Tulasi
-
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!
శ్రీరాముడు కొలువైన నగరమైన అయోధ్య(యూపీ)లో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణంలో యువత భాగస్వాములవుతున్నారు. వారంతా సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో యువత ఆలయాలకు చేరుకుని, పూజలు చేస్తుండటం మరింతగా కనిపిస్తోంది. కార్తీకమాసంలో అయోధ్యకు దాదాపు 30 లక్షల మంది రామభక్తులు తరలివచ్చారు. వీరిలో గరిష్ట సంఖ్యలో యువత ఉన్నారు. మరోవైపు అయోధ్యలో తులసి మాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్యలో తులసి మాలలు విక్రయమవుతున్నాయి. యువత తులసి మాలలు ధరించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు, భక్తుల రద్దీ మరింతగా పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే యువత తులసిమాల వేసుకోవాలని భావిస్తున్నారన్నారు. కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తులసి మాలలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. తులసి మాలలను చేతితో తయారు చేసే భువన్ దేవి మాట్లాడుతూ తన భర్తతో పాటు చాలా కాలంగా తాను ఈ పనిలో నిమగ్నమయ్యానని, ఇప్పుడు యువత అమితంగా తులసిమాలలకు ఆకర్షితులు కావడం చూస్తున్నానని అన్నారు. గత ఏడాది కాలంగా తులసి, రోజా, రుద్రాక్ష మాలలను యువతీయువకులు కొనుగోలు చేస్తున్నారన్నారు. తులసి మాల ధారణతో మనస్సు, వాక్కు రెండింటికీ స్వచ్ఛత లభిస్తుందని చెబుతారు. తులసి మాల ధరించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతుందని, భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందుతారని భక్తులు నమ్ముతారు. తులసి మాల మనశ్శాంతిని అందిస్తుందని కూడా అంటారు. తులసి మాల ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు -
కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్ అని!
కోకాపేట ఆంటీ గుర్తుందా? పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని తను చాలా రిచ్ అని చెప్పకనే చెప్తుండేది. తులసి సినిమా చూసిన అందరికీ ఆమె ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కోకాపేట ఆంటీ పాత్రను ఝాన్సీ పోషించింది. ఈ మూవీలోని ఓ డైలాగ్‌లో ఆమె మాట్లాడుతూ.. 'కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడ పెట్టుకోవాలో తెలీనంత డబ్బు వచ్చింది. అందులకేంచి పది లక్షలు తీసి ఈ కోక, నగలన్నీ కొన్నడు మా ఆయన' అని చెప్తుంది. ఇప్పుడీ డైలాగ్ మరోసారి వైరలవుతుంది. ఎకరానికి వంద కోట్లు కారణం.. కోకాపేటలో పెరిగిన భూమి ధరలు. హైదరాబాద్ శివారులో ఉన్న కోకాపేటలో భూముల ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఎకరం ఏకంగా వంద కోట్లు దాటింది. అయితే కోకాపేట అంటే ఎప్పటినుంచో రిచ్ అంటూ తులసి సినిమాలోని ఝాన్సీ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. 'కోకాపేట ఆంటీ చెప్పిందంటే అది నిజమే మరి', 'కోకాపేట అంటే మామూలుగా ఉండదు' అని కామెంట్లు చేస్తున్నారు. కోకాపేటలో రికార్డు ధరలు కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి. నిధుల సమీకరణలో భాగంగా హెచ్ఎండీఏ గురువారం నాడు మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.25 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. చదవండి: బుల్లితెర నటి ఇంట తీవ్ర విషాదం.. పెళ్లయిన ఏడాదికే -
నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా కాబోయే చోటి బహు (చిన్న కోడలు) రాధికా మర్చంట్‌కి అత్తగారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట. అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్‌కి నీతా అంబానీ ఒక అందమైన బహుమతి ఇవ్వడం వైరల్‌గా మారింది. నీతా, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో నిశ్చితార్థం తరువాత రాధికా మర్చంట్ అంబానీ కుటుంబంలో కీలక వ్యక్తిగా మారిపోవడమే కాదు, అత్తమామలతో పాటు, తోటికోడలు శ్లోకా మెహతా, ఆడపడుచు ఇషా అంబానీ కుటుంబాలతో బాగా కలిసి పోయింది. ఏ ఈవెంట్లో చూసిన వారితో సందడి చేస్తోంది. (హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా? ) తాజాగా నీతా అంబానీ తన కాబోయే కోడలు రాధికా మర్చంట్ కోసం సిద్ధం చేసిన అందమైన గిఫ్ట్ హ్యాంపర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, తులసి మొక్కతోవెండి కుండీతోపాటు పాటు, వెండి అగరుబత్తీ స్టాండ్, లక్ష్మీ-గణేష్ విగ్రహాలసెట్ను చూడవచ్చు. అంతేకాదు తెల్ల చామంతి పువ్వులతో అద్భుతంగా అలంకరించిన ఈ స్పెషల్ హాంపర్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో ) జనవరిలో గుజరాతీ సంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ 'గోల్ ధన' వేడుకలో రాధికా మర్చంట్ ,అనంత్ అంబానీ నిశ్చితార్థం చేసుకున్నారు. నీతా అంబానీ మాదిరిగానే రాధికా మర్చంట్ కూడా అందమైన భరతనాట్యం నృత్యకారిణి కూడా. జూన్ 2022లో, 'ది గ్రాండ్ థియేటర్' (జియో వరల్డ్ సెంటర్)లో ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) -
దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?
భారతీయ సినీ పరిశ్రమలో సినీ నేపథ్య గాయకులకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. ప్లేబ్లాక్ సింగింగ్ను కరియర్‌గా ఎంచుకున్న మహిళలు కూడా చాలామందే ఉన్నారు. తెలుగులో సుశీల, జానకి మొదలు వాణీ జయరాం, సునీత, చిన్మయి, ఉష లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే లతామంగేష్కర్, ఆశా భోంశ్లే బాలీవుడ్ సినిమాను ఏలారు. ఇంకా సునిధి చౌహాన్ , శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ లాంటి వాళ్లు లెజెండ్స్‌గా ఈ తరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో చూద్దాం. భారతీయ సంగీతంలో ప్లేబ్యాక్ సింగింగ్‌కు సంబంధించి1950-60లలో గాయకులకు పైసా కూడా చెల్లించేవారు కాదట. కానీ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వాళ్లు పోరాటం ఫలితంగా ఈ తరం గాయకులు మంచి రెమ్యునరేషన్‌ను అందుకోవడం విశేషమే మరి. ఎంతగా అంటే నేడు చాలా మంది గాయకులు కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు లక్షల్లో వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు అనగానే పలు భాషల్లో తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు గుర్తు వస్తారు కదా! (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఈ పేర్లు టాప్ 5లో ఉన్నప్పటికీ, నికర విలువ పరంగా చూస్తే మాత్రం 37 ఏళ్ల తులసీ కుమార్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈమె నికర విలువ రూ. 200 కోట్లు. అయితే పాటలు పాడటంతోపాటు, కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపాదన కూడా ఈమె నెట్‌వర్త్‌కు జత కలిసింది. కంటే కొంత తక్కువగానే ఉన్నాయి. గాయకుడు-అలా సింగర్=ఆంట్రప్రెన్యూర్ నికర విలువ 25 మిలియన్లు డాలర్లు. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరి తులసికి కుటుంబ వ్యాపారంలో వాటా ఉంది. సుమారు 4000 కోట్ల కంపెనీలో ఆ వాటా ఆమెకు అపారమైన సంపదను జోడిస్తోంది. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి) దాదాపు రూ.180-185 కోట్ల నికర విలువతో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, 100 కోట్ల రూపాయలతో తరువాతి ప్లేస్‌లో ఉన్నారు. ఇక సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర విలువ రూ. 80 కోట్లకు పైగా ఉండగా, లేటెస్ట్ సెన్నేషనల్ సింగర్ నేహా కక్కర్ విలువ దాదాపు రూ. 40 కోట్లు. అయితే ఇండియా అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే తులసి నికర విలువ తక్కువే. ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయుడు ఏఆర్ రెహమాన్ నికర విలువ రూ. 500 కోట్లకు పైగా మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్లకంటే చాలా ఎక్కువ. తులసి మరిన్ని విషయాలు 1986 మార్చి 15న న్యూఢిల్లీలో జన్మించారు తులసి సోదరుడు భూషణ్ కుమార్, ఖుషాలి కుమార్ అనే సోదరి ఉన్నారు. లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాలలో చదువుకుంది. వ్యాపారవేత్త హితేష్ రాల్హాన్తో 2015లో ప్రేమ వివాహం. వీరిద్దరికీ 2017లో శివాయ్ రాల్హాన్ అనే పాప పుట్టింది. 2009లో 'లవ్ హో జే' ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బంలతో మిలియన్ల వ్యూస్‌తో ఆదరణ పొందడమే కాదు తన గాన ప్రతిభకు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2010- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు 2014- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2017- ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2017- మిర్చి మ్యూజిక్ అవార్డు 2019- IIFA బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌కి నామినేట్ -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
Health: ఏది పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు! పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు.. ఇంకా తులసితో..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం. అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సహజ చిట్కాలు... ►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది. ►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది. ►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది ►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙ ►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది. వేడినీళ్ళకే ఓటేయండి... ►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఈ పండ్లు మంచివి పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధం వాసా తులసి ప్లస్ ప్రవేశపెట్టింది. వైద్యపరంగా నిరూపితమైన వాము పువ్వు, ప్రిమ్ రోజ్, తాలీస పత్రం, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనా ఇందులో వాడారు. కఫాన్ని తొలగించడానికి వస, వాము సాయపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ఆస్తమా, దగ్గు-జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సైనసైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ -
కార్తికేయ 2 సినిమా ఒక ఎత్తు.. ఆ ఒక్క స్పీచ్ మరో ఎత్తు: నటి
తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కలిసి దాదాపు 700 సినిమాలు చేసింది నటి తులసి. ఒకప్పుడు హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇటీవల ఎక్కువగా అమ్మ పాత్రల్లో ఒదిగితోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కార్తికేయ 2తో మరింత ఊపు మీదున్న ఆమె వరుస సినిమాలకు సంతకం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తులసి మాట్లాడుతూ.. 'నేను 1967లో జన్మించాను. పుట్టిన మూడు నెలలకే నటించాను. మూడేళ్లకే డైలాగ్స్ చెప్పాను. అంటే 56 ఏళ్లుగా వెండితెరపై నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నాలుగు స్తంభాలాట సినిమాలో అలీ హీరో, నేను హీరోయిన్. షూటింగ్ గ్యాప్‌లో అలీ నాకు సరదాగా సైట్ కొట్టేవాడు. ఇక కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఆ మూవీ సక్సెస్ ఒక ఎత్తయితే, ఆ సినిమా స్పీచ్ వల్ల నాకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫిజికల్ అన్నారంటే ఒక్కొక్కరి తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ సమంత గ్లిజరిన్ కూడా వాడదు: యశోద డైరెక్టర్స్ -
పాచి పని చేసే అత్త, నిరుపేద ఇంటికి కోడలిగా వెళ్లా: తులసి
సీనియర్ నటి తులసి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 56 ఏళ్లకు పైనే అయింది. తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు భాషల్లో దాదాపు 700 సినిమాలు చేసింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 'డైరెక్టర్ శివమణితో వన్ డే మ్యాచ్‌లా నా పెళ్లయిపోయింది. బెంగళూరులో మా తాతగారు కట్టిన బాబా గుడిలో ఆయనతో నా వివాహం జరిగింది. నిజం చెప్పాలంటే ఒక బీదవాడిని పెళ్లి చేసుకున్నా. మా అత్తగారు వేరే వాళ్ల ఇంట్లో పాచిపనులు చేసింది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆస్తి వచ్చింది. కాకపోతే మా ఆయన హీరోగా సినిమాలు చేసి అప్పులప్పాలయ్యారు. ఓసారి నేను మిణుగు తార అనే సినిమా రాశాను. దాన్ని మేమే నిర్మించాం. సినిమా హిట్టయితే బాబా గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్టయంది. రూ.13 కోట్ల లాభం వచ్చింది, కానీ మా ఆయన మొక్కు మాత్రం తీర్చలేదు. దీంతో వచ్చింది వచ్చినట్లు పోయింది. చాలా లేట్‌గా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇకపోతే నేను మొదట్లో బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు సాయిబాబాను చాలా తిట్టాను. అప్పుడు ఒక రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు బాబా నా గదిలోకి వచ్చి అమ్మా అని పిలిచి, గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లి అన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమ్ముడు చనిపోయిన ఆరేళ్లకు నాకు కొడుకు పుట్టాడు. అతడికి సాయి అని పేరు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది. అలనాటి హీరోయిన్ సావిత్రమ్మ గురించి చెప్తూ.. ఆమె అక్షయపాత్రవంటివారు. ఎవరు ఏం అడిగినా ఇచ్చేసేవారు. కానీ చివరి రోజుల్లో నరకం అనుభవించారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మహానటి సినిమాలో సావిత్రి తల్లి పాత్ర చేయమని నన్ను అడిగారు, కానీ కుదర్లేదు, పిన్ని రోల్ అడిగారు.. అప్పుడు కూడా డేట్స్ సెట్టవులేవు. చాలా ఫీలయ్యాను. తర్వాత సమంత తల్లి రోల్ ఆఫర్ చేశారు. చిన్న పాత్రయినా సరే చాలని చేసేశా. మా తాతగారు ఎప్పుడూ అంటుండేవారు... హీరోయిన్గా ఫేడవుట్ అయ్యాక అమ్మగా మంచి పేరు తెచ్చుకుంటావు అని! ఆయన చెప్పిందే జరిగింది అని తెలిపింది తులసి. చదవండి: ఐటం సాంగ్.. అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్ ఈ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్లో -
వెండితెర తల్లులు.. ఆనాటి నుంచి ఈనాటి వరకు
శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా? పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు. ∙∙ సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది. అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు. ∙∙ అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు. ∙∙ కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు ∙∙ ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. -
Health Tips: ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే..
ఏదైనా మితంగా తినడమే ఉత్తమం. రుచిగా ఉంది కదా అనో, ఇష్టం అనో– పులిహోర ఎక్కువగా తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు పులిహోర తిన్న వెంటనే – గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే – తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు. ►ఇక పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. పిల్లలకు పుదీనా రసాన్ని తాగించడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ►పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి. ►పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి తొందరగా తలెత్తదు. ►ప్రతి రోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి. ►రోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేప ఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బీపీతో బాధపడుతున్న వాళ్లు మినహాయించాలి). చదవండి: Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర (2022 – 23) రాశిఫలాలు -
Health Tips: ఫుడ్ పాయిజనింగ్ సమస్యా.. ఈ చిట్కాతో చెక్!
చెడిపోయిన ఆహార పదార్థాలు, పురుగులు పడిన పండ్లు వంటివాటిని చూసుకోకుండా తింటుంటాం. అందువల్ల ఒకోసారి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది. కడుపులో బాగా గడబిడ, తిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, టీ స్పూన్ ఆవపిండిని గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే కడుపులోని విషపదార్థం వాంతిరూపంలో బయటకు వచ్చేస్తుంది. అస్వస్థత నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులతో కషాయం తులసి ఆకులు తింటే ఎంతో మంచిదంటారు. ఇవి వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడంలో తోడ్పడతాయి. అదే విధంగా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, జయసుధ, తులసి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిబింబాలు’. కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ‘వియ్యాలవారి కయ్యాలు, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం’ వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమా 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ – ‘‘1982 సెప్టెంబర్ 4న ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో కొత్తగా ఉందనిపించి, ఈ చిత్రకథని ఎన్నుకున్నాం. అయితే ఇప్పటికీ అలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏయన్నార్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం అలరిస్తుంది. మేలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్. -
తులసితో కేన్సర్‌కు చెక్
కాజీపేట అర్బన్: నిట్.. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది పరిశోధనలకు కేంద్రబిందువు అని. ఎన్నో ఆలోచనలు, ఆశలతో కళాశాలలో విద్యార్థులు అడుగు మోపుతారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి నిట్ ఒక చక్కటి వేదిక. దీనిలో భాగంగానే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి తలసి ఆకులతో మందును కనుగొన్నారు. కేన్సర్ వ్యాధి నివారణకు బాధితులు అనేక కంపెనీలకు చెందిన మందులను వాడుతున్నారు. అయితే చాలా మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మరణిస్తున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తక్కువ ధరలో సహజ సిద్ధంగా యాంటీకేన్సర్ మందును తయారు చేశారు నిట్ విద్యార్థులు. డ్రగ్‌తో పాటు ఆహారంతో వచ్చే కేన్సర్‌ను రూపుమాపడానికి జౌషధాన్ని కనుగొన్నారు.సర్వ రోగ నివారిణి..తులసిని శాస్త్రీయంగా ఆసీమం టెన్యూఫ్లోరం అని పిలుస్తారు. తులసికి అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు నిర్ధారించి వివిధ రకాల మందుల తయారీలో వాడుతున్నారు. జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, శ్వాస, జీర్ణ సంబంధిత వ్యాధులను తులసితో నివారించవచ్చు. ప్రతి రోజు ఉదయం స్నానం చేయగానే తులసి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందనే నానుడి ఉంది. కాగా మనిషి పుట్టుక మొదలుకుని చివరి శ్వాస విడిచే సమయంలో సైతం తులసి నీరు అందించడం భారతీయుల అనవాయితీ. తులసి ఆకుల రసంతో.. తులసి ఆకుల రసంతో యాంటీ కేన్సర్ డ్రగ్‌కు రూపకల్పన చేశారు. నిట్ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ సతీష్‌బాబు పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్స్ చంద్రసాయి, మాధురి పరిశోధన చేపట్టారు. విభిన్న ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు లక్షలాది సూక్ష్మజీవులకు నిలయంగా ఉండగా 40రకాల సూక్ష్మజీవు(బ్యాక్టీరియా)లపై 2014లో పరిశోధనలు ప్రారంభించారు. తొలుత తులసి ఆకురసంతో బ్యాసిల్లస్ స్టాటోస్పెరికస్ ఔషధ గుణాన్ని కనుగొన్నారు. సూక్ష్మజీవులకు న్యూట్రియెంట్ అగార్ అనే మిడియా(ఫుడ్)ను అందించి వివిధ రకాల ప్రయోగాల అనంతరం ఎల్-ఆస్పిరెన్, ఎల్-గ్లుటామిజెన్ అనే ఎంజైమ్‌లను కనుగొన్నారు. వివిధ దశల్లో ఎంజైమ్‌లను అభివృద్ధి చేసి అక్యూట్ లింపోసిటిక్ లుకేమియా అనే కేన్సర్‌ను(బ్లడ్ కేన్సర్) నివారించే ఔషధం(యాంటీ కేన్సర్ డ్రగ్)ను ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాల పరిశోధనల అనంతరం వారి కల ఫలించింది. త్వరలో వివిధ ప్రాణుల మీద ప్రయోగం చేసి మానవాళిని కేన్సర్ వ్యాధి బారినుంచి కాపాడే ఔషధాన్ని అందించనున్నారు. నిట్ ఖాతాలో మరో పేటెంట్... నిట్ ఖాతాలో మరో పేటెంట్ చేరే అవకాశం ఉంది. ఇటీవల మెకానికల్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ రాపూర్ వెంకటాచలం రూపొందించిన పర్ఫెక్ట్ స్టీరింగ్ మెకానిజం పేటెంట్ సాధించింది. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సతీష్‌బాబు, పీహెచ్డీ స్కాలర్లు తులసి ఆకుల రసంతో రూపొందించిన యాంటీ కేన్సర్ మందునుసైతం పేటెంట్ అనుమతులకు పంపించారు. -
వైభవంగా లక్ష తులసిపూజ
సూర్యాపేటటౌన్ : బదరినారాయణ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆదివారం లక్ష తులసిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ నారాయణమంత్రాన్ని లోకానికి అందించిన బదరీనారాయణ మంత్రాన్ని పఠించిన వారికి మాత్రమే మోక్షం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది పఠించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్వీ సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణ, కృష్ణమూర్తి, రవీందర్, మంజుల, అరుణ, నాగమ్మ, మాధవరావు, అరుణ, సరోజ, సంకర్షణాచార్యులు, శ్రీహరిఆచార్యులు, ఫణికుమారాచార్యులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రేపు సుదర్శన హోమం ఈ నెల 9న మంగళవారం శ్రీసుదర్శన జయంతి సందర్భంగా దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నట్టు దేవాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. -
మూడు నెలల వయసులో నటినయ్యా..
సింహాచలం: మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే సినిమాల్లో నటించానని, ప్రస్తుతం తల్లి పాత్రలంటే చాలా ఇష్టమని సీనియర్ సినీ నటి తులసి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనసింహస్వామిని శుక్రవారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 1967లో విడుదలైన భార్య సినిమాలో రాజబాబు కుమారుడి(మూడు నెలల పాపనైన నన్ను తీసుకున్నారు)గా నటించానన్నారు. మహానటి సావిత్రి మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్, దాంతో నెలల బాబు అవసరం కావడంతో నన్ను తీసుకున్నారన్నారు. అలా సావిత్రి ఇచ్చిన ఆ అవకాశమే నాకు జీవితంగా మారిందని చెప్పారు. బాలనటిగా ఊహ తెలిసి జీవిత తరంగాలు సినిమాలో తొలి డైలాగ్ చెప్పానని గుర్తు చేసుకున్నారు. శంకరాభరణం చిత్రం బాలనటిగా తనకు మంచి గుర్తింపునిచ్చిందన్నారు. హీరోయిన్గా తొలిసారి చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో నటించానన్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మొత్తం 318 చిత్రాల్లో నటించినట్టు ఆమె చెప్పారు. రామ్ కథానాయకుడిగా తీస్తున్న హైపర్ సినిమాలో తల్లి పాత్రలో ప్రస్తుతం నటిస్తున్నానన్నారు. కష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్ర వనం సినిమా కూడా ప్రస్తుతం చేస్తున్నానన్నారు. కష్ణవంశీ సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుందని, అందుకే ఆయనంటే చాలా ఇష్టమని చెప్పారు. బాలనటిగా, కథనాయికిగా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తల్లిపాత్రలో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు అడుగుతున్నారన్నారు. ఈ తరం కథనాయకుల్లో అల్లు అర్జున్, నయనతార, అప్పట్లో ఎస్.వి.రంగారావు, సావిత్రి అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు సినిమాలో తల్లి పాత్ర తానే చేయాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా యాక్ట్ చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నట్లు తులసి చెప్పారు. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వచ్చిన ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని టెంపుల్ ఇన్స్పెక్టరు వాయునందనరావు ఆమెకు అందజేశారు. -
చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట
చెల్లెలి చిత్రం అక్కకు తెగ నచ్చేసిందట. ఈ సోదరి ద్వయం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నాటి అందాల తార రాధ పుత్రికలు కార్తీక, తులసి. నటి తులసి తొలి చిత్రం కడల్ ఆమెను నిరాశ పరిచింది. అయినా యాన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. జీవా సరసన నటించిన ఈ చిత్రంపై తులసి చాలా ఆశలు పెట్టుకుంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్, జయరామన్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. దీనిన తులసి అక్క కార్తీక విడుదల సమయంలో చూడలేదట. ఆమె పొరంబొక్కు చిత్రంతో పాటు తెలుగులో అల్లరినరేష్‌తో నటిస్తున్న చిత్ర షూటింగుల్లో బిజీగా ఉందట. షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ముంబయి చేరుకున్న కార్తీక చెల్లి తులసి నటించిన యాన్ చిత్రం చూడాలని తహతహ లాడిందట. ఈ చిత్రం మంబయిలో విడుదల కాలేదు. త్వరలో అనువాదమై రిలీజ్ అవుతుందట. దీంతో కార్తీక చెల్లెలు తులసిని తీసుకుని తన సొంత ఊరైన కేరళ రాష్ట్రం త్రివేండ్రం వెళ్లి యాన్ చిత్రాన్ని తిలకించింది. తన గెస్ట్‌హౌస్‌లో స్టాఫ్‌తో సహా యాన్ చిత్రాన్ని ఏకంగా రెండుసార్లు చూసిందట. చిత్రం ఆమెకు అంతగా నచ్చేసిందట. ఈ విషయం గురించి నటి తులసి చెబుతూ తన చిత్రం చూసిన అక్క తన ను గట్టిగా కౌగిలించుకుని ముద్దాడిందని చెప్పింది. -
రాధ కుటుంబం నుంచి మరో తార
చిత్ర రంగంలో వారసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ల కుటుంబాల నుంచి వారసురాళ్లు పెరుగుతున్నారు. నటి రాధ విషయం తీసుకుంటే 1990 దశకంలో తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఆమె. ఇప్పుడీ మాజీ బ్యూటీ తన ఇద్దరు కూతుళ్లు కార్తిక్, తులసిలను హీరోయిన్లుగా రంగంలోకి దింపారు. తాజాగా ఆ కుటుంబం నుంచి మరో హీరోయిన్ రంగ ప్రవేశం చేశారు. నటి రాధ సోదరి కూతురు గౌరి నాయర్ వలి యుడన్ ఒరు కాదల్ చిత్రంలో నాయికిగా నటిస్తున్నారు. నాయకుడిగా నవ నటుడు రాజేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మాతాస్ బ్లెస్సింగ్ స్టూడియోస్ పతాకంపై రవి రాజేష్ నిర్మిస్తున్నారు. సంజీవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, పల్లెటూరిలో జాలీగా తిరిగే హీరో పక్క ఊరులోని ధనవంతుల అమ్మాయి ప్రేమలో పడతాడన్నారు. అయితే అతని ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అన్నదే చిత్ర కథ అని చెప్పారు. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండే వలియుడన్ ఒరు కాదల్ చిత్ర చివరి ఘట్ట సన్నివేశాలు అనూహ్య రీతిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను నాగర్‌కోయిల్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. జికె సెల్వ సంగీతానికి, ఎస్ సెల్వకుమార్ చాయాగ్రహణం అందించారు. -
అమ్మ చెప్పిన చిత్రాల్లోనే నటిస్తా
తన తల్లి చెప్పిన చిత్రాల్లోనే నటిస్తానని వర్ధమాన నటి తులసి చెబుతున్నారు. 1980 దశకంలో నటీమణుల ద్వయం అంబికా, రాధ ఇరువురు తమ తల్లి మాటకు కట్టుబడి పనిచేశారు. ప్రస్తుతం ఆ అలవాటు కార్తిక, తులసి కూడా కొనసాగిస్తున్నారు. కుమార్తెలు ఇరువురూ షూటింగులకు వెళ్లాలన్నా, దర్శకుల వద్ద కథా చర్చలు చేపట్టాలన్నా తల్లి రాధ వెంట ఉండాల్సిందే. కొత్త దర్శకుల చిత్రాలైతే అన్ని వేళలా షూటింగ్ స్పాట్లలో వారిని వెన్నంటి ఉంటారు. భారతీరాజా దర్శకత్వంలో అన్నకొడి చిత్రంలో కార్తిక, మణిరత్నం దర్శకత్వంలో కడల్ చిత్రంలో తులసి నటించిన సమయంలో మాత్రమే దర్శకుల బాధ్యతకు కుమార్తెలను విడిచిపెట్టారు. ఈ చిత్రాల షూటింగ్లలో కుమార్తెల కోసం వెళ్లిందే లేదట. ప్రస్తుతం కార్తికా, తులసి మళ్లీ అమ్మ కంట్రోల్‌కు వచ్చారు. అందులోను చిన్న కుమార్తె తులసి దీన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. కడల్ చిత్రం తర్వాత యాన్ చిత్రంలో తులసి నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకు చిత్ర వాతావరణం అలవాటైందట. గతంలో కంటే ప్రస్తుతం స్వతంత్రంగా నటించడం ఆరంభించారు. కొత్త చిత్రాలు ఒప్పుకోవడానికి ముందు దర్శకులు ఎవరైనప్పటికీ అమ్మ రాధ వద్ద ఓకే తీసుకున్న తర్వాతనే అగ్రిమెంట్‌పై తులసి సంతకం చేస్తారు. దీని గురించి ఆమె వద్ద ప్రశ్నించగా ఏ క్యారెక్టర్ తనకు సరిపడుతుందనేది అమ్మకు తెలుసని, అందుకే ఆమె నిర్ణయం మేరకు నడుచుకుంటున్నాన న్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తపేట, న్యూస్‌లైన్ : కొత్తపేట మండలం పలి వెల వంతెన సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అమలాపురం శ్రీరామపురానికి చెందిన ఎం డూరి నాగవెంకట సుబ్బారావు తన భార్య రామతులసి,మూడేళ్ల పాపతో కలసి టీవీఎస్ మోపెడ్‌పై అమలాపురం వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆర్అండ్బీ గైడ్ స్టోన్‌ను ఢీకొన్నాడు. సుబ్బారావు (31) తలకు తీవ్రగాయమై పడిపో యాడు. అతడి భార్య తులసి స్పృహ తప్పి పడిపోయనట్టు భావించి, కొత్తపేటలోని తమ బంధువులకు ఫోన్ చేసింది. వారు సంఘటనస్థలానికి చేరుకుని తులసిని కొత్తపేట పంపించారు. సుబ్బారావును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై ఎ.గరగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు హోల్‌సేల్ మెడికల్ వ్యాపారి. పండగకు తణుకు అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
' ఓ ప్రయత్నం చేసి చూద్దామని'
జోష్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఒకనాటి అందాల తార తనయ కార్తీక ...తనకు నటనే ముఖ్యం కాదంటోంది. అమ్మ బాటలోనే పిల్లలు కార్తీక, తులసి పయనిస్తున్నారు. అయితే వారిద్దరి కెరియర్ ఆశించినంత వేగంగా లేదు. కో చిత్రం కార్తీకకు తమిళంలో మంచి హిట్ అందించింది. తర్వాత వచ్చిన అన్నకొడి నిరాశపరచింది. ప్రస్తుతం అరుణ్ విజయ్ సరసన డీల్ చిత్రంలో నటిస్తోంది. తన కెరియర్ వేగంగా లేకపోవడంపై కార్తీక స్పందించింది. ఆమె మాట్లాడుతూ నటిని అవ్వాలని తాను కోరుకోలేదని తెలిపింది. తాను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుండగా తెలుగులో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఓ ప్రయత్నం చేసి చూద్దామని సినీ రంగంలోకి వచ్చానంది. తమిళంలో నటించిన కో చిత్రం విజయం సాధించడంతో నటిగా కొనసాగుతున్నానని వెల్లడించింది. చివరి వరకు నటిగానే ఉండాలని కోరుకోవడం లేదని, తనకు వేరే ప్రణాళిక ఉందని వివరించింది. అదేమిటన్నది ప్రస్తుతానికి చెప్పనని అంది. త్వరలో డీల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు పేర్కొంది. అంతకంటే ముందు తమ సొంతూరు కేరళలో జరుగుతున్న ఓనం పండుగలో పాల్గొంటున్నట్లు కార్తీక తెలిపింది. ఇక రాధ చిన్న కూతురు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినా .... ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత తులసికి మరే చిత్రంలోనూ అవకాశం రాలేదు. అయితే తొలి నుంచి దర్శకత్వంపై మక్కువ చూపుతున్న తులసి ఆ దిశగా తన కెరీర్ ను మలుచుకుంటున్నట్లు సమాచారం.