సూర్యాపేట : వాతావరణ సమాచారాన్ని ఇకనుంచి సెల్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నూతన యాప్‌ను అందుబా టులోకి తీసుకొచ్చింది. టీఎస్ వెదర్ యాప్‌ను ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రా జేందర్ ఆవిష్కరించారు. ఆటోమేటెడ్ పరికరాలతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను, తాజా అంచనాలను ఈ యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు.
టీఎస్‌వెదర్ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న మొబైల్ పోర్ట్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వాతావరణ వివరాలైన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రాంతాల్లో నెలకొన్న వర్షపాతం, ఉష్ణోగ్రత, పీడనం, గాలి గమన దిశలు మొదలైన వాతావరణ వివరాలను 24గంటలు అందుబాటులో అందరికి ఉంచడానికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ఈ యాప్‌ను రూపొం దించింది.
మొబైల్ యాప్‌లో ఉండే వివరాలు..
ఆ ప్రాంతంలో ఆటోమెటిక్ వెదర్‌స్టేషన్ పం పిన వాతావరణ వివరాలతో పాటు ఆ ప్రాంత సమీపంలో ఉండే ఐదు ఆటోమెటెడ్ వెదర్‌స్టేషన్లకు సంబంధించిన వివరాలుంటాయి. అదే విధంగా రాష్ట్రంలో నమోదైన వర్షపాతానికి సం బంధించి 10 ప్రాంతాల వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నమోదైన వర్షపాతం, అత్యధిక వర్షపాతానికి చెందిన ఐదు ప్రాంతాల వివరాలు ఉంటాయి.
యాప్‌తో అనేక ప్రయోజనాలు
టీఎస్ వెదర్‌యాప్ అందుబాటులోకి రావడంతో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా రైతులకు వర్ష సూచన తెలియక విత్తనాలు విత్తుకునేవారు. సకాలంలో వర్షాలు కురవక నష్టాల్లో కూరుకుపోతున్నారు. టీఎస్ డీపీఎస్ రూపొందించిన వెదర్‌యాప్‌తో ఎప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ నూతన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో ఇటు రైతుల్లో, అటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది.
- బాదె లింగయ్య,జిల్లా కోఆర్డినేటింగ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment