lost
-
బీబీసారా చేతిలో హంపి ఓటమి
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 34 ఎత్తుల్లో కజకిస్తాన్‌కు చెందిన అసబయేవా బీబీసారా చేతిలో ఓడిపోయింది. పది మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో జరిగిన తొలి గేమ్ ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... టాన్ జోంగి (చైనా)తో జరిగిన రెండో గేమ్‌ను 70 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన మూడో గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. సలీమోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో హంపి 64 ఎత్తుల్లో నెగ్గింది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉంది. దివ్య గెలుపు బోణీ భారత రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ ఐదో రౌండ్లో గెలుపు బోణీ కొట్టింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో దివ్య 45 ఎత్తుల్లో నెగ్గింది. హంపితో తొలి రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించిన దివ్య... కాటరీనా లాగ్నోతో జరిగిన రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో గేమ్‌లో దివ్య 40 ఎత్తుల్లో ఓడిపోయింది. టాన్ జోంగి (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను దివ్య 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
పోరాడి ఓడిన లక్ష్య సేన్
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థి రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) నుంచి ‘వాకోవర్’ దొరకడంతోపాటు లక్ష్య సేన్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ఏడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–19, 18–21, 15–21తో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌ను దక్కించుకున్నా... ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడుకు జవాబివ్వలేకపోయాడు. మరో భారత ప్లేయర్ కిరణ్ జార్జి కథ కూడా ముగిసింది. ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 17–21, 8–21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక బన్సోద్ 15–21, 8–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో... ఉన్నతి హుడా 10–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో... ఆకర్షి 9–21, 8–21తో హాన్ యువె (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆద్యా–సతీశ్ కుమార్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) జోడీ చేతిలో.. రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జంట 8–21, 10–21తో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. -
హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..కాంగ్రెస్‌తో పొత్తు లేదు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.ఐదు సీట్లకు పరిమితమై.. ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్ తన డిమాండ్‌ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్ అందుకు అంగీకరించలేదు.ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్ సాయముంటే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.పేలవమైన పార్టీ పనితీరు హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్‌కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.బీజేపీకి అనుకూల గాలి హర్యానాలో బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్‌కు ఆప్‌కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్‌కు కష్టమయ్యింది.అట్టడుగు నుంచి మద్దతు శూన్యంహర్యానాలో ఆప్‌కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.ఆకట్టుకోవడంలో విఫలం ఆప్ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.వ్యూహాత్మక అంచనా లోపం హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి దారితీసింది.సమయం కేటాయించని నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్‌కు కాంగ్రెస్‌తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్‌కి భారంగా మారింది. ఇది కూడా చదవండి: కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం -
క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ ఓడిపోయాడు. ప్రపంచ 63వ ర్యాంకర్ పావెల్ కొటోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 6–7 (5/7)తో ఓటమి పాలయ్యాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 8,340 డాలర్ల (రూ. 6 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
జొకోవిచ్‌కు షాక్
న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసే లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ కల నెరవేరేందుకు మరికొంత ఆగాల్సిందే. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత అమిత విశ్వాసంతో ఈ టోర్నీ బరిలోకి దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన జొకోవిచ్ అనూహ్యంగా మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు.పురుషుల సింగిల్స్‌లో క్రితం రోజు 2022 చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ నిష్క్ర మించగా... జొకో ఆట మూడో రౌండ్లో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో అతను 4–6, 4–6, 6–2, 4–6తో 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. 37 ఏళ్ల వెటరన్ స్టార్ 16 ఏస్‌లు సంధించినప్పటికీ అదేపనిగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. దిగ్గజానికి దీటుగా 15 ఏస్‌లు కొట్టిన పాపిరిన్ కేవలం 6 డబుల్ ఫాల్ట్‌లే చేశాడు. జొకో 40 విన్నర్లకే పరిమితమైతే... 25 ఏళ్ల ఆ్రస్టేలియన్ 50 విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పదిసార్లు ఫైనల్ చేరిన రెండో సీడ్ జొకోవిచ్ ఇందులో నాలుగు టైటిళ్లు (2011, 2015, 2018, 2023) సాధించాడు. 2007, 2010, 2012, 2013, 2016, 2021లలో రన్నరప్‌గా నిలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న సెర్బియన్ సూపర్‌స్టార్ 17 ఏళ్ల తర్వాత మూడో రౌండ్లో ఇంటిదారి పట్టాడు. యూఎస్ ఓపెన్ ఆడిన తొలినాళ్లలో రెండుసార్లు (2005, 2006) మాత్రమే అతను మూడో రౌండ్లో ని్రష్కమించాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో రెండుసార్లు నాలుగో రౌండ్ మినహా ప్రతీసారి సెమీస్ లేదంటే ఫైనల్ చేరిన ఘనత జొకోవిచ్ సొంతం. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 5–7, 7–5, 6–1, 6–3తో థామస్ ఎచెవెరి (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో జిరి లెహెక (చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–7 (1/7), 3–6, 6–0, 6–3, 6–1తో జన్చెంగ్ షాంగ్ (చైనా)పై, 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సిస్కొ కొమెసన (అర్జెంటీనా)పై విజయం సాధించారు. తొమ్మిదో సీడ్ గ్రిగొర్ డిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–3, 6–1తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. మూడో రౌండ్లోకి యూకీ బాంబ్రి జోడీ భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రి పురుషుల డబుల్స్‌లో వారి భాగస్వాములతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో 2వ సీడ్ బోపన్న–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–2, 6–4తో కార్బలెస్ బేనా (స్పెయిన్)–ఫెడెరికొ కారియా (అర్జెంటీనా) జంటపై గెలిచింది. అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో జోడీకట్టిన యూకీ బాంబ్రి రెండో రౌండ్లో 4–6, 6–3, 7–5తో 15వ సీడ్ క్రాజిసెక్ (అమెరికా)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించింది. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–గైడో అండ్రియోజ్జి (అర్జెంటీనా) ద్వయం 6–7 (4/7), 4–6తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది.2002తర్వాత ‘బిగ్–3’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవని సీజన్‌గా 2024 నిలువనుంది. వరుసగా 21 ఏళ్ల పాటు (2003–2023) ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కనీసం ఒక గ్రాండ్‌స్లామ్ అయినా నెగ్గారు. 2017తర్వాత జొకోవిచ్ కనీసం ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవని సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లలో ఓడిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్‌కు ముందు తప్పుకున్నాడు. -
కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది. -
రైలుకు వేలాడుతూ స్టంట్లు, కట్ చేస్తే..
సరదా మాటున విషాదం నెలకొంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అయినా సోయి లేని పనులు చేస్తున్నారు కొందరు. అలా ఓ కుర్రాడు రైలుకు వేలాడుతూ స్టంట్లు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల దాకా వెళ్లింది. అతన్ని వెతుక్కుంటూ ఆ కుర్రాడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. చివరకు అక్కడి దృశ్యం చూసి కంగుతిన్నారు. ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో ఓ కుర్రాడు ముంబై లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో రైల్వే పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టారు. ఆ కుర్రాడి ఆచూకీ తెలుసుకున్నారు. అయితే ఆ కుర్రాడిని ఒక చేయి, ఒక కాలు కోల్పోయిన స్థితిలో చూసి షాకయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వాడాలాలోని ఆంటోప్ హిల్‌లో నివసిస్తున్న ఫర్హత్ అజా షేక్ అనే కుర్రాడిని లోకల్ రైలులో స్టంట్ చేసిన వ్యక్తిగా ఆర్పీఎఫ్ పోలీసులు కనుగొన్నారు. స్టంట్ చేస్తుండగా ఆ కుర్రాడు ఒక కాలు, ఒక చేయిని కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కుర్రాడి స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దరిమిలా రైల్వే పోలీసులు జూలై 14న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుర్రాడు ముంబైలోని ఆంటోప్ హిల్‌లో ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం వారు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుర్రాడు చేయి, కాలు కోల్పోయి కనిపించడంతో కంగుతిన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. #MumbaiAttn : @RailMinIndia @drmmumbaicr @grpmumbai @RPFCR @Central_Railway @cpgrpmumbaiSuch Idiots performing Stunts on speeding #MumbaiLocal trains are a Nuisance just like the Dancers inside the trains.Should be behind Bars.Loc: Sewri Station.#Stuntmen pic.twitter.com/ZWcC71J44z— मुंबई Matters™ (@mumbaimatterz) July 14, 2024 -
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
-
బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
పాట్నా: బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. -
యూకీ బాంబ్రీ జోడీ ఓటమి
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయింది. స్టుట్‌గార్ట్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 5–7, 4–6తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం 12 ఏస్‌లు సంధించింది. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయింది. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి..!
నెల రోజుల తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలో భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్లో జరుగుతున్న బీఎన్పీ పరిబా ప్రైమ్రోజ్ ఏటీపీ–175 చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 2–6, 2–6తో ప్రపంచ 130వ ర్యాంకర్ హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.ఇవి చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..! -
అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్‌గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
‘లోక్‌సభ’లో ఓడినా... ప్రధానులైన నేతలు వీరే!
దేశంలోని ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే పలు విచిత్ర ఉదంతాలు మనకు కనిపిస్తాయి. వీటిలోని కొన్నింటిని విన్నప్పుడు మనకు ఒక పట్టాన నమ్మాలని అనిపించదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే నాటి ఎన్నికల్లో దిగ్గజనేతలైన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, నరసింహారావు ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తదుపరి 12 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో దేశానికి ప్రధానులుగా మారడం విచిత్రం. చంద్రశేఖర్ జనతా పార్టీ నుంచి నాడు ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ తన సంప్రదాయ స్థానమైన బల్లియా(యూపీ) నుంచి పోటీకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్‌కు చెందిన జగన్నాథ్ చౌదరి 53,940 ఓట్ల తేడాతో సునాయాసంగా చంద్రశేఖర్‌ను ఓడించారు. ఆ తర్వాత 1990లో చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1984లొ దక్షిణాదిలో బీజేపీ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీ జంగారెడ్డి 54,198 ఓట్ల తేడాతో నరసింహారావుపై విజయం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత సీ జంగా రెడ్డి. 1991లో నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. వాజ్‌పేయి అటల్ బిహారీ వాజ్‌పేయి 1984 ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో వాజ్‌పేయి ఓటమి పాలయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1996లో దేశానికి ప్రధాని అయ్యారు. -
పోరాడి ఓడిన సుమిత్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందుతాడు. -
సెమీస్‌లో శ్రీకాంత్ పరాజయం
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. బాసెల్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్‌కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
మూడేళ్లలో 3,200 రోడ్డు ప్రమాదాలు, 1,231 మంది మృతి!
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో గత మూడేళ్లలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో గత మూడేళ్లలో మొత్తం 3200 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1231 మంది మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఖర్గోన్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ టీఐ దేవేంద్ర సింగ్ పరిహార్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 24 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు కలెక్టర్ నేతృత్వంలో అన్ని రోడ్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రోడ్ల విస్తరణ, నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించనున్నారు. -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
సెమీస్‌లో ఓడిన అష్మిత
థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జొకోవిచ్‌కు సినెర్ షాక్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, 10 సార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్ ధాటికి జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సినెర్ 3 గంటల 22 నిమిషాల్లో 6–1, 6–2, 6–7 (6/8), 6–4తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన సినెర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్ సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు. మరోవైపు జొకోవిచ్ 54 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో సినెర్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మెద్వెదెవ్ 4 గంటల 18 నిమిషాల్లో 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించి ఈ టోరీ్నలో మూడోసారి, ఓవరాల్‌గా ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకున్నాడు. -
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం
-
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!
డెన్వర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు లాక్రోస్ టో టోర్నమెంట్‌కి వెళ్లి వస్తూ తమ లగేజీని కోల్పోయారు. బాల్టిమోర్ నుండి చికాగో మీదుగా విమానం వస్తూ డెన్వర్‌కు పయన మయ్యారు. విమానాశ్రయంలో లగేజీ బెల్ట్‌లో తమ బ్యాగ్ కనిపించలేదు. దీంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఇక దొరకదు అనుకున్న ఖరీదైన బ్యాగును టెక్నాలజీ సాయంతో దక్కించుకున్న వైనం విశేషంగా నిలిచింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం సాండ్రా షుస్టర్ , ఆమె 15 ఏళ్ల కుమార్తె రూబీ లాక్రోస్ ప్లేయర్. టోర్నమెంట్ నుంచి జూలై 17న చికాగో ఓ'హేర్ విమానాశ్రయం వద్ద, లాక్రోస్ కిట్ చెకిన్ బ్యాగ్‌గా ఉంచుకుని, మిగిలిన బ్యాగేజీని విమానాశ్రయంలో లగేజీ కౌంటర్లో ఇచ్చారు. అయితే బెల్ట్‌పై వారి లగేజీ మిస్ అయింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయగా వస్తుందని చెప్పారు. కానీ రాలేదు. మళ్లీ కాల్ చేస్తే మీ బ్యాగ్ ఇంకా బాల్టిమోర్‌లో ఉంది అనే సమాధానం వచ్చింది. అంతేకాదు మీ బ్యాగును ఎవరో కొట్టేశారని కూడా చెప్పారు. రూబీ బ్యాగులో ఖరీదైన 2,000 డాలర్ల కిట్ ఉంది. అంతకుమించి తన ఆటకు బాగా అలవాటైన లాక్రోస్ గేమ్ స్టిక్ ఉంది. దాన్ని వదులుకోవడం అంటే చాలా నష్టం. మరోవైపు మరో టోర్నమెంట్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలి. దీంతో తమ రిఫరెన్స్ నంబర్‌తో డెన్వర్‌లోని పోయిన లగేజ్ డెస్క్ వద్ద ఆగి, చికాగోలో ఎయిర్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రాక్ చేస్తూనే ఉందని గట్టిగా వాదించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తన బ్యాగ్ బాల్టిమోర్‌లో లేదని షుస్టర్కి అర్థమవుతోంది. టెక్నాలజీ సాయంతో పరిశీలించగా, చికాగోలోని టెర్మినల్-1, బ్యాక్ ఆఫీసులో బ్యాగ్ ఉన్నట్లు ఎయిర్‌ట్యాగ్ చూపించింది. ఇదే విషయాన్ని వారికి వివరించి అక్కడి వారిని విచారించమని అడిగితే తమకు అనుమతి లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది. అయితే సిస్టమ్‌లో నోట్ పెడతామని, బ్యాగేజీ బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టీంని ట్విటర్ ద్వారా సంప్రదించారు. అయితే ట్యాగ్ వివరాలు తప్పుగా ఉన్నాయని చెప్పడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. బ్యాగ్, క్లెయిమ్ టిక్కెట్, లొకేషన్ వివరాలను వారికి పంపించారు. చివరికి మరో అరగంటలో ఫోన్ చేసి బ్యాగ్ దొరికిందని, పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ల మీద ఉన్న అపనమ్మకంతో నెక్ట్స్ ఫ్లైట్‌లోనే చిగాగో వెళ్లి అక్కడ కేవలం 30 సెకన్లలో తన బ్యాగును గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాయన్ని సాండ్రా షుస్టర్, రూబీ మీడియాతో పంచుకున్నారు. విమానయా సంస్థల సేవలు అధ్వాన్నంగామారుతున్నాయి.ఫలితంగా ఖరీదైన వస్తువులు,బ్యాగులు పోగొట్టుకుంటున్నాం. అందుకే ఎయర్ట్యాగ్ని కొనుగోలు చేసానని సాండ్రా షుస్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్ యుగంలో టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఒక ట్రాకింగ్ డివైస్. మిస్ అయిన వ్యక్తులు వ్యక్తిగత వస్తువులను కనుగొనడంలో ఎయిర్‌ట్యాగ్ కీ ఫైండర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌ట్యాగ్ క్రౌడ్సోర్స్డ్ ఫైండ్ మై నెట్వర్క్,బ్లూటూత్ సిగ్నల్స్ సాయంతో కీలు, బ్యాగ్‌లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు తదితర పోగొట్టుకున్న వస్తువులను గుర్తించవచ్చు. -
'AI' ఎఫెక్ట్ ఉద్యోగాలు ఉఫ్...
-
ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి?
దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం. మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్ ఆధార్ ఎలా పొందాలి? ఆధార్ కార్డ్ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్ కార్డ్ పోగొట్టుకునిపోతే ఆధార్ నంబర్ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా సరే ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? ఆధార్ నంబర్ ఉంటే.. https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్ చేయండి 12 అంకెల ఆధార్ నంబర్, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు చేయండి. స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేకపోతే.. https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి. ఆధార్ నంబర్ కావాలో లేదా ఎన్రోల్మెంట్ ఐడీ కావాలో ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వస్తుంది. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. అన్ని వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉంటుంది. అంటే తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్‌బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
ఓటమి అవమానంతో.. ఏడుగురి ప్రాణాలు తీశాడు
క్రైమ్: ఆటలో ఓడిపోయాడు. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆవేశంలో మళ్లీ ఆడాడు. ఈసారి చిత్తుగా ఓడాడు. దీంతో అక్కడున్నవాళ్లు హేళన చేస్తూ నవ్వారు. అది అతనికి పట్టరాని పిచ్చికోపం తెప్పించింది. ఆ క్షణికావేశంలో ఉన్మాదిగా మారిపోయి ఏడుగురి బలిగొన్నాడు. బ్రెజిల్లో దారుణం జరిగింది. పూల్ గేమ్ ఓడిన వ్యక్తి.. అందరూ నవ్వారనే కోపంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతనికి మరో వ్యక్తి సాయం చేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. బ్రెజిల్ రాష్ట్రం మాటో గ్రోస్సోలోని సినోప్ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు ఎడ్గర్ రికార్డో డె ఒలివెయిరా. సహనిందితుడి పేరు ఇజెక్వియాస్ సౌజ రిబెయిరోలు. ఇద్దరూ ఘటన తర్వాత ఓ కుగ్రామంలో తలదాచుకుని.. అక్కడి నుంచి మరో చోటుకి పరారైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. ఒలివెయిరా తొలుత ఓ వ్యక్తి చేతిలో పూల్ గేమ్ ఓడిపోయి 4,000 రియస్(776 డాలర్లు) పోగొట్టుకున్నాడు. ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్లి.. ఇజెక్వియాస్ను వెంట తెచ్చుకున్నాడు. మళ్లీ ఆడదామంటూ.. గెలిచిన వ్యక్తికి సవాల్ విసిరాడు. అయితే ఈసారి కూడా గేమ్ ఓడిపోయాడు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లంతా బిగ్గరగా నవ్వడంతో కోపం ఆపుకోలేకపోయాడు. ట్రక్కులోకి వెళ్లి షాట్ గన్ తీసుకొచ్చి పూల్ ఓనర్‌తో సహా అక్కడున్న ఏడుగురిని కాల్చి చంపాడు. డబ్బులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పూల్ హాల్లోని సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు వైరల్ అయ్యాయి. -
పెన్నహోబిలంలో విషాదం..వెలికి తీసేలోపు..
సాక్షి, ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.... బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన గోపాలకృష్ణారెడ్డి, హిమబిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహిత (14) అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం ఉదయం పిల్లలను పిలుచుకుని తల్లి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చింది. ఆలయంలో పూజలు ముగించుకుని దిగువన ఉన్న జలపాతం వద్దకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో జలపాతానికి ఎగువన పిల్లలు వరుసగా నిలబడి ఉండగా తల్లి ఫొటో తీసింది. అదే సమయంలో నీళ్లలో ఉన్న పాచి పట్టిన రాతిపై కాలు పెట్టిన మహిత ఒక్కసారిగా జారిపడి జలపాతం దిగువకు కొట్టుకుపోయింది. గమనించిన తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో కొందరు యువకులు జలపాతంలోకి దూకి మహిత కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మహితను జలపాతానికి ఫర్లాంగు దూరంలో యువకులు గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మహితను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..) -
‘మనం ఎద్దు నుంచి పాలు పితకగలిగాం!’
సాక్షి, న్యూఢిల్లీ: అత్యధిక స్థానాలు తమవేనంటూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు ఇచ్చుకున్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఓటమి తర్వాత చల్లబడి పోయారు. ఈ క్రమంలో.. గుజరాత్ ఓటమిపై కేజ్రీవాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఐదు సీట్లను గెల్చుకోవడం కూడా అతి కష్టమేనన్న రీతిలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, ఎద్దు నుంచి పితకగలరా? గుజరాత్లో మనం గెలుపు కోసం చేసిన యత్నం దాదాపు అలాంటిదే అని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే పంజాబ్‌లో అధికారం దక్కించుకున్నాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నాం. గోవాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు, గుజరాత్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలతో 14 శాతం ఓట్ షేర్ సాధించాం. గుజరాత్ పరిణామం ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అది ఎద్దు నుంచి పాలు పితకడం లాంటిదని అన్నాడు. అది అక్షరాల సత్యం. ఆవు నుంచి ఎవరైనా పాలు పితకగలరు. కానీ, మనం ఏకంగా ఎద్దు నుంచే పాలు పితికాం అని చెప్పారాయన. గుజరాత్లో ఈ దఫా కాకపోయినా.. 2027 అధికారం ఆప్‌దేనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతామని ప్రకటించారు కేజ్రీవాల్. ఇక గుజరాత్ ఎన్నికల ఓట్ షేర్‌తో.. ఆప్‌కు జాతీయ హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జరిగిన కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా సాగింది. అంతేకాదు.. ఈ భేటీ నుంచి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. భారత జవాన్ల ప్రాణాలంటే మోదీ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్‌కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్‌సలాన్‌పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..
Actress Sharon Stone Reveals She Lost 9 Childrens By Miscarriage: సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు 'అమ్మ' అని పిలుచుకోవాలని తహతహలాడతారు. పిల్లల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించక అమ్మ అనే మాధుర్యాన్ని పొందలేని మహిళల బాధ వర్ణణాతీతం. మరి అలాంటిది గర్భస్రావం వల్ల ఏకంగా తొమ్మిది సార్లు పిల్లలను కోల్పోతే. ఇక వారి ఆవేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి బాధను అనుభవించింది 64 ఏళ్ల ఒకప్పటి స్టార్ హీరోయిన్ షరాన్ స్టోన్. ఈ అమెరికన్ నటి షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్టింక్ట్' సినిమా సిరీస్ ద్వారా అత్యధిక పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా తాను 9 మంది పిల్లలను కోల్పోవడం గురించి తెలిపింది. 'నేను గర్భస్రావం వల్ల తొమ్మిది మంది పిల్లలను కోల్పోయాను. ఇదేం చిన్న విషయం కాదు. శారీరకంగా, మానసికంగా నేను అనుభవించాను. మహిళలుగా మాకు ఈ నష్టం గురించి మాట్లాడేందుకు పదాలు లేవు. ఒకరకమైన ఓటమి భావనతో ఒంటరిగా, రహస్యంగా భరించాల్సిన విషయం. కానీ దీనికి బదులు కాస్తా సానుభూతి, ప్రేమ, కనికరం అవసరం.' అని తెలిపింది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) షరాన్ స్టోన్ తన మొదటి గర్భస్రావం గురించి 'అలా జరిగినందుకు నేను ఎంతో సిగ్గుపడ్డాను. ఎంతో అవమానకరంగా అనిపించింది. దాని గురించి ఎలా చెప్పాలో నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. నిజానికి నా ఆరోగ్యం పట్ల గర్వంగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు పునురుత్పత్తి కోసం అది అంతగా సహాయపడలేదనుకుంటా.' అని పేర్కొంది. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) -
తల్లితో అప్పటిదాక చేయి పట్టుకుని తిరిగింది...కొద్ది క్షణాల్లోనే తల్లికళ్లముందే..
భాగ్యనగర్‌కాలనీ: భవనం స్లాబ్ శకలాలు ఆ చిన్నారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. అభం శుభం ఎరగని నాలుగేళ్ల బాలిక నూరేళ్లు నిండేలా చేశాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కూతురు కళ్లముందే విగతజీవి కావడం ఆ తల్లిదండ్రులకు అశనిపాతంలా మారింది. తీరని శోకాన్నే మిగిల్చింది. తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న కూతురు శాశ్వతంగా దూరం కావడం ఆ తల్లిని దుఃఖం సాగరంలో ముంచింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన లాం సునీల్ కుమార్, లోత్ మేరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. హెచ్ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటూ శాతవాహన నగర్లో బేకరీ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి షరోన్ దిత్య (4) కూతురు ఉంది. మంగళవారం ఉదయం తల్లితో కలిసి ఆ చిన్నారి టిఫిన్ తీసుకొని బేకరికి వెళుతుండగా పక్కనే పాత ఇంటిపై నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి బాలిక తలపై పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలై మెదడు బయటపడింది. బంధువుల సహాయంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెఆప్పరు. కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తూ.. చిన్నారి మృతికి కారణమైన ఇంటి యజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్‌కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాన్‌కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య ''నా పాన్‌కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
రెండు నెలల్లో.. 40వేల కోట్లు పొగొట్టుకుందామె!
సొంత దేశం కోసం తప్ప.. వ్యక్తిగతంగా బాగుపడకూడదంటూ బిలియనీర్లపై పగబట్టింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా అపర కుబేరులపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రియలిటీ కింగ్‌గా ఉన్న ‘ఎవర్‌గ్రాండ్’ సైతం దివాళా దిశగా వెళ్లడం, అలీబాబా జాక్ మా లాంటి వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం లాంటివి గమనిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో.. చైనా దెబ్బకి హాంకాంగ్‌కు చెందిన ఓ బిలియనీర్.. తన సంపదలో దాదాపు 40 వేల కోట్లకు పైగా కోల్పోయింది. హువాబావో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో షేర్ల ధరలు ఏకంగా 67 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ చైర్ఉమెన్ చూ లమ్ వైయియూ(52) ను క్రమశిక్షణ ఉల్లంఘనల కింద చైనా ప్రభుత్వం విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు దారుణాతిదారుణంగా పతనం అవుతున్నాయి. చైనా దర్యాప్తు మొదలైందన్న విషయం తెలిశాక.. ఇన్వెస్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ ఎఫెక్ట్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లెయియాంగ్ సిటీకి చెందిన సూపర్వైజరీ కమిటీ ఒకటి.. చూ ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చూ లమ్ వైయియూ.. హువాబావో కంపెనీ చైర్ఉమెన్ మాత్రమే కాదు.. 71 శాతం వాటాతో సీఈవోగా కూడా కొనసాగుతున్నారు. నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇవాళ్టి(ఫిబ్రవరి 3)నాటికి 2.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే స్టాక్ ధరలు మరింత దిగజారుతాయనే భయంతో దర్యాప్తు దేని మీద సాగుతుందన్న వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది కంపెనీ. tobacco fragrance queenగా చూ కి మరో పేరుంది. అయితే హువాబావో కంపెనీ తరపున ఈ-సిగరెట్లను మైనర్లకు విక్రయించడం మీద అభ్యంతరాల నడుమే చైనా ప్రభుత్వం ఆమెపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. కానీ, చైనా పౌరసత్వం వదులుకుని మరీ ఆమె బిలియనీర్‌గా ఎదగడం ఓర్వ లేకే చైనా.. ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందన్నది హాంకాంగ్ వర్గాల కథనం. చూ కెరీర్ చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పుట్టిన చూ.. ఆపై హాంకాంగ్ పౌరసత్వం తీసుకుంది. కాలేజీ రోజుల్లోనే హువాబావో పేరిట చూ లాం వైయియూ.. అత్తరు వ్యాపారాన్ని కొనసాగించింది. 1966లో కంపెనీని మొదలుపెట్టిన ఆమె.. పదేళ్ల తర్వాత కంపెనీని ఐపీవోకి తీసుకెళ్లింది. ఐదవ సీపీపీ సీసీసీ (Chinese People's Political Consultative Conference Committee)లో ఆమె సభ్యురాలిగా కూడా పని చేసింది. వారసుడిని వ్యాపారంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉండగానే.. ఆమెకు ఈ ఎదురు దెబ్బ తగడం విశేషం. -
బాప్రే.. రూ. 70 వేల కోట్లకు మునిగిన బిలియనీర్
స్టాక్ మార్కెట్ పరిణామాలు.. ఊహాతీతం. ఎప్పుడు.. ఎవరి కొంప ముంచుతాయో.. ఎవరిని అందలం ఎక్కిస్తాయో? ప్చ్.. చెప్పడం కష్టం. రెండేళ్ల తర్వాత ఆ దిగ్గజ కంపెనీ స్టాక్ ధరలు ధబేల్‌మని మునిగిపోయాయి. ఆ ప్రభావం ఓ బిలియనీర్ మీద పడగా.. మొత్తంగా ఆయనకు వాటిల్లిన నష్టం ఇప్పట్లో రికవరీ అయ్యేలా కనిపించడం లేదు. సింగపూర్ గేమింగ్ బిలియనీర్ ఫారెస్ట్ లీ(44)కి భారీ షాక్ తగిలింది. చైనా గేమింగ్ దిగ్గజం టెన్సెంట్, సీ లిమిటెడ్ కంపెనీ వాటాలో కోత విధించడంతో.. ఫారెస్ట్ లీకి తీవ్ర నష్టం వాటిల్లింది. 2021 అక్టోబర్ నుంచి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్‌కాగా.. తాజా పరిణామాలు ఆయన ఆదాయంపై భారీగా దెబ్బేశాయి . దీంతో ఆయన వేల కోట్లు నష్టపోయాడు. సీ లిమిటెడ్ చైర్మన్-సీఈవో అయిన ఫారెస్ట్ లీ.. గత అక్టోబర్‌లో అమెరికన్ డిపాజిటరీ రసీదులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి తన సంపదను క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. ఈ తరుణంలో సీ కంపెనీ వాటాను 21 శాతం నుంచి 18 శాతానికి కోత విధించినట్లు మంగళవారం టెన్సెంట్ కంపెనీ ప్రకటించింది. గేమింగ్-ఈకామర్స్ దిగ్గజం అయిన టెన్సెంట్ స్టాక్ ధరలు రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పతనం కావడమే ఇందుకు కారణం. ఈ చర్యతో సీ కంపెనీ వోటింగ్ హక్కులు సైతం 10 శాతానికి పడిపోయింది. ఇక తాజా పరిణామంతో ఈ మూడు నెలల్లోనే ఫారెస్ట్ లీకి వాటిల్లిన నష్టం 10 బిలియన్ డాలర్లకు పైమాటేనని బ్లూమరాంగ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.. అంటే మన కరెన్సీలో 70 వేల కోట్ల రూపాయలకు పైమాటే. ఒక్క మంగళవారమే 1.5 బిలియన్ డాలర్లు(పది వేల కోట్ల రూపాయలకు పైనే) లీ నష్టపోయాడు. ప్రస్తుతం ఫారెస్ట్ లీ సంపద 11.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో సింగపూర్ రిచ్ పర్సన్ జాబితాలో మూడు ప్లేస్‌కు చేరుకున్నాడు. టెన్సెంట్ స్టాక్ ధరలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ ప్రభావంతో ఫారెస్ట్ లీకి వాటిల్లి నష్టం సైతం ఇప్పట్లో రికవరీ కాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫారెస్ట్ లీతో పాటు గ్యాంగ్ యే, డేవిడ్ చెన్ అనే ఇద్దరు 2009లో సీ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. షాపీ అనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, మొబైల్ గేమ్ ఫైర్ ఫ్రీ(గూగుల్ ప్లేలో వంద కోట్ల డౌన్లోడ్లు దాటిన గేమ్ ఇదే) అందిస్తోంది. అయితే సీ లిమిటెడ్ పేరుకు సింగపూర్ కంపెనీ అయినప్పటికీ.. ట్రేడ్ మాత్రం అమెరికా ఆధారితంగానే నడుస్తోంది. ఈ కంపెనీ ద్వారా యే, చెన్లకు 6.3 బిలియన్ డాలర్లు, 2.1 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది ఇప్పటిదాకా. కొవిడ్ టైంలో సింగపూర్ వ్యాప్తంగా ఆన్లైన్ షాపింగ్, గేమింగ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనిని సీ లిమిటెడ్ క్యాష్ చేసుకోగా.. ఆ ఎఫెక్ట్‌తో ఫారెస్ట్ లీ ఏకంగా సింగపూర్ రిచ్చెస్ట్ పర్సన్‌గా అవతరించాడు. అయితే ఆ ఘనత ఎంతోకాలం కొనసాగలేదు. తీవ్రమైన పోటీ నేపథ్యం, స్టాక్ మార్కెట్ కుదేలు, ఇతర పరిణామాలతో ఆయన సంపద కరిగిపోతూ వస్తోంది. -
పేటీఎంకు భారీ షాక్
Patym Mall Lost Unicorn Status: డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేటీఎం ఈ-కామర్స్ విభాగం ‘పేటీఎం మాల్’ యూనికార్న్ హోదాను కోల్పోయింది. తాజాగా హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించిన యూనికార్న్ జాబితాలో ‘పేటీఎం మాల్’ స్థానం కనిపించలేదు. స్టార్టప్ వాల్యూయేషన్ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ స్టార్టప్‌లను ‘యూనికార్న్’ కంపెనీలుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్ వాల్యూ 1 బిలియన్ కంటే కిందకి పడిపోయినట్లు సమాచారం. ఈ పతనంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. ఇక పేటీఎం మాల్తో పాటు మరో ఏడు భారీ స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొగొట్టుకున్నాయి. వీటిలో చాలావరకు చైనాకు చెందినవే ఉండడం విశేషం. ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు యూనికార్న్ హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సేంజ్ లిస్ట్ కావడం లేదంటే ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో మొత్తం 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. ఈ-కామర్స్ రంగం పోటీలో భాగంగా పేటీఎం మాల్‌ను 2016లో పేటీఎం లాంఛ్ చేసింది. రెండేళ్లు తిరగకుండానే బిలియన్ డాలర్ల వాల్యూతో యూనికార్న్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది పేటీఎం మాల్. ఈబే ఫండింగ్ తర్వాత 2019లో పేటీఎం మాల్ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో సైతం పోటీపడింది పేటీఎం మాల్. కిందటి ఏడాది 3 బిలియన్ డాలర్ల వాల్యూతో నిలిచిన పేటీఎం మాల్.. ఈ ఏడాది ఏకంగా యూనికార్న్ హోదా కోల్పోవడం విశేషం. ఇంకోవైపు ఐపీవోకి వెళ్లిన పేటీఎం.. చేదు ఫలితాల్నే చవిచూస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్.. నెక్స్ట్ చైనానే! -
దుసపాటిలొద్ది జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఒకరు నీట మునిగి పోతుండటంతో అతడిని రక్షించడానికి వెళ్లి మరొకరు నీటిలో మునిగిపోయాడు. ఎస్సై కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకారం.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం సందర్శనకు వచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తుండగా మునిగెల నరేశ్ (24) ప్రమాదవశాత్తు గుండంలో పడిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాక పోవడంతో మిగతా మిత్రులు ఆందోళనకు గురై అక్కడే ఉన్న పర్యాటకులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో పాటు రెస్క్యూ టీంను అక్కడికి పంపించారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. చీకటి కావడంతో గాలింపు నిలిపి వేశారు. గల్లంతైన నరేశ్‌కు తల్లి సమ్మక్క ఉంది. తండ్రి సింగరేణిలో పనిచేస్తూ మృతిచెందడంతో ఆ ఉద్యోగం నరేశ్‌కు వచ్చింది. గత కొంతకాలంగా గోదావరిఖనిలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మూడు నెలల క్రితం భూపాలపల్లికి డిప్యుటేషన్‌పై వచ్చాడు. కాపాడటానికి వెళ్లి..: నరేశ్ నీటిలో మునిగి గల్లంతు కావడంతో జలపాతం చూడటానికి వచ్చిన రవికుమార్‌చారి (30) అనే యువకుడు అతడిని కాపాడటానికి నీటిలో దిగాడు. అయితే అతను కూడా గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన రవికుమార్‌చారి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు. వారించినా వినకుండా..: ఈ జలపాతం రిజర్వ్ ఫారెస్టులో ఉండడంతో అటవీ శాఖ సిబ్బంది పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిస్తున్నారు. అయినా వినకుండా చాలా మంది వెళ్తున్నారు. గతంలో ఇక్కడ ఒకరు గల్లంతై చనిపోగా, తాజాగా ఇద్దరు గల్లంతయ్యారు. -
పొచ్చర జలపాతం వద్ద యువకుడి గల్లంతు
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్, నరేశ్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠికి చెందిన రమేశ్, భీంసరి గ్రామానికి చెందిన ఆడెపు వెంకట్ ఆదివారం మధ్యా హ్నం పొచ్చర జలపాతానికి వచ్చారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో జలపాతానికి వరద నీరు పోటెత్తింది. వీరు తిరిగి వెళ్తున్న దారిలోఉన్న వంతె నపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన దాటే ప్రయత్నంలో రమేశ్ జారి పడడంతో హరీశ్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వర ద ఉ«ధృతికి హరీశ్ కొట్టుకుపోయాడు. రమేశ్ వంతెనను పట్టుకుని బయటపడ్డాడు. హరీశ్(25)కు 6 నెలల క్రితమే వివాహం అయింది. ఆయన తండ్రి విఠల్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్సై తెలిపారు. -
Euro 2020: ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో అదీ షూట్అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది. వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ 1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్. అచ్చీరాని షూట్అవుట్లు ఇంగ్లండ్‌కు ఇలా షూట్అవుట్లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది. అభిమానుల అతి.. వ్యతిరేకత ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్లో షూట్అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ విన్నర్ జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు. ఆరు నెలల తర్వాత రాబర్టో మన్సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
French Open: థీమ్‌కు షాక్...
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ పెను సంచలనంతో ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు రన్నరప్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల పాబ్లో అందుహర్ అసమాన పోరాటపటిమ కనబరిచి 4 గంటల 28 నిమిషాల్లో 4–6, 5–7, 6–3, 6–4, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ థీమ్‌ను బోల్తా కొట్టించాడు. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల థీమ్ ఈ టోర్నీ తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2016, 2017లలో సెమీఫైనల్ చేరిన థీమ్... 2018, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. థీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన ప్రపంచ 68వ ర్యాంకర్ పాబ్లో ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన పాబ్లో... థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో థీమ్ ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 61 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు కెరీర్లో 37వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న పాబ్లో తొలి రెండు సెట్లు ఓడిపోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 27వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ), కీ నిషికోరి (జపాన్), 11వ సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఒసాకాపై 15 వేల డాలర్ల జరిమానా మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఒసాకా 6–4, 7–6 (7/4)తో పాట్రిసియా మరియా టిగ్ (రొమేనియా)ను ఓడించింది. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లు ముగిశాక మీడియా సమావేశాలకు హాజరుకానని ప్రకటించిన ఒసాకా అలాగే చేసింది. తొలి రౌండ్లో గెలిచిన తర్వాత ఆమె మీడియా సమావేశానికి గైర్హాజరయింది. దాంతో టోర్నీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఒసాకాపై 15 వేల డాలర్ల (రూ. 10 లక్షల 86 వేలు) జరిమానా విధించారు. ఆమె గెలిచిన ప్రైజ్‌మనీలో నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. కెర్బర్ ఓటమి మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 26వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లో 2–6, 4–6తో కలినీనా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (3/7), 7–6 (7/5), 6–1తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై... మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–3తో అనా కొంజు (క్రొయేషియా)పై గెలిచారు. -
అంకితకు నిరాశ
పారిస్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రాలో ఆడాలనుకున్న భారత మహిళల నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా నిరీక్షణ మరింత కాలం కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీలో 27 ఏళ్ల అంకితకు మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 176వ ర్యాంకర్ అంకిత 3–6, 2–6తో 22వ సీడ్ కురిమి నారా (జపాన్) చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైంది. గంటా 21 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ‘మ్యాచ్‌లో మరీ చెత్తగా ఆడలేదు. నా ప్రత్యర్థి గొప్పగా ఆడి నా సర్వీస్ గేమ్‌ల్ని దక్కించుకుంది. అవి గెలిచుంటే ఫలితం మరోలా ఉండేది. అక్కడ గాలి కూడా ప్రభావం చూపింది’ అని మ్యాచ్ అనంతరం అంకిత వ్యాఖ్యానించింది. అంకిత ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ కేటగిరీలో భారత ప్రాతినిధ్యం లేనట్లయింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ క్వాలిఫయర్స్‌లోనే ఓటమి పాలయ్యారు. -
బోపన్న జంట ఓటమి
రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–4, 5–7, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫాబ్రిస్ మార్టిన్–జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 30 వేల యూరోలు (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో షపోవలోవ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. మూడో రౌండ్లో షపోవలోవ్ 6–7 (5/7), 6–1, 6–4తో యుగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. -
సెరెనా మరో ‘సారీ’
సొంతగడ్డపై ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ రికార్డును సమం చేయాలని ఆశించిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆశలు ఆవిరయ్యాయి. వ్యక్తిగత జీవితంలోని సమస్యల నుంచి బయటపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ‘బెలారస్ మమ్మీ’ విక్టోరియా అజరెంకా ఏడేళ్ల విరామం తర్వాత మరో ‘గ్రాండ్’ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెరెనాతో ఆడిన 10 సార్లూ ఓటమి వైపు నిలిచిన అజరెంకా 11వ సారి మాత్రం స్ఫూర్తిదాయక ఆటతో విజయతీరాలకు చేరింది. తద్వారా కెరీర్లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మాజీ చాంపియన్ నయోమి ఒసాకా తన జోరు కొనసాగిస్తూ అజరెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్లో ఎవరు గెలిచినా వారి ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. న్యూయార్క్: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఇంకా ఉందని బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా నిరూపించింది. ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆమె టైటిల్ పోరుకు అర్హత పొందింది. అమెరికా దిగ్గజ క్రీడాకారిణి, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్‌తో గంటా 55 నిమిషాలపాటు జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ అజరెంకా 1–6, 6–3, 6–3తో విజయం సాధించింది. అజరెంకా చివరిసారి 2013లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్ రన్నరప్)లో ఫైనల్ చేరింది. 38 ఏళ్ల సెరెనాతో కెరీర్లో 23వసారి తలపడిన 31 ఏళ్ల అజరెంకా తొలి సెట్లో నిరాశ పరిచింది. కేవలం ఒక గేమ్‌ను గెల్చుకొని 34 నిమిషాల్లో సెట్‌ను చేజార్చుకుంది.. దాంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో సెరెనా చేతిలో ఆమెకు వరుసగా 11వ సారీ ఓటమి తప్పదేమోనని అనిపించింది. కానీ అజరెంకా రెండో సెట్లో గాడిలో పడింది. ఐదో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన ఆమె 35 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్‌లో సెరెనా 0–1తో వెనుకబడి తన సర్వీస్‌లో 30–40తో వెనుకంజలో ఉన్నపుడు బ్యాక్‌హ్యాండ్ షాట్ ఆడే క్రమంలో సెరెనా ఎడమకాలు మడత పడింది. దాంతో ఆమె చికిత్స కోసం మూడు నిమిషాలు విరామం తీసుకుంది. ట్రైనర్ కాలి మడమకు పట్టీ కట్టాక బరిలోకి దిగిన సెరెనా తన సర్వీస్‌ను కోల్పోయింది. సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అజరెంకా మూడో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా అజరెంకా తడబడకుండా చివరకు 6–3తో సెట్‌ను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో అజరెంకా రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు సెరెనా ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఎదురులేని ఒసాకా... 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీతో 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 7–6 (7/1), 3–6, 6–3తో నెగ్గింది. ఇద్దరూ పవర్ఫుల్ ఆట కనబర్చడంతో మ్యాచ్ మొత్తంలో ఇద్దరూ ఒక్కోసారి మాత్రమే తమ సర్వీస్‌లను కోల్పోయారు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఒసాకా పైచేయి సాధించింది. రెండో సెట్లో బ్రేడీ ఎనిమిదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–3తో దక్కించుకుంది. మూడో సెట్లో ఒసాకాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. ఒసాకా 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు బ్రేడీ తన సర్వీస్‌లో లైన్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షంచకపోవడం ఒసాకాకు కలిసొచ్చి బ్రేక్ పాయింట్ దక్కింది. ఒసాకా కొట్టిన షాట్ నెట్‌కు తగిలి అవతలివైపు వెళ్లగా బ్రేడీ రిటర్న్ షాట్ ఆడింది. అయితే ఆమె కొట్టిన షాట్ బయటకు వెళ్లిందని లైన్ అంపైర్ ప్రకటించింది. అయితే టీవీ రీప్లేలో బ్రేడీ షాట్ లైన్ అంచును తాకిందని కనిపించింది. కానీ బ్రేడీ టీవీ రీప్లే అడగకపోవడంతో గేమ్ ఒసాకా వశమైంది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని బ్రేడీ ఓటమిని ఖాయం చేసింది. పావిచ్–సోరెస్ జంటకు డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్ విభాగంలో అన్‌సీడెడ్ ద్వయం మ్యాట్ పావిచ్ (క్రొయేషియా)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పావిచ్–సోరెస్ జంట 7–5, 6–3తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పావిచ్–సోరెస్ జంటకు 4,00,000 డాలర్లు ప్రైజ్‌మనీగా (రూ. 2 కోట్ల 93 లక్షలు) లభించాయి. -
కరోనా కలిపింది ఇద్దరినీ..
నెబ్రాస్కా: కరోనా వైరస్ మనుషుల్ని విడదీస్తూ మానవ సంబంధాలను దెబ్బతీస్తూ ఉంటే ఆ తోబుట్టువులను మాత్రం ఏకం చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారిద్దరూ కరోనా వైరస్ తమ పాలిట దైవం అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఒక న్యూస్ ఛానెల్‌తో వారు పంచుకున్న అనుభూతులు ప్రకారం.. అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన డోరిస్ క్రిపెన్(73) కరోనా సోకడంతో ఫ్రీమెంట్ నగరంలోని ఒక ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు వైద్యం చేసింది ఎవరో కాదు. ఆమె తోడబుట్టిన చెల్లెలు బేవ్ బోరో. 1967లో తండ్రి మరణానంతరం తల్లి లేకపోవడంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ చెరో చోట పెరిగారు. బోరోకి ఆరు నెలలు ఉన్నప్పుడు ఇద్దరూ విడిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా ఆస్పత్రిలో కలుసుకున్నారు. బోరో ఆస్పత్రికి వచ్చిన రోగుల జాబితా చూస్తూ ఉంటే క్రిపెన్ పేరు కనిపించింది. తన అక్క పేరు కూడా అదే కదా ఆమే అయి ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ క్రిపెన్ చికిత్స పొందుతున్న వార్డుకి వచ్చింది. ఆమెకి వినికిడి సమస్య ఉండడంతో ఒక బోర్డు మీద మీ తండ్రి పేరు వెండాల్ హఫ్‌మ్యాన్? అని రాసింది. దానికి క్రిపెన్ అవునని తలూపడంతో బోరో భావోద్వేగాలను పట్టలేకపోయింది. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ నేను నీ చెల్లెలు బోరోని అంటూ మళ్లీ రాసింది. అది చదివిని క్రిపెన్‌కి కుర్చీలోంచి కింద పడ్డంత పనైంది. ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ తోబుట్టువులు సంతోషంలో మునిగిపోయారు. కరోనా కలిపింది ఇద్దరినీ అంటూ హాయిగా పాడుకుంటున్నారు. -
విండీస్ చేతులెత్తేసింది
వెస్టిండీస్ ఆట మారలేదు. రాత కూడా మారలేదు. ఒక రోజంతా వరుణుడు అడ్డుగా నిలబడి ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చినా దానిని హోల్డర్ బృందం వృథా చేసుకుంది. పేలవ బ్యాటింగ్‌తో కేవలం 31.1 ఓవర్లకే 8 వికెట్లు ఇచ్చేసి ఘోర పరాజయం చవిచూసింది. పదునైన బౌలింగ్‌తో చెలరేగిన ఇంగ్లండ్ సునాయాసంగా తమ పని పూర్తి చేసి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. చివరి ‘విజ్డన్ ట్రోఫీ’ని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకుంది. మాంచెస్టర్: సొంతగడ్డపై ఇంగ్లండ్ ఖాతాలో మరో టెస్టు సిరీస్ చేరింది. వెస్టిండీస్ చేతిలో మొదటి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న ఇంగ్లండ్ సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. మంగళవారం ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 269 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల ఛేదనలో 2 వికెట్లకు 10 పరుగుల స్కోరుతో ఆట చివరి రోజు తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 37.1 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షై హోప్ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. ఆటపరంగా నిరాశపర్చినా.... కరోనా కష్టకాలంలో క్రికెట్ ఆడేందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానం చూరగొన్న విండీస్ చివరకు ఆ సంతృప్తితోనే వెనుదిరిగింది. విజయంపై ఎలాంటి ఆశలు లేకపోయినా చివరి రోజు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి వికెట్లు కాపాడుకునే అవకాశం విండీస్ ముందు నిలిచింది. స్వల్పంగా కురిసిన వర్షం మరోసారి జట్టుకు సహకరించేలా కనిపించింది. అయితే జట్టు బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా పట్టుదల కనబర్చలేదు. క్రిస్ వోక్స్ (5/50), స్టువర్ట్ బ్రాడ్ (4/36) చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 6 వికెట్లతో కలిపి మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన బ్రాడ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఐదో రోజు ఆరంభంలోనే బ్రాత్‌వైట్ (19)ను బ్రాడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న తర్వాత మొదలైన విండీస్ పతనం వేగంగా సాగిపోయింది. ఇది బ్రాడ్‌కు 500వ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత వోక్స్ వరుస ఓవర్లలో హోప్, బ్రూక్స్ (22)లను వెనక్కి పంపడంతో జట్టు సగం వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి ఛేజ్ (7) రనౌట్ కాగా... కెప్టెన్ హోల్డర్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. వోక్స్ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టగా... బ్లాక్‌వుడ్ (23)ను చివరి వికెట్‌గా అవుట్ చేసి బ్రాడ్ విండీస్ ఆట ముగించాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో విండీస్ గెలవగా... మాంచెస్టర్‌లో జరిగిన మిగిలిన రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ నెగ్గింది. ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ తరఫున స్టోక్స్ కాకుండా బ్రాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికవగా (ప్రత్యర్థి జట్ల కోచ్ ఈ విజేతను ఎంపిక చేస్తారు), విండీస్ తరఫున రోస్టన్ ఛేజ్కు ఈ పురస్కారం దక్కింది. విజ్డన్ సిరీస్ ట్రోఫీతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ -
సెమీస్‌లో వైశాలి ఓటమి
చెన్నై: మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి పోరాటం ముగిసింది. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ అనా ఉషెనినాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 19 ఏళ్ల వైశాలి 4.5–5.5తో ఓడిపోయింది. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను బోల్తా కొట్టించిన వైశాలి క్వార్టర్ ఫైనల్లో మున్‌జుల్ టర్ముంఖ్ (మంగోలియా)పై విజయం సాధించింది. వైశాలి మరో రెండు స్పీడ్ చెస్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఆడనుంది. -
హరికృష్ణకు నిరాశ
చెన్నై: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘ఎ’ లీగ్ దశ గేమ్‌లు ముగిశాక హరికృష్ణ మొత్తం మూడు పాయింట్లతో తన గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఆరో రౌండ్లో హరికృష్ణ 47 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమ్‌ను 67 ఎత్తుల్లో; ఎనిమిదో రౌండ్లో డానిల్ దుబోవ్ (రష్యా)తో గేమ్‌ను 36 ఎత్తుల్లో; తొమ్మిదో రౌండ్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ చివరిదైన పదో రౌండ్లో 30 ఎత్తుల్లో అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్సన్, వ్లాదిస్లావ్, నకముర, గ్రిషుక్... గ్రూప్ ‘బి’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), కరువానా (అమెరికా), లిరెన్ డింగ్ (చైనా) నాకౌట్ దశకు అర్హత సాధించారు. -
‘నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు’
లండన్: లాక్డౌన్ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలెంజ్‌లు విసురుకుంటుంటే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం కనిపించకుండా పోయిన వన్డే ప్రపంచకప్ పతకాన్ని వెతికే పనిలో పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్ పతకం దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు. తాను పాత ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిత్రపటానికి పతకాన్ని వేలాడదీశానని... అయితే కొత్త ఇంటిలో ఆ చిత్ర పటం ఉంది కానీ తన మెడల్ మాత్రం లేదన్నాడు. -
సింధు నిష్క్రమణ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈసారైనా టైటిల్ సొంతం చేసుకోవాలని ఆశించిన భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 21–12, 15–21, 13–21తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 68 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడినా... రెండో గేమ్ నుంచి తడబడింది. అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. -
మన వనిత... పరాజిత
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్‌ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్‌లో మెగాన్ షూట్, జొనాసెన్ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. మెల్బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్‌గానే ముగించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ బెత్ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్ (4/18), జొనాసెన్ (3/20) భారత ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. హీలీ విధ్వంసం... స్పిన్ బలాన్ని నమ్ముకున్న భారత్... దీప్తి శర్మతో తొలి ఓవర్ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్‌ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది. వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్లను నిలువరించడంలో భారత్ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్ 42 పరుగులే చేయగలిగింది. దీప్తి మినహా... ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో షూట్ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్ వంతు! తొలి ఓవర్ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్‌కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా, జెమీమా (0) పేలవ షాట్‌తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్ తర్వాతి ఓవర్లో డీప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ హర్మన్ కౌర్ (4) అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్), తానియా స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిచా ఘోష్ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ రెండు క్యాచ్‌లు... ఆసీస్‌లాంటి జట్టుకు ‘లైఫ్’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్ కథ ముగించారు. ►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి. ►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ►184 ఫైనల్లో ఆసీస్ స్కోరు. ఏ టి20 ప్రపంచకప్‌లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు. ►85 భారత్‌కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది. ►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 86, 174 ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్ మ్యాచ్‌కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్ మూనీ (నాటౌట్) 78; మెగ్ లానింగ్ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్ (బి) పూనమ్ 4; క్యారీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్ యాదవ్ 4–0–30–1; రాధ యాదవ్ 4–0–34–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్ 11; తానియా (రిటైర్డ్‌హర్ట్) 2; జెమీమా రోడ్రిగ్స్ (సి) క్యారీ (బి) జొనాసెన్ 0; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్ (బి) కిమిన్స్ 19; రిచా ఘోష్ (సి) క్యారీ (బి) షూట్ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్ 1; పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షూట్ 1; రాజేశ్వరి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్‌హర్ట్), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99. బౌలింగ్: మెగాన్ షూట్ 3.1–0–18–4; జొనాసెన్ 4–0–20–3; మాలినెక్స్ 4–0–21–1; కిమిన్స్ 4–0–17–1; క్యారీ 4–0–23–1. -
‘టెస్టు’ ఫెయిల్...
