Vaishali
-
‘పరాయి స్త్రీలను తాకను’.. ఇంత పొగరు పనికిరాదు!
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో(Tata Steel Chess Tournament) ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ యకుబొయేవ్(Nodirbek Yakubboev) వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలి(R Vaishali)తో గేమ్ సందర్భంగా నొదిర్బెక్ ఆమెతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.క్షమించండిఈ నేపథ్యంలో నొదిర్బెక్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచలేదని.. తన వల్ల తెలిసోతెలియకో పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరాడు. అయినప్పటికీ అతడి వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇంత పొగరు పనికిరాదుద్వంద్వ ప్రమాణాలు పాటించే వారు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరంటూ నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రౌండ్లో ఆర్.వైశాలితో నొదిర్బెక్ ముఖాముఖి తలపడ్డాడు. అయితే, ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్బెక్.. గేమ్ ఆరంభం కావడానికి ముందు కర్టెసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాచగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్లుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు.విజయం తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదుఇక ఈ గేమ్‌లో నొదిర్‌బెక్‌పై వైశాలి గెలుపొందింది. గేమ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. నొదిర్బెక్ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.పరాయి స్త్రీలను తాకను‘‘ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. క్షమించండి. నాకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తాను.పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. 2023లో దివ్యతో నేను పొరపాటుగా అలా వ్యవహరించాను. ఈరోజు గేమ్ ఆడేటపుడు నా ప్రత్యర్థి బుల్మాగాకు ముందే చెప్పాను.షేక్ హ్యాండ్ నాకు ఇష్టం ఉండదని. తను అందుకు అంగీకరించింది. అయితే, కొంతమంది మర్యాదపూర్వక పలకరింపునకు చిహ్నంగా నమస్తే అయినా చెప్పాలని కోరారు. ఏదేమైనా.. దివ్య, వైశాలిలతో గేమ్‌లకే ముందే నేను మహిళలతో షేక్ హ్యాండ్‌కు విరుద్ధం అని చెప్పి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు’’ అని నొదిర్బెక్ వివరణ ఇచ్చాడు. కాగా అంతకుముందు మరో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్యతో గేమ్‌కు ముందు ఆమె ముంజేయికి ముంజేయి తాకించి.. విష్ చేశాడు. ఇక చెన్నైకి చెందిన చెస్ సంచలనం ఆర్.ప్రజ్ఞానందకు తోడబుట్టిన అక్క వైశాలి అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ప్రస్తుతం టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు.. 23 ఏళ్ల నొదిర్బెక్ 2019లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందగా.. 23 ఏళ్ల వైశాలి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా ఇటీవలే చరిత్ర సృష్టించింది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా?A renowned Uzbek chess Grandmaster, Nodirbek, refused to shake hands with India's Women's Grandmaster Vaishali.Does religion influence sports? However, he was seen shaking hands with other female players earlier. pic.twitter.com/fGR61wvwUP— Ayushh (@ayushh_it_is) January 27, 2025 -
వారెవ్వా వైశాలి
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టోర్నీ తొలి రోజు మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ దశలో 11 గేమ్‌లలో కలిపి ఆమె మొత్తం 9.5 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. 8 గేమ్‌లు గెలిచిన వైశాలి 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. తొలి నాలుగు గేమ్‌లను వరుసగా గెలుచుకొని 23 ఏళ్ల వైశాలి శుభారంభం చేసింది. ఐదో గేమ్‌లో ఆమెకు రష్యాకు చెందిన మాజీ బ్లిట్జ్ వరల్డ్ చాంపియన్ కేటరీనా లాగ్నోతో గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీ సమరం తర్వాత ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఆ తర్వాత వైశాలి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో గేమ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ఎనిమిదో రౌండ్లో ప్రస్తుత వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ వలెంటినా గునీనా (రష్యా)పై గెలవడం ఆమె ముందంజ వేయడంలో కీలకంగా మారింది. 9వ రౌండ్‌ను ‘డ్రా’గా ముగించుకున్న అనంతరం పదో గేమ్‌లో పొలినా షువలోవా (రష్యా)ను ఓడించడంతో వైశాలికి అగ్ర స్థానం ఖాయమైంది. దాంతో అమెరికాకు చెందిన కారిసా ఇప్తో జరిగిన 11వ గేమ్‌ను చకచకా 9 ఎత్తుల్లోనే ‘డ్రా’ చేసుకొని వైశాలి క్వాలిఫయింగ్ దశలో నంబర్‌వన్‌గా నిలిచింది. మొత్తం 8 మంది ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్) దశకు అర్హత సాధించారు. క్వార్టర్ ఫైనల్లో జూ జినర్ (చైనా)తో వైశాలి తలపడుతుంది. మరోవైపు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి నాకౌట్‌కు చేరలేకపోయింది. 11 రౌండ్ల తర్వాత మొత్తం 8 పాయింట్లతో ఆమె 9వ స్థానంతో ముగించింది. 8 గేమ్‌లను గెలిచిన హంపి...మరో 3 గేమ్‌లలో పరాజయం పాలైంది. ఎనిమిదో రౌండ్లో మరో భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చేతిలో అనూహ్యంగా ఓడటం హంపి అవకాశాలను దెబ్బ తీసింది. ఇతర భారత క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్ (7 పాయింట్లు) 18వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ (7 పాయింట్లు) 19వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక (7 పాయింట్లు) 22వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక (5 పాయింట్లు) 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ (5 పాయింట్లు) 71వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి (4.5 పాయింట్లు) 76వ ర్యాంక్‌లో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరిస్తారు. అర్జున్‌కు నిరాశ... పురుషుల (ఓపెన్) విభాగంలో భారత ఆటగాళ్లలో ఎవరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మొత్తం 13 రౌండ్ల తర్వాత భారత్ నుంచి అత్యుత్తమంగా ఆర్.ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 23వ స్థానంతో ముగించగా, రౌనక్ సాధ్వానికి 35వ స్థానం (8 పాయింట్లు) దక్కింది. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి 7 పాయింట్లు మాత్రమే సాధించి 64వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 5 గేమ్‌లలో గెలిచి అగ్రస్థానంతో ముందుకు దూసుకుపోయిన అర్జున్‌కు ఆ తర్వాత అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. తర్వాతి 5 రౌండ్లలో 2 ఓడి, 2 ‘డ్రా’ చేసుకున్న అతను ఒకటే గేమ్ గెలవగలిగాడు. ఆఖరి 3 రౌండ్లలో వరుసగా అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డెనిస్ లజావిక్ (రష్యా), కజీబెక్ నొగర్బెక్ (కజకిస్తాన్)ల చేతుల్లో ఓడటంతో రేసులో అర్జున్ పూర్తిగా వెనుకబడిపోయాడు. -
ఓ గూటికి చేరిన చెదిరిన అక్షరం
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్‌లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్‌లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్‌లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్‌లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది. ‘‘నా బాల్యంలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.బాధపెట్టిన బాల్యంనాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.అద్దెలేని హాస్టల్ గదిలో..ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్‌లెస్ పుస్తకం.కోపగించుకున్నా.. కుటుంబ మద్దతుఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.సమాజంలో మార్పుకుఅనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి. -
‘‘ఫస్ట్ లవ్’ పాటలోనే కథ చూపించారు – ఎస్ఎస్ తమన్
‘‘ఫస్ట్ లవ్’ టైటిల్ సాంగ్ మ్యూజిక్ వీడియో చాలా అందంగా ఉంది. ఈ పాటలోనే ఒక అద్భుతమైన కథ చూపించారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. దీపు జాను హీరోగా బాలరాజు ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. వైశాలీ రాజ్ హీరోయిన్గా నటించి, నిర్మించారు. సంజీవ్ .టి సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ (‘ఫస్ట్ లవ్’) లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లవ్’ పాటలు వినగానే ‘వైశాలి, ఖుషి’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. మధు పొన్నాస్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘చాలా కష్టపడి ప్రేమతో ‘ఫస్ట్ లవ్..’ పాట చేశాం’’ అన్నారు. ‘‘అందరూ సెలబ్రేట్ చేసుకునే స్పెషల్ ఆల్బమ్ ఇది’’ అన్నారు బాలరాజు ఎం. -
ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ప్రజ్ఞానంద... ప్రపంచ మూడో ర్యాంకర్‌పై వైశాలి సంచలన విజయాలు
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు, తోబుట్టువులైన ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్’ గేమ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), భారత స్టార్ కోనేరు హంపి మధ్య క్లాసికల్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించగా జు వెన్జున్ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
వైశాలి విజయం... హంపి పరాజయం
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. నాలుగో రౌండ్ గేమ్‌లో వైశాలి 54 ఎత్తుల్లో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత వైశాలి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నంబర్‌వన్ కోనేరు హంపి 55 ఎత్తుల్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో 65 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
వైశాలి చేతిలో హంపి ఓటమి
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్ గేమ్‌లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్ అర్మగెడాన్ గేమ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్ లిరెన్ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. -
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్‌నుంచి తప్పుకుంది. మహిళల చెస్‌ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్‌ప్రి సిరీస్‌ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
హంపి, వైశాలి విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో పోటీపడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి 11వ రౌండ్లో విజయం సాధించారు. సలీమోవా నుర్గుయెల్ (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో హంపి 90 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 70 ఎత్తుల్లో గెలిచారు. ఈ టోర్నీలోకి హంపికిది రెండో విజయంకాగా, వైశాలి ఖాతాలో మూడో గెలుపు చేరింది. 11వ రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఓపెన్ విభాగంలో 11వ రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌లకు ఓటమి ఎదురుకాగా, దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో, విదిత్ 67 ఎత్తుల్లో నిపోమ్‌నిషి (రష్యా) చేతిలో పరాజయం పాలయ్యారు. గుకేశ్, కరువానా (అమెరికా) గేమ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. 11వ రౌండ్ తర్వాత గుకేశ్ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 5వ స్థానంలో, విదిత్ 5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
Vaishali Shroff: సజీవ ప్రపంచంలోకి...
వైశాలి ష్రాఫ్ చేతిలో మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం అడవులను బడులకు రప్పించగలదు. అలనాటి రాక్షస బల్లులతో ఈనాటి పిల్లలను మాట్లాడించగలదు. ఆ మంత్రదండం పేరు కలం. ముంబైకి చెందిన వైశాలి ష్రాఫ్ పర్యావరణ సంబంధిత విషయాలపై పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఎన్నో పుస్తకాలు రాసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకుంది... నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్(సిఎన్పీ)కి వెళ్లి వచ్చిన తరువాత వైశాలికి ‘సీతాస్ చిత్వాన్’ అనే పుస్తకం రాయడం ప్రారంభించింది. ఈ పార్క్‌కు వెళ్లడానికి ముందు తన కుటుంబంతో కలిసి మన దేశంలోని ఎన్నో జాతీయ పార్క్‌లను చూసింది వైశాలి. ఏ పార్క్‌కు వెళ్లినా అందులోని జీవవైవిధ్యం తనకు బాగా నచ్చేది. సాలె పురుగుల నుంచి పెద్ద పిల్లుల వరకు ఏనుగుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే చెట్ల వరకు తనను అమితంగా ఆకట్టుకునేవి. ‘ప్రకృతిని కాపాడుకుంటేనే బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు’ అనే సత్యాన్ని పిల్లలకు బోధ పరచడానికి ‘సీతాస్ చిత్వాన్’ పుస్తకం రాసింది. ‘పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే అడవులను తద్వారా రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. అడవి ఒక పాఠశాల. సహనంతోనూ, సాహసోపేతంగా ఉండడాన్ని నేర్పుతుంది. జీవరాశుల పట్ల సానుభూతి కలిగి ఉండడాన్ని నేర్పుతుంది’ అని ‘సీతస్ చిత్వాన్’ ద్వారా చెబుతుంది వైశాలి. ప్రాపంచిక, పర్యావరణానికి సంబంధించిన విషయాల గురించి తగిన సమాచారంతో ఫిక్షన్ ఫార్మట్‌లో చెప్పడం వైశాలికి ఇష్టం. ఈ ఫార్మట్‌లో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆకట్టుకునే క్యారెక్టర్లను సృష్టించింది. పిల్లలు పుస్తకంలోని పాత్రలతో కనెక్ట్ కావడమే కాకుండా పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు. తన బామ్మ నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకుంది వైశాలి. వైశాలి స్కూల్ రోజుల్లో... తన బామ్మ ఒక మూలన కుర్చీలో కూర్చుని ఏదో ఒక పుస్తకం సీరియస్‌గా చదువుతూ కనిపించేది. బామ్మను అనుకరిస్తూ వైశాలి కూడా ఏదో కథల పుస్తకం చదువుతూ కూర్చునేది. మధ్య మధ్యలో బామ్మను ఆసక్తిగా చూసేది. ఈ అనుకరణ కాస్తా ఆ తరువాత పుస్తకాలు చదివే అలవాటుగా మారింది. ఆ అలవాటే తనని పిల్లల రచయిత్రిని చేసింది. ‘ఫిక్షన్, నాన్ ఫిక్షన్లలో నాన్ ఫిక్షన్ రాయడమే కష్టం. నాన్ ఫిక్షన్ పుస్తకాల కోసం బోలెడు సమాచార సేకరణ చేయాల్సి ఉంటుంది’ అంటుంది వైశాలి. మన దేశంలోని రాక్షస బల్లుల గురించి సాధికారమైన సమాచారంతో ఆమె రాసిన ‘బ్లూథింగోసారస్’ నాన్–ఫిక్షన్ పుస్తకానికి ఎంతో మంచి స్పందన వచ్చింది. వివిధ రకాల వ్యక్తీకరణల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ కావడానికి భాషలు వీలు కల్పిస్తాయి. వైశాలి తాజా పుస్తకం ‘తాతుంగ్ తతుంగ్ అండ్ అదర్ అమేజింగ్ స్టోరీస్’ పుస్తకం భారతీయ భాషల విస్తృతి, లోతు గురించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మాతృభాషల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. గుహ గోడలపై ఉన్న చిత్రలిపి నుంచి పురాతన, సమకాలీన స్థానిక భాషలకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి. ‘తాతుంగ్ తతుంగ్... మన దేశపు అద్భుతమైన భాషా సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది. భాషలు, వాటి గొప్ప వారసత్వాలు కనుమరుగు కాకూడదని హెచ్చరిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు తమ మాతృభాష పట్ల మరింత అభిమానం పెరుగుతుంది’ అంటారు రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్. ‘భిన్నమైన విషయాల గురించి భిన్నమైన పద్ధతుల్లో రాయడం ఇష్టం’ అంటున్న వైశాలి ష్రాఫ్ పిల్లల కోసం మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశిద్దాం. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్‌తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్‌ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
కథని నమ్మి చేశారనిపిస్తోంది
‘‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. ఈ చిత్రంతో తనకు మంచి సక్సెస్ రావాలి. టీజర్, ట్రైలర్ చూస్తే కథని నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తోంది. టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్నాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. అభినవ్ గోమఠం, వైశాలి రాజ్ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కాసుల క్రియేటివ్ వర్క్స్‌పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, మూవీ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు తొలి అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు తిరుపతి రావు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు భవాని కాసుల. -
‘గ్రాండ్‌మాస్టర్’ వైశాలి
చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్‌మాస్టర్’ హోదాను అందుకుంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రిగాట్ ఓపెన్ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతో గ్రాండ్‌మాస్టర్ ఖాయమైంది. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్‌నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్‌లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్‌బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్ చెస్ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో వైశాలి అండర్–12, అండర్–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది. 2018లో ఆమె ఉమన్ గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్ మెమోరియల్ టోరీ్నలో రెండో జీఎం నార్మ్ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్ మాస్టర్స్‌లో మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు క్వాలిఫయింగ్‌గా పరిగణించే క్యాండిడేట్స్ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు. దాంతో ‘క్యాండిడేట్స్’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్‌నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు. -
‘దర్భంగా ఎక్స్‌ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్లో చేర్చారు. రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్‌పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
భారత చెస్ చరిత్రలో గొప్ప క్షణాలు.. ఒకేసారి రెండు అద్భుత విజయాలు
Isle of Man- Vidit Gujrathi, Vaishali R claim titles: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్. వైశాలి, విదిత్ గుజరాతి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విదిత్ గుజరాతి ఓపెన్ చాంపియన్‌గా అవతరించగా.. ఆర్.వైశాలి మహిళా విభాగంలో టైటిల్ విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన వేళ చెస్ టోర్నీలో వీరిద్దరు డబుల్ ధమాకా అందించారు. అదే విధంగా ఈ విజయంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు వైశాలి, విదిత్. అక్కడా సత్తా చాటి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫై కావాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా స్విస్ టోర్నీలో ర్యాంకింగ్స్‌లో తమకంటే ఎంతో మెరుగ్గా ఉన్న ప్లేయర్లను ఓడించి మరీ వైశాలి, విదిత్ ఈ మేరకు విజయం అందుకోవడం విశేషం. ఓపెన్ టోర్నీలో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన విదిత్.. ఫిబియానో కరువానా, హికరు నకమురా, అలీరెజా ఫిరౌజాలతో పాటు భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్, ప్రజ్ఞానందలతో పోటీపడి విజేతగా నిలిచాడు. మరోవైపు.. మహిళల విభాగంలో 12వ సీడ్‌గా పోటీకి దిగిన వైశాలి.. ఫైనల్ రౌండ్లో పెద్దగా పోరాడాల్సిన పనిలేకుండానే బత్కుయాగ్ మోంగోటుల్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా చెన్నైకి చెందిన రమేశ్‌బాబు వైశాలి.. ప్రఖ్యాత చెస్ ప్లేయర్, సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఆర్. ప్రజ్ఞానంద అక్క అన్న విషయం తెలిసిందే. ఇక ఫిడే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. తాజాగా వైశాలి సైతం క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! -
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం
ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్‌చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్‌తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
జనాభాను నియంత్రించలేం
పాట్నా: జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు. గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తప్పుపపట్టారు. బిహార్ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి! -
మన్నెగూడ కిడ్నాప్: నవీన్ రెడ్డి వీడియోపై వైశాలి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్‌సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్‌తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్‌రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి. ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో -
యువతి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డి రిమాండ్‌కు తరలింపు
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మొబైల్ లోకేషన్ ఆధారంగా గోవాలోని బీచ్‌లో అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తరలించారు. సరూర్ నగర్ ఓస్‌ఓటీ కార్యాలయంలో నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ జరిగిన డిసెంబర్9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్ రెడ్డి గోవా పారిపోయాడు. నవీన్‌రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్‌రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్‌రెడ్డిన రిమాండ్‌కు తరలించాం. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న రూమన్, పవన్‌ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా నవీన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్‌తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
రంగారెడ్డి యువతి కిడ్నాప్ కేసు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్ 9న కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. సాక్షి చేతికి అందిన వైశాలి కేసు రిమాండ్ రిపోర్టులో.. ‘గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో ఇద్దరి మధ్య పరిచయం. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరుచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేశాడు. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మధ్యలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. వైశాలి ఇంటి వద్ద దాడికి పాల్పడుతున్న నవీన్ గ్యాంగ్ వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. అయిదు నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాడిలో ధ్వంసమైన ఇంట్లోని సామాగ్రి వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్‌లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్‌రెడ్డి, రుమాన్, చందూ, సిద్ధూ, సాయినాథ్, భాను ప్రకాష్‌తో కలిసి వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్ వేశారు. వైశాలితోపాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు. చదవండి: ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం డిసెంబర్ 9వ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఇంటి వద్ద పార్క్ చేసిన అయిదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంటిపై దాడి చేసి వస్తువులను సీసీటీవీ కెమెరాలను నాశనం చేశారు. డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారు. అనంతరం నల్గొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగి పారిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్ వోల్పో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చారు. కిడ్నాప్ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తండ్రికి కాల్ చేసి చెప్పింది. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. నిందితులను 5 రోజుల కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ3 భాను ప్రకాశ్, ఏ4 సాయినాథ్, ఏ8 ప్రసాద్, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్‌ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. -
క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు
రంగారెడ్డి : తనను కిడ్నాప్ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది. కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్ హామీ ఇచి్చనట్లు తెలిసింది. నవీన్‌రెడ్డి కారు లభ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్ 07 హెచ్ఎక్స్ 2111) వదిలేశారు. పార్కింగ్ చేసి, లాక్ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 2019లో వరంగల్ ఇంతియార్‌గంజ్ పీఎస్ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ చేసినవే: వైశాలి
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి వైశాలి స్టేట్మెంట్ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. ఏడాదిగా నవీన్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె. పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి అంటోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో రోజూ హంగామా చేసేవాడట నవీన్. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. అయితే.. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. సంబంధిత వార్త: వైశాలిని ఇప్పటికీ కూడా అంగీకరిస్తా! -
నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదు : వైశాలి
-
యువతి కిడ్నాప్ కేసు.. ‘హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు, కొరికారు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్‌కు గురైన యువతి వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్ రెడ్డితో తనకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్ తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు. నాకు నవీన్ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్‌ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు. నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్తోనా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్‌గా ఉంటుందని నవీన్ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని నవీన్‌రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు. మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు. అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేశారు. చదవండి: టెక్కీ భర్త నిర్వాకం.. స్నేహితులతో పడుకోవాలని భార్యను బలవంతం -
వైశాలి ఎందుకిలా చేసిందో!.. నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలి-నవీన్‌రెడ్డికి చెందిన వాళ్లు.. ఎవరి వెర్షన్లో వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం నవీన్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది. రెండేళ్లుగా వైశాలి-నవీన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది.. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది. ‘‘నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్‌ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నారాయణమ్మ. ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్ అండ్ డౌన్ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నవీన్‌రెడ్డి చెప్పాడు. అయితే.. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారంలాంటిదేం నడవలేదని వైశాలి కుటుంబం చెబుతోంది. నవీన్‌రెడ్డి ప్రేమ పేరుతో వైశాలిని వేధించాడని చెబుతోంది. ఈ తరుణంలో అన్ని విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదీ చదవండి: మన్నెగూడ కిడ్నాప్ ఘటన.. వైశాలి కుటుంబానికి భద్రత కల్పించండి -
జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది దుర్మరణం
పాట్నా: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. నయా గావ్ టోలి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భూయాన్ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వచినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాజిపూర్లోన సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు సహాయంగా అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు -
బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. వరద నీటిలో వీరోచిత పోరాటం
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల ప్రజలు చిక్కుకుని గల్లంతైన ఘటనలు చూశాము. తాజాగా మరో ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో భారీ వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగింది. కాగా, వరద నీటి ప్రవాహంలో ఓ ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదిన ఘటన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడే ట్విస్టు ఏంటంటే.. పీకల్లోతు మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉండటమే. అయితే, ఏనుగుతో సహా మావటివాడు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద కారణంగా గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు. ఈ క్రమంలో తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో ఎన్నో కష్టాలకు ఓడ్చి.. సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూసి.. ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. స్పందించిన నెటిజన్లు ఏనుగు ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Watch - पटना से लगे राघोपुर में गंगा नदी में हाथी के साथ महावत VIDEO VIRAL, हाथी ने पानी में तैरकर 3 किलोमीटर की दूरी तय करके बचाई खुद की और महावत की जान।#Patna #Elephant #GangaRiver #Raghopur #ViralVideo pic.twitter.com/ubOHASv1r5 — Nedrick News (@nedricknews) July 13, 2022 ఇది కూడా చదవండి: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు -
చైనాకు చెక్..ఇంజినీర్ వైశాలి
‘తొలి మహిళ’ అనే మాట బాగా పాతబడిపోయిన భావనగా అనిపించవచ్చు. ‘అది ఇది ఏమని అన్ని రంగముల’ మహిళలు తమ ప్రతిభా ప్రావీణ్యాలను నిరూపించుకుంటూ రావడం ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. అంతమాత్రాన తొలి మహిళ కావడం ఘనత కాకుండా పోదు. తాజాగా వైశాలి హివాసే అనే మహిళ ఇండో–చైనా సరిహద్దులో భారత సైన్యం నిర్మించబోతున్న వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుకు కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు! ఒక మహిళ ఇలాంటి విధులను చేపట్టనుండడం భారత ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆర్మీ విభాగమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజొనీరుగా పని చేస్తున్న వైశాలికి ఇండియన్ ఆర్మీ ఈ ‘కఠినతరమైన’ పనిని అప్పగించడానికి కారణం గతంలో వైశాలి కార్గిల్ సెక్టార్లో ఇంజినీరుగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడమే. ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో).. భారత సైన్యానికి ఎంత కీలకమైనదో, బీఆర్వోలో పని చేసే ఇంజినీర్ల బాధ్యతలు అంత ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని వార్థా ప్రాంతానికి చెందిన వైశాలి ఎం.టెక్ చదివి ఇటువైపు వచ్చారు. సరిహద్దుల్లో శత్రుదేశాలను వెనక్కు తరిమేందుకు, మిత్రదేశాలకు అవసరమైన సాధన సంపత్తిని అందచేసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు శత్రు దుర్భేద్యంగా దారులను నిర్మించడం బీఆర్వో ప్రధాన విధి. ఇప్పుడు వైశాలీ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉండబోతున్నది శత్రుదేశం చొరబాట్లను నియంత్రించే దారిని నిర్మించే ప్రాజెక్టుకే! గత ఏడాది లడఖ్ సెక్టార్లో భారత్–చైనా ఘర్షణల మధ్య కూడా బీఆర్వో సిబ్బంది శత్రువును కట్టడి చేసే పైకి కనిపించని మార్గాలను, సొరంగాలను నిర్మిస్తూనే ఉన్నారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్లో వైశాలి నేతృత్వంలోని ఇంజినీర్లు, నిర్మాణ కార్మికులు అక్కడి గండశిలల్ని పెకిలించి, భూభాగాలను తొలిచి.. భారత సైన్యం మాటువేసి శత్రువును తరిమికొట్టడానికి వీలుగా పోరాట మార్గాలను నిర్మించబోతున్నారు. అంత ఎత్తులో పని చేసేవారికి ఆక్సిజన్ సరిగా అందదు. తవ్వకాల్లో దుమ్మూధూళీ పైకి లేస్తుంది. డ్రిల్లింగ్ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లో హోరెత్తుతుంటాయి. సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. మధ్యలో కన్స్ట్రక్షన్ ప్లాన్‌ని మార్చవలసి రావచ్చు. వీటన్నిటినీ వైశాలే దగ్గరుండి పరిష్కరించాలి. ఇప్పటికే అక్కడికి రెండు ‘ఎయిర్–మెయిన్‌టైన్డ్ డిటాచ్మెంట్స్’ (అత్యవసర సేవల బృందాలు) చేరుకున్నాయి. ఇక వైశాలి వెళ్లి పనిని మొదలు పెట్టించడమే. శత్రువు ఆట కట్టించేందుకు ‘షార్ట్‌కట్’ మార్గాలను కనిపెట్టి, ‘పోరు దారులను’ నిర్మించడమే. ∙∙ బీఆర్వో ప్రస్తుతం లడఖ్, జమ్ము–కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మక దారుల్ని నిర్మిస్తోంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న 66 ప్రాంతాలలో ఇలాంటి దారుల్ని 2022 డిసెంబరు నాటికి నిర్మించాలన్న ధ్యేయంతో పని చేస్తోంది. కమాండింగ్ ఆఫీసర్ గా వైశాలి ఇప్పుడు ఎలాగూ కొండల్ని పిండి చేయిస్తారు కనుక తర్వాతి బాధ్యతల్లో కొన్నింటినైనా ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ‘తొలి మహిళ’ అనే మాట పాతబడి పోయినట్లనిపిస్తోందా?! -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
సెమీస్‌లో వైశాలి ఓటమి
చెన్నై: మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి పోరాటం ముగిసింది. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ అనా ఉషెనినాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 19 ఏళ్ల వైశాలి 4.5–5.5తో ఓడిపోయింది. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను బోల్తా కొట్టించిన వైశాలి క్వార్టర్ ఫైనల్లో మున్‌జుల్ టర్ముంఖ్ (మంగోలియా)పై విజయం సాధించింది. వైశాలి మరో రెండు స్పీడ్ చెస్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఆడనుంది. -
రైతు గొంతుక
వైశాలి సుధాకర్ ఎడె 28 ఏళ్ల యువతి. మహారాష్ట్ర మహిళ. రైతుల కోసం గళమెత్తిన రైతు భార్య. యావత్మల్– వాశిమ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నేల తల్లి బిడ్డ. ‘ఫైట్ ఫర్ కాజ్’ అంటూ ఎన్నికల బరిలో దిగిన ధీశాలి గురించి... ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన సందర్భంగా చెప్పుకోవలసిన విశేషాలు చాలానే ఉన్నాయి. వైశాలిది యావత్మల్ జిల్లాలోని రాజూర్ గ్రామం. అది విదర్భ రీజియన్‌లో ఉంది. ఏ శాపం పీడిస్తుందో తెలియదు కానీ అక్కడి మహిళల్లో ఎక్కువ మంది భర్తను భూమాతకు అప్పగించి ఒంటరిగా బతుకీడుస్తున్నవాళ్లే. పుట్టెడు ధాన్యమిచ్చి బతుకును పండించాల్సిన భూమి తల్లి.. బతుకును బలి కోరుతుంటే ఆపగలిగిన శక్తి ఎవరికుంటుంది? ‘అంతా విధి రాత’ అని నుదురు కొట్టుకుంటూ బీడు వారిన భూమిలో భర్త వదిలి వెళ్లిన వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మహిళలే కనిపిస్తారు... అక్కడ ఎటు చూసినా. దాదాపు రెండు దశాబ్దాలుగా రైతుల ఆత్మహత్యలతో అతలాకుతలమై పోయింది యావత్మల్ జిల్లా. సరాసరిన రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు! అలాంటి క్లిష్టమైన సమయంలోనే వైశాలికి పెళ్లయింది. సినిమా కథలాగ పెళ్లితో సుఖాంతం అయిన జీవితం కాదామెది. తన జీవితం కష్టాల కడలిగా మారిందని పెళ్లి తర్వాతే తెలిసిందామెకి. కొండంత అప్పు ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో 92వ మరాఠీ లిటరరీ మీట్ ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్’ జరిగింది. జనవరి 11వ తేదీన మొదలైన మూడు రోజుల సదస్సును ప్రారంభించడానికి వైశాలికి ఒక ఆదర్శ మహిళగా ఆహ్వానం వచ్చింది. సదస్సులో ఆమె ప్రసంగం ఇలా సాగింది.‘‘మా సొంతూరు దోంగార్ ఖర్దా. మా తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. నాకు పద్దెనిమిదేళ్లకు పెళ్లయింది. టెన్త్ క్లాస్ చదివానంతే. అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మొత్తం పద్నాలుగు మంది ఉండేవారు. తొమ్మిదెకరాల పొలం ఉంది. రైతు కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టడం నా అదృష్టం అని మురిసిపోయారు మా అమ్మానాన్న. మా అత్తగారింట్లో అందరూ పొలం పనులు చేసేవాళ్లు. నా భర్త కూడా వ్యవసాయం చేసేవాడు. పెళ్లయిన ఏడాదికి బాబు పుట్టాడు. వ్యవసాయం యేటికేడాది కష్టంగా మారిపోయింది. పత్తి, చెరకు పంటలు చేతికి రాలేదు. వరుసగా రెండేళ్లు పంట దిగుబడి లేదు. పంటలు వేయడానికి తెచ్చిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. బ్యాంకు అప్పు అలాగే ఉంది. రెండోసారి షావుకారు నుంచి అప్పు తెచ్చి పంట వేశారు. వడ్డీతో కలుపుకుని అప్పు పెరిగిపోతోంది. షావుకారు నుంచి ఒత్తిడి కూడా పెరిగింది. ఇంట్లో అందరి ముఖాల్లో ఒకటే దిగులు. బాబు పుట్టిన తర్వాత రెండేళ్లకు.. అంటే 2011లో నాకు మళ్లీ గర్భం వచ్చింది. నేను మా పుట్టింటికి వెళ్లాను. ఓ రోజు మా వారు నన్ను చూడడానికి మా పుట్టింటికి వచ్చారు. ఆ ఏడాది కూడా పంట వస్తుందన్న ఆశలేదని బాధగా చెప్పాడు. కానీ ఆ రోజు నాతో చాలా బాగున్నాడు. బాబు జాగ్రత్త, అని నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని మళ్లీ మళ్లీ చెప్పి ఊరికెళ్లాడు. ఆ మరుసటి రోజే వినరాని వార్త... ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని వైశాలి మాట్లాడుతుంటే.. సాహిత్య సదస్సుకు హాజరైన అతిథుల గుండె బరువెక్కింది. ప్రాంగణం అంతా నిశ్శబ్దం ఆవరించింది. భర్త పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో బతుకు పోరాటం చేస్తున్న ఒక యోధను చూస్తున్నారు వాళ్లంతా. ఆమె ప్రసంగం పూర్తి కాగానే సభికులంతా కన్నీళ్లు తుడుచుకుంటూ చప్పట్లతో ఆమెను అభినందించారు. భర్త అప్పగించిన బాధ్యత ఇరవై రెండేళ్లలోపే భర్త పోయాడు. ఇద్దరు పిల్లలను (కునాల్, జాహ్నవి) పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత కళ్ల ముందు కనిపిస్తోంది వైశాలికి. అంతకంటే ముందు మా అప్పు సంగతేంటని షావుకారు మనుషులు వచ్చి గుర్తు చేసి పోతున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే ప్రభుత్వం సహాయంగా ఇచ్చే లక్షరూపాయలను అప్పులోకి జమ చేసింది. అయినా తీరలేదు, ఇంకా మిగిలే ఉన్నాయి. తన బంగారు అమ్మేసి మిగిలిన అప్పులు తీర్చింది. టైలరింగ్ నేర్చుకుంది. పంటలు లేక పేదరికం తాండవిస్తున్న ఊర్లో ఎంత మంది కొత్త దుస్తులు కుట్టించుకోగలుగుతారు, పగలు రాత్రి కష్టపడాలని వైశాలికి ఉన్నా చేతి నిండా పని దొరకడమూ కష్టమే. ఆ ఊరికి అంగన్వాడీ సెంటర్ వచ్చింది. 2013లో అంగన్వాడీ వర్కర్‌గా చేరింది. అప్పట్లో నెలకు రెండు వేలిచ్చేవాళ్లు. ఇప్పుడు మూడున్నర వేలు చేశారు. బతుకు బండి అయితే ఎలాగోలా సాగిపోతోంది. అంగన్వాడీ సెంటర్ చూసుకుంటూ, తన పిల్లలను పోషించడంతోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలకు మాట సాయం చేయడం, వాళ్లను గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళ్లి రావాల్సిన డబ్బు ఇప్పించడం వంటి సహాయం చేస్తోంది వైశాలి. ఆ చుట్టు పక్కల గ్రామాలకు ఆమె ఒక రోల్ మోడల్‌గా మారింది. ఆమెకి సాహిత్య సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానం కూడా అప్పుడే వచ్చింది. ఆ ప్రసంగం అంతా ఆమె పదేళ్ల జీవితమే. పద్దెనిమిదేళ్లకు పెళ్లయితే ఇరవై ఎనిమిదేళ్ల లోపు ఆమె పడిన కష్టాలే ఆమె ప్రసంగం. ఎదురీదుతూ నిలిచిన తీరే ఆమెలో రగులుతున్న స్ఫూర్తికి నిదర్శనం. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కష్టాలే అనుభవాలు ఓ రోజు ప్రహర్ జన్‌శక్తి పక్ష (పి.జె.పి.) అధ్యక్షుడు ఓమ్ ప్రకాశ్ బాబారావ్, మరికొందరు నాయకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చారు. యావత్మల్ వాశిమ్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయమని వాళ్ల ప్రతిపాదన. ఆమె మొదట ఆశ్చర్యపోయింది. ‘‘నాకు రాజకీయాలు తెలియవు, పంచాయితీ సర్పంచ్ కాదు కదా కనీసం వార్డు మెంబర్‌గా కూడా చేయలేదు. ఏకంగా లోక్‌సభ సభ్యత్వానికి పోటీ చేయమంటున్నారు’’ అని సందేహం వ్యక్తం చేసిందామె. ‘‘మన కష్టాలే మన అనుభవాలు. అంతకంటే పెద్ద పాఠం ఏముంటుంది నేర్చుకోవడానికి’’ అని ఒప్పించారామెని బాబారావు. ‘‘ప్రజలకు రైతుల కష్టాలను విడమరిచి చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. రైతుల అవసరాలను తీర్చడానికి ఉద్యమించాల్సిన రాజకీయ పార్టీలు ఆ పని చేయకపోతే మనలాంటి సామాన్యులే ఉద్యమిస్తారని రాజకీయ పార్టీలకు తెలియాలి’’ అని ప్రోత్సహించారాయన. ‘రైతు కుటుంబంలో పెరిగిన వాళ్లకు రైతుల స్థితిగతులు, రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఎదురయ్యే దుర్భరమైన పరిస్థితుల గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు. వాటినే చట్టసభలో మాట్లాడాలి. ఇందుకు నాకున్న అనుభవం నా జీవితమే. రైతుల కష్టాలను పెద్ద సభలు గుర్తించి పరిష్కరించడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా పోరాటంలో నేను విజయవంతమవుతాను’ అని తన తొలి ఎన్నికల సభలో అన్నారు వైశాలి. ఓటర్లే విరాళాలిచ్చారు వైశాలి ఎన్నికల ప్రచారం మార్చి 28వ తేదీన మొదలైంది. బస్సు, ఆటో రిక్షా, కాలి నడకన గ్రామాలను చుట్టేస్తోంది. గ్రామసభల్లో మాట్లాడుతోంది. ‘‘నాకు అవకాశం వస్తే... రైతుల ఆత్మహత్యలకు కారణాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని, అందుకోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరతాను. చట్టం వచ్చే వరకు పోరాడతాను’’ అని భరోసా ఇస్తోంది. భర్తను కోల్పోయిన మహిళలతోపాటు అనేక రైతు కుటుంబాలు కూడా వైశాలికి మద్దతిచ్చాయి. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమె ఎన్నికల ఖర్చు కోసం విరాళాలిచ్చారు. రూపాయి నుంచి యాభై వేల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. రూపాయి, ఐదు, పది రూపాయలు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత విరాళాల డబ్బాలో వేశారు. దుబాయ్ నుంచి ఒక దాత ఐదు వేలిచ్చాడు. నాసిక్ నుంచి రైతులు యాభై ఒక్క వేల రూపాయలు సమీకరించి, ఆ మొత్తాన్ని పంపించారు. షోలాపూర్ నుంచి ఒక రైతు పది బస్తాల ధాన్యం, గోధుమలు ఇచ్చాడు. గుజరాత్ నుంచి ఇంకో రైతు ప్రహర్ జన్‌శక్తి పక్ష పార్టీ ఆఫీసుకు ఫోన్ చేసి వైశాలి బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని నగదు జమ చేశాడు. అలా మొత్తం ఐదు లక్షల రూపాయలు సమాకూరాయి. మీడియా వెతుక్కుంటూ వచ్చింది వైశాలి తన ప్రచారంలో ఎప్పుడూ మీడియా సహాయం కోరలేదు. గ్రామాలు తిరుగుతూ రైతు కుటుంబాలను కలవడమే తప్ప మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వనే లేదు. అలాగని మీడియా మిన్నకుండిపోలేదు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటారో వెతికి పట్టుకునే పనిలో పడింది. స్థానిక, జాతీయ మీడియా సంస్థలు ఆమె ప్రచారంలో ఉంటే ఎప్పుడు ఏ గ్రామంలో దొరుకుతారో తెలుసుకుని మరీ ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయి. వాళ్లకు ఆమె చెప్పిన మాట ఒకటే... ‘‘2001 నుంచి ఇప్పటి వరకు యావత్మల్ జిల్లాలో 4,265 మంది, వాసిమ్ జిల్లాలో 1,523 మంది రైతులు మరణించారు. మరణించిన వాళ్లకు లక్ష పరిహారం ఇవ్వడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోతుందా? మన వ్యవసాయ దేశంలో రైతు జాతికి అన్నం పెట్టాలి తప్ప రైతు అన్నం లేక చచ్చిపోకూడదు. మేము పోరాడుతున్నాం, ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతామా లేదా అనేది కాదు. మా పోరాటం ఒక మంచి సామాజిక అవసరం కోసం. ఆ అవసరాన్ని దేశం గుర్తించే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేము విజయం సాధిస్తాం. మా పోరాటం పార్లమెంటు స్థానం కాదు, ఒక సామాజిక అవసరత’’ అని! కొత్త నాయకత్వానికి స్వాగతం యావత్మల్– వాశిమ్ సిట్టింగ్ ఎంపీ శివసేన అభ్యర్థి భావనా గవాలి. ఆమె 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాణిక్ రావు ఠాక్రే. ఇద్దరూ కుంబి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 19 లక్షల ఓటర్లుండగా వారిలో ఆరు లక్షలకు పైగా ఓటర్లు కుంబి సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే గతంలో శివసేన ఆ సామాజిక వర్గం నుంచి భావనా గవాలిని నిలబెట్టి రెండుసార్లు గెలిపించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి కుంబి సామాజికవర్గంలోని ఉపవర్గం మీద దృష్టి పెట్టింది. కుంబిలోని తిరాలే ఉపవర్గానికి చెందిన ఠాక్రేకి టికెట్ ఇచ్చింది. ఎందుకంటే భావన గవాలి కుంబిలోని ఘటోలే ఉపవర్గానికి చెందిన వ్యక్తి. ఆ ఉపవర్గానికంటే తిరాలే ఉపవర్గం వాళ్లే ఎక్కువ. గతంలో కాంగ్రెస్ ఆ స్థానం నుంచి శివాజీ రావు మోఘేను నిలబెట్టింది. అతడు కుంబి కులస్థుడు కాదు. దాంతో కుంబి సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా భావనకు పడ్డాయి. ఇప్పుడు కుంబిలో ఉన్న రెండు ఉపవర్గాలతో కొత్త సమీకరణకు తెర తీసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాన పార్టీలు ఇలా కుల సమీకరణల లెక్క చూసుకుంటున్నాయి తప్ప రైతుల సమస్యలను, ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు. ఒక నాయకుడు విఫలమైనప్పుడే సమాజం మరో నాయకుడిని స్వాగతిస్తుంది. అది మరోసారి ఇప్పుడు వైశాలి విషయంలో నిజమైంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో 61.07 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రజలు రైతు పక్షాన ఉన్నారా లేక కుల సమీకరణల వ్యూహాల్లో కొట్టుమిట్టాడుతున్నారా? ఈ సందేహానికి సమాధానం... మే నెల 23 మాత్రమే చెప్పగలుగుతుంది. – వాకా మంజులారెడ్డి మాకు మేమే ఓడిపోతాననే భయం లేదు. పోరాడుతున్నాను, పోరాడడానికి ధైర్యం ఉంది. ఎవరి కష్టం వాళ్లకే బాగా తెలుస్తుంది. మా కష్టం ఏమిటో, అదెంత తీవ్రంగా ఉంటుందో మాకంటే బాగా మరెవ్వరూ చెప్పలేరు. చెప్పడానికి ఎవరైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చినా... నేలలో గింజలు వేసి అవి మొలకెత్తకపోతే మనసు ఎంత తల్లడిల్లుతుందో డబ్బున్న పెద్ద పెద్ద వాళ్లకెవ్వరికీ అర్థం కాదు. మొలకెత్తిన మొక్క వెన్ను తీయకుండా వడలిపోతే ఊపిరాడక ఛాతీ ఎలా పట్టేస్తుందో వాళ్లకు అనుభవంలోకి వచ్చి ఉండదు. నీళ్లు లేక ఎండిన భూమి నెర్రలు బారుతుంటే మా గుండెలు నిలువునా చీలిపోతాయి, విచ్చిన పత్తి రాలిపోయి నేల పగుళ్లలోకి జారిపోతుంటే అరచేతులు అడ్డు పెట్టి ఆపుదామన్నంత ఆర్తి కలుగుతుంది. బతుకంతా తోడుగా ఉంటాడనుకున్న భర్త... ప్రకృతి మాత పెట్టిన పరీక్షలో ఓడిపోతే... ఇల్లాలు పడే ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ఆ కష్టాన్ని అనుభవించిన మాకు మాత్రమే ఆ కష్టాన్ని చెప్పడానికి మాటలు వస్తాయి. చట్టసభలో దేశమంతటికీ వినిపించేలా చెప్పగలిగిన స్వరం మా గొంతులకే ఉంటుంది. అందుకే ఈ పోరాటం. రైతుల శక్తి ఏమిటో దేశానికి చాటుతాం. వైశాలి ఎడె, యావత్మల్– వాశిమ్ లోక్‌సభ అభ్యర్థి, ప్రహర్ జన్‌శక్తి పక్ష పార్టీ యావత్మల్– వాశిమ్ లోక్‌సభ స్థానంలో శివసేన– కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. జనతాదళ్ (ఎస్), రాష్ట్రీయ బహుజన్ కాంగ్రెస్‌పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ, వాంఛిత్ బహుజన్ ఆఘాదీ, బహుజన్ ముక్తి పార్టీ, సన్మాన్ రాజ్కీయ పక్ష, బహుజన్ సమాజ్ పార్టీ, ప్రహార్ జన్‌శక్తి పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు. -
వైశాలి యెడే అనే నేను..
‘నేను రైతుల గొంతుకనవుతా. వ్యవసాయ సంక్షోభం మిగిల్చిన వితంతువుల వెతలను పార్లమెంట్లో చర్చకు పెడతా. నన్ను ఆదరించండి. గెలిపించండి..’ అంటూ 28 ఏళ్ల వైశాలి యెడే మహారాష్ట్రలోని యవత్మాల్ – వషిమ్ నియోజకవర్గమంతటా కలియదిరుగుతోంది. ఆమె ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన వితంతువు. కూలీ. అంగన్వాడీ కార్మికురాలు. వ్యవసాయ నష్టాలను తట్టుకోలేక 2011లో ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రహర్ జన్‌శక్తి పక్ష అనే స్థానిక రాజకీయ పార్టీ తరఫున వైశాలి ఎన్నికల బరిలోకి దిగింది. అమరావతి జిల్లా అచల్పూర్ నియోజకవర్గానికి చెందిన 48 ఏళ్ల ఓం ప్రకాశ్ కడు అనే స్వతంత్ర ఎమ్మెల్యే ఈ పార్టీ స్థాపించారు. 2017లో ప్రహర్ పార్టీ దక్షిణ యవత్మాల్లోని పందర్కౌడ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టికరిపించి 19 సీట్లకు 17 సీట్లు సంపాదించుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు వైశాలి ప్రచారానికి విరాళాలు అందిస్తున్నట్టు ఓంప్రకాశ్ చెబుతున్నారు. రంగస్థలంపై.. 2009లో 18 ఏళ్ల వయసప్పుడు వైశాలి సుధాకర్ యెడేను పెళ్లాడింది. ఆయన మూడెకరాల భూమిలో పత్తి, సోయా పండించేవాడు. పంట చేతికి రాకపోవడం, అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటికి వైశాలి వయసు 20. ఇద్దరు పిల్లల తల్లి. భర్త మరణానంతరం వైశాలి సామాజిక కార్యకలాపాల్లోకి అడుగుపెట్టింది. నాగపూర్ నాటక రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్యామ్ పెత్కర్ వ్యవసాయ వితంతువులపై రూపొందించిన నాటకంలో తనలాంటి బాధితులతో కలసి నటించింది. గత జనవరిలో యవత్మాల్ సాహిత్య సదస్సును ప్రారంభించడం ద్వారా ఆమె మరింత గుర్తింపు పొందింది. వైశాలి ఉదయం కూలీకి పోతుంది. మధ్యాహ్నం రాజ్పూర్ గ్రామ అంగన్వాడీలో పని చేస్తుంది. సాయంత్రానికల్లా కుట్టు మిషన్ ఎక్కుతుంది. ఇంతా కష్టపడితే నెలకు ఆమెకు లభించే ఆదాయం రూ.7–8 వేలు. నేను గెలిస్తే.. 17.5 లక్షల మంది ఓటర్లు వున్న యవత్మాల్ – వషిమ్లో ఈ నెల 11న ఎన్నిక జరగబోతోంది. తనను గెలిపిస్తే, పంటలకు గిట్టుబాటు ధరలు, మహిళా వ్యవసాయ కూలీలకు న్యాయసమ్మతమైన వేతనాలు, వితంతు కుటుంబాల వెతలు సహా పేదల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీలిస్తోంది. -
పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి
పట్నా: బీహార్‌లోని హాజీపూర్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువజామున 3.52 గంటల సమయంలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. అజ్మీర్‌నుంచి జైపూర్ జంక్షన్ వైపు వెళ్తుండగా ఇంజన్ పట్టాలు తప్పి బోల్తా పడిందని సంగనేర్ పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ - 06158 221645, హజీపూర్ - 06224 272230, బరౌని- 06279 232222. Rescue and relief operations are on for derailment of 9 coaches of Jogbani-Anand Vihar Terminal Seemanchal express at Sahadai Buzurg, Bihar. Help lines: Sonpur 06158221645 Hajipur 06224272230 Barauni 06279232222 — Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 3, 2019 -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్‌టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
వైశాలికి రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో విద్యా వినయలయ స్కూల్ విద్యార్థి వైశాలి అద్భుత ప్రదర్శన కనబరిచింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వైశాలి రెండు స్వర్ణాలను గెలుచుకుంది. అండర్–16 బాలికల ఫ్లోర్, బీమ్ ఈవెంట్లలో వైశాలి విజేతగా నిలిచింది. ఫ్లోర్, బీమ్ ఈవెంట్లలో ఆమని (చిరెక్), ఆశ్రిత (సుచిత్ర అకాడమీ) వరుసగా రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. వాల్ట్ కేటగిరీలో ఆమని పసిడిని కైవసం చేసుకోగా, జీవీ ఆశ్రిత రజతాన్ని గెలుచుకుంది. ఎం. ధన్యతా రెడ్డి (గాడియం స్కూల్), పి. వైశాలి కాంస్యాలను అందుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి ఎస్. సోమేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీబీఆర్ పాలక అధికారి జి. రవీందర్, మాజీ కార్యదర్శి ఎం. బాలరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి బి. బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–6 బాలికలు: 1. వైష్ణవి (హోవర్డ్), 2. జనని (క్రెమన్ మాంటిస్సోరి), ఆర్యరావు (బిర్లా ఓపెన్ మైండ్స్). అండర్–8 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. అనయ (ఇండస్), 2. అనన్య (పుల్లెల గోపీచంద్ అకాడమీ), 3. ఇషా (ఫ్యూచర్ కిడ్స్); బాలురు: 1. కృష్ణ (శ్రీహనుమాన్ వ్యాయామశాల), 2. అహాన్ (చిరెక్), 3. ఆకాశ్ (సుజాత స్కూల్). అండర్–10 బాలికల బీమ్ ఈవెంట్: 1. సిరిరెడ్డి (రోజరీ కాన్వెంట్), 2. నిధి (నాసర్ స్కూల్), 3. తన్వి (ఓక్రిడ్జ్). అండర్–10 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. సిరి రెడ్డి (రోజరీ కాన్వెంట్), 2. మెహర్ (పుల్లెల గోపీచంద్), 3. నిధి (నాసర్ స్కూల్); బాలురు: 1. శ్రీకర్ (బ్రాహ్మణ్ టాలెంట్ స్కూల్), 2. కె. సాయి కిరణ్ (బల్విన్ హైస్కూల్), 3. శ్రీకర్ కుమార్ (ఓబుల్ రెడ్డి స్కూల్). అండర్–10 బాలుర వాల్ట్: 1. శ్రీకర్ (బ్రాహ్మణ్ టాలెంట్ స్కూల్), వివియానా అగర్వాల్ (చిరెక్), 3. కె. మోనిశ్ (సెయింట్ జోసెఫ్). అండర్–12 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. ప్రణవి భారతీయ (డీపీఎస్), 2. వేద (చిరెక్), 3. క్రుతిక (గాడియం స్కూల్); వాల్ట్ ఈవెంట్: 1. దివేషి (చిరెక్), 2. క్షేత్ర (ఇండస్), 3. రేహా రెడ్డి (రాక్వెల్ స్కూల్); బీమ్: 1. హర్షిత (ప్రభుత్వ పాఠశాల), 2. విష్ణుప్రియ (సెయింట్ జోసెఫ్), 3. ప్రణవి (డీపీఎస్). అండర్–12 బాలుర ఫ్లోర్ ఈవెంట్: 1. సాయి అనీశ్ (గేట్‌వే ఇంటర్నేషనల్ స్కూల్), 2. సంతోష్ గౌడ్ (సెయింట్ మేరీస్), 3. గౌరీశంకర్ (హెచ్‌పీఎస్). అండర్–14 బాలికల ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. సీహెచ్ గీతా రాజ్, 2. అభిష్ట, 3. ఉన్నతి; బీమ్: 1. గీతా రాజ్ (సెయింట్ ఆండ్రూస్), 2. అభిష్ట (ఫ్యూచర్ కిడ్స్), 3. ఉన్నతి (ప్రభుత్వ బాలికల పాఠశాల); అండర్–14 బాలుర ఫ్లోర్: 1. దీపక్ గౌడ్ (సెయింట్ మేరీస్), 2. ఆదిత్య (కృష్ణవేణి టాలెంట్ స్కూల్). 3. రాఘవ్ (రాకెల్‌ఫోర్డ్). అండర్–18 బాలుర ఫ్లోర్: 1. రిత్విక్ మిశ్రా (గుడ్‌విల్), 2. పవన్ లాల్ (శ్రీమేధ), 3. బాలాజీ (శ్రీ సాయిరాం స్కూల్); వాల్ట్: 1. పీతాంబర్ (శ్రీమేధ), 2. రిత్విక్ మిశ్రా (గుడ్‌విల్), 3. బాలాజి (శ్రీ సాయిరాం). -
రోప్ లేకుండా రిస్కీ ఫైట్స్
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా, వైశాలి, కిమయా హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘దివ్యమణి’. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జులై 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథనానికి స్టైలిష్ స్క్రీన్‌ప్లే జోడించి తెరకెక్కించాం. బ్యాంకాక్, పటాయా వంటి ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్యారలెల్ కిక్ మరియు నాన్ చాక్‌తో టేబుల్ టెన్నిస్ ఆడడం, రన్నింగ్ లారీ కింద నుంచి స్లయిడ్ అవ్వడం వంటి స్టంట్స్‌ను రోప్ లేకుండా రామ్–లక్ష్మణ్‌ల నేతృత్వంలో చిత్రీకరించాం. జాకీచాన్, టోనీజా వంటి యాక్షన్ హీరోలతో పనిచేసిన ఫైట్ మాస్టర్ జైకాకేషా మా చిత్రానికి ఫైట్స్ అందించారు’’ అన్నారు. -
ఉత్కంఠభరితంగా...
అరుణ్ విజయ్ హీరోగా ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ మూవీ ‘కుట్రమ్ 23’. మహిమా నంబియార్, అభినయ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ 23’ పేరుతో శ్రీ విజయ నరసింహా ఫిలింస్ పతాకంపై శ్రీమతి అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ సంయుక్తంగా తెలుగులోకి అనువదించారు. ఈ నెల 18న ‘క్రైమ్ 23’ విడుదల కానుంది. ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ- ‘‘రీసెంట్గా ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా అరుణ్ విజయ్ బాగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. విజయ్‌కుమార్, అరవింద్ ఆకాశ్, వంశీకృష్ణ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త. -
వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్టిస్ట్ సురేష్ కమల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దివ్య మణి’. వైశాలి, కిమయా కథానాయికలు. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్, రెడ్ నోడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గిరిధర్ గోపాల్–స్టీవ్ శ్రీధర్ స్వరపరచిన ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. లెజెండరీ డ్యాన్సర్, పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్‌ల గ్రహీత డా. యామిని కృష్ణమూర్తి పాటల సీడీలను విడుదల చేసారు. సురేష్ కమల్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ఇది నా తొలి చిత్రం. యోగా నేర్పటం కోసం నేను ప్రపంచమంతా తిరిగినా తెలుగు నేలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కథ చెప్పారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశా. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘మనిషి తనని తాను జాగృతి పరచుకోవటానికి సృజనాత్మకత ఎంతో అవసరం. పాటలు బాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తీస్తాం’’ అన్నారు గిరిధర్ గోపాల్. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు సాయికుమార్, మాటల రచయిత బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాటా, నేపథ్య సంగీతం: స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్. -
పచ్చటి పొలాలను మద్యంతో తడిపేశారు!
వైశాలి: మొన్నటిదాకా భారీ వర్షాలతో అతలాకుతలమైన బిహారీలు.. నేడు పొలాల్లో పారుతోన్న మద్యం వరదను చూసి బెంబేలెత్తుతున్నారు. మద్యనిషేధం కఠినంగా అమలవుతోన్న బిహార్‌లో ప్రభుత్వ అధికారుల అత్యుత్సాహం పేద రైతుల పాటిట శాపంగా మారింది. మద్యంతో పొలాన్ని తడిపేసిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వైశాలి జిల్లా అబ్కారీ అధికారులు ఇటీవల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశానుసారం శుక్రవారం ఆ మద్యం సీసాలను ధ్వసం చేయడానికి పూనుకున్నారు. ఓ గ్రామ శివారులోని బాటిలింగ్ ప్లాంట్ వెలుపల మద్యం కాటన్లను ఉంచి, జేసీబీతో వాటిని నలగొట్టేశారు. చుట్టుపక్కల పచ్చటి పొలాలున్నాయన్న ఇంగితాన్ని మర్చిపోయారు. మొత్తం లక్ష లీటర్ల మద్యం.. అక్కడి పంటలను ముంచెత్తింది. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. అయినాసరే ఇవేవీ పట్టించుకోని అధికారులు.. ‘కోర్టు చెప్పింది.. మేం చేశాం’ అని చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది. -
ఆసియా చెస్‌లో వైశాలికి స్వర్ణం
చెంగ్డూ (చైనా): ఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో భారత క్రీడాకారిణులు మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో తమిళనాడు అమ్మాయి ఆర్.వైశాలి స్వర్ణ పతకం సాధించగా... ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైశాలి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... పద్మిని రౌత్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లు సంపాదించిన సారాసదత్ (ఇరాన్) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరీలో భారత ప్లేయర్ అరవింద్ చిదంబరం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు 6.5 పాయింట్లతో ఏడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. -
పోలీసులకు షాక్ ఇచ్చిన సీరియల్ కిల్లర్
పట్నా: బ్యాంకు దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైశాలి జిల్లాలో బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'నన్ను ఇంటరాగేట్ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. గూగుల్ లో సైకో కిల్లర్ అమిత్ అని వెతికితే నా గురించి మొత్తం తెలుస్తోంద'ని పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాము వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అతడే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. పట్నా, వైశాలి ఇతర జిల్లాల్లో 22 హత్యలు చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి. 'సైకో సీరియల్ కిల్లర్'గా ముద్రబడిన అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్ ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివాడు. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో పనిచేశాడు. 2003లో అతడి తండ్రి హత్యకు గురైయ్యాడు. తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న పప్పుఖాన్ అనే వ్యక్తి చంపిన తర్వాత అమిత్ సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. పప్పు ఖాన్ శరీరంలోకి అమిత్ 32 బుల్లెట్లు దించాడని, తన తండ్రి హత్యకు కారకులైన మరో నలుగురిపై దాడి చేశాడని వైశాలి ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించారు. బాలీవుడ్ సినిమా 'గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్-2' సినిమా క్లైమాక్స్ ప్రేరణతో తన తండ్రిని హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసులతో అమిత్ చెప్పాడు. 60వ దశకంలో ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ పేరు కూడా అతడు ప్రస్తావించాడు. వైశాలిలో సెంట్రల్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఆదివారం అమిత్ పోలీసులకు పట్టుబడ్డాడు. -
బాలిక లేఖకు పీఎంఓ స్పందన
హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆరే ళ్ల చిన్నారికి ఉచిత వైద్యం పుణె: గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద బాలిక ఆర్థిక సాయం కోసం చేసిన విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) స్పందించి సకాలంలో చికిత్స చేయించింది. పుణెకి చెందిన వైశాలి యాదవ్(6) రెం డో తరగతి చదువుతోంది. ఆమెకు గుండెలో రంధ్రం ఏర్పడింది. టీవీలో ప్రధాని మోదీని చూసిన వైశాలి...తన ఆరోగ్యం, ఆర్థిక స్థితిని వివరిస్తూ చికిత్సకు సాయం చేయాలని పీఎంఓ కు లేఖ రాసింది. స్కూలు ఐడీ కార్డును జతచేసింది. వారంలో పీఎంఓ నుంచి పుణె జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. జిల్లా అధికారులు ఆమెకు నగరంలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించి జూన్ 4న ఉచితం వైద్యం అందించారు. -
అసలైన స్నానం
బౌద్ధవాణి బుద్ధుని కాలంలో వైశాలి ఒక గణతంత్ర రాజ్యం. దాని మహారాజు నందకుడు. ఒకరోజు బుద్ధుడు వైశాలిలోని మహావనంలో ఉన్నాడు. ఆ సాయంత్రం అక్కడే ఆయన తన ధర్మప్రసంగం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి, ఆ వనం పక్కనే ఉన్న తన నివాసం నుండి వెళ్లి బుద్ధుని ధర్మ ప్రసంగాన్ని వింటున్నాడు నందకుడు. బుద్ధుడు ఆ రోజు పంచశీల గురించి, అష్టాంగమార్గం గురించి వివరిస్తున్నాడు. బుద్ధుని ధర్మోపన్యాసం వింటూ అందులో లీనమై పోయాడు నందకుడు. ఇంతలో నందకుని రాజసేవకుడు వచ్చి, నందకునితో ‘‘రాజా! తమ స్నానానికి వేళయింది. వేన్నీళ్లు, చన్నీళ్లు సిద్ధం చేశాము’’ అని నెమ్మదిగా చెప్పాడు. ‘‘సేవకా! చాలు చాలు. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. భగవానుని ధర్మ ప్రవచనాలు వింటూ నా మనస్సును కడిగేసుకుంటున్నాను. ధర్మస్నానం చేస్తున్నాను. నీవు చెప్పే బాహ్యస్నానాలకంటే ఇదెంతో మేలైంది. ఆ స్నానం ఇప్పుడు కాదు.. నువ్వు వెళ్లు !’’ అని పంపించేశాడు. తిరిగి బుద్ధుని ధర్మోపన్యాసాల్లో లీనమై పోయాడు. బాహ్యస్నానం వల్ల శరీరం తేలికపడ్డట్టు, ధర్మస్నానం వల్ల అతని మనస్సు తేలిక పడింది. - బొర్రా గోవర్ధన్ -
మేల్కొన్న మానవత్వం
రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించారని అంటే జాలి చూపని మనిషి ఉండడు. తెలిసిన వాళ్లు అయినా, తెలియని వాళ్లు అయినా ప్రమాదంలో మరణించారని తెలిస్తే అయ్యోపాపం.. అని అంటాం. అయితే ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే ప్రమాదాల విషయంలో కూడా ఇలాంటి స్పందనే వ్యక్తం చేసే మనుషులు మనలో తక్కువ. ప్రయాణ సమయంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, బాధితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... తమదారిన తాము వెళ్లిపోయే వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే... పనుల మొదలు పోలీసుల భయం... దాకా ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అలాంటి అనుభవమే ఎదురైంది వంశీ, వైశాలి దంపతులకు. ఉద్యోగస్తులైన ఈ భార్యభర్తలు ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అక్కడ ఒక చోట చాలా మంది గుమి కూడి ఉన్నారు. వారిని తప్పించుకొని కొంచెం తొంగిచూస్తే ఒక మనిషి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వయసుకు వృద్ధుడిలానే ఉన్నాడు. ఏదో భారీ వాహనం నడుస్తూ వెళుతున్న ఆ మనిషికి కొట్టేసి వెళ్లిపోయినట్టుగా జనాలు మాట్లాడుకొంటున్నారు. అక్కడ అయ్యోపాపం అనే మాటలు వినిపస్తున్నాయి కానీ... ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆ మనిషిని ఆసుపత్రికి తీసుకెళదామనే ఆలోచన ఎవరి రాలేదు. ఎవరూ అతడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడమే అందుకు రుజువు. ఈ పరిస్థితిని గమనించిన వంశీ, వైశాలి దంపతులు వినోదం చూస్తున్న మనుషులను పట్టించుకోకుండా... ప్రమాదంలో ఉన్న మనిషి గురించి ఆలోచించారు. తమ కారును తీసుకొచ్చి ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్యాక్ సీటులో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను అడ్మిట్ చేసి వైద్యం అందేలా చేసి వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన పేరు క్రిస్టఫర్ అని తెలిసింది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిశాయి. వాళ్లు వచ్చేంత వరకూ క్రిస్టఫర్ బాధ్యతను వంశీ, వైశాలి దంపతులే చూసుకొన్నారు. సమయానికి ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ దంపతులకు క్రిస్టోఫర్ కుటుంబీకులు ఎంతో కృతజ్ఞత చూపారు. ఈ విషయాన్ని వాళ్లే రోడ్క్రాఫ్ట్ అనే ఎన్జీవోకు తెలిపారు. ఆ ఎన్జీవో రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో సిసలైన మనుషుల్లా ప్రవర్తించే వ్యక్తులను సత్కరిస్తూ ఉంటుంది. వంశీ, వైశాలి దంపతులకు కూడా ఆ ఎన్జీవో వాళ్లు ‘గుడ్ సమరిటన్’ అవార్డును ఇచ్చారు. ఇలాంటి అవార్డుల మాట ఎలా ఉన్నా.. వంశీ, వైశాలిలు మాత్రం అభినందనీయులు. -
రుత్విక, వృశాలి సంచలనం
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ ఆలిండియా జూ॥బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు జి.రుత్విక శివాని, జి.వృశాలి సంచలన విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన అండర్-19 బాలికల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అన్‌సీడెడ్ రుత్విక 21-6, 21-16 తేడాతో మూడో సీడ్ శ్రీయాన్షి పర్దేశి (ఎయిరిండియా)పై... అన్‌సీడెడ్ వృశాలి 21-13, 17-21, 21-12తో ఆరో సీడ్ కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర)పై గెలిచారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి సంతోషి హాసిని 18-21, 15-21 తేడాతో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలైంది. ఇక బాలికల అండర్-17 ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజితరావు 21-18, 20-22, 21-14 తేడాతో అశ్మితా చలీహ (అసోం)పై, జి.వృశాలి 21-16, 21-18 తేడాతో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, కె.వైష్ణవి 21-15, 21-18 తేడాతో అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది.అయితే బి.అర్చన 6-21, 6-21 తేడాతో శిఖా గౌతమ్ (కర్ణాటక) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బాలుర అండర్-17లో ఏపీ క్రీడాకారులు ఎం.కనిష్క్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ కనిష్క్ 21-17, 21-12 తేడాతో కార్తీక్ జిందాల్ (హర్యానా)పై గెలుపొందగా, మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21-11, 19-21, 21-18తో సిద్ధార్థ్ ప్రతాప్‌సింగ్ (చత్తీస్‌గఢ్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక సిరిల్ వర్మ 21-12, 21-14తో నిశ్చయ్ జైస్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలవగా, కె.జగదీశ్ 10-21, 17-21 తేడాతో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) చేతిలో ఓటమిపాలయ్యాడు. -
మహాదాత
బౌద్ధవాణి వైశాలి నగరంలో సువర్ణదత్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలో అతనికంటే ధనవంతుడు లేడు. ఎన్నో దేశాలలో వ్యాపారం చేసేవాడు. ఎంత ధనవంతుడో అంత దాత కూడా. ఆయన చేసిన చిన్నచిన్న దానాలకు లెక్కేలేదు. భూరి దానాలూ అంతగానే చేశాడు. ప్రజలు సువర్ణదత్తుడిని గొప్పదాతగా చెప్పుకునేవారు. వారు పొగిడిన కొద్దీ దానాలు చేసేవాడు సువర్ణదత్తుడు. అతని దగ్గర ఎందరో నౌకర్లు ఉండేవారు. అతని వ్యక్తిగత పనులు చేసే సుదత్తుడనే పనివాడు వారిలో ఒకడు. సుదత్తుడు కూడా దానధర్మాలు చేసేవాడు. సువర్ణదత్తునిలా పెద్దపెద్ద దానాలు చేయకపోయినా తనకు తగినంతలోనే దానాలు చేసేవాడు. కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు. వారి వారి దానఫలాన్ని బట్టి ఇద్దరూ తుషిత స్వర్గంలో చేరారు. అక్కడ దేవతలు సువర్ణదత్తునికీ, సుదత్తునికీ సన్మానం ఏర్పాటు చేశారు. తనతో పాటు తన సేవకుడూ స్వర్గానికి రావడం చూసి సువర్ణదత్తుడు ఆశ్చర్యపోయాడు. పైగా తనతో కలిసి సన్మానం పొందడం చూసి మరింత అవాక్కయ్యాడు. ఇద్దరికీ సన్మానం జరిగింది. సువర్ణదత్తునికి ‘గొప్పదాత’ అనే బిరుదు ప్రదానం చేసి, బంగారు కిరీటం పెట్టారు. సుదత్తునికి ‘మహాదాత’ అనే బిరుదునిచ్చి వజ్రాలు పొదిగిన కిరీటం అలంకరించారు. ఈ సన్మానం తనకు అవమానంగా భావించాడు సువర్ణదత్తుడు. వెంటనే అక్కడివారిని అడిగాడు. అప్పుడు దేవరాజు - ‘‘సువర్ణదత్తా! నువ్వు భాగ్యశాలివి. నువ్వు ఎంత దానం చేసినా అది నీ సంపదలో కొద్ది మాత్రమే. కానీ సుదత్తుడు ఒక సేవకుడు. పనివాడు. తన సంపాదనలో అతను చేసిన పాలు చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు గొప్పదాతవు, అతను మహాదాత అయ్యారు. ఇక కిరీటాలు అంటావా, దాతలుగా ఇద్దరూ బంగారు కిరీటాలకు అర్హులే. కానీ నువ్వు గొప్పదనం కోసం దానాలు చేశావు. సుదత్తుడు ఎదుటివారి కష్టాల్నీ, కన్నీటినీ చూసి కరిగిపోయి దానాలు చేశాడు.అతని మనసు కరిగి కన్నీరుగా మారేది. అతను ఎదుటివారి కష్టాలు చూసి కార్చిన ఒక్కో కన్నీటి బొట్టుకూ, ఒక్కొక్క వజ్రం దానఫలంగా అతని కిరీటంలో చేరింది’’ అన్నాడు. ‘‘సుదత్తా! నీలాంటి సేవకుణ్ణి పొందిన భాగ్యం నాది’’అంటూ సువర్ణదత్తుడు సుదత్తుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. - బొర్రా గోవర్థన్ -
నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?
చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న దక్షిణాది నటి సింధు మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్త మీడియాలో సంచలనం రేపింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు అందుతున్నాయి. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్పించే సమయానికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది అని వార్తలు వెలువడ్డాయి. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది. -
బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని 22 మందికి అస్వస్థత
బీహార్ రాష్ట్రాన్ని మధ్యాహ్న భోజన విషాదం వీడట్లేదు. ఆ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాందాహా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పిల్లలను హాజీపూర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చామని, వారిలో ముగ్గురు తప్ప మిగిలిన వారంతా ప్రమాదం నుంచి బయటపడినట్లేపనని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురి పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందన్నారు. శుక్రవారం నాటి మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరగాయలు, పప్పు పెట్పటారు. అన్నం తినగానే పిల్లలు తమకు కడుపులో నొప్పిగా ఉన్నట్లు చెప్పారని, కొద్దిసేపటికే వారికి వాంతులయ్యాయని ఓ అధికారి చెప్పారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జూలై 16వ తేదీన బీహార్ రాష్ట్రంలోని శరణ్ జిల్లాలో మధ్యాహ్నభోజనం తిని 23 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భోజనంలో తేడా అనగానే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లోని 72 వేల పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. సుమారు 1.6 కోట్ల మంది విద్యార్థులకు రోజూ భోజనం పెడుతున్నారు.