మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
సుమిత్‌కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందుతాడు.
Comments
Please login to add a commentAdd a comment