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత ప్రత్యర్థి చేతిలో వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు ఇప్పుడు టెస్టుల్లోనూ సున్నా చుట్టి పర్యటనను ముగించింది. సోమవారం ఇక్కడ హాగ్లీ ఓవల్ మైదానంలో ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 90/6తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే ఆలౌటైంది. బౌల్ట్ (4/28), సౌతీ (3/36) టీమిండియాను దెబ్బ తీశారు. అనంతరం కివీస్ 36 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టామ్ బ్లన్‌డెల్ (113 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లాథమ్ (74 బంతుల్లో 52; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన కైల్ జేమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా, 14 వికెట్లు తీసిన టిమ్ సౌతీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. 47 నిమిషాల్లో... మూడో రోజు భారత్ మిగిలిన 4 వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. సౌతీ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ వైపు వెళుతున్న బంతిని ఆడి విహారి (9) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా... బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో పంత్ (4) కూడా అవుటయ్యాడు. షమీ (5), బుమ్రా (4) తమ స్థాయిలోనే చేతులెత్తేయగా, జడేజా (16 నాటౌట్) మరో ఎండ్‌లో నిలబడిపోయాడు. బౌల్ట్ వేసిన ఓవర్ చివరి బంతిని జడేజా ఆడగా, సింగిల్ తీసి స్ట్రయిక్‌ను సహచరుడికే మళ్లీ ఇద్దామనే ప్రయత్నంలో బుమ్రా రనౌట్ కావడంతో భారత్ ఆట ముగిసింది. సెంచరీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ ఛేదన కాస్త కష్టంగానే సాగింది. బంతి పేసర్లకు అనూహ్యంగా స్పందిస్తూ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో పలు మార్లు బంతి కివీస్ ఓపెనర్ల శరీరానికి కూడా తగిలింది. అయితే లాథమ్, బ్లన్‌డెల్ ఇద్దరూ పట్టుదలగా నిలబడ్డారు. తప్పుడు షాట్లు ఆడకుండా జాగ్రత్త పడుతూనే చెత్త బంతి పడినప్పుడు మాత్రం వృథా చేయకుండా బౌండరీలు రాబట్టారు. 10 పరుగుల వద్ద బ్లన్‌డెల్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పంత్ వదిలేశాడు. లంచ్‌కు ముందు మూడు ఓవర్లే వేసిన షమీ గాయం కారణంగా రెండో సెషన్లో తిరిగి రాకపోవడం భారత్‌ను మరింత ఇబ్బంది పెట్టింది. విరామం తర్వాత కివీస్ ఓపెనర్లు చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 67 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఇక కివీస్‌కు 10 వికెట్ల విజయం ఖాయమనిపించిన దశలో లాథమ్‌ను అవుట్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే బుమ్రా చెలరేగి వరుస ఓవర్లలో విలియమ్సన్ (5)ను, బ్లన్డెల్లను వరుస ఓవర్లలో పెవిలియన్ పంపించాడు. అయితే టేలర్ (5 నాటౌట్), నికోల్స్ (5 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. మా బౌలర్లు ఆధిపత్యం చలాయించేందుకు కావాల్సినన్ని పరుగులు బ్యాట్స్‌మెన్ చేయలేకపోయారు. రెండు టెస్టుల్లో మా బౌలింగ్ బాగుంది. సిరీస్ తుది ఫలితం నిరాశ కలిగించింది. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం. మా ప్రణాళికలు విఫలమయ్యాయి. ఎలాంటి సాకులు వెతకడం లేదు. టాస్ గురించి ఫిర్యాదు చేయదల్చుకోలేదు. అన్ని రంగాల్లో మాపై కివీస్‌దే పైచేయి అయింది. మాకు ఏదీ అనుకూలంగా సాగలేదు. గతంలో అనేక సార్లు చూపించిన తెగువను ఈసారి ప్రదర్శించలేకపోయాం. పిచ్, వాతావరణంలాంటి అంశాల్లో మా బ్యాట్స్‌మెన్ అతిగా ఆలోచించి మనసులో ఒక రకమైన సంకోచంతో ఆడటం కూడా చేటు చేసింది. సమష్టి వైఫల్యం కాబట్టి ఏ ఒక్కరినో తప్పుపట్టడం లేదు. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ఏం మాట్లాడుతున్నావో తెలుసా? టెస్టు ముగిశాక జరిగిన మీడియా సమావేశంలో ఒక న్యూజిలాండ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కోహ్లిని ఆగ్రహానికి గురి చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ అవుటైనప్పుడు కివీస్ అభిమానులను ఉద్దేశించి కోహ్లి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా కాస్త ఆదర్శంగా వ్యవహరించాలి కదా, ఇలా ప్రవరిస్తే ఎలా అని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దాంతో చిర్రెత్తిన కోహ్లి...‘దీని గురించి నువ్వేం అనుకుంటున్నావు? నేను అడుగుతున్నదానికి జవాబు చెప్పు. అసలు మైదానంలో ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకొని ఆ తర్వాత ప్రశ్నలడుగు. సగం సమాచారంతో సగం ప్రశ్నలు అడగవద్దు. కావాలని వివాదం చేయాలనుకుంటే ఇది సరైన వేదిక కాదు. అయినా నేను రిఫరీతో మాట్లాడాను కూడా. ఆయనకు లేని బాధ నీకెందుకు?’ అని తిరుగు ప్రశ్న వేశాడు. మరోవైపు ఇదే ఘటనను విలియమ్సన్ తేలిగ్గా తీసుకున్నాడు. ‘విరాట్ మైదానంలో ఎప్పుడైనా అంతే ఆవేశంగా కనిపిస్తాడు. అది అతని స్వభావం. దీని గురించి అతిగా ఆలోచించడం అనవసరం’ అని కివీస్ కెప్టెన్ నవ్వేశాడు. గంగూలీ (2002) – కోహ్లి (2020) న్యూజిలాండ్ చేతిలో 0–2తో భారత జట్టు సిరీస్ ఓడటంలో 2002 ఓటమికి చాలా దగ్గరి పోలికలున్నాయి. అప్పుడు గంగూలీ నేతృత్వంలోనూ టీమ్ 0–2తో చిత్తయింది. ఇద్దరూ కెప్టెన్లూ ఘోరంగా విఫలమయ్యారు. కోహ్లి కెప్టెన్సీలో టెస్టుల్లో భారత్ క్లీన్‌స్వీప్‌కు గురి కావడం ఇదే తొలిసారి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 242; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) సౌతీ 14; మయాంక్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 3; పుజారా (బి) బౌల్ట్ 24; కోహ్లి (ఎల్బీ) (బి) గ్రాండ్‌హోమ్ 14; రహానే (బి) వాగ్నర్ 9; ఉమేశ్ (బి) బౌల్ట్ 1; విహారి (సి) వాట్లింగ్ (బి) సౌతీ 9; పంత్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 4; జడేజా (నాటౌట్) 16; షమీ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 5; బుమ్రా (రనౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 124. వికెట్ల పతనం: 1–8; 2–26; 3–51; 4–72; 5–84; 6–89; 7–97; 8–97; 9–108; 10–124. బౌలింగ్: సౌతీ 11–2–36–3; బౌల్ట్ 14–4–28–4; జేమీసన్ 8–4–18–0; గ్రాండ్‌హోమ్ 5–3–3–1; వాగ్నర్ 8–1–18–1. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (సి) పంత్ (బి) ఉమేశ్ 52; బ్లన్‌డెల్ (బి) బుమ్రా 55; విలియమ్సన్ (సి) రహానే (బి) బుమ్రా 5; రాస్ టేలర్ (నాటౌట్) 5; నికోల్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (36 ఓవర్లలో 3 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–103; 2–112; 3–121. బౌలింగ్: బుమ్రా 13–2–39–2; ఉమేశ్ 14–3–45–1; షమీ 3–1–11–0; జడేజా 5–0–24–0; కోహ్లి 1–0–4–0. -
క్రెడిట్ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు
న్యూఢిల్లీ/గువాహటి: రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘బ్రాంచ్ బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు. డేటా విశ్లేషణ, బిగ్ డేటా వినియోగాన్ని కోరుకుంటున్నప్పటికీ.. శాఖల స్థాయిల్లో కస్టమర్లు మీ నుంచి వ్యక్తిగత స్పందనను కోరుకుంటారు’’ అని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో గురువారం జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. ఆర్బీఐ కానీ, ప్రభుత్వం కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించాలంటూ ఎటువంటి ఆదేశాన్ని జారీ చేయలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో వ్యక్తిగత అనుసంధానత, డేటాను వినియోగించుకోవడం అవసరమన్నారు. శాఖల స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలను విని, వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలని బ్యాంకు ఉన్నతోద్యోగులకు సూచించారు. రుణ వితరణను పెంచాలి.. రుణాల పంపిణీని మరింత పెంచాలని బ్యాంకుల చీఫ్‌లను మంత్రి సీతారామన్ కోరారు. వ్యవస్థలో తగిన డిమాండ్ లేదంటూ వారు చెప్పినా.. రుణ వితరణ పెంపు దిశగా తగిన విధానాలను చేపట్టాలని ఆమె కోరడం గమనార్హం. పెట్టుబడులపై ‘సీఏఏ’ ప్రభావం ఉండదు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన హింసాత్మక చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఇటీవల తాను భేటీ అయిన ఇన్వెస్టర్లు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారన్నారు. ఇప్పటిౖMðతే కరోనా వైరస్ ప్రభావం మన దేశంపై లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడకపోతే పరిశ్రమకు చేదోడుగా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. 1.18 లక్షల రుణ దరఖాస్తులను పరిష్కరించాలి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద పెండింగ్‌లో ఉన్న 1.18 లక్షల దరఖాస్తులను మార్చి 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. రుణ సాయంతో స్వయం ఉపాధి కింద వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే పీఎంఈజీపీ పథకం ఉద్దేశ్యం. ఎంఎస్ఎంఈ రంగ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్ఎంఈ రుణాల పునరుద్ధరణపై కూడా చర్చించారు. -
భారత్‌కు తొలి ఓటమి
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో ఆదివారం జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున వివేక్ సాగర్ ప్రసాద్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (17వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టు తరఫున మాక్సిమి ప్లెనెవాక్స్ (17వ, 26వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... అలెగ్జాండర్ హెండ్రిక్స్ (3వ ని.లో) మరో గోల్ చేశాడు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ప్రొ హాకీ లీగ్‌లో రెండు రౌండ్లు ముగిశాక ప్రస్తుతం బెల్జియం 14 పాయింట్లతో అగ్రస్థానంలో, భారత్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో రౌండ్లో భాగంగా భువనేశ్వర్‌లోనే ఆస్ట్రేలియాతో భారత్ ఈనెల 21, 22 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
ఫుజౌ (చైనా): ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ... భారత యువ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు ఓటమి తప్పలేదు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ద్వయం పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 20–22తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సాత్విక్–చిరాగ్ జంటకు 9,800 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ ఆరంభంలోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇండోనేసియా ద్వయం నెమ్మదిగా తేరుకొని వరుస పాయింట్లు సాధించి విరామానికి 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత అదే ఊపులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. కీలకదశలో అనుభవజ్ఞులైన కెవిన్–గిడియోన్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఓవరాల్‌గా కెవిన్–గిడియోన్ చేతిలో భారత జంటకిది వరుసగా ఎనిమిదో ఓటమికాగా... ఈ ఏడాది మూడోది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్... గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. -
ఒక్క పరుగు తేడాతో...
నార్త్ సౌండ్: భారత మహిళల విజయ లక్ష్యం 226 పరుగులు... ఓపెనర్లు మినహా మిగతావారు విఫలం కావడంతో తక్కువ వ్యవధిలోనే జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌కు వచ్చేసరికి చేయాల్సిన పరుగులు 9 కాగా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక ఎండ్‌లో జులన్ గోస్వామి (12 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్) ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే 50వ ఓవర్ వేసిన వెస్టిండీస్ సీనియర్ స్పిన్నర్ అనీసా మొహమ్మద్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టింది. తొలి బంతికే ఏక్తా బిష్త్ (0)ను అవుట్ చేయగా, తర్వాతి నాలుగు బంతుల్లో జులన్ 7 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండగా, పూనమ్ యాదవ్ (0) అవుటయ్యింది. దాంతో తొలి వన్డేలో భారత్‌కు పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. భారత్ 50 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ప్రియా పూనియా (107 బంతుల్లో 75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, జెమీమా రోడ్రిగ్స్ (75 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 20; ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 5) విఫలమయ్యారు. అనీసాకు 5 వికెట్లు దక్కాయి. అంతకుముందు వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (91 బంతుల్లో 94; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, నటాషా మెక్లీన్ (82 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), చెడీన్ నేషన్ (55 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. -
మొబైల్ పోయిందా? కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త. తస్కరించిన ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. దొంగిలించబడిన మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బిఎస్ఎన్ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల, రీగ్రామింగ్‌తో సహా భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) దీన్ని చేపట్టింది.కోల్పోయిన లేదా కొట్టేసిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అన్ని నెట్ వర్క్‌లలో బ్లాక్ చేయడం, మొబైల్ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నిరోధించడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇతర ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్సెట్లను గుర్తించడానికి అనుమతిస్తుంది. ఫోన్ పోతే ఫిర్యాదు ఎలా చేయాలి మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా అది ఎవరైనా దొంగిలించినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్‌లైన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్)కి తెలియజేయాలి. దీంతో సత్త్వరమే డాట్ మీ ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో దీన్ని ఉపయోగించడం కుదరదు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్‌కు సహకరిస్తాయి. -
ఓటమిపై స్పందించిన సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి వామపక్షేతర శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చిందని.. ఈ క్రమంలోనే అది విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘డబ్బును భారీ స్థాయిలో పంచి బీజేపీ అనైతిక రాజకీయాలను ప్రదర్శించింది. సీపీఎం, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధించింది. అయినప్పటికీ వామపక్ష పార్టీ 45 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అందుకు త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో కూడా స్పందించారు. త్రిపుర ఓటర్లు బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, 25 ఏళ్లుగా తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రశ్నించటం మాత్రం తాము ఆపబోమని.. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. Tripura voters have given their mandate for a BJP-IPTF government in the state. We thank the people of Tripura for giving us the opportunity to serve them for the past 25 years. We will continue to oppose BJP and its divisive agenda not only in Tripura but all over India. (1/n) — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 The Polit Bureau thanks the 45 per cent of the voters who extended support to the CPI(M) and the Left Front. The Party will carefully examine the reasons for this electoral setback and take necessary remedial measures. Full text: https://t.co/wjdhdqGrpU pic.twitter.com/BlDjCj81QS — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 -
అప్రమత్తమైన వసుంధరా రాజే
సాక్షి, జైపూర్ : ఉప ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తమయ్యారు. తన కుర్చీకే ఎసరుపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఆమె నేతృత్వంలో పార్టీ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. ‘‘ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. అందుకే అప్రమత్తమయ్యాం. అభివృద్ధి పనులు జరుగుతున్నా ఇంత దారుణమైన ఫలితం ఎందుకొచ్చిందో సమీక్షించబోతున్నాం’’ అని సమావేశానికి ముందు ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు ఉన్న ఆమె నేపథ్యంలో సమావేశంలో నేతలకు ధైర్యాన్ని నూరిపోసినట్లు సమాచారం. ఓటమి గురించి వదిలేయండి. అధైర్య పడవద్దు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే కావాలి అని నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సీఎం వసుంధర రాజేతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 1న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలను, మండల్‌గఢ్ శాసన సభ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీఎం వసుంధరా రాజే రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. -
రోహిత్ అట్టర్ ఫ్లాప్.. కోహ్లి స్పందన ఇది
ప్రోటీస్ జట్టుతో మొదటి టెస్ట్ ఘోర పరాజయం తర్వాత టీమిండియా టీం వైఫల్యంపై విశ్లేషణలు, విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా గతంలో సఫారీ గడ్డపై రాణించిన అజింక్య రహానేను పక్కనబెట్టి స్థానంలో రోహిత్ శర్మను తీసుకోవటం అన్న అంశం మీదే అవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. పేస్ మైదానంపై చెలరేగిపోయే రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతి కష్టం మీద 21 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఆ నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. రోహిత్‌ను ఎంపిక చేయటానికి కారణాలు వివరించాడు. ‘‘తాను ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ బాగానే స్కోర్ చేశాడు. శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేం అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకం కూడా. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్ చేసింది. కానీ, విఫలం అయ్యాం’’ అని కోహ్లి వివరించాడు. మరో వైపు సౌతాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ కూడా భారత జట్టులో బుమ్రా, రోహిత్ శర్మల ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. -
సీఎం అభ్యర్ధి ధుమాల్ ఓటమి
-
చంద్రబాబు ఓడిపోయారు..!
-
బోపన్న జంట పరాజయం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. జొకోవిచ్–విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జంటతో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 6–2, 3–6, 7–10 తేడాతో ఓడిపోయింది. చెరో సెట్ గెల్చుకున్నాక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంట 4–2తో ఆధిక్యంలోకి వెళ్లినా చివరికి 7–10తో ఓటమి పాలైంది. -
పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కొండమల్లేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, తమ పంట పొలాలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించడంతో పాటు రైతులకు పూర్తిగా రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రాపోలు జయప్రకాశ్, రమావత్ జగన్‌లాల్‌నాయక్, ఉట్కూరి వేమన్‌రెడ్డి, తేరా సత్యనారాయణరెడ్డి, యూనుస్, వెంకటేష్, శంకర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న డబ్బు అప్పగింత
సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఎస్సైలు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు కురవి : ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధ రైతు పోగొట్టుకున్న డబ్బును పోలీసులు తిరిగి అప్పగించారు. ముగ్గురు ఎస్సైలు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడు చేజార్చుకున్న నగదును ఆయనకు అందజేసి సేవా దృ క్పథాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై టి.అశోక్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలంలోని గుండెపూడికి చెందిన వృద్ధ రైతు బింగి అయిలయ్య పల్లి విత్తనాలను కొనుగోలు చేసుకునేందుకు ఉదయం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వెళ్లాడు. ఈ మేరకు ఆయన ఇంటి నుంచి రూ.30 వేల నగదును తీసుకెళ్లాడు. అయితే సూర్యాపేటలో పల్లి విత్తనాలు దొరకకపోవడంతో సాయంత్రం డబ్బులను పంచెలో పెట్టుకుని ఇంటికి బయలుదేరేందుకు సూర్యాపేటలో మానుకోట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ సందర్భంగా అయిలయ్య మరిపెడ మండలంలోని బుర్హా¯ŒSపురంలో దిగేందుకు టికెట్ తీసుకున్నాడు. సాయంత్రం బస్సు బుర్హా¯ŒSపురం గ్రామానికి చేరుకోవడంతో ఆయన బస్సు దిగాడు. అనంతరం తన పంచెలో పెట్టుకున్న డబ్బులను చూసుకోగా కనిపించలేదు. దీంతో లబోదిబోమంటుండగా.. గమనించిన బుర్హా¯ŒSపురం గ్రామస్తులు వెంటనే మరి పెడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమం లో ఎస్సైలు నరేష్, నందీప్ స్థానిక బస్టాండ్ వద్ద బస్సుల్లో తనిఖీ చేశారు. కాగా, సూర్యాపేట నుంచి వచ్చిన బస్సు కురవి వైపునకు వెళ్లిందని తెలుసుకుని వారు అక్కడి ఎస్సై అశోక్‌కు సమాచారం అందజేశారు. వెంటనే ఆయన కురవి గుడి సెంటర్లో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న బస్సులను నిలిపివేసి తనిఖీ చేయగా అయిలయ్య కూర్చున్న సీటు కింద రూ.30 వేలు దొరికాయి. దీంతో దొరికిన డబ్బులను ఆయన బాధితుడికి అందజేశారు. కాగా, తాను పోగొట్టుకున్న డబ్బులను తిరిగి అప్పగించేందుకు కృషి చేసిన ఎస్సైల కు అయిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
వెన్ను విరిగిన కుటుంబం..!
జీవచ్ఛవంలా ఇంటి యజమాని –రెండు కాళ్లు సచ్చుబడడంతో మంచానికే పరిమితం –వైద్యానికి లక్షల రూపాయల ఖర్చు –భార్యపై కుటుంబ భారం –దీనస్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అసలే పేదరికం. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి. వచ్చిన కొద్దిపాటి సంపాదనతో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇంటి యజమాని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆ ఘటనలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్షల రూపాయలు అప్పు తెచ్చి రెండు కాళ్లకు ఆపరేషన్ చేయించారు. అయినా దురదృష్టం వెంటాడింది. ఇన్ఫెక్షన్ రావడంతో రెండు కాళ్లు సచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు.. మిర్యాలగూడకు చెందిన చిలుకూరి ప్రభాకర్. నాటి నుంచి కుటుంబ భారాన్ని మోస్తున్న అతని భార్య శ్రావణి దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది. మిర్యాలగూడ టౌన్ : దేవరకొండకు చెందిన చిలుకూరి ప్రభాకర్‌ది నిరుపేద కుటుంబం. బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్ల క్రితం మిర్యాలగూడకు వలస వచ్చాడు. స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉంటూ టైలర్ పని చేసుకుంటున్నాడు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014లో బైక్‌పై నల్లగొండ నుంచి మిర్యాలగూడకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి రెండు కాళ్లు విరిగిపోయాయి. రూ. 2.60లక్షలు అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించారు. కానీ, ఇన్స్ఫెక్షన్ వచ్చి రెండు కాళ్లు సచ్చుబడిపోయాయి. దీంతో వృత్తి పని చేయలేక ఉపాధి కోల్పోయి కుటుంబ గడవడమే కష్టంగా మారింది. నాటి నుంచి కుటుంబ భారం అతని భార్య శ్రావణిపై పడింది. భర్తకు కాళ్లు సచ్చుబడడంతో పాటు ఇతర జబ్బులు కూడా సోకడంతో వైద్యులను సంప్రదించగా రూ.5లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. కుమారుడిని కూడా చదివించలేదని దీన స్థితి. ఇరుగుపొరుగు వారు చేసే సాయంతో వీరి కుటుంబం గడుస్తోంది. అన్నీ తానై... జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తన భర్త ప్రభాకర్‌కు సపర్యలన్నీ భార్యే చేస్తోంది. స్నానం చేయించడం, మల విసర్జన, మూత్రానికి తీసుకెళ్తుంది. నా భర్తను చూస్తే కడుపు తరుక్కుపోతుంది –చిలుకూరి శ్రావణి(ప్రభాకర్ భార్య) జీవచ్ఛవంలా ఉన్న తన భర్తను చూస్తే కడుపుతరుక్కుపోతుంది. ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పులు తెచ్చాం. మళ్లీ అప్పు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సాయం చేస్తే నా భర్తను బాగు చేయించుకుంటా. సాయం చేయాలనుకునే వారు బాధిత కుటుంబ సభ్యుల సెల్ నంబర్ 9908758598, ‘సాక్షి’ కార్యాలయం : 9705348038, 9705346232లో సంప్రదించవచ్చు. బ్యాంక్ అకౌంట్ నంబర్ 62289649001, ఎస్బీహెచ్, మిర్యాలగూడ -
ఆటో పరిశ్రమకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఢిల్లీలో భారీ డీజిల్ వాహనాల నిషేధంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిషేధాన్ని విధించాయంటోంది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్య వాహనాల నిషేధంతో ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయిందని సియామ్ ఆరోపిస్తోంది. ఈ నిషేధం మూలంగా గత 8 నెలల్లో రూ .4,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అశోక్ లేలాండ్ ఎండీ, సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) యొక్క 58 వ వార్షిక సమావేశాలలో మాట్లాడిన దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు. వాతారణ కాలుష్యానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండా ఆటో పరిశ్రమను నియంత్రించాలని ప్రతివారూ చూస్తున్నారని విమ్శించారు. మీడియా సృష్టించిన హైప్, తప్పుడు సమాచారాన్ని ఆధారంగా కోర్టులు నిషేధం విధించాయన్నారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాహనాలపై నిషేధం విధించడం సరికాదన్నారు. దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 50 శాతం తమదేనని, ముప్పయి మిలియన్ల ఉద్యోగాలను ఆటో పరిశ్రమ కల్పిస్తోందని ఇందుకు చాలా గర్వంగాఉందని దాసరి పేర్కొన్నారు.కానీ ఎక్కడ కాలుష్య ఉన్నా.. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఆటో పరిశ్రమనే తప్పుపడుతున్నారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం పొల్యూషన్ నియంత్రించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని దాసరి వ్యాఖ్యానించారు. పర్యావరణ సెస్ 1 శాతం విధింపు మూలంగా 2000 సీసీ పైన డీజిల్ వాహనాలను ప్రజలుకొనడం మానేస్తారా? దాని వలన ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గిపోతుందనా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆటో పరిశ్రమకు సవాల్ లాంటిదని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆటో పరిశ్రమ తిరిగి తమ ఇమేజ్ పునర్నిర్మాణానికి కలిసి పని చేయాల్సి అవసరం ఉందని దాసరి పిలుపునిచ్చారు. -
భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు
వజ్రకరూరు: కమలపాడు గ్రామంలో మంగళవారం రాత్రి కు రిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలా లు కోతకు గురికావడంతోపాటు పైపొలాల్లోని మట్టి మొత్తం కింది పొలాల్లోకి చేరుకోవడంతో పంటలన్నీ పూడుకుపోయాయి. పంచాయతీ పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన విత్తనాలన్నీ కొట్టుకుపోయాయని వారు వాపోయారు. మిరప, కంది, పత్తి పం టల్లో కూడా వర్షపునీరు నిలబడటంతో పంటలు దెబ్బతి న్నాయి. అదే విధంగా మండలంలోని వజ్రకరూరు, బోడిసానిపల్లి గ్రామాల్లో కూడా భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. -
ఫోన్ పోయిందా? గూగుల్ లో వెతకండి!
మీ ఫోన్ పోగొట్టుకున్నారా? ఎవరైనా దొంగిలించారా? ఇకపై ఫోన్ ఆచూకీ తెలుసుకోవడానికి కష్టపడాల్సిన పని లేదంటోంది ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకోసం 'ఫైండ్ యువర్ ఫోన్' పేరున కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ సదుపాయంతో వినియోగదారులు కేవలం గూగుల్ సెర్స్ లో 'ఐ లాస్ట్ మై ఫోన్' అని టైప్ చేసి ప్రత్యేక సర్వీసును పొందొచ్చని సంస్థ వెల్లడించింది. గూగుల్ మై అకౌంట్ లో ఉండే ఫైండ్ యువర్ ఫోన్ ఫీచర్... ఐఫోన్ పోగొట్టుకున్నవారికి సహాయపడుతుందని, అయితే ఇంతకు ముందే 'యాపిల్ ఐ క్లౌడ్' లో ఉన్న 'ఫైండ్ మై ఐ ఫోన్' కు ఉన్న సామర్థ్యం ఈ 'ఫైండ్ యువర్ ఫోన్' లో లేదని గూగుల్ చెప్తోంది. తాము కొత్తగా ప్రవేశ పెట్టే ఫైండ్ యువర్ ఫోన్ వినియోగించుకోవాలనుకున్నవారు గూగుల్ ఖాతాలో సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ యాండ్రాయిడ్, ఐ ఫోన్, టాబ్లెట్ల జాబితా తో పాటు.. పోయిన ఫోన్ మీ సొంతం అయితే 'ఫైండ్ అండ్ లాక్' ఆప్షన్ చూపిస్తుందని దాంతో మీ ఫోన్ లాక్ చేసి అనంతరం వెతికేందుకు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాల్సి ఉంటుందని గూగుల్ చెప్తోంది. కాగా ఈ ఫీచర్ జీ మెయిల్, గూగుల్ ఫోటో వినియోగదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే..యాండ్రాయిడ్ వినియోగదారులకు కూడ అవే ఐదు ఆప్షన్లు కనిపిస్తాయని, వారు మాత్రం లాక్ స్క్రీన్ పాస్ వర్డ్ సెట్ చేసుకున్నట్లే ముందుగానే ఫోన్లో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చని, అలా కాని పద్ధతిలో ఫోన్ పోయిన తర్వాత కూడ ఫోన్ కు నోట్ పంపే అవకాశం ఉందని చెప్తోంది. ఫోన్ కు పేజ్ నుంచి కాల్ చేయడం వల్ల కూడ యాండ్రాయిడ్ ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందంటోంది. దీంతోపాటు గూగుల్ మై అకౌంట్ లోకి వెళ్ళేందుకు లేటెస్ట్ వర్షన్స్ లో వాయిస్ ఆప్షన్ ను కూడ చేర్చింది. దీంతో మీకు కావలసిన ఆప్షన్ ను మాటలతోనే ఎంచుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఆప్షన్ ను ముందుగా ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రవేశ పెట్టామని, దీంతో ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడాల్సి వస్తుందని తెలిపింది. త్వరలో మిగిలిన భాష్లో కూడ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది. దీంతోపాటు గూగుల్ వినియోగదారులు త్వరలో తమ పేరును చెప్పి షార్ట్ కట్ ద్వారా అకౌంట్ లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడ అందుబాటులోకి తేనుంది. -
పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!
మానసిక అనారోగ్యంతో కొన్ని వేల సంవత్సరాల పని శక్తిని కోల్పోతాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మానసిక అనారోగ్యం వల్ల వచ్చే 2030 సంవత్సరం నాటికి సుమారు 12 బిలియన్ల పనిరోజులు లేదా 50 మిలియన్ సంవత్సరాల పని వృధా అయిపోతుందని డబ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, ఆత్రుత వంటి లక్షణాలకు చికిత్స అందించడంలో వైఫల్యం చెందితే సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక ఉత్పాదకతలో 925 బిలియన్ డాలర్ల ఖరీదైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. సాధారణ మానసిక అనారోగ్య చికిత్సకోసం పెట్టుబడి, ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు పై ప్రపంచంలోనే మొదటిసారి విశ్లేషణ జరిపిన సంస్థ తన పరిశోధనా వివరాలను ల్యాన్సెట్ సైకియాట్రీ లో ప్రచురించింది. మానసిక ఒత్తిడి అనారోగ్యాల చికిత్సకు వెచ్చించే ఒక డాలర్... ఆరోగ్యంతోపాటు తిరిగి 4 డాలర్ల ఖరీదైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యాలకు చికిత్స అందించడం పై దృష్టి పెట్టకపోవడం, ఓ మానవ తప్పిదంగానూ, పిసినారితనంగానూ కనిపిస్తోందని, అన్ని దేశాలు మానసిక ఆరోగ్య సేవలపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం సగటున మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది. వచ్చే 15 సంవత్సరాల్లో కౌన్సెలింగ్, యాంటీ డిప్రెషన్ మందులకోసం 147 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే... 399 బిలియన్ డాలర్ల ఖరీదైన కార్మిక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మంది అంటే సుమారు 740 మిలియన్లమంది ఇప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులోనూ సాధారణ మానసిక అనారోగ్యం క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఆందోళన, వ్యాకులత దాదాపు సగం పెరిగింది. అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు వల్ల వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, 20 శాతం ప్రజలు అటువంటి సంఘటనలవల్లే ఒత్తిడికి గురౌతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. ఇది ఓ ప్రజారోగ్య సమస్య కాదని, అభివృద్ధి సమస్యగా గుర్తించాలని, నిరాశ, ఆత్రుత వంటి వాటికి చికిత్సను అందిస్తే... అది ఆర్థిక అభివృద్ధికి మంచి అర్థాన్ని తెస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
రూపాయి పరుగుకు బ్రేక్
ముంబై: వరుసగా రెండు వారాలు బలపడిన రూపాయి మంగళవారం నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్(ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 25 పైసలు బలహీనపడి రూ.66.46 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యం... బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఏర్పడిన డిమాండ్ రూపాయి తాజా బలహీనతకు కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. గడచిన రెండు వారాల్లో రూపాయి 50 పైసలు (0.75 శాతం) లాభపడింది. -
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న జోడి ఓటమి
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జి (రొమేనియా) జోడి ఓటమిపాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ బోపన్న-మెర్జి 4-6, 6-1, 5-10తో ఐదోసీడ్ ఇటాలియన్ ద్వయం ఫోగ్నిని-సైమన్ బోల్లెలి చేతిలో ఓడారు. దీంతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న బోపన్న ద్వయం... యాష్ / స్మిత్ గ్రూప్‌లో రెండో స్థానానికి పరిమితంకాగా, ఫోగ్నిని- బోల్లెలి జంట అగ్రస్థానంలో నిలిచింది.