
సాక్షి,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, బేతవోలులో జరిగిన దసరా ఉత్సవాల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ వీరకుమార్ ఆలయంలో మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి దిగాడు.
అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లుపై కూడా దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోదాడ పట్టణ సీఐ రాము ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాడు.
మాజీ సర్పంచ్ నాగయ్య ఆలయం భయట మూత్ర విసర్జన చేస్తుండగా.. కొందరు వీడియోలు తీసి వాట్సప్‌లో షేర్ చేయడంతో గొడవ తలెత్తింది. ఇదికాస్తా ఘర్షణకు దారితీయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ వీరకుమార్‌పై చిలుకూరు పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై రజితారెడ్డి తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment