Senior Actress Tulasi Comments About Comedian Ali And Her Movie Offers, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Tulasi: పుట్టిన మూడు నెలలకే నటించా, మూడేళ్లకే డైలాగ్‌ చెప్పా

Published Wed, Nov 9 2022 4:58 PM | Last Updated on Wed, Nov 9 2022 6:24 PM

Senior Actress Tulasi About Comedian Ali - Sakshi

తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కలిసి దాదాపు 700 సినిమాలు చేసింది నటి తులసి. ఒకప్పుడు హీరోయిన్‌గా, తర్వాత క్యారెక్టర​ ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇటీవల ఎక్కువగా అమ్మ పాత్రల్లో ఒదిగితోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన కార్తికేయ 2తో మరింత ఊపు మీదున్న ఆమె వరుస సినిమాలకు సంతకం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తులసి మాట్లాడుతూ.. 'నేను 1967లో జన్మించాను. పుట్టిన మూడు నెలలకే నటించాను. మూడేళ్లకే డైలాగ్స్‌ చెప్పాను. అంటే 56 ఏళ్లుగా వెండితెరపై నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నాలుగు స్తంభాలాట సినిమాలో అలీ హీరో, నేను హీరోయిన్‌. షూటింగ్‌ గ్యాప్‌లో అలీ నాకు సరదాగా సైట్‌ కొట్టేవాడు. ఇక కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఆ మూవీ సక్సెస్‌ ఒక ఎత్తయితే, ఆ సినిమా స్పీచ్‌ వల్ల నాకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఫిజికల్‌ అన్నారంటే ఒక్కొక్కరి తోలు తీస్తా: రేవంత్‌ వార్నింగ్‌
సమంత గ్లిజరిన్‌ కూడా వాడదు: యశోద డైరెక్టర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement