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా ఆశల పల్లకిలో ఉన్నాడు. ‘అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నగాల్ బెర్త్‌ను ఖరారు చేసింది. ఆడేందుకు నగాల్ కూడా ‘సై’ అనడంతో అక్రిడేషన్, తదితర ఏర్పాట్ల కోసం వెంటనే మేం భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమిచ్చాం’ అని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. సింగిల్స్‌లో సుమిత్ ఆడనుండటంతో పురుషుల డబుల్స్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలు బరిలో ఉండే అవకాశాలు పెరిగాయి. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్నతో సుమిత్ జత కట్టవచ్చు. ఒకవేళ బోపన్న ఎంట్రీ కూడా ఖరారైతే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో బోపన్న, సుమిత్లలో ఒకరు కలసి ఆడే అవకాశముంది. సియోల్–1988 ఒలింపిక్స్‌లో తొలిసారి టెన్నిస్‌ను ప్రవేశపెట్టాక భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న ఏడో ప్లేయర్ సుమిత్ నగాల్. గతంలో విజయ్ అమృత్‌రాజ్, జీషాన్ అలీ (1988), రమేశ్కృష్ణన్ (1992), లియాండర్ పేస్ (1992, 1996, 2000), విష్ణువర్ధన్, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (2012) ఈ ఘనత సాధించారు. -
French Open: సుమిత్ తొలి రౌండ్ ప్రత్యర్థి అతడే
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 191వ ర్యాంకర్ మార్కోరా (ఇటలీ)తో ఆడనున్నాడు. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 152వ ర్యాంకర్ ఆస్కార్ ఒట్టె (జర్మనీ)తో... రామ్‌కుమార్ 168వ ర్యాంకర్ మైకేల్ మోమో (అమెరికా)తో తలపడతారు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా)తో అంకిత రైనా ఆడుతుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్ -
సుమీత్ తొలి రౌండ్ ప్రత్యర్థి బ్రాడ్లీ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలో ఉన్న భారత ప్లేయర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్లో ప్రపంచ 128వ ర్యాంకర్ బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)తో ఆడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 122వ స్థానంలో ఉన్న సుమీత్కు వరుసగా ఇది రెండో యూఎస్ ఓపెన్. గత ఏడాది ఈ టోర్నీ లో సుమీత్ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌తో తలపడి పోరాడి ఓడిపోయాడు. నిషికోరి దూరం మరో మూడు రోజుల్లో యూఎస్ ఓపెన్ మొదలవుతున్న వేళ... టోర్నీలో ఆడలేనంటూ 2014 రన్నరప్ కీ నిషికోరి (జపాన్) ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ నిషికోరి ఇటీవలే కోలుకున్నాడు. దాంతో టోర్నీలో పాల్గొంటాడని అందరూ భావించారు. ఇప్పటికిప్పుడు ఐదు సెట్లపాటు జరిగే మ్యాచ్‌ల్లో తాను ఆడలేనని, అందుకే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు నిషికోరి పేర్కొన్నాడు. సెప్టెంబర్ 27న ఆరంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో అతడు పాల్గొనే అవకాశం ఉంది. -
ప్రిక్వార్టర్స్‌లో నాగల్
న్యూఢిల్లీ: ప్రాగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 127వ ర్యాంకర్ సుమీత్ నాగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సుమీత్ నాగల్ 6–3, 5–7, 4–1తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి జేక్లార్క్ (బ్రిటన్) గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో సుమీత్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సుమీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జిరీ లెహస్కా (చెక్ రిపబ్లిక్)తో తలపడతాడు. -
ఒకేసారి 26 ర్యాంకులు ఎగబాకాడు..
న్యూఢిల్లీ: తన కెరీర్లో రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ సంచలనం సుమీత్ నాగల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఆదివారం ముగిసిన బ్యూనోస్ ఎయిర్స్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచిన నాగల్ ఏకంగా 26 ర్యాంకులు ఎగబాకాడు. ఫలితంగా సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 135వ ర్యాంకులో నిలిచాడు. ఇది సుమీత్ నాగల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుగా నిలిచింది. నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో నాగల్ 6-4, 6-2 తేడాతో బాగ్నిస్(అర్జెంటీనా)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. తొలి సెట్‌ను గెలవడానికి కాస్త శ్రమించిన నాగల్.. రెండో సెట్‌ను సునాయాసంగా గెలుపొందాడు. అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్న నాగల్ దూకుడుగా ముంద బాగ్నిస్ తలవంచక తప్పలేదు. కేవలం 37 నిమిషాల్లో బాగ్నిస్‌ను ఓడించి తన రాకెట్ పవర్‌ను చూపించాడు.ఇటీవల యూఎస్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన 22 ఏళ్ల నాగల్.. తొలి రౌండ్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను గెలిచినా మిగతా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. కాకపోతే ఒక గ్రాండ్ స్లామ్లో ఫెడరర్‌పై కనీసం సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే ఫెడరర్ చేత మన్ననలు కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతి పెద్ద విజయాలను సాధించే సత్తా నాగల్లో ఉందంటూ ఫెడరర్ కొనియాడాడు. -
ఫైనల్లో సుమిత్ నాగల్
బోస్నియా: ఏటీపీ టూర్ బంజా లుకా చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ ప్రవేశించాడు. సెమీస్‌లో సుమిత్ 7–6 (7/1), 6–2తో ఫిలిప్ హొరంస్కీ (స్లొవేకియా)పై విజయం సాధించాడు. షాంగై చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్న మరో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. అతను 6–7 (7/9), 4–6తో యసుటక ఉచియామ (జపాన్) చేతిలో ఓడాడు. -
కోహ్లి సహకారం లేకపోతే..
న్యూఢిల్లీ: తనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సహకారం లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని భారత టెన్నిస్ యువ కెరటం సుమీత్ నాగల్ పేర్కొన్నాడు. యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన నాగల్..ఆపై టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో జరిగిన తొలి రౌండ్ పోరులో ఓటమి పాలయ్యాడు. ఫెడరర్‌కు చెమటలు పట్టించి తొలి సెట్‌ను గెలిచిన నాగల్.. ఆ తర్వాత కూడా గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే ఫెడరర్ అనుభవం ముందు నాగల్ ఎదురునిలవలేకపోయాడు. కాగా, తాను సాధించిన ఘనతలు వెనుక కోహ్లి హస్తం ఉందని నాగల్ పేర్కొన్నాడు. ‘2017 నుంచి విరాట్ కోహ్లి ఫౌండేషన్ నాకు సహాయం చేస్తోంది. ఆర్థిక ఇబ్బంది వల్ల అంతకు ముందు రెండుళ్లుగా నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయాను. విరాట్ కోహ్లి నాకు సహాయం చేయకపోయి ఉంటే.. నేను ఇదంతా సాధించేవాడిని కాదు. ఈ ఏడాది ఆరంభంలో కెనడా నుంచి జర్మనీ వెళ్లేప్పుడు నా జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదీ ఆ సహాయం అందినాకే. అంటే గతంలో నేను ఎలాంటి కష్టాలు ఎదురుకున్నానో ఆలోచించండి. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయివిరాట్ నుంచి సహాయం పొందడం నా అదృష్టం అనుకుంటున్నాను’అని సుమిత్ పేర్కొన్నాడు. -
మనోడు ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు..
న్యూయార్క్: పిన్న వయసులోనే యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించిన భారత యువ సంచలనం సుమీత్ నాగల్.. ప్రపంచ మూడో ర్యాంకర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నాగల్ పోరాడి ఓడాడు. ఇరువురి మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో నాగల్ తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే తొలి సెట్‌ను 6-4తో గెలిచి మంచి జోష్‌లో కనిపించాడు. అయితే టెన్నిస్ ప్రపంచంలో అసాధారణ ఆటగాడిగా పేరున్న ఫెడరర్ అనుభవం ముందు నాగల్ చివరకు తలవంచక తప్పలేదు. రెండో సెట్లో నాగల్ 1-6 తేడాతో కోల్పోగా, మూడో సెట్లో 2-6తో వెనుకంజ వేశాడు. కాగా, నాల్గో సెట్లో తిరిగి పుంజుకున్న నాగల్.. ఫెడరర్‌కు అంత తేలిగ్గా లొంగలేదు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన నాల్గో సెట్లో నాగల్ 4-6 తేడాతో పోరాడి పరాజయం చవిచూశాడు. దాంతో యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ నుంచే నాగల్ నిష్క్రమించాడు. కాగా, గత రెండు దశాబ్దాల కాలంలో ఒక గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలో కనీసం ఒక్క సెట్ గెలిచిన నాల్గో భారత ఆటగాడిగా నాగల్ గుర్తింపు సాధించాడు. -
సుమీత్ నాగల్ సంచలనం
న్యూయార్క్: భారత టెన్నిస్ యువతార సుమీత్ నాగల్ తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సుమీత్ ప్రధాన ‘డ్రా’లో బెర్త్ దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమీత్ 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ లో 5–7, 6–4, 6–3తో జావో మెనెజెస్ (బ్రెజిల్)పై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో సుమీత్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో సుమీత్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో సుమీత్ తలపడనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మంగళవారం ఉదయం జరుగుతుంది. 1998 తర్వాత...: సుమీత్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంతో... 1998 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ యూఎస్ ఓపెన్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. తొలి రౌండ్లో అతను ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)తో తలపడతాడు. చివరిసారి 1998 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. ‘‘టెన్నిస్ రాకెట్ పట్టే ప్రతి ఒక్కరూ ఏనాడైనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో ఆడాలని కలలు కంటారు. నా విషయంలోనూ అంతే. యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఫెడరర్‌లాంటి దిగ్గజంతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. టెన్నిస్‌లో దేవుడిలాంటివాడైన ఫెడరర్‌తో తలపడే అవకాశం రావాలని ఇటీవలే కోరుకున్నాను. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందని అనుకోలేదు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’ – సుమీత్ నాగల్ -
సుమీత్ నాగల్ కొత్త చరిత్ర
న్యూయార్క్: భారత టెన్నిస్ యువ సంచలనం సుమీత్ నాగల్ కొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. శుక్రవారం జరిగిన తన చివరి క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లో నాగల్ 5-7, 6-4, 6-3 తేడాతో జోవా మెనిజెస్(బ్రెజిల్)పై గెలిచాడు. దాంతో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. 22 ఏళ్ల నాగల్ తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆపై వరుస రెండు సెట్లలో విజృంభించి ఆడాడు. పాన్ అమెరికన్ స్వర్ణ పతక విజేత అయిన మెనిజెస్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్లను కైవసం చేసుకున్నాడు. ఫలితంగా పిన్న వయసులోనే భారత్ నుంచి యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో తన తొలి మ్యాచ్‌ను టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్‌తో తలపడనున్నాడు. మంగళవారం జరుగనున్న తొలి రౌండ్ పోరులో ఫెడరర్‌తో సుమీత్ నాగల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. 2015 వింబుల్డన్ జూనియర్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ అయిన సుమీత్.. యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించే క్రమంలో ఆద్యంతం ఆకట్టకున్నాడు. తొలి క్వాలిఫయర్ రౌండ్లో జపాన్ క్రీడాకారుడు తత్సుమా ఎల్టోపై గెలవగా, రెండో రౌండ్లో కెనడాకు చెందిన పీటర్ పోలంస్కీను ఓడించాడు. ఈ వీరిద్దర్నీ ఓడించే క్రమంలో ఒక్కో సెట్ టై బ్రేక్ దారి తీసినా సుమీత్ మాత్రం పట్టువదలకుండా పోరాడి విజయం సాధించాడు. -
రెండో రౌండ్లో నాగల్
చెన్నై: సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సుమీత్ నాగల్, విజయ్ సుందర్ ప్రశాంత్, అర్జున్ ఖడే తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. విజయ్ సుందర్ 6–2, 2–6, 6–2తో కార్లోస్ బొలుడా (స్పెయిన్)పై, అర్జున్ ఖడే 6–4, 6–1తో ఇవాన్ నెడెల్కో (రష్యా)పై విజయం సాధించగా... సుమీత్ నాగల్ 6–3, 6–2తో డేవిడ్ పెరెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. రెండో రౌండ్లో సాకేత్ మైనేనితో ప్రశాంత్ తలపడతాడు. ఇతర భారత ఆటగాళ్లు అభినవ్ సంజీవ్, దక్షిణేశ్వర్ సురేశ్, సిద్ధార్థ్ రావత్ తొలి రౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు -
నాగల్ నెగ్గాడు ఏటీపీ టైటిల్
బెంగళూరు: భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో శనివారం జరిగిన ఫైనల్లో అతను 6–3, 3–6, 6–2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ప్రస్తుతం 321వ ర్యాంకులో ఉన్న 20 ఏళ్ల నాగల్ తాజా టైటిల్ విజయంతో 225వ ర్యాంకుకు చేరువయ్యే అవకాశముంది. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. భారత్ ఆతిథ్యమిచ్చిన రెండు చాలెంజర్ ఈవెంట్లలోనూ భారత ఆటగాళ్లే టైటిల్స్ గెలిచారు. గతవారం పుణే ఓపెన్ చాలెంజర్ ఈవెంట్లో యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. -
గీత దాటినందుకే...
న్యూఢిల్లీ: గతేడాది సెప్టెంబరులో స్పెయిన్‌తో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో... భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ అరంగేట్రంలోనే అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కానీ వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఈ ఢిల్లీ ప్లేయర్‌కు స్థానం లభించలేదు. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేకున్నా అతనిపై వేటు వేయడానికి కారణమేంటో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే 19 ఏళ్ల సుమిత్ నాగల్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయలేదని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలో కొరియాతో జరిగిన పోటీల్లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సమయంలో 19 ఏళ్ల సుమిత్ హ్యాంగోవర్ కారణంగా ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు గైర్హాజరయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌ను హోటల్ గదికి తీసుకొచ్చాడు. ఈ రెండు చర్యలను ‘ఐటా’ తీవ్రంగా పరిగణించి ఈసారి అతనిపై వేటు వేసింది. ‘స్పెయిన్‌తో పోటీలకు జట్టును ప్రకటించిన అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిందేమిటో కూడా కచ్చితంగా తెలీదు. ఆ తర్వాత అసలు విషయాలు తెలిసి ఇప్పుడు జట్టుకు ఎంపిక చేయలేదు’ అని ‘ఐటా’ వర్గాలు పేర్కొన్నాయి.