Weather condition
-
తెలంగాణ: అంతటా కుండపోత.. అతిభారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో చెట్టు, కరెంట్‌పోల్ పడిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. Rains lash Telangana #Hyderabadrains!! Get ready hyderabad city for some intense spell of rains rains wrst north zone of city for next 1 hour☔ pic.twitter.com/HeQgACIrys — Telangana state Weatherman (@ts_weather) July 20, 2023 ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి. మెదక్ వెల్దుర్తిలో 15 సెం.మీలు, దామరంచలో 13 సెం.మీ. రాజపల్లిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం పరిధిలో ఏకంగా 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. నిలిచిపోయిన రాకపోకలు జయశంకర్ భూపాలపల్లి సహా భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వెలుతుర్లపల్లి వద్ద ఉధృతంగా మొరంచవాగు ప్రవహిస్తోంది. ధర్మారావుపేట, అప్పయ్యపల్లి, కొండాపురం, గనపురంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద తాత్కాలిక మట్టిరోడ్డు తెగిపోయింది. దీంతో పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ వెంకటాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరికి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో.. భద్రాచలం వద్ద 39 అడుగులకు చేరింది నీరు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. -
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్!
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్! -
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
వెలికితీతే.. శాపమైంది !
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అత్యంత అరుదైన గార (డంగుసున్నంతో రూపొందిన) శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది... వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్‌లో ఇది బయటపడింది. అప్పటికే పగుళ్లు ఏర్పడి కొంతభాగం ముక్కలైన ఈ శిల్పాన్ని తవ్వకాల సమయంలో అధికారులు సురక్షితంగా వెలికి తీసి నగరంలో ఉన్న పురావస్తుశాఖ డైరెక్టరేట్‌కు తరలించారు. ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం కావటంతో గాలిలో అధికంగా ఉండే తేమను పీల్చుకుని అది వేగంగా శిథిలమవుతోంది. మరికొంతకాలం ఇలాగే ఉంటే అది ముక్కలుముక్కలై అనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈలోపే దాన్ని సంరక్షించి తేమ చొరబడకుండా గాజు పెట్టెలో భద్రపరచాల్సి ఉంది. నిపుణులు సిద్ధంగా ఉన్నా... దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. బుద్ధుడి జాతక కథల్లో ఉండే బోధిసత్వుడుదిగా తేల్చారు. గతంలో బోధిసత్వుడికి సంబంధించి రెండు మూడు అడుగుల ఎత్తున్న గార ప్రతిమలు వెలుగు చూశాయి. కానీ 6 అడుగులకంటే ఎత్తున్న సున్నం విగ్రహం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. ఆ ఆకృతి ఆధారంగా విగ్రహానికి పూర్తి రూపు ఇవ్వగలిగే నిపుణులు ఢిల్లీ, ముంబై, పుణేల్లో ఉన్నారు. కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలో కూడా ఇలాంటి నిపుణులున్నారు. వారిని పిలిపిస్తే విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. కానీ ఆ కసరత్తు లేకుండా పురావస్తుశాఖ విగ్రహాన్ని గాలికొదిలేసింది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహా లు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు. -
తీరంలో అలజడి
సాక్షి, విజయనగరం : వాతావరణ మార్పులతో సంద్రంలో అలజడి నెలకొంది. అలలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని తాకుతున్నాయి. చింతపల్లి తీరం ఆదివారం కోతకు గురికావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీయడం.. కెరటాల తాకిడి పెరగడంతో వేటకు వెళ్లేందుకు వెనుకడుగువేస్తున్నారు. పూసపాటిరేగ తీరంలో సుమారు 400 వరకు బోట్లు ఉన్నా కేవలం 12 బోట్లతోనే వేట సాగించారు. చింతపల్లి రేవు నుంచి కేవలం 3 బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయి. పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, చింతపల్లి గ్రామాల మత్స్యకారులు వేటను వాయిదా వేసుకున్నారు. -
అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని
సాక్షి, అమరావతి : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకోస్తుంది. ఒడిశాలోని పూరీకి నైరుతి దిశగా 830 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670 కి.మీల దూరంలో ఫొని పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరో 12 గంటల్లో ఫొని తీవ్ర పెను తుపానుగా మారనుంది. ఈశాన్య దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనుంది. ఫొని తుపాను మే 3 మధ్యాహ్నానికి ఒడిశా తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు అధికారులు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా.. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేబినేట్ కార్యదర్శి సమీక్ష ఫొని తుపానుపై కేబినేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పరిస్థితిని సమీక్షించారు. మే 2, 3 తేదీల్లో ఫొని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా నీరు, ఆహారం అందించేందుకు రైల్వే బోర్టుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
