చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లోనే ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ ఓడిపోయాడు.
ప్రపంచ 63వ ర్యాంకర్ పావెల్ కొటోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 6–7 (5/7)తో ఓటమి పాలయ్యాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 8,340 డాలర్ల (రూ. 6 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment