సాక్షి, విశాఖ: దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
ఏపీలో చలి పంజా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఉదయం ఏడు గంటల వరకు పొగ మంచు ప్రభావం కొనసాగుతోంది. అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, పార్వతీపురం మన్యం వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా చలి తీవ్రత ఉంది. రానున్న 10 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. ఉత్తరాదిలో చలి కారణంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. విజిబిలీటీ తగ్గిపోయింది. దీంతో, ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీకి సంబంధించి 255 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో 43 విమానాలను అధికారులు రద్దు చేశారు. 15 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
ఇక, పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇద్దరు మృతిచెందారు.
#WATCH | Delhi | A dense layer of fog blankets the national capital as a cold wave grips the city.
(Visuals from DND) pic.twitter.com/9An3CiwseV— ANI (@ANI) January 4, 2025
అలాగే, కోల్‌కత్తా విమానశ్రయంలో కూడా దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో, పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చండీగఢ్, అమృత్‌సర్, జైపూర్, అనేక ఇతర విమానాశ్రయాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
#WATCH | Uttar Pradesh | A dense layer of fog blankets the Vaishali area of Ghaziabad as a cold wave grips the city. pic.twitter.com/bOsR0oJY34
— ANI (@ANI) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment