Actress Kasthuri Spend Her Whole Salary To Cancer Children Foundation, Details Inside - Sakshi
Sakshi News home page

Actress Kasturi: నటి కస్తూరి తన సంపాదనను ఏం చేస్తుందో తెలుసా? బయటికొచ్చిన షాకింగ్‌ నిజాలు

Published Wed, Dec 14 2022 3:44 PM | Last Updated on Wed, Dec 14 2022 7:02 PM

Actress Kasthuri Spend Her Whole Salary to Cancer Children Foundation - Sakshi

నటి కస్తూరి శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్‌ ద్వారా తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సామాజం ఆమె ఎదుర్కొనే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఆమె సామాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుందనే విషయం తెలిసిందే. ఇటీవల నయనతార సరోగసిపై ట్వీట్‌ చేసి వివాదానికి తెరలేపింది. 

చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఇంట తీవ్ర విషాదం

అలా గతంలో ఆమె ఎన్నో అంశాలపై ఆమె ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల చెన్నై మెట్రోలో ప్రయాణించిన ఆమె తన ఫోన్‌ పొగొట్టుకుందట. దీంతో కస్తూరి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఫోన్‌ను వెతికిపెట్టి ఇచ్చారట. దీంతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీసెంట్‌గా ఆమె ట్వీట్‌ చేసింది. ‘చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది. మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు. పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది. ఇలా ఉంతోమంది ప్యాసింజర్‌ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు. అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం’ అంటూ ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చింది. 

చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్‌

ఇక ఆమె ట్వీట్‌ చూసిన ఓ నెటిజన్‌ ‘మీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దీంతో  మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెలబ్రెటీ అయి ఉండి ఆడంబరాలకు పోకుండ సాధారణ జీవితం గడుపుడుతూ ఉన్నంతో ఇతరులకు సాయం చేస్తున్న ఆమె పట్ల గౌరవం పెరిగిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా కస్తూరి నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement