చెన్నై: మహిళల స్పీడ్ చెస్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి పోరాటం ముగిసింది. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ అనా ఉషెనినాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 19 ఏళ్ల వైశాలి 4.5–5.5తో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను బోల్తా కొట్టించిన వైశాలి క్వార్టర్ ఫైనల్లో మున్‌జుల్ టర్ముంఖ్ (మంగోలియా)పై విజయం సాధించింది. వైశాలి మరో రెండు స్పీడ్ చెస్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment