Isle of Man International Chess Tournament
-
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారికతోపాటు మరో ముగ్గురు నినో బత్సియాష్విలి (జార్జియా), అనా ఉషెనినా (ఉక్రెయిన్), తానియా సచ్దేవ్ (భారత్) 5.5 పాయి0ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... హారికకు టాప్ ర్యాంక్ లభించింది. నినో బత్సియాష్విలి రెండో స్థానంలో, అనా ఉషెనినా మూడో స్థానంలో, తానియా నాలుగో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 15 ఎత్తుల్లో అర్మేనియా గ్రాండ్‌మాస్టర్ సెర్గీ మూవ్సెసియాన్తో ‘డ్రా’గా ముగించింది. ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి0ది. ఏడో రౌండ్లో హారిక మహిళల ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది. మొత్తం 133 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ నుంచి 26 మంది బరిలోకి దిగారు. తెలుగు క్రీడాకారులు ఎం.ఆర్. లలిత్ బాబు 5.5 పాయి0ట్లతో 28వ స్థానంలో, హర్ష భరతకోటి 4 పాయి0ట్లతో 79వ స్థానంలో, కోటిపల్లి సాయి నిరుపమ 3.5 పాయి0ట్లతో 110వ స్థానంలో నిలిచారు. -
హారిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. మహిళల ప్రపంచ నంబర్‌వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)పై హారిక తన కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో హు ఇఫాన్‌ను ఓడించింది. ఈ గేమ్‌కు ముందు హు ఇఫాన్‌తో హారిక 19 సార్లు తలపడగా... నాలుగు గేముల్లో ఓడిపోయి, 15 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఐదు పాయి0ట్లు ఉన్నాయి.