kasturi
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
నటి కస్తూరికి బెయిల్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.ఈ కారణం వల్లే అరెస్ట్నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
సంచలన వీడియో రిలీజ్ చేసిన నటి కస్తూరి
-
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. తెలుగువారు ఎవరు?అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. పోలీసుల గాలింపుకానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.చదవండి: నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్ -
నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి
తమిళనాడులో తెలుగు ప్రజలనుద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు కూడా నమోదైయింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కస్తూరి మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకకరించారని చెబుతోంది.తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవం అని.. వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.‘తమిళనాడులో ఇప్పుడు డ్రవిడియన్ ఐడియాలజీ జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తాగుడు అలవాటే లేకున్నా.. తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు జరిపిస్తున్నారు. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. తెలుగు అనే పదం వాడింది నిజమే. కానీ నేను ఏ ఉద్దేశ్యం గురించి ఆ పదం వాడానో నా స్పీచ్ మొత్తం వింటే తెలుస్తుంది. తెలిసో తెలియకో ఓ మాట అన్నాను.దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కస్తూరి అన్నారు. -
నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం?
తమిళసినిమా: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసే విషయమై న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున కసూ్తరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 192, 196(1ఏ)3 53 ,353(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నటి కస్తూరి అరెస్ట్ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కస్తూరి ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, తన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే వారికి క్షమాపణ చెబుతున్నానని ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: రోజుకో వ్యక్తితో నాకు అక్రమ సంబంధం పెడుతున్నారు -
మహేశ్‌ది, నాది సేమ్ ఏజ్.. హీరోయిన్గా చేస్తా కానీ తల్లిగా నో ఛాన్స్!
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టైఫాయిడ్ రావడంతో వదిలేశా కస్తూరి మాట్లాడుతూ.. 'రజనీకాంత్‌తో మూడుసార్లు నటించే ఛాన్స్ వచ్చింది. కానీ చేజారిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. జెంటిల్మెన్ హిందీ వర్షన్లో చిరంజీవి పక్కన హీరోయిన్గా నేను చేయాల్సింది. సరిగ్గా అదే సమయంలో టైఫాయిడ్ రావడంతో ఆ అవకాశం పోయింది. గతేడాది రిలీజైన డెవిల్ మూవీలో సీత చేసిన పాత్ర కూడా ముందు నాకే వచ్చింది. సినిమాకు సంతకం చేశాక నేను యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు. అదే నా బాధ.. కాలా మూవీలో కూడా రజనీ పక్కన యంగ్‌గా కనిపిస్తున్నానని నన్ను తీసేసి ఈశ్వరి రావును సెలక్ట్ చేశారు. నేను పెద్ద వయస్కురాలిగా కనిపించను.. అదే నా బాధ. నా ముఖంలో నా వయసు కనిపించదు. ఇప్పటికీ తెల్లజుట్టు కూడా రాలేదు. అందుకే కొన్ని సినిమాలకు నేనే నా జుట్టుకు తెల్లరంగు వేసుకుంటున్నాను. తల్లి పాత్రలు వస్తున్నాయి.. కానీ ఏ హీరోకు అని చేయగలను? మహేశ్‌బాబుది, నాది ఒకే వయసు. అతడికి జోడీగా నటించగలను.. కానీ, తల్లిగా ఎలా చేయగలను? చూడటానికి అస్సలు బాగోదు' అని కస్తూరి చెప్పుకొచ్చింది. చదవండి: ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్ -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్‌లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
Kasthuri Shankar : సీరియల్ నటి కస్తూరిని ఇలా గ్లామర్ లుక్‌లో చూశారా? (ఫోటోలు
-
ఆ విషయంలో జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారు. కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాద్‌కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది. -
అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరి, స్వయంగా వెల్లడించిన నటి
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్ చేసింది. ‘ప్రస్తుతం చికెన్ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) -
నటి కస్తూరి తన సంపాదనను ఏం చేస్తుందో తెలుసా? బయటికొచ్చిన షాకింగ్ నిజాలు
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సామాజం ఆమె ఎదుర్కొనే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఆమె సామాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుందనే విషయం తెలిసిందే. ఇటీవల నయనతార సరోగసిపై ట్వీట్ చేసి వివాదానికి తెరలేపింది. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం అలా గతంలో ఆమె ఎన్నో అంశాలపై ఆమె ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల చెన్నై మెట్రోలో ప్రయాణించిన ఆమె తన ఫోన్ పొగొట్టుకుందట. దీంతో కస్తూరి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఫోన్‌ను వెతికిపెట్టి ఇచ్చారట. దీంతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీసెంట్గా ఆమె ట్వీట్ చేసింది. ‘చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది. మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు. పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది. ఇలా ఉంతోమంది ప్యాసింజర్ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు. అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్ ఇక ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘మీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దీంతో మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెలబ్రెటీ అయి ఉండి ఆడంబరాలకు పోకుండ సాధారణ జీవితం గడుపుడుతూ ఉన్నంతో ఇతరులకు సాయం చేస్తున్న ఆమె పట్ల గౌరవం పెరిగిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా కస్తూరి నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. OMG @cmrlofficial found my phone! No words to praise the dedication and integrity of CMRL staff. Many passengers have gotten back lost valuables. Special thanks to Mr Vijay Varadhan, joint GM . I already am a Chenno metro loyalist, now I have one more reason to love them! https://t.co/UGLpAYrFbR — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 I don't own a car. I don't have tv. I don't use Air conditioning. I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 -
నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
సీనియర్ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. వివాస్పద ట్వీట్స్ చేస్తూ తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి సంచలన ట్వీట్ చేసి వార్తల్లోకెక్కింది. భారతదేశంలో సరోగసిని బ్యాన్ చేశారంటూ ఆమె చేసిన ట్వీట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘ఇండియాలో సరోగసీపై నిషేధం విధించారు. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప.. సరోగసీని ప్రోత్సాహించకూడదు. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. చదవండి: మనోజ్ సెకండ్ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్ దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’ అంటూ కస్తూరి ఆమె తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లయిన విషయం ప్రకటించిన అనంతరం కాసేపటికే ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం. జూన్ 9న ప్రియుడి విఘ్నేశ్ శివన్‌తో ఏడడుగులు వేసిన నయన్ ఆదివారం(అక్టోబర్ 9న) కవలకు తల్లయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సరోగసి ద్వారా కవలకు జన్మనిచ్చిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో నటి కస్తూరి సరోగసిపై ట్వీట్ చేయడంతో ఆమె నయన్‌ను టార్గెట్ చేసిందని అందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే దీంతో నయన్ ఫ్యాన్స్ కస్తూరిపై మండిపడుతున్నారు. ‘ఇప్పుటి రోజుల్లో లా(Law)ని ఎవరు ఫాలో అవుతున్నారు?’, ‘ఎవరి జీవితం వారిది.. మీకేందుకు, మీ పని మీరు చూసుకోండి’, ‘ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఎవరిని భయపెడుతున్నారు.. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారా?’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలకు సైతం ఆమె స్పందిస్తూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నా పని నన్ను చూసుకో అని చెప్పిన వారందకి ఇదే నా సమాధానం. ‘లాయర్‌గా పట్టా పొందిన ఓ వ్యక్తిగా చట్టపరమైన అంశాలను విశ్లేషించే హాక్కు ఉంటుంది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. Surrogacy is banned in India except for medically inevitable reasons. This is the law from Jan 2022. We are going to be hearing a lot about this for next several days. — Kasturi Shankar (@KasthuriShankar) October 9, 2022 -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలను ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ప్రశంసించారు. 11వ వర్శిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణల పట్ల ఆయన అభినందించారు. వర్చువల్ ద్వారా పాల్గొన్న కస్తూరి రంగన్‌కు సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా సంస్కరణలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఏపీలో అమలవుతున్న విద్యా పథకాలపై సీఎం వైఎస్ జగన్‌ను కస్తూరి రంగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో సమర్థవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు, ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యా పథకాల అమలుపై కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు. -
అమెరికాలో ఫ్యాన్స్‌ను కలిసిన రజనీ, ఫొటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెరికాలోని ఆయన అభిమానులను కలిసిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల జనరల్ చెకప్‌లో భాగంగా భార్యతో కలిసి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అభిమానులను కలిసి ముచ్చటిచ్చారు. అనంతరం వారితో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. కాగా 2016లో రజనీ ఇక్కడే కిడ్నీ మార్పిడి సర్జరీ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనరల్ చెకప్ కోసం అమెరికాకు రెగ్యూలర్‌గా వెళుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల భార్య లతతో కలిసి అమెరికాకు పయనమవగా, కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్, వారి పిల్లలు కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అయితే రజనీ ఆరోగ్యంపై రచయిత వైరముత్తు ఓ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే తిరిగి ఇండియాకు రానున్నారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా రజనీ అమెరికా పయనంపై నటి కస్తూరి వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజా ట్వీట్లో ‘గత మే నెల నుంచి భారతీయులు అమెరికా వెళ్లడంపై నిషేధం విధించింది. ఎలాంటి హెల్త్ ఎమర్జేన్సీ అయినా ఇండయన్స్ అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో రజనీ అంత అర్జేంట్‌కు అమెరికా ఎందుకు వెళ్లినట్లు. ఇక్కడ హస్పీటల్స్ లేవా. జనరల్ చేకప్‌యే కదా అది ఇక్కడ చేయించుకోరాదా?. ఆయన రాజకీయ ప్రవేశం గురించి తప్పించుకునేందుకే ఆయన అమెరికా వెళ్లినట్టు ఉంది. ఆయన దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు. ప్లీజ్ త్వరలో మీ పొలిటికల్ ఎంట్రీపై ఓ స్ఫష్టత ఇవ్వండి రజనీ సర్’ అంటూ కస్తూరి రాసుకొచ్చారు. -
నటుడు మృతిపై కస్తూరి సంతాపం; మండిపడుతున్న నెటిజన్లు
తమిళ నటుటు, నిర్మాత వెంకట్ సుభా మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29) తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, నటి రాధిక శరత్ కుమార్‌లతో పాటు నటి కస్తూరి శంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కస్తూరి ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. Shocked beyond belief. Venkat sir . Returned frm Udhaynidhi new film shoot , got fever next day, but not positive... after a week got sick... and now he is gone. he wasn't vaccinated it seems. I am so sorry subha. pic.twitter.com/trdZ41ZSBa — Kasturi Shankar (@KasthuriShankar) May 29, 2021 ఇక రాధిక ట్వీట్ చేస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు. వెంకట్ గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మరణవార్త తెలియగానే గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారి జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు. So very saddened to say goodbye to Venkat, his wife Subaa has been associated with me for many years in Radaan. Venkat was a kind, strong thinking person& known him for many years. Subaa fought so strongly for his recovery, heartbreaking to see he lost the fight. Prayers to all pic.twitter.com/43oorm0lvz — Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2021 -
ప్రశ్నించడం మానండి
‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు చెబుతున్నారు. చాలా మంది నటీమణులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి, ‘అన్నమయ్య’ ఫేమ్ కస్తూరి కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి కస్తూరి మాట్లాడుతూ– ‘‘పబ్లిసిటీ కోసమే హీరోయిన్లు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాటిని వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి తనకు ఇలా జరిగిందని చెప్పగానే మనం చేసే మొదటి పని తనని జడ్జ్ చేయడం. ఇలా ఆరోపించడం వల్ల తనకు లాభం ఏంటి? అని ఆలోచిస్తున్నారు కూడా. అలాంటి సంఘటనలు బయటకు చెప్పడానికే ఎంతో ధైర్యం కావాలి. ఇలా చెప్పడం వల్ల తను ఏదో సాధిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. తప్పుడు ఆరోపణలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలని, పాపులర్ అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు. మనం అనవసరంగా ప్రశ్నిస్తే ఇంకెప్పుడూ ఎవరూ ముందుకు వచ్చి తమ వేదనను పంచుకోరు. ‘ఈ విషయం జరిగినప్పుడే ఎందుకు బయటకు చెప్పలేదు?’ అని చాలామంది అంటుంటే విన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవ్వరైనా వాటి నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు తప్పితే కంప్లయింట్ ఇవ్వాలనుకోరు. నేనిచ్చే సలహా ఏంటంటే స్త్రీలను ప్రశ్నించడం మానేసి, అలాంటి ఇబ్బందులు పెట్టిన వారి నుంచి సమాధానాలు రాబట్టడం మంచిదనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
మనస్తత్వాలు మారాలి
... అంటున్నారు నటి కస్తూరి. కస్తూరి అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తారు. ‘అన్నమయ్య’ సినిమాలో ‘ఏలే ఏలే మరదలా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేశారు. ఈ మధ్య ‘శమంతకమణి’లో సుధీర్‌బాబు తల్లిగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన ‘తమిళ పడమ్ 2.0’ సినిమా టీజర్లో గ్లామరస్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు కస్తూరి. ‘‘ఒక రెస్పాన్సిబుల్ మదర్‌గా ఉంటూ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం కరెక్ట్ కాదు’’ అంటూ విమర్శకు గురయ్యారామె. దీనికి కస్తూరి స్పందిస్తూ – ‘‘ఈ ఆలోచనా ధోరణే మార్చుకోవాలంటున్నాను. సెక్సీగా కనపడటం అంటే నీతి నియమాలకు దూరంగా ఉండటం, అమ్మతనానికి కళంకం తేవడం అనే ఆలోచనా ధోరణి మారాలి. ‘మీరు డ్రింక్ చేసే సీన్స్‌లో, రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు పిల్లలున్నారు’ అని మేల్ ఆర్టిస్ట్‌లకు చెప్పం కదా. మరి ఆడవాళ్లకే ఎందుకీ నియమాలు. ఆర్టిస్ట్ అంటే ఎవరైనా ఒకటే కదా’’ అన్నారు. -
రజనీ తప్ప వేరే విషయాలు లేవా?: నటి ప్రశ్న
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నదని, అయినా ఆ విషయాలేవీ పట్టించుకోకుండా కేవలం రజనీకాంత్ రాజకీయ ఆగమనం మీద జాతీయ మీడియా ఫోకస్ చేయడం దారుణమని ప్రముఖ తమిళ నటి కస్తూరి విమర్శించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆమె గతంలో వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మీడియా తీరును తప్పుబట్టారు. ‘రజనీకాంతే కాదు తమిళనాడులో చర్చించుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి రాష్ట్రంలో శూన్యత ఆవరించి ఉంది. ఓ మంచి వ్యక్తి వచ్చి ఈ శూన్యాన్ని భర్తీ చేయాలి. అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అంటూ అస్తమానం ఊహాగానాలు చేయడం సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. కస్తూరి ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వల్ల ఆయన రాజకీయ అభిప్రాయాలు తెలుసుకొనే వీలు కలిగిందని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తాజాగా ఈ విషయమై స్పందిస్తూ త్వరలోనే మార్పు దిశగా రజనీ అడుగులు వేసే అవకాశముందని చెప్పారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ రజనీ తన అభిమానుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రజనీ రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది. -
అవగాహన కోసం అర్ధనగ్నంగా ...
చెన్నై : సినిమాను దాటి నటి కస్తూరి అర్ధనగ్నంగా ఒక చంటి బిడ్డను గుండెలకు హత్తుకున్నట్లు కెమెరాకు పోజులిచ్చారు. అవి ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. నటి కస్తూరి దక్షిణాది చిత్రపరిశ్రమలో సుపరిచితురాలే. తమిళంలో ఆత్తా ఉన్కోయిలిలే చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసి చిన్నవర్, సెంతమిళ్‌పాట్టు తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, ప్రభు, ప్రశాంత్ తదితర నటులకు జంటగా నటించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ అన్నమయ్య వంటి పలు చిత్రాల్లో నటించారు. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్న కస్తూరి ఆ మధ్య నాంగ చిత్రం ద్వారా రీఎంట్రీ అయ్యారు. అయితే రీఎంట్రీ ఆమెను కథానాయికగా నిలబెట్టలేక పోయింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. తాజాగా ఒక పుస్తకానికి అర్ధనగ్న పోజు లిచ్చి వార్తల్లోకెక్కారు. అమెరికాకు చెందిన జెడ్ అనే నిశ్చల ఛాయాగ్రహకుడు గర్భిణి స్త్రీల సమస్యలు, ప్రసవం అనంతరం గురయ్యే సుఖ వ్యాధులు క్యాన్సర్, గర్భసంచి సమస్యలు ఇత్యాది విషయాలపై అవగాహన కలిగించేలా ఏ బ్యూటీపుల్ ప్రాజెక్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించనున్నారు. ఈ పుస్తకం కోసం కస్తూరి అర్ధ నగ్న పోజులిచ్చారట.దీని గురించి ఆమె తెలుపుతూ మం చి ప్రయత్నం కోసం తన ఇమేజ్ బాధింపుకు గురవతుందన్న అంశాన్ని కూడా పక్కన పెట్టి అర్ధనగ్న పోజులిచ్చానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడనున్న ఈ పుస్తకం లో కస్తూరిలా మరో 80 మంది స్త్రీల ఈ తరహా పోజులతో కూడిన ఫోటోలు ఆ పుస్తకంలో చోటు చేసుకుంటాయట.