వైభవంగా లక్ష తులసిపూజ
వైభవంగా లక్ష తులసిపూజ
Published Sun, Aug 7 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
సూర్యాపేటటౌన్ : బదరినారాయణ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆదివారం లక్ష తులసిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ నారాయణమంత్రాన్ని లోకానికి అందించిన బదరీనారాయణ మంత్రాన్ని పఠించిన వారికి మాత్రమే మోక్షం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది పఠించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌వీ సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణ, కృష్ణమూర్తి, రవీందర్, మంజుల, అరుణ, నాగమ్మ, మాధవరావు, అరుణ, సరోజ, సంకర్షణాచార్యులు, శ్రీహరిఆచార్యులు, ఫణికుమారాచార్యులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రేపు సుదర్శన హోమం
ఈ నెల 9న మంగళవారం శ్రీసుదర్శన జయంతి సందర్భంగా దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నట్టు దేవాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు.
Advertisement
Advertisement