ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు.
నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్‌జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment