suryapeta
-
దసరా పండుగ ఉత్సవాల్లో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం
సాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్‌లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్పై చిలుకూరు పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు -
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
-
వంద రోజుల్లో తెలంగాణ అస్తవ్యస్తమైంది: కేసీఆర్
సాక్షి,సూర్యాపేట: కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్’ అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ‘రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థత, తెలివితక్కువతనమే ఈ పరిస్థితికి కారణం. రైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునేవాడు దిక్కులేడు. ఎండిపోయిన పంటలపై నివేదిక తెప్పించుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఊరుకోదు. వెంట పడతాం. మెడలు వంచుతాం. ఒకరిద్దరని గుంజుకుని చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎండిన పంటలకుగాను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలు ఓపిక పట్టి నాలుగో నెలలో మాట్లాడుతున్నాం. వాగ్దానాలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు రూ.500 బోనస్, రుణమాఫీ ఇతర హామీలపై దీక్షలు, ధర్నాలు చేస్తాం. నీళ్లిస్తామంటే నమ్మి పంటలు వేశామని రైతులు పొలంబాటలో నాతో చెప్పారు.రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మా హయాంలో నీరు,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం చేశాం. కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా అమలు చేశాం. 2014లో 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండకపోయేది. కానీ ఆ తర్వాత మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాం. త తక్కువ కాలంలో రైతులు బాధపడతారు అనుకోలేదు.జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించాం. కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు.నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదు.ముందే తెలిస్తే ఓట్లు వెయ్యకపోయే వాళ్లమంటున్నారు. రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు చేయటం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రాజకీయనాయకులు రాష్ట్రం మేలు కాంక్షించాలి. రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. హైదరాబాద్‌లో నీటి కటకట ప్రారంభం అయ్యింది. నీటి ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి హైదరాబాద్ ప్రజలకు వచ్చింది. మా హయాంలో తెలంగాణలో బిందె పట్టుకున్న ఆడబిడ్డ కనిపించలేదు. ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మళ్లీ స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోతుంది కానీ తెలంగాణ లో పోదు అనే స్థాయికి తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీనికి స్పందించిన కేసీఆర్ కరెంటు ఇట్లా వస్తూ పోతుందన్నారు. ఇదీ చదవండి.. జనగామలో పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ -
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి vs ఎమ్మెల్యే సైదిరెడ్డి
-
సూర్యాపేట : మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేస్తూ పట్టుబడ్డ ప్రభుత్వ వైద్యుడు
-
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి
సాక్షి,హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సెప్టెంబరు చివరికల్లా రోడ్డు పనులు పూర్తికానుండటంతో వెంటనే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గిపోనుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరుసల రోడ్డు అందుబాటులో ఉండగా, సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య ఇంతకాలం రెండు వరుసల రోడ్డే ఉండేది. రోడ్డు కూడా బాగా దెబ్బతినిపోవడంతో ప్రయాణ సమయం బాగా పెరుగుతూ, తరచూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో దీన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించిన కేంద్రం 2019లో ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో మూడు నెలల అదనపు సమయాన్ని నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఫలితంగా సెప్టెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 58.63 కిలోమీటర్లకు ఇప్పటికే 49.55 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. (క్లిక్: బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్.. స్పెషల్ డ్రైవ్) -
తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు: ఈటల రాజేందర్
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని హుజూర్ నగర్లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతో మంది ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. రాజకీయాల కోసం ఎంతో మందిని హుజురాబాద్ పంపించి ఎలాగైనా నన్ను ఓడించాలనే ప్రయత్నం చేసినా.. అక్కడ ప్రజలెవరూ నమ్మక కర్రు కాల్చి వాత పెట్టారు. దళితులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేసి కంటితుడుపు చర్యగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీఆర్ఎస్ అంటూ కొత్తగా మరో నాటకానికి తెరలేపారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మధ్యాహ్న భోజనం కింద నగదును సమకూర్చే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అన్ని ఆధారాలు చూపించినా.. వారిపై చర్యలు తీసుకునే సాహసం లేదు అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు బీజేపీని ఎదిరించే దమ్ముంది -
మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ
ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్ తొలి మహిళా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సీతాదేవి పరిచయం. ‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్‌లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి. టెలివిజన్ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది. తెర నిండుగా వినోదం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్ ఉమన్. నాకు రోల్ మోడల్’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరీర్ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి. దూరదర్శన్ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్‌కి స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్ తయారీ పెద్ద సవాల్. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్ సరిపోదు. సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్‌లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్‌తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి. ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది. కాపీ రైట్ పోరు ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్ భారతీయ విద్యాభవన్కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్ తీసుకున్నాం. దూరదర్శన్ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం. అవి టెలికాస్ట్ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్ క్రానికల్‌లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్ కుమ్మక్కై కాపీ రైట్స్ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్‌నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్‌లో ఆరోగ్యం కొత్త సవాల్ విసిరింది. అనారోగ్యంతో పోరాటం మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్ స్లె్కరోసిస్ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్‌ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్ చిత్రీకరణ వంటి ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్ అండ్ బ్లూస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను. అవకాశం కోసం జూబ్లీహిల్స్ క్లబ్లో బ్యూటీ సెలూన్ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు. అలా 2005 క్రిస్టమస్ రోజు మొదలైన పార్లర్ ఇప్పుడు నలభై బ్రాంచ్‌లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది. నేను విజేతనే ‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్‌తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్‌ని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు. – పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్బీ సెలూన్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ట్రైనింగ్ విద్యార్థిని.. ఇంటికి వస్తేనే సంతకాలు పెడతానంటూ..
సాక్షి,సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది గురువులు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ కోసం వచ్చిన బీఈడీ విద్యార్థినిని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని బుధవారం డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విద్యార్థిని సూర్యాపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. బీఈడీ టీచింగ్ ట్రైనింగ్‌లో భాగంగా 20రోజులుగా జిల్లా కేంద్రంలోని నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలకు వస్తోంది. ట్రైనింగ్ పూర్తవ్వడంతో çసంబంధిత పాఠశాల హెచ్ఎం ట్రైనింగ్ పూర్తిచేసినట్లు రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే సదరు విద్యార్థిని రెండు మూడు సార్లు హెచ్ఎం దగ్గరకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించింది. తన రికార్డులపై సంతకాలు చేయాలని కోరగా ఇంటికి వస్తే గాని సంతకాలు చేయనని హెచ్ఎం ఫోన్లోనే అసభ్యంగా మాట్లాడినట్లు ఆ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రైనింగ్‌కు వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం తనను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తెలిపింది. హెచ్ఎంపై దాడి..? హెచ్ఎం చేష్టలకు విసిగిపోయిన సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో వారు హెచ్ఎంపై దాడి చేసినట్లు సమాచారం. హెచ్ఎంపై దాడి చేసి అక్కడ నుంచి వచ్చి డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హెచ్ఎంపై బీఈడీ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత హెచ్ఎంపై విచారణ చేపట్టి.. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –అశోక్, డీఈఓ చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. -
ప్రజల గుండె చప్పుడు
పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్‌మన్‌గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్‌సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు. సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్ రాజబహదూర్ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్‌రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్‌రెడ్డి కూడా ఆయన హాస్టల్ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు. ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్ వర్కర్స్ సంఘం, లారీ డ్రైవర్స్ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు చేపట్టాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
మహిళను మింగిన ఇసుక గుంత
ఆత్మకూర్–ఎస్ (సూర్యాపేట):. ఇసుక గుంత ఓ మహిళను మింగింది. ఈ ఘటన మండల పరిధిలోని మక్తా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ(34) పొలం పనుల నిమిత్తం ఏటిలో నుంచి అవతలికి వెళ్తుండగా ఇసుకకోసం తీసిన గుంతలో కాలుజారి పడడంతో నీటిలో మునిగింది. సమీప రైతులు గమనించి ఆమెను రక్షించేలోపే మృతిచెందింది. మృతురాలికి భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇష్టానుసారంగా ఇసుకతవ్వకాలు పాతర్లపహడ్, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూరు, బొప్పారం, మక్తాకొత్తగూడెం గ్రామల నుంచి బిక్కేరు వాగు వెళ్తుంది. ఈ వాగు నుంచి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇసుకతరలిస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.వర్షాలు వచ్చినప్పుడు అందులో నీరుచేరడంతో తెలియక పశువులు, మనిషులు ప్రమాదాల బారిన పడుతున్నారు.మక్తా కొత్తగూడెంలో ఏరు దాటే సమయంలో ఎక్కడ గుంతలు ఉన్నయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండు నెలల క్రితం మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన మహిళ ఏరుదాటుతూ నీటిలో మునిగి మృతిచెందగా ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ ఇసుక తవ్వకంతో ఏర్పడిన గుంతలో జారిపడి మృతిచెందడం ఇసుక మాఫియా ఆగడాలకు నిదర్శనం. వాగుదాటేదెలా... మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి 15కిలో మీటర్లకు పైగా వెళ్తున్న బిక్కేరు వాగు అవతల పలు గ్రామాల భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూముల్లో సాగుచేయడానికి రైతులు ప్రమాదమని తెలిసినా దాటకతప్పడంలేదు. వాగు దాటి రైతులు తమ భూముల్లోకి వెళ్లడానికి ఎక్కడా వంతెనలు లేవు. ప్రమాదమని తెలిసినా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వాగులో నుండే వెళ్తున్నారు. లేదా దూరమైనా వేరే గ్రామాల నుంచి తిరిగివస్తున్నారు. తమ భూములు సాగుకు నోచుకోవాలంటే వంతెనలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. -
సూర్యాపేటలో కుంభవృష్టి, 10 గంటలపాటు..
-
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్‌పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
ఇంట్లోనుంచి పోనంటున్న ఉడుత
-
కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా
సూర్యాపేట క్రైం: మలేసియా సముద్రతీరంలో సూర్యాపేట యువకుడు రిషివర్ధన్‌రెడ్డి(21) గల్లంతయ్యారు. మోటకట్ట వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారుడు రిషివర్ధన్ మలే సియాలో సరుకుల రవాణా నౌకలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లభించలేదని, బుధవారం సాయంత్రంలోగా తెలుస్తుందని అధికారులు ఫోన్లో తెలిపారు. దీంతో బిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. ఎలారా బతికేది? మూడ్రోజుల క్రితం ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మురిపించావు. ఆ మాటల్ని ఇంకా మరువనే లేదు. అంతలోనే సముద్రంలో కొట్టుకుపోయావని చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది? కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా. – రిషివర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు -
దేశ సంపద కార్పొరేట్‌కు ధారాదత్తం
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజాజీవితం అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వంట గ్యాస్‌ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాక అనేక రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగి పోయాయని, వాటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఏడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల భూములను ధరణి పేరుతో భూస్వాములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి తదితరులు సభలో పాల్గొన్నారు. -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్‌కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు. -
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరద బీభత్సం
-
‘బి’ బ్లడ్ గ్రూప్ వారికే ఎక్కువగా కరోనా!
సూర్యాపేట: పలానా గ్రూపు రక్తం వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందట.. పలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట అని చాలాసార్లే విని ఉంటాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది. కరోనా వైరస్ మొదటి, సెకండ్ వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ చికిత్సపొందిన 200 మంది రోగుల రక్తనమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది. సేకరించిన రక్తనమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావూరి స్వరూప పాల్గొన్నారు. -
దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని చాకలిగూడెంకు చెందిన దర్శనం శిల్ప తమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో అభ్యర్థించింది. తన భర్త సతీశ్.. తొమ్మిది నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడని, దీంతో తాను, ముగ్గురు పిల్లలు దిక్కులేని వారమయ్యామని వాపోయింది. స్పందించిన కేటీఆర్.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో ఆయన శుక్రవారం చాకలిగూడెం వెళ్లి శిల్ప కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. శిల్పకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శిల్ప మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిశోర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: పీఆర్సీ వర్తించేది వీటికే.. -
ప్రతీకార హత్యకు ప్లాన్ చేసిన నిందితులు..
సాక్షి, కోదాడ(సూర్యాపేట): తన అన్నను చంపిన వాడిని చంపాలని హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తితో పాటు సుపారీ గ్యాంగ్‌ను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మంగళవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి వెల్లడించారు. కోదాడ మండలం నల్ల బండగూడెం శివారు రామాపురం క్రాస్ రోడ్‌కు చెందిన గుగులోతు సురేష్ గతేడాది సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో డీజే నడిపిస్తూ అక్కడ బస్వరాజు తిరపతయ్యను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి ఇంటిలో అద్దెకు ఉంటూ ఆయన భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గమనించిన తిరపతయ్య అతడిని మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న అతడిని ఎలాగైనా హత్యచేయాలని సురేష్ స్నేహితుల సాయంతో తిరపతయ్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ కేసులో జైలు వెళ్లి వచ్చి స్వగ్రామంలో ఉంటున్నాడు. అన్నను చంపిన వాడిని హత్య చేయాలని.. తన అన్నను చంపిన వాడిని హత్యచేయాలని తిరపతయ్య తమ్ముడు జనార్దన్ తనకు పరిచయం ఉన్న ఖమ్మం జిల్లా దాచేపల్లికి చెందిన దాచేపల్లి సురేష్ సాయంతో చెర్వుమాదారంకు చెందిన రఫీతో గుగులోతు సురేశ్‌ను హత్య చేయడానికి రూ.2.50 లక్షల సుపారీ కుదుర్చుకుని ఫొటోను వివరాలను ఇ చ్చాడు. రఫీకి అడ్వాన్‌గా రూ.34వేలను గూ గుల్ పే ద్వారా పంపించాడు. దాచేపల్లి సురేశ్ రఫీలు ఇద్దరు కలిసి గుగులోతు సురేశ్ ను హత్య చేయడానికి అతడి ఇంటి రెక్కీ నిర్వహించి హత్యకు కావాల్సిన వేటకొడవళ్లను రోడ్డు వెంట భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రఫీ తన గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడైన రాకేశ్‌కు డబ్బు ఆశ చూపి అతడిని కూడా ఒప్పించి, తరువాత తమ వాళ్ల కాదని, తన గ్రామస్తుడైన ఏసోబుకు చెప్పగా అతడు హైదరాబాద్‌లోని పల్లపు నరేందర్ గ్యాంగ్ ఉందని చెప్పి అతడితో లక్ష రూపాయాలకు ఒప్పందం చేసుకుని రూ.4వేలు ఇచ్చారు. ఆ తర్వాత నరేందర్ గ్యాంగ్ ఈ నెల 23న ఏసోబుతో కలిసి హత్య చేసేందుకు రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుని రఫీకి ఫోన్ చేయగా అతడు ఎత్తకపోవడంతో సురేశ్ అడ్రస్ తెలియపోవడంతో వెళ్లిపోయారు. హత్య ఆలస్యం అవుతుందని జనార్దన్ ఒత్తిడి చేస్తుండటంతో 24 రాత్రి ఒంటి గంట సమయంలో రఫీ, రాకేష్‌ను తీసుకుని ద్విచక్రవాహనంపై రామాపురం క్రాస్‌రోడ్‌లోని గుగులోతు సురేశ్ ఇంటికి వెళ్లి సురేశ్ తల్లిని మీ కొడుకు లేడా అని కత్తులతో బెదిరించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేవరకు పరారయ్యారు. ఈ క్రమంలో ఒక కత్తి కిందపడిపోయింది. ఈ సంఘటనపై సురేష్ తల్లి రాంబాయి ఈ నెల 25న రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వి చారణ చేపట్టారు. ఎలాగైన అతడిని చంపాలని రఫీ, రాకేశ్‌లు రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగా పోలీసులు పట్టుకుని వారిని వి చారించి అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతం చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ వై. సైదులుగౌడ్‌ను, సిబ్బందిని సీఐ అభినందించారు.