సీనియర్ నటి తులసి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 56 ఏళ్లకు పైనే అయింది. తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు భాషల్లో దాదాపు 700 సినిమాలు చేసింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
'డైరెక్టర్ శివమణితో వన్ డే మ్యాచ్‌లా నా పెళ్లయిపోయింది. బెంగళూరులో మా తాతగారు కట్టిన బాబా గుడిలో ఆయనతో నా వివాహం జరిగింది. నిజం చెప్పాలంటే ఒక బీదవాడిని పెళ్లి చేసుకున్నా. మా అత్తగారు వేరే వాళ్ల ఇంట్లో పాచిపనులు చేసింది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆస్తి వచ్చింది. కాకపోతే మా ఆయన హీరోగా సినిమాలు చేసి అప్పులప్పాలయ్యారు. ఓసారి నేను మిణుగు తార అనే సినిమా రాశాను. దాన్ని మేమే నిర్మించాం. సినిమా హిట్టయితే బాబా గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్టయంది.
రూ.13 కోట్ల లాభం వచ్చింది, కానీ మా ఆయన మొక్కు మాత్రం తీర్చలేదు. దీంతో వచ్చింది వచ్చినట్లు పోయింది. చాలా లేట్‌గా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇకపోతే నేను మొదట్లో బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు సాయిబాబాను చాలా తిట్టాను. అప్పుడు ఒక రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు బాబా నా గదిలోకి వచ్చి అమ్మా అని పిలిచి, గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లి అన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమ్ముడు చనిపోయిన ఆరేళ్లకు నాకు కొడుకు పుట్టాడు. అతడికి సాయి అని పేరు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది.
అలనాటి హీరోయిన్ సావిత్రమ్మ గురించి చెప్తూ.. ఆమె అక్షయపాత్రవంటివారు. ఎవరు ఏం అడిగినా ఇచ్చేసేవారు. కానీ చివరి రోజుల్లో నరకం అనుభవించారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మహానటి సినిమాలో సావిత్రి తల్లి పాత్ర చేయమని నన్ను అడిగారు, కానీ కుదర్లేదు, పిన్ని రోల్ అడిగారు.. అప్పుడు కూడా డేట్స్ సెట్టవులేవు. చాలా ఫీలయ్యాను. తర్వాత సమంత తల్లి రోల్ ఆఫర్ చేశారు. చిన్న పాత్రయినా సరే చాలని చేసేశా. మా తాతగారు ఎప్పుడూ అంటుండేవారు... హీరోయిన్‌గా ఫేడవుట్ అయ్యాక అమ్మగా మంచి పేరు తెచ్చుకుంటావు అని! ఆయన చెప్పిందే జరిగింది అని తెలిపింది తులసి.
చదవండి: ఐటం సాంగ్.. అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్
ఈ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్‌లో
Comments
Please login to add a commentAdd a comment