సూర్యాపేట : వాతావరణ సమాచారాన్ని ఇకనుంచి సెల్ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నూతన యాప్‌ను అందుబా టులోకి తీసుకొచ్చింది. టీఎస్ వెదర్ యాప్‌ను ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రా జేందర్ ఆవిష్కరించారు. ఆటోమేటెడ్ పరికరాలతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను, తాజా అంచనాలను ఈ యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. టీఎస్వెదర్ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న మొబైల్ పోర్ట్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వాతావరణ వివరాలైన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రాంతాల్లో నెలకొన్న వర్షపాతం, ఉష్ణోగ్రత, పీడనం, గాలి గమన దిశలు మొదలైన వాతావరణ వివరాలను 24గంటలు అందుబాటులో అందరికి ఉంచడానికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ఈ యాప్‌ను రూపొం దించింది. మొబైల్ యాప్‌లో ఉండే వివరాలు.. ఆ ప్రాంతంలో ఆటోమెటిక్ వెదర్స్టేషన్ పం పిన వాతావరణ వివరాలతో పాటు ఆ ప్రాంత సమీపంలో ఉండే ఐదు ఆటోమెటెడ్ వెదర్స్టేషన్లకు సంబంధించిన వివరాలుంటాయి. అదే విధంగా రాష్ట్రంలో నమోదైన వర్షపాతానికి సం బంధించి 10 ప్రాంతాల వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నమోదైన వర్షపాతం, అత్యధిక వర్షపాతానికి చెందిన ఐదు ప్రాంతాల వివరాలు ఉంటాయి. యాప్‌తో అనేక ప్రయోజనాలు టీఎస్ వెదర్యాప్ అందుబాటులోకి రావడంతో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా రైతులకు వర్ష సూచన తెలియక విత్తనాలు విత్తుకునేవారు. సకాలంలో వర్షాలు కురవక నష్టాల్లో కూరుకుపోతున్నారు. టీఎస్ డీపీఎస్ రూపొందించిన వెదర్యాప్తో ఎప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ నూతన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో ఇటు రైతుల్లో, అటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. - బాదె లింగయ్య,జిల్లా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ -
వర్షం పడొచ్చు.. గొడుగు పట్టుకెళ్లండి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా అకస్మాత్తుగా మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వరకు ఎర్రటి ఎండ ఉన్నా కాసేపట్లోనే వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌లో ఎండ వేడి తాళలేకపోతుంటే.. హయత్‌నగర్‌లో వాన దంచి కొడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘గ్రేటర్’ప్రజలకు నగర వాతావరణ వివరాలు తెలిసేలా వాతావరణ శాఖ అనుసంధానించిన సమాచారంతో ‘మై జీహెచ్ఎంసీ’యాప్‌ను అప్డేట్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఐటీ) ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. వర్షం కురిసినపుడు వర్షపాతం, వర్షం కురిసిన ప్రాంతం వివరాలు, ఇతర సమయాల్లో వాతావరణ ఉష్ణోగ్రతల సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. వీటితోపాటు రాబోయే 5 రోజుల్లోని వాతావరణ సూచనలు, హెచ్చరికలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. నగరానికి కొత్తగా వచ్చేవారు తామెక్కడున్నామో, ఆ ప్రాంతం జీహెచ్ఎంసీ ఏ సర్కిల్, జోన్ పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని, రూ.5 భోజన కేంద్రాలు, ప్లే గ్రౌండ్, పబ్లిక్ టాయ్లెట్లు ఎంత దూరంలో ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. మొత్తంగా 120 సర్వీసులు యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా యాప్‌లో అందుబాటులో ఉండటం తెలిసిందే. -
వణికిస్తోంది..
సాక్షి, ఖమ్మం : ‘ఉదయం మంచు, చలి గాలి. పగలంతా ఎండ. సాయంత్రం 6 దాటితే చల్లని శీతల గాలులు. జిల్లాలో గత నాలుగు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి.’ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి కనిష్టంగా నమోదు అవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో గోగ్కొండ సీతమ్మ(80) అనే వృద్ధురాలు చలితీవ్రతను తట్టుకోలేక ఆదివారం మృతిచెందింది. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజామున బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో దట్టమైన అడవితో పొగమంచు, చలి ఎక్కువగా ఉండడంతో ఆదివాసీలు, గిరిజనులు ఉదయం 10 దాటిన తర్వాత గడప దాటడం లేదు. ఈనెల 16 నుంచి చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గడిచినవారంలో శనివారం అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 10.1గా నమోదైంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబర్లోనే ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రతగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు చలికి వణకుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలు చలికి తట్టుకోలేక మంటలు వేసుకుంటున్నారు. చలి పెరుగుదలతో ఉన్ని వస్త్రాలకు డిమాండ్ పెరిగింది. చలిని తట్టుకోలేక స్వెట్టర్లు, మప్లర్లు, రగ్గులు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. వాతావరణంలో మార్పుతో జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసినా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆశ్చర్య కలిగించే అంశం. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగకున్నా కనిష్ట ఉష్ణోగ్రతలు రోజుకు రెండు డిగ్రీల పైన పడిపోతుండడంతో చలి తీవ్రంగా ఉంటోంది. దట్టమైన పొగమంచుతో ఉదయం 8 గంటలకు కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.