మహేశ్‌ది, నాది సేమ్‌ ఏజ్‌.. హీరోయిన్‌గా చేస్తా కానీ తల్లిగా నో ఛాన్స్‌! | How Can I Act As Mother With Mahesh Babu: Kasturi Shankar - Sakshi
Sakshi News home page

Kasturi Shankar: రజనీకాంత్‌ పక్కన హీరోయిన్‌గా మూడుసార్లు అడిగారు!

Published Fri, Mar 29 2024 4:25 PM | Last Updated on Fri, Mar 29 2024 5:00 PM

Kasturi Shankar: How Can I Act As Mother of Mahesh Babu - Sakshi

కస్తూరి శంకర్‌.. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పార్టిసిపేట్‌ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

టైఫాయిడ్‌ రావడంతో వదిలేశా
కస్తూరి మాట్లాడుతూ.. 'రజనీకాంత్‌తో మూడుసార్లు నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ చేజారిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. జెంటిల్‌మెన్‌ హిందీ వర్షన్‌లో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నేను చేయాల్సింది. సరిగ్గా అదే సమయంలో టైఫాయిడ్‌ రావడంతో ఆ అవకాశం పోయింది. గతేడాది రిలీజైన డెవిల్‌ మూవీలో సీత చేసిన పాత్ర కూడా ముందు నాకే వచ్చింది. సినిమాకు సంతకం చేశాక నేను యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు.

అదే నా బాధ..
కాలా మూవీలో కూడా రజనీ పక్కన యంగ్‌గా కనిపిస్తున్నానని నన్ను తీసేసి ఈశ్వరి రావును సెలక్ట్‌ చేశారు. నేను పెద్ద వయస్కురాలిగా కనిపించను.. అదే నా బాధ. నా ముఖంలో నా వయసు కనిపించదు. ఇప్పటికీ తెల్లజుట్టు కూడా రాలేదు. అందుకే కొన్ని సినిమాలకు నేనే నా జుట్టుకు తెల్లరంగు వేసుకుంటున్నాను. తల్లి పాత్రలు వస్తున్నాయి.. కానీ ఏ హీరోకు అని చేయగలను? మహేశ్‌బాబుది, నాది ఒకే వయసు. అతడికి జోడీగా నటించగలను.. కానీ, తల్లిగా ఎలా చేయగలను? చూడటానికి అస్సలు బాగోదు' అని కస్తూరి చెప్పుకొచ్చింది.

చదవండి: ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement