Serial actress
-
నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ
బుల్లితెర నటి నవ్య స్వామి (Navya Swamy) బర్త్‌డే నేడు (మార్చి 17). పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇప్పటికే బాలి వెళ్లిపోయింది. అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి కేక్ కట్ చేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. తనకు బర్త్‌డే విషెస్ చెప్పినవారికి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కృతజ్ఞతలు చెప్తూ రిప్లై ఇస్తోంది. అయితే ఓ స్పెషల్ బర్త్‌డే విషెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు రవికృష్ణ (Ravi krishna) ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్య కృష్ణతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. 'ఓ స్వామీ.. హ్యాపీ బర్త్‌డే.. ఈ ఏడాది ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అదే కోరుకుంటున్నా..నేనేం కోరుకుంటున్నానో నీకు బాగా తెలుసు. నన్ను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేసే నీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా మంచిదానివి. అలాగే నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. మరెన్నో సంతోషకరమైన బర్త్‌డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. దీనికి నవ్యస్వామి స్పందిస్తూ.. థాంక్యూ.. నువ్వు కోరుకునేదేంటో నాకు తెలుసులే అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు.సమ్‌థింగ్.. సమ్‌థింగ్..కాగా రవికృష్ణ, నవ్యస్వామి ఆమె కథ సీరియల్లో కలిసి నటించారు. ఈ సీరియల్లో ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలో రియల్లైఫ్లోనూ ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు పలు ఎంటర్టైన్మెంట్ షోలకు కలిసే వెళ్లేవారు. అయితే డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి అలాంటిదేం లేదని సులువుగా చెప్పేవాడు. ఇప్పుడేకంగా ఈ ఏడాది ఒక స్పెషల్ ఉండబోతుందనడంతో అది ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారా? లేదా డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుంటారా? అదీ కాకుండా ఇద్దరూ కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా? అని నెటిజన్లు రకరకాలుగా ఆరా తీస్తున్నారు.సినిమావిరూపాక్ష సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్న రవికృష్ణ ద బర్త్‌డే బాయ్ అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఇది ఆహాలో అందుబాటులో ఉంది. గతేడాది లవ్మీ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా కోసం పుష్ప 2 ఆఫర్ వదిలేసుకున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లే అంత పెద్ద సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. రవికృష్ణ ప్రస్తుతం దండోరా సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) చదవండి: రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం! -
ఎవర్నీ మోసం చేయకూడదు.. గుణపాఠం నేర్చుకున్నా..: కావ్యశ్రీ
కావ్యశ్రీ- నిఖిల్ మళయక్కల్.. స్మాల్ స్క్రీన్‌పై జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ ప్రేమించుకున్నారు. కలిసి షాపింగ్‌కు, షికార్లకు వెళ్లేవారు. యూట్యూబ్‌లో కూడా కలిసే వ్లాగ్ వీడియోలు చేసేవారు. తర్వాతేమైందో కానీ ఉన్నట్లుండి విడిపోయారు. నిఖిల్ పేరెత్తితేనే కావ్య ముఖం మాడిపోయేది.కావ్య.. నిఖిల్ మధ్య దూరంబిగ్బాస్ షోలో నిఖిల్ (Nikhil Maliyakkal).. ఈ జన్మకు నువ్వే నా భార్యవు అని కావ్యనుద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేస్తే చిరాకుపడిపోయింది. ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దంటూ నిఖిల్ పేరెత్తకుండానే అతడిపై సెటైర్లు వేసింది. అలా కావ్య (Actress Kavyashree) అతడిపై పీకలదాకా కోపం పెంచుకుంది. బ్రేకప్ను వెనక్కు తీసుకునే ఉద్దేశమే లేదని తన మాటలతో కరాఖండిగా చెప్పేసింది. దీంతో నిఖిల్ కూడా సైలెంటయిపోయాడు. తాజాగా కావ్యశ్రీ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లే చేసుకోనుడ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నారన్న ప్రశ్నకు.. అతడు నన్ను బాగా చూసుకోవాలి. నాపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంతకుమించి పెద్దగా ఏమీ లేదు అని తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు.. అసలు పెళ్లే చేసుకోనంది. మీకు ఇరిటేషన్ అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే ఇంతకుముందు ఓ వ్యక్తి ఉండేవారు కానీ ఇప్పుడైతే అలా ఎవరూ లేరని తెలిపింది. జీవితంలో నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటన్న ప్రశ్నకు.. ఎవరినీ మోసం చేయకూడదు, ఎవరినీ బాధపెట్టకూడదు అని నేర్చుకున్నానంది.చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్ -
మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నటి కస్తూరి (ఫోటోలు)
-
లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
-
వీధికెక్కిన సినీ జంట
యశవంతపుర: తన భార్య వేధిస్తోందంటూ కన్నడ నటి శశికళపై భర్త, సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2021లో ఓ సినిమా షూటింగ్లో శశికళ, హర్షవర్దన్‌కు పరిచయమైంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు. కొన్నిరోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, తమ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగరభావిలోని ఆఫీసుకు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసింది. 2022లో ఆమె ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. సినిమా రంగంలో లేకుండా చేస్తానని బెదిరించిందన్నారు. చివరకు 2022 మార్చిలో శశికళను వివాహం చేసుకున్నాను. కొద్ది రోజులకు కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మా ఇంటికి వచ్చేవారు. అదేమని ప్రశ్నించినందుకు నన్ను బయటకు పంపి, రెండు గంటల తరువాత మళ్లీ ఇంటిలోకి రానిచ్చేది. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు శశికళతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్! (ఫోటోలు)
-
ఒకప్పడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసిన ఈ బుల్లితెర నటి గురించి తెలుసా..? (ఫొటోలు)
-
పెళ్లై 20ఏళ్లు.. పిల్లలు ఎందుకు లేరంటే.. (ఫోటోలు)
-
టీవీ సీరియల్ నటికి వేధింపులు...
బంజారాహిల్స్ : నా మాట వినకున్నా..నాతో కలవకున్నా..నన్ను పెళ్లి చేసుకోకున్నా..ఈ సంక్రాంతికి నీ ఫొటోలన్నీ బ్యానర్లుగా చేసి ఊరంతా కడతానంటూ టీవీ సీనియర్ నటిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్ గోదావరి జిల్లా, కవటం గ్రామానికి చెందిన మహిళ (29) శ్రీకృష్ణానగర్‌లో ఉంటుంది. ఆమెకు 2012లో కృష్ణమోహన్ అనే వ్యక్తితో పెళ్లి కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో కలిసి కృష్ణానగర్‌లో ఉంటోంది. గత సెపె్టంబర్ నుంచి శ్రావణ సంధ్య అనే సీరియల్లో నటిస్తుంది. ఈ సందర్భంగా బత్తుళ్ల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పగా, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు పెట్టడమే కాకుండా టీవీ ఇండస్ట్రీలో తాను వివిధ వ్యక్తులతో దిగిన ఫొటోలను చెడుగా ప్రచారం చేస్తున్నాడు. తనతో ఉండడానికి ఒప్పుకోకపోతే ఈ ఫోటోలతో సంక్రాంతికి ఆమె స్వ గ్రామంలో బ్యానర్లు కడతానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫణితేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీరియల్ నటి సంగీత కళ్యాణ్‌కుమార్ (ఫొటోలు)
-
‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ‘అను’ పెళ్లి సందడి (ఫొటోలు)
-
బుల్లితెర నటి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?
-
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
సీరియల్స్‌లో చీరకట్టు.. ఇన్‌స్టాలో ఈ కన్నడ బ్యూటీని ఇలా చూస్తే ఏమైపోతారో..! (ఫోటోలు)
-
క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!
నిఖిల్ మళయక్కల్.. గోరింటాకు సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇదే ధారావాహికలో అతడికి జోడీగా నటించింది కావ్య శ్రీ. సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ, వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది. ఇంకేముంది.. ప్రతి ఫంక్షన్లోనూ, షోలోనూ, ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఇద్దరి మధ్య దూరంవీళ్ల యవ్వారం చూసిన జనాలు ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్‌కు ఎదురైతే.. కావ్య మంచి అమ్మాయి.. పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింటిచ్చాడు. తర్వాత ఏమైందే ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశారు. కొట్టినా, తిట్టినా పడతా..ఇక నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్‌స్టోరీ చెప్తూ ఎమోషనలయ్యాడు. ఆరేళ్ల ప్రేమ.. విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్‌బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు. నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా.. అని ఏడుస్తూ చెప్పాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. మోసపోవద్దుమాస్కు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేవరకు ఎదురుచూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్- కావ్య మళ్లీ కలుస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
Mansi Joshi: 'దేవత' సీరియల్ నటి నిశ్చితార్థం (ఫోటోలు)
-
ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
-
బుల్లితెర నటి లహరి కుమారుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
చీరలో ఉంగరాల జుట్టుతో సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫొటోలు)
-
అప్పట్లో చిరంజీవితో చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడేమో సీరియల్ నటిగా.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్
గత కొన్నేళ్లలో తెలుగు సీరియల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నది ఏదైనా ఉందంటే అది 'కార్తీకదీపం'. కాస్త నలుపు ఛాయలో ఉన్న ఓ గృహిణి పడే ఇబ్బందులు అనే కథతో తీసిన ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ అనే నటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇది తప్పితే ఆమె గురించి పెద్దగా విషయాలేం తెలియవు.(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)ప్రస్తుతం సరికొత్త 'కార్తీకదీపం' సీరియల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్.. రీసెంట్గా ఓ కుర్రాడితో కలిసి ఇన్ స్టాలో రీల్ చేసింది. ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కి పెళ్లయి పిల్లలున్నారని తెలుసు గానీ మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్‌ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్. తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా.. అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు. దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు. సంతూర్ మమ్మీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) View this post on Instagram A post shared by Manujith (@_.maaaaaaaanu) -
ఖరీదైన లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ బ్యూటీ.. రేటు ఎంతంటే?
సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ కూడా ఈ మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో నటి లహరి కూడా చేరింది.(ఇదీ చదవండి: 'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం)'మొగలిరేకులు', గృహలక్ష్మి తదితర సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లహరి.. ప్రస్తుతం ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ కారు ధర మార్కెట్లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.కోటికి పైనే ఉండొచ్చు. తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!) View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమెకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది మళ్లీ చాన్నాళ్ల తర్వాత కరుణ్ భూషణ్ ట్విన్స్‌కి తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-సాయిధరమ్ తేజ్ వివాదంపై స్పందించిన నిహారిక)'ఆహా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'శంకర్ దాదా ఎంబీబీఎస్', కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు తెలుగులో బోలెడన్ని సీరియల్స్ చేసింది.ముఖ్యంగా 'అభిషేకం' సీరియల్లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Bharath Bhushan Nethi (@bharathbhushan_nethi) -
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
-
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణిచింది. యాక్సిడెంట్లో ఆమెకు పెద్దగా గాయాలు కానప్పటికీ ఆ సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూసింది. నటి మృతిని ఆమె ప్రియుడు, నటుడు చందు జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో కన్నీరుమున్నీరుగా విలపించాడు.ముందుగానే హింట్త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నానంటూ తన చావును ముందుగానే హింటిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వీడియోలలోనూ ఇంకో రెండు రోజులు మాత్రమే.. అంటూ పవిత్రతో కలిసున్న పిక్స్ షేర్ చేశాడు. చివరికి అన్నంత పనీ చేశాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం (మే 17న) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై నటుడి తల్లీభార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఐదేళ్లుగా నటితోనే..చందు తల్లి మాట్లాడుతూ.. 'ఐదేళ్ల నుంచి చందు.. పవిత్రతోనే ఉంటున్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి తను భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా నా కొడుకు మాతో మాట్లాడలేదు. నా కోడలు, నేను చూడటానికి వెళ్తే దగ్గరకు కూడా రానివ్వలేదు. అతడు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. మారతాడనుకున్నాం..తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. మారతాడేమోనని అంతా ఎదురుచూశాం. కానీ మారలేదు. యాక్సిడెంట్ తర్వాత అతడి ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. పవిత్ర ఎల్ఐసీ డబ్బుల కోసం వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. మేమెవరం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇంతలోనే అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది' అంటూ గుండె పగిలేలా ఏడ్చింది చందు తల్లి. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist)చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప -
భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. మొన్నే కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.మా మధ్య బంధం ముగిసిపోయిందిసీరియల్ నటి శిరీష భర్త నవీన్‌తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.తనపై గౌరవముందివీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.ఆ సీరియల్‌తో పాపులర్కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు సీరియల్‌తో బాగా పాపులర్ అయింది. స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం. . ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by It's-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor) చదవండి: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ.. -
తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకోసం వచ్చేసేయ్'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా కోసం తిరిగి వచ్చేయ్‌రా..' అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కాగా పవిత్ర జయరామ్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య. మొదట్లో హౌస్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా పని చేసిన ఈమె తర్వాత కన్నడ సీరియల్స్‌లో అడుగుపెట్టింది. అక్కడి నుంచి నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సీరియల్‌తో ఫేమస్'త్రినయని' సీరియల్ ద్వారా బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అంతకుముందు కన్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist) -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
-
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
బుల్లితెర సెలబ్రిటీలు శివంగి జోషి, కుషల్ టండన్ ప్రేమించుకుంటున్నారని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఇరువురూ స్పందించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా?ఈ మేరకు శివంగి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'నాకు రూమర్స్ అంటే ఎంతో ఇష్టం. నా గురించి నాకే తెలియని విషయాలను తెలుసుకుంటుంటే భలే అనిపిస్తుంది. మీడియా మిత్రులారా.. నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుందా? ఇది నాక్కూడా తెలీదే.. నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం థాయ్‌లాండ్‌లో ఉన్నాను. మీరేమో ఏదేదో రాసేస్తున్నారు.సీరియల్లో కలిసి..కాస్త వార్త రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి' అని సూచించింది. అటు కుషల్ కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. కాగా శివంగి, కుషల్.. బర్సాతే మౌసమ్ ప్యార్ కా అనే సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ప్రారంభమైన ఈ సీరియల్ ఇటీవలే ముగిసింది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్థింగ్ఆన్స్క్రీన్లో జంటగా కనిపించిన వీరు ఆఫ్‌స్క్రీన్‌లోనూ కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని అందరూ భావించారు. గతంలోనూ శివంగి.. బాలికా వధు సీరియల్ నటుడు రణ్‌దీప్ రాయ్‌తో డేటింగ్లో ఉందని రూమర్స్ వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని నటి క్లారిటీ ఇచ్చింది. అతడు కేవలం తన స్నేహితుడు మాత్రమేనని చెప్పింది.చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్ -
లంగా ఓణీలో తేజస్విని గౌడ.. ఇంత అందంగా ఉందేంటి! (ఫొటోలు)
-
39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సీరియల్ నటి
బుల్లితెర నటి ఆర్తి సింగ్ పెళ్లి చేసుకుంది. 39 ఏళ్ల వయసులో బిజినెస్మెన్ దీపక్ చౌహాన్‌తో ఏడడుగులు వేసింది. ముంబై జుహులోని ఇస్కాన్ ఆలయప్రాంగణంలో బుధవారం ఈ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికొడుకు దీపక్ గుర్రపు స్వారీ చేసుకుంటూ కల్యాణ మండపానికి వచ్చాడు. తెల్లని షేర్వాణీ ధరించిన అతడు తలపై పింక్ టర్బన్ పెట్టుకున్నాడు. ఆర్తి రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది.సిగ్గుతో ముడుచుకుపోయిన నటిపెళ్లికొడుకు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకింత సంతోషం, ఒకింత సిగ్గుతో ముడుచుకుపోయింది నటి. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరి పెళ్లికి విక్కీ జైన్- అంకిత లోఖండే, దేవలీనా భట్టాచార్జి, రష్మీ దేశాయ్, యువిక చౌదరి, కరణ్ సింగ్ గ్రోవర్-బిపాషా బసు.. తదితర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఆ షోలతో ఫేమస్కాగా ఈ వారం ప్రారంభంలోనే ఆర్తి ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ సైతం ఘనంగా జరిగాయి. ఆర్తి కెరీర్ విషయానికి వస్తే.. మాయ్క అనే సీరియల్‌తో 2007లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. తోడ హై బాస్ తోడే కీ జరూరత్ హై, పరిచయ్, వారీస్ అనే షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందుకంత కోపం వచ్చింది? -
నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం
సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్‌ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.కారు కొన్నా..మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్‌కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్‌కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?ఓపక్క చెత్త కామెంట్లు..నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్లైన్లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్షిప్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది. View this post on Instagram A post shared by RekhaRatheesh (@rekharatheesh3) చదవండి: చాహల్.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'వీడియోలో అతడెవరు?' -
రైల్వేలో ఇంటర్న్‌షిప్ చేశా.. జాబ్ కాదనుకుని యాక్టింగ్ ఫీల్డ్‌లోకి!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను.. ఇంజనీర్ అవబోయి ఇలా సినిమాల్లో వచ్చి పడ్డాను.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కొందరైతే సినిమాల మీద ప్రేమతో ఉన్న ఉద్యోగాలు వదిలేసి మరీ సినీ ఇండస్ట్రీలో వాలిపోయారు. అలా బుల్లితెర నటి మైరా ధాత్రి మెహ్రా కూడా నటి కాకముందు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్లో ఇంటర్న్‌షిప్ చేసిందట.జాబ్ ఆఫర్ వదిలేశాఆమె మాట్లాడుతూ.. 'నాకు చదువంటే ఇష్టం. ఇంజనీరింగ్ పూర్తి చేశాక రైల్వేలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలీదు కానీ ఎలాగోలా ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాను. ఆ సమయంలోనే.. రోజూ ఎనిమిది గంటల డ్యూటీ చేయడం నా వల్ల కాదని తెలుసుకున్నాను. అందుకే జాబ్ ఆఫర్ వచ్చినా వదిలేసుకున్నాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఇందుకోసం అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్టూడియోలో నెలపాటు శిక్షణ తీసుకున్నాను.కాలేజీకి వెళ్తూనే..పార్ట్ టైం కోర్సు కూడా పూర్తి చేశాను. ఓపక్క ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కోచింగ్ తీసుకుంటూ ఆ తర్వాత కాలేజీకి వెళ్లేదాన్ని. ఇందుకోసం ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పలేదు. అనుపమ్ సర్ అప్పట్లో కాస్టింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో కుంకుమ భాగ్య సీరియల్‌కు నా పేరు సూచించాడు. అలా ఫస్ట్ టైమ్ ఆ సీరియల్లో నటించాను.అప్పుడలా.. తర్వాతిలా..నిజానికి రైల్వే ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూసేదాన్ని. యాక్టింగ్ ఇండస్ట్రీలో వరుసగా 12 నుంచి 13 గంటల దాకా పని చేస్తాం. కానీ ఎన్నడూ బోర్‌గా ఫీలవలేదు, టైం ఎప్పుడు అయిపోతుందా? అని గడియారం వంక చూసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'కుంకుమ భాగ్య'తో పాటు 'సాసురాల్ జెండా ఫూల్ 2', 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' వంటి సీరియల్స్‌లో మెరిసిన మైరా ధాత్రి చివరగా 'దాల్చిని' సీరియల్లో నటించింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి మహేశ్వరి మరోసారి తల్లయింది. మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ.. ఆడ మగ అనేది చెప్పకుండా అందరి చేతులతో తీసిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలా శుభవార్తని అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) 'వదినమ్మ', 'శశిరేఖా పరిణయం' సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివనాగ్ ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మహేశ్వరిని.. రీసెంట్గా తన భర్త శివనాగ్ సడన్‌గా సీమంతం చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమ బుజ్జాయికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే అందరూ బుల్లితెర నటి మహేశ్వరికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) View this post on Instagram A post shared by Gali Maheshwari (@mahishivan9_official) -
పెళ్లై రెండేళ్లు.. పిల్లలు పుట్టాలంటే ముందు ఆ కండీషన్!
పెళ్లైన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏమైనా విశేషం ఉందా? అని! ఒకప్పుడు డజను కొద్దీ పిల్లల్నీ కనేవారు.. కానీ ఇప్పుడు సంతానం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్నటివరకు ఇద్దరు ముద్దు అనుకునేవారు కూడా ఒక్కరు చాలని భావిస్తున్నారు. మరికొందరైతే లైఫ్‌లో సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తామంటున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం ఓ కండీషన్ పెట్టుకుని మరీ ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నారట! కండీషన్ కన్నడ బుల్లితెర జంట లావణ్య- శశి హెగ్డే కన్నడ సీరియల్స్ ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయగా ఇద్దరూ రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే అందరి జంటలకూ మాదిరే ఈ జంటకు కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి లావణ్య బదులిస్తూ.. 'నేను, నా భర్త ఇప్పటివరకు హనీమూన్‌కు వెళ్లనేలేదు. రెండుసార్లు ప్లాన్ చేసుకుని వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. బ్రో అని పిలిచి.. హనీమూన్‌కు వెళ్లాకే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్త కండీషన్ పెట్టాడు. అలాగే నేనూ ఓ కండీషన్ పెట్టాను. నన్ను హనీమూన్‌కు మనాలీయో లేదంటే విదేశాలకో తీసుకెళ్లిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేద్దామన్నాను. జూన్‌లో హనీమూన్‌కు వెళ్లబోతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా రాజారాణి సీరియల్ సెట్స్‌లో వీరి పరిచయం బలపడింది. ఈ సీరియల్లో లావణ్య.. శశిని బ్రో అని పిలిచేది. తర్వాత అతడే భర్త అవడం విశేషం! చదవండి: చెల్లితో హీరోయిన్ రీల్.. నెట్టింట ట్రోలింగ్ -
రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి
ఒకప్పుడు సీరియల్స్‌లో రఫ్ఫాడించింది నటి, నిర్మాత యాట నవీన. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ హడావుడి చేస్తోంది. ఆమె భర్త యాట సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అమ్మ ఎంతో కష్టపడింది తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా చిన్నప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చీరలమ్ముతూ, మిషన్ కుడుతూ పోషించింది. నేను షూటింగ్స్‌కు వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది. నిజానికి నేను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఇష్టంగా రాలేదు. పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్ చేయించుకుని అవి పట్టుకునే తిరిగేవాళ్లం. దానికోసం మా అమ్మ తనదగ్గరున్న ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది. అరిస్తే ఏడ్చేశా వీరివీరి గుమ్మడిపండు, కాదంటే ఔననిలే.. సినిమాల్లో హీరోయిన్గా చేశాను. ఇంకో రెండు సినిమాల్లో కథానాయికగా చేశాను కానీ రిలీజ్ కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు.. నాకు యాక్టింగ్ సరిగా రావడం లేదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్స్‌లో అరిచేశాడు. ఏడ్చి వెళ్లిపోయాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కిలో బంగారం.. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కిలో బంగారం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటికే కిలోదాకా గోల్డ్ జమ చేశాను. ఒకసారి మేము పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాము. ఓ సీరియల్ తీసేందుకు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశాం. అగ్రిమెంట్స్ దగ్గర తేడా రావడంతో వంద ఎపిసోడ్లకే ఆ సీరియల్ ఆపేశారు. రూ.20 లక్షలు కూడా వెనక్కు రాలేదు. రూ.50 లక్షలు నష్టం రావడంతో మా దగ్గరున్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం. మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం' అని పేర్కొంది. చదవండి: ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా! -
Tejaswini Gowda: ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్‌తో సీరియల్ బ్యూటీ తేజస్విని సెన్సేషన్ (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఇది రెండోసారి!
బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి సీమంతం మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి. ఫ్యాన్స్ విషెస్ ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్తో కలిసి పార్టిసిపేట్ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది. చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్ మేనమామ కామెంట్లు వైరల్ -
పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. ఇద్దరికీ రెండోదే!
బుల్లితెర నటుడు కరణ్ శర్మ, పూజా సింగ్ పెళ్లి పీటలెక్కారు. మార్చి 30న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బుల్లితెర తారలు సైతం పెళ్లిలో తెగ హడావుడి చేశారు. తమ పెళ్లి విషయాన్ని కొత్త జంట ఏప్రిల్ 1న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మిస్టర్ అండ్ మిసెస్ శర్మ అంటూ భర్తను ముద్దాడుతున్న ఫోటోలు షేర్ చేసింది పూజా సింగ్. ఏళ్ల తరబడి ఒకే సంస్థలో.. ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు మార్చి 29 నుంచే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇద్దరూ ఒకే నిర్మాణ సంస్థలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకుందే లేదు. కానీ ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గతేడాది డిసెంబర్లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ఏడడుగుల బంధానికి దారి తీసింది. పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది. అద్భుతంగా సాగాలి కరణ్ మాట్లాడుతూ.. బ్యాచిలర్ లైఫ్ నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానన్నాడు. కాగా ఇతడు సాసురాల్ సిమర్ కా 2, ఉదారియాన్, మోహి, ఏక్ నహీ పెంచాన్ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. పూజ.. దియా ఔర్ బాతీ హమ్, తేరే ఇష్క్ మే ఘాయల్, శక్తి: అస్తిత్వ కే ఎసాస్ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె గతంలో కపిల్ చట్టానీని పెళ్లి చేసుకుంది. 2017లో ఆమె పెళ్లి జరగ్గా 2021లో విడిపోయారు. కరణ్ కూడా గతంలో టియారా ఖర్ను పెళ్లాడాడు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2016లో పెళ్లవగా నాలుగేళ్లకే విడిపోయారు. View this post on Instagram A post shared by Pooja Singh (@poojaa_singh_) View this post on Instagram A post shared by Jigyasa Singh (@jigyasa_07) చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
అవకాశాల్లేకపోవడంతో డిప్రెషన్.. రాత్రి పెగ్గేశాకే..: నటి
మల్లిక జాగుల.. సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించింది. సినిమా కంటే కూడా సీరియల్స్ ద్వారానే పేరు, డబ్బులు సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి తర్వాత మాత్రం సడన్‌గా స్మాల్ స్క్రీన్కు దూరమైంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకుని ఎమోషనలైంది. 'ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వరు. బెంగళూరు నుంచి తీసుకొస్తారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు, ఛాన్సులు కూడా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగా తిండి కూడా తినకపోయేసరికి నిల్చున్నచోటే పడిపోయేదాన్ని. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడం కష్టమన్నారు. ఆ స్టేజీ నుంచి మళ్లీ బతికొచ్చాను. చీరలమ్మాను.. 19 ఏళ్ల అనుభవం. కరోనా తర్వాత ఛాన్సులు నిల్.. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానేంటి? అని ఆలోచించి పిచ్చిదాన్నైపోయాను. మొన్నటివరకు బతుకుదెరువు కోసం చీరలమ్మాను. పెట్రోల్ బంకులో పని చేయడానికి కూడా సిద్ధమయ్యాను. కానీ వాళ్లు చులకనగా మాట్లాడారు. పదేళ్ల క్రితం నా రెమ్యునరేషన్ రోజుకు రూ.1300. అందులో మళ్లీ కటింగ్స్ ఉంటాయి. నాలుగేళ్లు అదే పారితోషికానికి పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు పోగేస్తారనుకుంటారు కానీ అందరి పరిస్థితి అలాగే ఉండదు. కమిట్మెంట్ అడిగారు సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కమిట్మెంట్ అడిగారు. నేను నో చెప్పి వచ్చేశాను. నెలరోజులపాటు టార్చర్ పెట్టారు. అందుకే సీరియల్స్ ద్వారా నేనేంటో చూపించాను. ఇకపోతే డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అయితే నేను ఒళ్లు అమ్ముకోలేదు, ఒళ్లు చూపించుకున్నానంతే! గతంలో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆయన్ను మర్చిపోయేందుకు మద్యం తాగేదాన్ని. అలా మద్యపానం అలవాటైంది. రాత్రి ఓ పెగ్గేసి పడుకుంటాను. ఇకపోతే నా జీవితంలో ఎవరికీ చోటు లేదు. నేను పెళ్లి చేసుకోను' అని చెప్పుకొచ్చింది. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
షూటింగ్ లో ఒకాయన నన్ను ఏడిపించారు అప్పుడు నాన్న..!
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. పెళ్లి చేసుకున్న నటి
బుల్లితెర నటి ట్వింకిల్ వశిష్ట్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు హర్ష్ తులిని మంగళవారం పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ట్వింకిల్- హర్ష డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను పెళ్లితో పదిలపర్చుకోవాలనుకున్నారు. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మార్చి 12న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మా జర్నీ అంత ఈజీగా సాగలేదు ఎన్నో హార్ట్ ఎటాక్‌లు, బ్రేకప్‌లు, ఎత్తుపల్లాలు, ఇతరుల ఎత్తిపొడుపు మాటల నుంచి ఇక్కడివరకు వచ్చాం. మా ప్రేమ నిజమైనది నిరూపించాం. మాకు ఎదురైన ప్రతీ పరీక్షలో ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మాది విడదీయరాని బంధమని నిరూపించాం. మా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. కానీ ఈ జర్నీలో ఓపిక, నమ్మకం, కమిట్మెంట్ అన్న పదాలకు అసలైన అర్థాలు తెలుసుకున్నాం. ఎన్నో ఛాలెంజ్‌లను దాటి ఈరోజు ఒక్కటిగా నిలబడ్డాం.. ప్రేమకు సరిహద్దు లేదని నిరూపించాం. ధృడ సంకల్పం, విధి ఆటలను అన్నింటినీ తట్టుకుని మా ప్రేమను నిర్మించుకున్నాం. ఐ లవ్యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా అభిమానులు, సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నో బ్రేకప్‌లు తమ పెళ్లి గురించి నటి మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఎన్నోసార్లు బ్రేకప్ చెప్పుకున్నాం. కానీ మళ్లీ కలిసిపోయేవాళ్లం. మా ఫ్రెండ్స్ కూడా మా బంధాన్ని నమ్మలేదు. విడిపోతామనే చూశారు. కానీ మేము ఒకరికొకరం దూరం కాలేకపోయాం. ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్లీ కలిసిపోయేవాళ్లం. నేను అరిచినా హర్ష్ మాత్రం ఎంతో మెచ్యూర్‌గా ఆలోచిస్తాడు. ఇలాంటి పార్ట్నర్ దొరికినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం కుండలీ భాగ్య అనే సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by ⭐️Twinkle R Vasisht⭐️ (@twinkle_vasisht) చదవండి: హీరోయిన్ను అమ్మేయాలని చూసిన భర్త.. హనీమూన్‌లో అతడి ఫ్రెండ్స్.. -
టాలీవుడ్ నటి వివాహేతర సంబంధం.. భర్త ఆవేదన..
ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసిందంటున్నాడు ఆమె భర్త శ్యామ్ కుమార్. పెళ్లి చేసుకుని డబ్బులన్నీ కాజేసి ఇప్పుడు విడాకులు అడుగుతూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ మీడియాను ఆశ్రయించాడు. తన వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ సోమవారం నాడు సాక్షి టీవీతో తన గోడు వెల్లబోసుకున్నాడు. కాగా గతేడాది సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్- అడ్డాల ఐశ్వర్య వివాహం జరిగింది. పెళ్లయిన నెలకే.. ఓ మ్యాట్రిమోనీ ద్వారా వీరు పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాతే అసలు గొడవలు మొదలయ్యాయి. పెళ్లయిన నెల రోజులకే భార్య.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేశ్‌బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నాడు భర్త. ఇదేంటని బెదిరిస్తే తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. పెళ్లయ్యాక తన దగ్గరి నుంచి రూ.25 లక్షలు కాజేసిందని, ఇప్పుడేమో విడాకులు కావాలంటూ తన కుటుంబాన్ని మానసికంగా టార్చర్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సీరియల్స్, సినిమాలు.. అడ్డాల ఐశ్వర్య తెలుగు బుల్లితెర పరిశ్రమలో ఎన్నో సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్‌లో యాక్ట్ చేస్తోంది. గతంలో.. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖి వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ చేసింది. చదవండి: మరోసారి మార్మోగుతున్న ఆర్ఆర్ఆర్.. ఈసారి పాటే కాదు ఏకంగా.. -
ఒక్కరోజు వ్యవధిలో కన్నుమూసిన అక్కాచెల్లెళ్లు
గర్భాశయ క్యాన్సర్ వల్ల నటి పూనమ్ పాండే మరణించిందంటూ ఆమె టీం ఇటీవల ఓ ప్రాంక్ చేసింది. దానివల్ల ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడింది పూనమ్. తన ఉద్దేశం బాగానే ఉన్నా, అవగాహన కల్పించాల్సిన తీరు బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ అంత ప్రమాదమా? దాని వల్ల మరణిస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది. క్యాన్సర్‌తో ఒకరు.. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి డాలీ సోహి (48) ఇదే క్యాన్సర్ బారినపడి కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో శుక్రవారం(మార్చి 8న) ఉదయం తుదిశ్వాస విడిచింది. మరింత విషాదం ఏంటంటే.. నటి కన్నుమూయడానికి ముందు రోజు ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. జాండిస్‌తో సోదరి మృతి పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది. చదవండి:'గామి' మూవీ రివ్యూ -
19 ఏళ్లకే హీరోయిన్ ఆఫర్.. ఎగిరి గంతేశా! కానీ..: నటి
హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీజైన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, అసూయలు.. ఇవన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది అంకితనే! తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ షోకి హాజరైన ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశావా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని తలూపుతూ ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేసుకుంది. ఎగిరి గంతేశా.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు కాల్ చేసి మీరు సెలక్ట్ అయ్యారు, వచ్చి సంతకం చేయండన్నారు. నేను సంతోషంతో ఎగిరిగంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే ఇంత తేలికగా ఎలా సెలక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. లోపలికి వెళ్లాక నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. షాకయ్యాను. నేనలాంటిదాన్ని కాదని.. నాకప్పుడు 19 ఏళ్లే. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు.. నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్‌లో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్ చేసిందో వివరంగా చెప్పలేదు. చదవండి: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ -
ఒకప్పుడు చెత్త ఏరుకుంది.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న బ్యూటీ
ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి మెట్టు.. ఇక్కడ చెప్పుకునే బుల్లితెర నటి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. అడిగినదానికి లొంగకపోతే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినా వణికిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిన్నాచితకా పనులు చేసింది. చివరికి చెత్త ఏరుకుని రూపాయిరూపాయి కూడబటెట్టింది. నేడు లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి.లైఫ్ సెట్ అనుకున్న సమయంలో..దివ్యాంక నటి మాత్రమే కాదు యాంకర్, మోడల్ కూడా! తన కెరీర్ మొదలైందే యాకరింగ్‌తో! తర్వాత ఆమె 2005లో మిస్ భోపాల్‌గా కిరీటం అందుకుంది. 'బనూ మే తేరి దుల్హాన్' సీరియల్‌తో క్లిక్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో మెరిసింది. ఇంక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. నిత్యావసరాలు, ఈఎమ్ఐలు, ఇంకా ఎన్నింటికో డబ్బులు అవసరమయ్యాయి.రోడ్డుపై చెత్త ఏరుతూ..ఎవరో ఏదో ఆఫర్ ఇస్తారని ఎదురుచూస్తూ ఉండేకన్నా.. ఏదో ఒక పని చేయడం మేలనుకుంది. ఐదు వేలు లేదంటే రెండు వేలు ఇచ్చినా కిరాణా సామాను తెచ్చుకోవచ్చనుకుంది. పైగా తనకో పెంపుడు శునకం ఉంది. ఆ వచ్చిన డబ్బుతో దానికి కాస్త తిండిపెట్టవచ్చని ఆలోచించింది. చిన్న పాత్రలిచ్చినా సరే చేస్తానంటూ డైరెక్టర్లను వేడుకుంది. ఈ లోపు రోడ్డుపై చెత్త ఏరడం మొదలుపెట్టింది. అట్టముక్కలను, టూత్‌పేస్ట్ డబ్బాలను ఏరి అమ్ముకుంది. ఒక్క డబ్బాకు ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లట. అలా రోజూ చెత్తనంతా సేకరించి దాన్ని అమ్మి డబ్బు సంపాదించింది.అడ్డదారులు తొక్కడం ఇష్టం లేకఅంతకుముందు దాచుకున్న డబ్బుతో ప్రతినెలా ఈఎమ్ఐలు కట్టింది. సరిగ్గా అదే సమయంలో తనకో ఆఫర్ కూడా వచ్చింది. రాత్రికి వస్తానంటే మంచి ఛాన్స్ ఇస్తామన్నారట. అలాంటి అడ్డదారులు తొక్కేబదులు ఇలా సొంతంగా సంపాదించుకోవడమే మేలనుకుంది. తర్వాతి కాలంలో యే హై మొహబ్బతే ధారావాహికలో డాక్టర్ ఇషితా అయ్యర్‌గా ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సీరియల్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దివ్యాంక ఒక్క ఎపిసోడ్‌కు రూ.1- 1.5 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగింది.లవ్ బ్రేకప్నాచ్ బలియే 8వ సీజన్ విన్నర్, ఖత్రోన్ కే ఖిలాడీ 11వ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బుల్లితెర నటిగా రికార్డుకెక్కింది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడింది నటి. సీరియల్ నటుడు శరద్ మల్హోత్రాను ప్రాణంగా ప్రేమించింది. కానీ ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 2016లో నటుడు వివేక్ దహియాను పెళ్లాడింది. వీరిని అభిమానులు ముద్దుగా దివేక్ అని పిలుచుకుంటారు.చదవండి: వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటాడు.. అలాంటిది.. -
విడాకులై మూడేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డా: బుల్లితెర నటి
బుల్లితెర నటి నివేదిత పంకజ్ మరోసారి ప్రేమలో పడిందట! సీరియల్ నటుడు సురేందర్‌ను గాఢంగా ప్రేమిస్తుందట! త్వరలోనే అతడి కలిసి ఏడడుగులు వేయనుందట! త్వరలోనే కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానోచ్ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బ్యూటీ. అయితే గతంలో నివేదిత సీరియల్ నటుడు ఎస్ఎస్ ఆర్యన్‌ను పెళ్లాడింది. వీరిని అభిమానులు క్యూట్ కపుల్‌గా అభివర్ణించారు. కానీ, అంతలోనే విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న మూడేళ్లకు తనకు మరో తోడు దొరికిందని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది నివేదిత. పనికిరాని ప్రశ్నలు అడగొద్దు 'చిన్నచిన్న విషయాలు కూడా మీతో పంచుకోవడమే నాకిష్టం. నేను విడాకులు తీసుకుని మూడేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాను. ఓ స్పెషల్ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. ఈ విషయంపై మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో నాకు తెలుసు. ఏయే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో కూడా తెలుసు. ప్లీజ్.. పనికిరాని ప్రశ్నలు వేసి విసిగించొద్దు. పాజిటివ్‌గా ఉందాం. ఒకరికొకరం మద్దతుగా నిలబడుదాం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్' అని ఓ లేఖ షేర్ చేసింది. మాజీ భర్త రెండో పెళ్లి 'మీ అనుమానాలు, ప్రశ్నలన్నింటికి ఈ ఒక్క పోస్ట్‌తో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను' అంటూ సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. దీనికంటే ముందే సురేందర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ ఇతడే తన ప్రియుడు అని హార్ట్ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేసింది. ఇకపోతే ఆమె మాజీ భర్త ఆర్యన్ సైతం గతేడాది మరో పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Nivedhitha (@_n.i.v.e.d.h.i.t.h.a_) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) చదవండి: OTT: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. -
డెలివరీ అయిన 2 నెలలకే నటి ఆత్మహత్యాయత్నం.. భర్తకు విడాకులు
జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానంటోంది తమిళ బుల్లితెర నటి కృతిక అన్నమలై. ఒకానొక సమయంలో భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యకు యత్నించానంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలున్నాయి. అసలు నా పెళ్లి జీవితమే పెద్ద సమస్య. నా మెడలో తాళి పడ్డ పది నెలలకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలో నా చేతిలో మూడు సీరియల్స్ ఉన్నాయి. వాడిని చూసుకోవడం కోసం సీరియల్స్ మానేసి ఇంటిపట్టునే ఉన్నాను. ఇంటి దగ్గరే ఖాళీగా.. అప్పటినుంచే నాకు, నా భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత అతడు వ్యాపారంలో నష్టపోవడంతో నేను తిరిగి సీరియల్స్ చేయడం ప్రారంభించాను. తను మాత్రం బాధ్యత లేకుండా ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చున్నాడు. దీనివల్ల మా మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఒకరోజు ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాను. పిల్లాడు పుట్టిన రెండు నెలలకే ఇది జరిగింది. చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన నేను మళ్లీ అతడితోనే సర్దుకుపోవాలనుకున్నాను. భరించలేక విడాకులు.. నాలుగేళ్లు అతడితోనే కలిసున్నాను. ఆ తర్వాత మాత్రం తనను భరించే ఓపిక నశించి విడాకులు తీసుకున్నాను. చాలామందికి నేను విడాకులు తీసుకున్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు విడిపోయానని చెప్పినందుకు చాలామంది చులకనగా కామెంట్లు చేస్తారు. కానీ మేము కూడా మనుషులమే.. మాకూ జీవితాలుంటాయి. నా భర్తతో ఎంతో పోరాడాను. అలిసిపోయాను. నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'మెట్టి ఒలి' సీరియల్‌తో పాపులర్ అయింది కృతిక. విలనిజం పండించడంలో ఆమె దిట్ట. సీరియల్స్‌లో కనిపించే ఈ నటి 'మనద మయిలద' అనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లోనూ పాల్గొంది. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
సీరియల్ జంట పెళ్లి
-
వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్నా: నటి యమున
సౌత్ ఇండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ప్రేక్షకుల అభిమాన తారగా యమున కొనసాగింది. 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆమె జర్నీ సూపర్ స్పీడ్‌లో ఉన్న సమయంలోనే వివాహం జరగడం ఆపై... తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం ఆపేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. కానీ సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం ఆమె కెరియర్‌పై కూడా పడింది. అయితే దీనిపై యమునకు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో ఆమెకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ఆమెను సోషల్‌మీడియా మాత్రం వదలడం లేదు. ఆమెపై ఇప్పటికీ తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి వ్యూస్ కోసం కొందరు చేస్తున్న పని వల్ల ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఓ టీవీ ప్రొగ్రామ్‌కి హాజరైన యమున..ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. 'సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్న. అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏం చేసుకోలేకపోయాను.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే విషయంపై గతంలో యమున ఏం చెప్పింది..? ఈ విషయంపై యమున గతంలో కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వార ఒక వీడియో చేసి తన బాధను పంచుకుంది. 'ఒక సమస్య వల్ల నేను బయటపడ్డాను.. అక్కడ ఏం జరిగిందో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ విషయంలో న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ నేను సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది.' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
Serial Actress Latha (Rupa Muggalla): అందంతో చంపేస్తున్న సీరియల్ నటి రూపముగ్గల్ల (ఫొటోలు)
-
తీవ్ర రక్తస్రావం, ప్రాణానికే ప్రమాదమన్నారు: సీరియల్ నటి
బుల్లితెర నటి గౌరీ రాజ్ ఉన్నట్లుండి సీరియల్స్ మానేసింది. ప్రేమ ఎంత మధురంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన గౌరీ బెస్ట్ విలన్‌గా అవార్డు సైతం అందుకుంది. మల్లి సీరియల్ ద్వారా కూడా తగినంత గుర్తింపు సంపాదించుకుంది. కానీ సడన్‌గా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసింది. కొంతకాలంగా ఆమె ఏ సీరియల్లోనూ కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది నటి. తీవ్ర రక్తస్రావం.. ప్రెగ్నెన్సీ అని తెలీక.. గౌరీ రాజ్ మాట్లాడుతూ.. 'ఒక నటిగా సీరియల్స్, సినిమాలు చేయాలని నా కోరిక. కానీ సడన్‌గా యాక్టింగ్ ఎందుకు మానేశాననేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో నేను నెల తప్పాను. కానీ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకూ తెలియదు. అప్పుడు సీరియల్లో చాలా ఫైటింగ్ సీన్లలో నటించాను. ఆ తర్వాత నాకు 20-25 రోజులపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ప్రెగ్నెన్సీ అని తెలియక లైట్ తీసుకున్నాను. కడుపు నొప్పి ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొనేదాన్ని. సడన్‌గా ఐసీయూకు తీసుకెళ్లారు ఓసారి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే చాలా ఆలస్యం చేశాను. స్కానింగ్‌లో నేను గర్భం దాల్చానని చెప్పారు. తల్లి కాబోతున్నానని సంతోషపడ్డాను. తర్వాతి రోజు నేను రెడీ అయి షూటింగ్‌కు వెళ్తుంటే నా భర్త నన్ను ఆపేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నాకు టెస్టులు, స్కానింగ్ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటికే డాక్టర్ నా ఫ్యామిలీతో మాట్లాడారు. వీళ్లంతా డల్‌గా ఉన్నారు. కానీ నాకు ఏదీ చెప్పలేదు. ఇంతలో ఐసీయూకు తీసుకెళ్లారు. ఏం జరుగుతోందని నిలదీశాను. సర్జరీ వల్ల నిలబడలేకపోయా.. దానికి డాక్టర్స్.. లోపల ఉన్న శిశువు బ్లాస్ట్ అయింది. శరీరమంతా ముక్కలు ముక్కలుగా ఛిద్రమైపోయింది. అది తీయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. సర్జరీతో పాటు లాపరోస్కోపీ చేశారు. ఇలా ప్రెగ్నెన్సీ పోవడం రెండోసారి. నరకం అనుభవించాను. అయినా ఆ డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ నా పనిపై ధ్యాస పెట్టాను. కానీ సర్జరీ వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయాను. అందుకే కొంతకాలానికే రెండు సీరియల్స్ మానేశాను. ఆ సమయంలో ఉత్తమ విలన్‌గా అవార్డు వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు.. అయితే ఒక్క సీరియల్ మాత్రం చేస్తూ పోయాను. కానీ ఇక్కడ కూడా మూడో ప్రెగ్నెన్సీ పోయింది. అది ముందుగానే గుర్తించగలిగాం కాబట్టి ఇంజక్షన్‌తోనే బయటకు వెళ్లిపోయింది. డాక్టర్ ఈసారైనా విశ్రాంతి తీసుకోమని హెచ్చరించాడు. ఇప్పుడు ఏ సీరియల్ కూడా చేయడం లేదు అయితే మూడుసార్లు ఇలా జరగడం, ఇంజక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడంతో కొంత లావైపోయాను. నాకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు? నాకు ముగ్గురు పిల్లలు.. ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారు' అంటూ ఏడ్చేసింది గౌరీ రాజ్. చదవండి: భగవంత్ కేసరి రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? -
అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్ మా' నటీనటులు
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు. దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్ హిట్ పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేశారు. అనంతరం వారితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు. ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు. -
బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!
ఆడపిల్ల సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నటి సమీరా. ఆ తర్వాత జీవితం, అభిషేకం, ఆడపిల్ల, అన్నా చెల్లెల్లు, భార్యామణి, డా. చక్రవర్తి, ముద్దు బిడ్డ, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తమిళంలోనూ 'రెక్క కట్టి పరాక్కుదు మనసు' అనే సీరియల్లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత నటనకు కాస్తా విరామం ప్రకటించింది. పిల్లలు పుట్టాక ప్రస్తుతం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న భామ.. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా సమీరా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలో పెదవికి రక్త కారుతూ కనిపించింది. ఆ ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఇదొక హెచ్చరిక అంటూ పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) సమీరా ఇన్‌స్టాలో రాస్తూ..'ట్రిగ్గర్ హెచ్చరిక. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరినీ బాధపెట్టకూడదు. ప్రతి ఒక్కరి కథకు అవగాహన ఉంటుంది. ఇది కేవలం జ్ఞాపకశక్తి కోసం క్లిక్ చేసిన చిత్రం. నా ఫీడ్‌లో చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు! కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది చూస్తే నేను నా సోదరీమణులు,స్నేహితులు, భర్తతో గొప్పగా గొడవపడినట్లు కనిపిస్తోంది. భర్తకు, భార్యతో కచ్చితంగా ఏదో తప్పు జరుగుతోంది.' అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా..' భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. కానీ ఏదో ఒక సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను అన్వర్ జాన్ని వివాహం చేసుకోక ముందు కూడా నా శరీరంపై గాయాలు ఉండేవి. అవి నిజానికి నా మేనల్లుడు అయాన్ చేసినవి. అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ వల్ల గాయాలు అయ్యేవి. కానీ నేను, నా భర్త పెద్దగా గొడవ పడినట్టుగా ఈ పిక్‌లో కనిపిస్తోంది. కానీ ఇది అర్హాన్ పొరపాటుతో జరిగింది. కానీ మీరు ఈ ఫోటో చూడగైనే కచ్చితంగా నా భర్తతో గొడవ వల్లే జరిగి ఉంటుందని అనిపించి ఉండొచ్చు. అవును మేము గొడవపడతాం. కానీ ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తాం. మీలో ఎంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ పోస్ట్‌తో.. మీరు ఎవరినీ జడ్జ్ చేయవద్దనేది నా సలహా.' అంటూ సమీరా రాసుకొచ్చింది. అయితే సమీరా పోస్ట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది చిన్న పిల్లలు ఉన్న అందరి ఇళ్లలో జరిగేదే అంటూ గడ్డి పెడుతున్నారు. దయచేసి ఇలాంటి నాన్సెన్స్ పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరేమో మాకు కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయని చెబుతున్నారు. మీరు ఇలాంటి పోస్టులు చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపొచ్చు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు ఇలాంటి పోస్టులు పెడుతూ మీ సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి
ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి సీరియల్ యాక్టర్స్ వరకు చాలామంది ఇలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నవాళ్లే. అయితే ప్రముఖ సీరియల్ నటి మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే యూట్యూబర్ తో ప్రేమలో పడి.. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఆదివారమే(ఆగస్టు 27) ఈ జంట ఒక్కటయ్యారు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి) 'శివ మనసులో శక్తి', 'కణ్మని' తదితర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి జనని ప్రదీప్.. ఎన్నియన్ అనే యూట్యూబర్‌ని పెళ్లి చేసుకుంది. గతంలో ఈమెనే తన లవ్‌స్టోరీ గురించి బయటపెట్టింది. ఓ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ కోసం కలిసిన వీళ్లు.. తొలుత ప్రేమలో పడ్డారు. అలా దాదాపు నాలుగేళ్ల గడిచిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దలు కూడా వీళ్లిద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. అలా ఇప్పుడు జనని ప్రదీప్-ఎన్నియన్ కలిసి ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు పలువురు సీరియల్ నటీనటులు హాజరై.. కొత్త జంటని ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై మీరు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) -
ముహూర్తం పెట్టాక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా, ఎందుకంటే?: నటి
సీరియల్స్‌లో విలనిజం పండించే పాత్రలకు పెట్టింది పేరు రెనీ ధ్యాని. రాత్రి కి యాత్రి, కసమ్, చంద్రఖాంత, యే తేరి గాలియాన్, ఆప్కీ నజ్రోన్ నే సమ్జా.. ఇలా ఎన్నో సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. నటనకు కొంత గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. 'నటిగా భిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తూ రావడం వల్ల కొంత అలసటకు లోనయ్యాను. మళ్లీ ఈ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి బ్రేక్ అవసరమని భావించాను. నెగెటివ్ రోల్స్ చేయడం వల్ల నాపై పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తీసేయాలనుకున్నాను. నా మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నాను. అందుకే 9 నెలల బ్రేక్ తీసుకున్నాను. ఈ బ్రేక్ నాకు చాలా ఉపయోగపడింది పైగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నాను. అందులో భాగంగానే వివిధ తీర్థయాత్రలకు వెళ్లాను. గత కొన్నేళ్లుగా నాతో దూరంగా ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి కాలక్షేపం చేసి ఎన్నో మధురమైన అనుభవాలు మూటగట్టుకున్నాను. ఈ అనుభవాలు తిరిగి నేను మూలాలతో కనెక్ట్ అయ్యేందుకు దోహదపడ్డాయి. నన్ను నేను తిరిగి చూసుకున్నాను. ఇప్పుడు నేను నా భావోద్వేగాలను, కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలను. అందరూ నా పెళ్లి రద్దు గురించి అడుగుతున్నారు.. నిజానికి నా పేరెంట్స్ నా పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఓ సంబంధం తీసుకురాగానే సరేనని తలాడించాను. కానీ పెళ్లంటే చిన్న విషయం కాదు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఎన్నో బరువుబాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అసలే చాలా పెళ్లిళ్లు మధ్యలోనే విచ్ఛిన్నమవుతాయి. నాకొక తోడు కావాలన్న ఆలోచన కూడా లేని సమయంలో ఆదరాబాదరాగా పెళ్లి చేసుకోవడం అవసరమా? అనిపించింది. ఇప్పుడే వెళ్లి వద్దు అని నాన్నకు చెప్పేశా. ఆయన అర్థం చేసుకున్నాడు. నా నిర్ణయాన్ని గౌరవించాడు. అలా పెళ్లి రద్దు చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రెనీ గతేడాది జూలై 3న ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య వర్మతో పెళ్లికి సిద్ధమైంది. కానీ అంతలోనే పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. చదవండి: లలిత్ మోదీతో బ్రేకప్.. సుష్మిత సేన్ క్లారిటీ -
బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి
కోలీవుడ్‌లో పాపులర్ బుల్లితెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా ఆగష్టు 2న మరణించాడు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. (ఇదీ చదవండి: వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్) శ్రుతి షణ్ముక ప్రియ నాదస్వరం, భారతి కణ్ణమ్మ, వాణిరాణి, పూనూంజల్ లాంటి తమిళ సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. గతేడాది ఆరవింద్‌ను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. భర్త మరణంతో పుట్టెడు శోకంలో ఉన్నా కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఒక విజ్ఞప్తి చేశారు. అరవింద్ మృతితో దుఃఖంలో ఉన్న తనను ఓదార్చేందుకు ఫోన్లు, మెసేజ్‌లు పంపిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలా చెప్పుకొచ్చారు. 'అరవింద్ నాతోనే ఉంటాడు, ఎప్పుడూ మాతోనే ఉంటాడు. ఇలాంటి సమయంలో కూడా ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేస్తున్నానో మొదట మీకు చెప్తాను. అరవింద్ మరణానికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలియని వారు దీనిని సమాచారంగా కూడా తీసుకోవచ్చు. కానీ కొంతమంది యూట్యూబర్లకు నిజం ఏమిటో తెలియదు వాళ్లందరూ రకరకాల పుకార్లను ప్రచారం చేస్తున్నారు. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) అతనొక సివిల్ ఇంజనీర్, ఫ్యాషన్ కోసం బాడీబిల్డర్ కూడా. ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా తెలిపారు. కానీ యూట్యూబర్లు మాత్రం పలు రకాలైన థంబ్‌నైల్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అతని మరణానికి కారణం అసలు విషయం తెలిసికూడా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తప్పుగా ప్రచురించడం న్యాయం కాదు. ఇంట్లో అందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మీ వ్యూవ్స్, లైకుల కోసం మమ్మల్ని వేధించకండి.' అని శ్రుతి షణ్ముగ ప్రియ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) -
గతేడాది ప్రియుడితో పెళ్లి.. ఇంతలోనే నటికి పుట్టెడు శోకం..
తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ జీవితంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్(30) ఆగస్టు 2న గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆమె ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా శృతి, అరవింద్ శేఖర్ కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. గతేడాది మే నెలలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోవడంతో శృతి గుండెలవిసేలా రోదిస్తోంది. కాగా శృతి.. నటస్వరం సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ వంటి పలు హిట్ ధారావాహికల్లో నటించింది. సీరియల్స్ చేస్తున్న సమయంలో బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్‌తో లవ్‌లో పడ్డ ఈమె అతడితో కలిసి రీల్స్ చేస్తూ ఉండేది. వీరిని అభిమానులు ముచ్చటైన జంటగా అభివర్ణించేవారు. ఇంత చిన్న వయసులో అరవింద్ మరణించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. Rest in peace #ArvindShekar 💔 Condolences to #ShrutiShanmugaPriya Sister pic.twitter.com/H93GSJ1x5q — Kollywood Cinima (@KollywoodCinima) August 3, 2023 View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) చదవండి: బేబీకి అదిరిపోయే ఆఫర్.. ఆ యంగ్ హీరోతో జోడీ కట్టనున్న వైష్ణవి! -
తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్
సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే ఇటీవల నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. తను గర్భం దాల్చడం వల్లే యాక్టింగ్‌కు విరామం పలికింది. గత నెలలో లహరి సీమంతం వేడుకను ఇంటిసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతానికి బుల్లితెర తారలు హాజరై కాబోయే తల్లిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం లహరికి తొమ్మిదవ నెల కావడంతో స్నేహితులంతా కలిసి మరోసారి సీమంతం ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయింది. దీనిపై రెడ్ కోట్ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్ అయ్యేలా రెడ్ జాకెట్ ఉన్న బ్లూ డ్రెస్ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను లహరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దుస్తులు, బ్యాగులు, బెడ్.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను సైతం తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. మరికొద్ది రోజుల్లో డెలివరీ ఉండటంతో లహరికి అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S W A T (@glamsoulwidbeauty) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి, పెళ్లయిపోయిందా? -
బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..
పెళ్లయిన ప్రతి దంపతులకు ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? లేదా ఎంతమంది పిల్లలు? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోని దంపతులు లేరంటే అతిశయోక్తి కాదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు. బుల్లితెర స్టార్స్ మహి విజ్-జై భానుశాలి కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అన్న ప్రశ్న వారికీ ఎదురైంది. ఒకరకంగా చెప్పాలంటే వారు కూడా సంతానం కోసం ఎంతో ఎదురుచూశారు. కానీ పిల్లలు కావాలన్న వారి కోరిక ఫలించలేదు. సంతానం కోసం ఐవీఎఫ్ దీంతో 2019లో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా మహి గర్భంలో కవలలను ప్రవేశపెట్టారు. తమ సంతోషం రెట్టింపు కానుందని సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఒక పాపాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మరో పాప మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. తాజాగా ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంది మహి విజ్. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ ఆమె మాట్లాడుతూ.. 'సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. తొలి ప్రయత్నం విజయవంతం కాలేదు. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. ఈ గుడ్‌న్యూస్ నాకు ముందుగా నా భర్త చెప్పాడు. అప్పటికే నేను పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. సోనోగ్రఫీ కోసం మాత్రమే బయటకు వెళ్లేదాన్ని. మిగతా సమయాల్లో నర్సే ఇంటికి వచ్చి ఇంజక్షన్స్ ఇచ్చేది. నేను అప్పుడు చాలా సైలెంట్ అయిపోయాను. బయట ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసుకున్నాను. కవలల్లో ఒకరు కన్నుమూత ఐవీఎఫ్ వల్ల కవలలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక పాప ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఒకరకంగా మంచే జరిగిందన్నారు. చాలా సందర్భాల్లో కవలల్లో ఒకరు చనిపోయేలా ఉంటే మిగతా ఒకరు కూడా మరణించే అవకాశాలే ఎక్కువన్నారు. కానీ మిగతా పాపకు ఏం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కనీసం ఒక్కరైనా మాకు దక్కారని సంతోషించాం' అని చెప్పుకొచ్చింది. కాగా మహి-జై 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2019లో తారాకు జన్మనిచ్చారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: విజయ్ దేవరకొండ షర్ట్‌తో కనిపించిన రష్మిక.. మళ్లీ దొరికిపోయిందిగా ఈ శుక్రవారం ఓటీటీలో 22 సినిమాలు -
ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!
పైన ఫొటో చూడగానే అరే.. ఈమె రామ్‌చరణ్ 'ఆరెంజ్' సినిమా హీరోయిన్ కదా అని అనుకున్నారేమో? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లు. ఎందుకంటే ఈమె ఆమె కాదు. ఈ బ్యూటీ కూడా హీరోయినే కాకపోతే కొన్నాళ్ల ముందు వరకు సొంత భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరకు షిప్ట్ అయిపోయింది. స్క్రీన్‌పై పద్ధతిగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో రెచ్చిపోతూ, కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. అలా రెచ్చిపోతూ సాధారణంగా ఓ వయసు వచ్చాక హీరోయిన్ల గ్లామర్ తగ్గిపోతుంది. ఈమెకి మాత్రం అది రివర్స్ లో జరుగతున్నట్లుంది. లేకపోతే ఏంటి ప్రస్తుతం ఈమె వయసు 38 ఏళ్లు. తెలుగులో 'గుప్పెడంత మనసు' సీరియల్లో జగతి పాత్రలో హీరో రిషికి తల్లిగా నటిస్తోంది. సీరియల్లో చీరకట్టుతో ఈమె సోషల్ మీడియాలో మాత్రం హద్దుల్లేకుండా రెచ్చిపోతోంది. అవును మీరు పైన చూసిన ఫొటోలు అవే. (ఇదీ చదవండి: నాలుగో రోజు 'బేబీ'కి ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!) పదేళ్ల క్రితమే ఈమె అసలు పేరు జ్యోతిరాయ్. 1985 ఫిబ్రవరి 23న కర్ణాటకలో పుట్టింది. కన్నడలో స్టేషన్ 3, సిల్లీ లిల్లీ, శుభమాంగళ్య, కిన్నెర, జోగుల, జోజో లాలీ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్‌కి షిప్ట్ అయింది. కన్నడతో పాటు తుళు సీరియల్స్‌లో చేసింది. అలానే పదేళ్ల క్రితమే 'కన్యదానం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోకి తల్లిగా కానీ ఆ తర్వాత తెలుగు, కన్నడ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో హీరో రిషికి తల్లిగా చేస్తోంది. ఈమె పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే 40 ఏళ్లకి దగ్గరలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజులో రెచ్చిపోతోంది. దిగువన ఉన్న ఫొటోలు చూస్తే మీకే అది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు.. ఫొటోస్ దేఖో! View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!) -
ఆడిషన్స్‌కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి
Ratan Raajputh Casting Couch: ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని లేకుండా చాలామంది నటీనటుల దీని బారిన పడుతున్నారు. గతంలో తమకు జరిగిన అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఎలా ఇబ్బంది పడ్డామో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు రివీల్ చేసింది. కూల్‌డ్రింక్ తాగమని 'ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత ఓ కో ఆర్డినేటర్ వచ్చి.. 'డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి సిద్ధమవండి' అని చెప్పారు. దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను. వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత.. 'మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం' అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాం. అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది' (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) గదంతా బట్టలు 'కొన్ని గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు. తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది. బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి. ఓ అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు. ఇతడు ఎవరూ అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు. తమ్ముడని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాం' అని నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 2009లో వచ్చిన 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న రతన్ రాజ్ పుత్.. మహాభారత్, సంతోషి మా సీరియల్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ వీటిని బయటపెట్టకపోతే చాలామంది మోసపోయే అవకాశముందని, అందుకే తనకు జరిగిన దాన్ని రివీల్ చేసినట్లు రతన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Ratan Raajputh (@ratanraajputh) (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు) -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్‌లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా, బ్రేకప్.. నాన్నకు గుండెపోటు: నటి
ఈ రోజుల్లో ఆకర్షణను కూడా ప్రేమంటున్నారు. ఒకరు నిజంగా ప్రేమించినా మరొకరు మాత్రం టైంపాస్ చేస్తున్నారు. వేరొకరికి ఆకర్షితమై నిజంగా ప్రేమించినవారిని మోసం చేస్తున్నారు. అలా తాను కూడా మోసపోయానంటోంది నటి పాలక్ పురస్వాని. మాజీ బాయ్‌ఫ్రెండ్ అవినాశ్ సచ్దేవ్ చేతిలో దారుణంగా మోసపోయానని కంటతడి పెట్టుకుంది నటి. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాలక్ అతడి నిజ స్వరూపాన్ని ఆలస్యంగా తెలుసుకుంది. పాలక్, అవినాశ్.. ఇద్దరూ హిందీ బిగ్‌బాస్ ఓటీటీ 2వ సీజన్లో పాల్గొన్నారు. పాలక్ మొదటివారంలోనే ఎలిమినేట్ కాగా అవినాశ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. ఇకపోతే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన పాలక్ తన గతాన్ని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైంది. 'అవినాశ్ వేరొక నటితో క్లోజ్‌గా ఉండగా నేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. ఈ విషయాన్ని అతడి పేరెంట్స్‌కు కూడా చెప్పాను. ఆంటీ, అంకుల్.. మీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడండి. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న అతడికి దేవుడు రెండో ఛాన్స్ ఇచ్చాడు. దాన్ని కనీసం గౌరవించాలి కదా! అని ఆవేదన వ్యక్తం చేశాను. కానీ ఉపయోగం లేకపోయింది. 'అవినాశ్ ఒక్క ఛాన్సివ్వు అని వెంటపడేవాడు. ఇచ్చి చూసినా ఫలితం లేదు. మళ్లీ నాకు వేరే అమ్మాయితో పార్టీలో అడ్డంగా దొరికాడు. ఒకేసారి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కూడా ఫ్లర్ట్ చేసేవాడు. వారికి అతడు ఎంత గలీజ్ మెసేజ్‌లు చేశాడంటే అవి నేను నా నోటితో చెప్పలేను. అంత నీచంగా ఉన్నాయి. అతడి క్యారెక్టర్ తెలిసి మా కుటుంబం చాలా బాధపడింది. అవినాశ్‌ను ఎంతగానో ప్రేమించే మా నాన్నకు ఈ విషయం తెలిసి గుండెపోటు వచ్చింది. అతడు ఆస్పత్రి పాలయ్యాడు. మేము బ్రేకప్ చెప్పుకుని చాలాకాలం అవుతోంది. కానీ ఇంతవరకు మా నాన్నకు అసలు పూర్తిగా ఏం జరిగిందనేది కూడా చెప్పలేదు' అంటూ ఏడ్చేసింది పాలక్. అవినాశ్ గతంలో శల్మాలీ దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కలిసి ఉన్నారో లేదో విడాకులు తీసుకున్నాడు. చదవండి: సరిగమప సింగర్ కూతురు కన్నుమూత.. ఏడాది కూడా నిండకముందే.. -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, కొడుకు సమక్షంలోనే..
పెళ్లి, విడాకులు, సింగిల్ పేరెంట్‌గా ఇబ్బందులు.. ఇలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సీరియల్ నటి సౌమ్య ఇటీవలే కొత్త జీవితాన్ని ఆరంభించింది. ప్రియుడు శుభం చౌహడియాను అమెరికాలో సీక్రెట్‌గా పెళ్లాడింది. తాజాగా తన రెండో పెళ్లి గురించి స్పందించింది నటి సౌమ్య సేత్. ఆమె మాట్లాడుతూ.. 'నా భవిష్యత్తు బాగుండాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ ఆరాటపడ్డారు. వారి కోరికను నిజం చేస్తూ పెళ్లిపీటలెక్కాను. నా కొడుకు ఐడెన్ కూడా శుభంను ఎంతో ఇష్టపడుతున్నాడు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లి కోసం వాడు కూడా ఎదురుచూశాడు. పెళ్లి గెటప్స్‌లో మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డాడు' అని చెప్పుకొచ్చింది. జూన్ 21న హల్దీ, మెహందీ వేడుక జరగ్గా 22వ తేదీన వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఎవరీ శుభం చౌహడియా? చిత్తూర్ఘడ్కు చెందిన ప్రముఖ హాస్పిటల్ వైద్యుడు అంజు చౌహాన్ తనయుడే శుభం. ఇతడు వాషింగ్టన్ డీసీలో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్న సౌమ్య తన అపార్ట్మెంట్లో ఓ గదిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకోగా అదే గదిలో శుభం వచ్చి చేరాడు. మొదట హౌస్‌మేట్‌గా, తర్వాత స్నేహితుడిగా మారాడు. కరోనా సమయంలో ఒకరికొకరు సాయంగా ఉంటూ మరింత దగ్గరయ్యారు. అతడు తన జీవితంలోకి వస్తే లైఫ్ మరింత అందంగా తయారవుతుందని భావించింది సౌమ్య. ఇద్దరూ ప్రేమించుకోగా వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా పచ్చజెండా ఊపాయి. View this post on Instagram A post shared by Somya Seth (@somyaseth) చదవండి: టూమచ్ ఓవరాక్షన్ అని నటుడిని పొట్టుపొట్టు తిట్టిన డైరెక్టర్ -
పనికిమాలినదంతా వాగుతున్నారు, నేను పాలిచ్చే తల్లిని: నటి
అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది దెబీనా బొనర్జీ. తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. హిందీ రామాయణం సీరియల్లో సీతగా ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ఇదే సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరిని 2006లో రహస్యంగా, 2011లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లాడింది. వీరికి గతేడాది ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 'నాక్కూడా ఫిట్‌గా ఉండాలనుంది. అందుకే మీరు చెప్పేకంటే ముందే నేను వ్యాయామాన్ని మొదలుపెట్టాను. అందుకు నా శరీరం కూడా సహకరిస్తోంది. అలా అని అందరు తల్లులు ఎక్సర్సైజ్ చేయాల్సిందేనని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అయినప్పటికీ నేను బరువు తగ్గలేకపోతున్నాను. దీని గురించి సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. దీనివల్ల నాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ నేను అమ్మతనాన్ని హాయిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. డైట్ విషయంలో మాత్రం నేను నిబంధనలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే నేను పాలిచ్చే తల్లిని. తిండి దగ్గర నోటికి సంకెళ్లు వేస్తే నా పిల్లలకు సరిపడా పాలు రావు. కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాలనుకుంటున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా బరువు తగ్గుతాను. నా గురించి పనికిమాలినది వాగేవాళ్లను పట్టించుకోను. వాళ్ల కోసం అనవసరంగా ఆలోచించి నా పిల్లలకు పాలివ్వడం మానేసి సన్నబడలేను' అని చెప్పుకొచ్చింది దెబీనా. చదవండి: ఆస్పత్రి నుంచి ఉపాసన డిశ్చార్జ్.. తన పోలికలేనన్న రామ్‌చరణ్ -
ఆ టార్చర్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' (TMKOC) నిర్మాతలు తనను వేధించారని నటి మోనికా భడోరియా ఇటీవల తెలిపింది. ఆ షో కోసం పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తనతో వెట్టి చాకిరి చేయుంచుకొని చివరకు తనకు రావాల్సిన రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదని తెలిపింది. (ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ఎగబడ్డ ఫ్యాన్స్) తారక్ మెహతా కా ఉల్టా చష్మా (TMKOC)లో మోనికా భడోరియా.. బావ్రీ పాత్రతో మెప్పించింది. మోనికా తన షో సెట్స్‌లోని రోజులను "హెల్" (నరకం) అని పిలిచింది. చివరకు తన తల్లి క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు షో యూనిట్ నుంచి ఎలాంటి మద్ధతు లభించలేదని ఇలా చెప్పింది.''నేను రాత్రంతా ఆస్పత్రిలో అమ్మ వద్దే ఉండేదాన్ని.. కానీ వారు కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారు. నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పినా.. రమ్మని బలవంతం చేసేవారు. ఎదురు ప్రశ్నించలేక షూట్ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్ చేయించేవారు'' అని కన్నీరు పెట్టుకుంది. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ''మా కుటుంబలో నేనే ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నాను. చాలా తక్కువ కాలంలోనే నా తల్లిని, అమ్మమ్మను కోల్పోయాను. వాళ్లిద్దరూ నా జీవితానికి మూలస్తంభాలు, దీంతో వారు లేరనే బాధను భరించలేక నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను. అయినా ఈ సమయంలో, నేను తారక్ మెహతా కా ఉల్టా చష్మా కోసం పని చేశాను, అప్పుడు కూడా వారు హింసించేవారు. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యం కోసం డబ్బులు ఇచ్చాం అని కూడా వారు ప్రచారం చేశారు. ఈ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి.'' అని చెప్పుకొచ్చింది మోనిక. (ఇదీ చదవండి: CSK: 'సీఎస్కే' టైటిల్ ఫిక్స్ చేయనున్న విజయ్?) దశాబ్ద కాలంగా ఈ షో విజయవంతంగా నడుస్తుండగా ఈ నిర్మాతలపై జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ లైంగిక ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు దిశా వకాని, ప్రియా అహుజా, శైలేష్ లోధా, ఇప్పుడు మోనికా షో నిర్మాతల తీరును తప్పుబట్టారు. -
భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి?
-
బుల్లితెర హీరోయిన్ వెండితెరపైకి.. వరుస ఛాన్సులు
ద గర్ల్ నెక్ట్స్ డోర్లా అనిపించే నటి.. నవ్య స్వామి.. బుల్లితెర కథానాయిక. భాష ఏదైనా సరే హావభావాలతో మెప్పిస్తుంది. అలా ఒకేసారి కన్నడ, తమిళ, తెలుగు బుల్లితెర స్టార్‌గా ఎదిగి వెండి, వెబ్ తెరల మీదా వెలుగుతోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్య డాక్టర్ కావాలనుకుంది. అయితే, 2011లో ‘తంగలి’ అనే కన్నడ సీరియల్లో నటించే అవకాశం రావడంతో యాక్టర్‌గా మారింది. ఆ సీరియల్ మంచి విజయం సాధించటంతో వరుసగా తమిళ, తెలుగు భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘నా పేరు మీనాక్షి’, ‘కంటే కూతురునే కనాలి’, ‘ఆమె కథ’ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై, ఇక్కడే స్థిరపడిపోయింది. అప్పుడప్పుడు రియాలిటీ షోస్‌లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది నవ్య. సోషల్‌మీడియాలోనూ ఎప్పటికప్పుడు పోస్ట్‌లు, ఫొటోలు పెడుతూ చురుగ్గా ఉంటుంది. పలు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది. ఈ మధ్యనే వెండితెర ప్రవేశం కూడా చేసింది. అనికా సురేంద్రన్, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బుట్ట బొమ్మ’ సినిమాలో అర్జున్ దాస్‌కు జోడీగా నటించి, మెప్పించింది. మరో సినిమా ‘ఇంటింటి రామాయణం’ త్వరలోనే విడుదల కానుంది. సీరియల్స్ ఒక మారథాన్ లాంటివి. అంత ఈజీగా ఆపలేం. ఇక నా జీవితం సీరియల్స్‌కే పరిమితం అని అనుకునే సమయానికి అదృష్టం కొద్ది సినిమా అవకాశం వచ్చింది! – నవ్య స్వామి -
యూట్యూబ్ లో మా సంపాదన ఎంతంటే..?
-
చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఈ నటి మాజీ సీఎం మనవరాలని తెలుసా?
బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా రాణిస్తున్న గొప్ప నటీమణి జ్యోతి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి. తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ నటిగా రాణిస్తుండటం విశేషం. ఎక్కువగా నెగెటివ్ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. కుటుంబానికి ఎంతో విలువిచ్చే ఆమె అమ్మానాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్లు వేయించుకుంది. తాజాగా జ్యోతి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని. చదువులో నేను ముందుడేదాన్ని. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్.. వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించాను. నాకు ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టుల్లో నటించమని వారి పీఏలను మా ఇంటికి పంపించేవారు. అది చూసి మా అమ్మ అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్‌వాష్ చేసింది. తన వల్లే యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను. షూటింగ్ లొకేషన్లో ఉన్నంతవరకు అందరూ మంచి ఫ్రెండ్సే. కానీ ఇంటికెళ్లిపోయాక ఎవరితోనూ టచ్‌లో ఉండను. ఓ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పుడు నాకు మూడేళ్లుంటాయి. ఇంటి గడప మీద కూర్చుని పడుకున్నాను. అమ్మ బిందెడు నీళ్లు నా మీద గుమ్మరించింది. అప్పటినుంచి అమ్మ పిలవకముందే నిద్ర లేచేదాన్ని. కాలేజీకి లేట్ అవుతుంది, షూటింగ్‌కు లేటవుతుంది.. అని ఏనాడూ అమ్మతో అనిపించుకోలేదు. అంత క్రమశిక్షణగా ఉంటాను. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇద్దరబ్బాయిలు. వాళ్లను అమ్మ చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి. -
బాబు కోసం బంగారం షాపింగ్ చేసిన బుల్లితెర నటి
బుల్లితెర నటి వైష్ణవి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తనకు కొడుకు పుట్టగానే నటి తమ్ముడు ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తమ కుటుంబంలోకి వెలుగులు తీసుకొచ్చిన పసివాడి కోసం తాజాగా నటి బంగారం కొనుగోలు చేసింది. ఆమె షాపింగ్ చూస్తే నెల రోజులు కూడా నిండని బాబు కోసం ఇన్ని వస్తువులు కొనచ్చా? అని అనిపించక మానదు. పిల్లలకు ఏమేం వేస్తారో అన్నీ చూపించండి అంటూ షాపింగ్ మొదలుపెట్టింది వైష్ణవి. కళ్లకు నచ్చినవాటిని పక్కనపెడుతూ షాపింగ్ కొనసాగించింది. బాబుకు దిష్టి తగలకుండా 4 గ్రాముల దిష్టిపూసల దండ జత తీసుకుంది. అలాగే 8 గ్రాముల కడెం(జత), 1 గ్రాము ఉంగరం, ఒక చైన్, 14 గ్రాముల బ్రేస్లెట్ తీసుకుంది. బంగారం షాపుకు వచ్చాక ఆడవాళ్ల కన్ను నగల మీద పడకుండా ఉంటుందా? కొత్తగా ఏమేం డిజైన్లు వచ్చాయో కనుక్కుంటూ వాటిని ఓసారి తనివితీరా చూసింది. పనిలో పనిగా తను కూడా బంగారు ఆభరణాలు కొనుక్కుంది. లక్ష్మీదేవి నెక్లెస్, మ్యాచింగ్ గాజులు, చెవికమ్మలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఇకపోతే నటి వైష్ణవి రామిరెడ్డి బుల్లితెరపై సీరియల్స్‌లో నటించింది. సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాక వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ నటనకు గుడ్‌బై చెప్పింది. సెప్టెంబర్‌లో గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిన ఆమె ఆ మధ్య సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు బుల్లితెర నటి ప్లాన్, చివరికి..
తమిళ సీరియల్ నటి రమ్య ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. పోలీసుల విచారణలో రమ్య కుట్ర బట్టబయలు కావడంతో నటిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడఘలోని నల్లగౌండన్‌కు చెందిన నటి రమ్య దంపతులు బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వాహనంతో వీరి బైక్‌ను ఢీ కొట్టాడు. వెంటనే సదరు వ్యక్తి.. కిందపడిన రమేశ్‌ను తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన రమేశ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు రమ్య పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో తనపై అనుమానం పెరిగింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్ పరిశీలించగా తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. దంపతుల మధ్య దూరం పెరిగిందిలా.. రమ్య, రమేశ్‌ల మధ్య కొంతకాలం కిందట బేధాభిప్రాయాలు వచ్చాయి. రమ్య సీరియల్స్‌లో నటించడం తనకు ఇష్టం లేదని రమేశ్ చెప్పాడు. కానీ రమ్య అతడి మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో వీరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. మాటామాటా పెరిగి గొడవలు పెద్దవి కావడంతో కొద్ది నెలలుగా వీరు కలిసి ఉండటం లేదు. నటిగానే కెరీర్ కొనసాగించాలనుకున్న రమ్య.. 'సుందరి', 'కన్నేదిరే తొండ్రినాల్' వంటి సీరియల్స్‌లో నటించింది. అదే సమయంలో సహనటుడు డేనియల్ (చంద్రశేఖర్)తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. అటు చంద్రశేఖర్ కూడా రమేశ్ ఇల్లును పది లక్షలకు కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు. అంత తక్కువ మొత్తానికి ఇల్లు అమ్మడం కుదరదన్నాడు రమేశ్. దీంతో ఇద్దరూ కలిసి రమేశ్‌ను అంతమొందించాలని ప్లాన్ చేశారు. చివరికి ప్లాన్ ఫెయిలవడంతో ఇద్దరూ కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్‌కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
నాన్న టార్చర్.. ఇల్లు వదిలి బస్తీకి.. ఖాళీ కడుపుతో కష్టాలు: నటి
ముఖానికి రంగు పూసుకుని కెమెరా ముందుకు వచ్చి వినోదాన్ని పంచుతారు. కానీ ఆ స్థాయికి రావడం కోసం ఎన్నో కష్టనష్టాలను ఒంటిచేత్తో భరిస్తారు. అలాంటివారిలో బుల్లితెర నటి స్నేహల్ రాయ్ ఒకరు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో దాటుకుని వచ్చిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చింది. 'తొమ్మిదేళ్ల వయసులోనే గృహహింసను కళ్లారా చూశాను. అమ్మానాన్న గొడవపడేవారు. కానీ అమ్మ మాత్రం మనం ఒక ఆట ఆడుతున్నాం.. వెళ్లి కారులో పడుకుందాం అని చెప్పేది. అలా ఖాళీ కడుపుతో కార్లలో నిద్రించిన రోజులు చాలానే ఉన్నాయి. తన ముఖం మీద ఉన్న గాయాల తాలూకు మచ్చలను చిరునవ్వుతో కప్పిపుచ్చేది. నాన్న తనను కొడుతున్నాడని మాకెప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆ నరకం నుంచి బయటపడేందుకు అమ్మ ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకుంది. నన్ను, చెల్లిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసి కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ అప్పుడు మేము పడ్డ కష్టాలను మాటల్లో చెప్పలేను. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేదు. ఓ బస్తీకి వెళ్లి బతికాం. కేవలం పానీపూరి తిని ఆ నీళ్లు ఎక్కువగా తాగి కడుపు నింపుకునేవాళ్లం. ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవాళ్లం. ఇదేదో సినిమా కథ అనుకునేరు, ఇది నా జీవితగాథ. స్కూల్‌కు తరచూ వెళ్లేదాన్ని కాదు. నా పరిస్థితిని వాళ్లు అర్థం చేసుకునేవారు. కానీ తోటి విద్యార్థులు మాత్రం నన్ను ఇష్టపడి స్నేహం చేసేవారు కాదు. 16 ఏళ్ల వయసుకే ఉదయం సెలూన్లో రిసెప్షనిస్టుగా, సాయంత్రం కాల్ సెంటర్లో పని చేసేదాన్ని. నా తండ్రి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత తప్పు తెలుసుకుని అమ్మను చేరదీశాడు. అతడు మమ్మల్ని క్షమాపణలు కోరకపోయినా మేమతడిని క్షమించేశాం. మారడానికి ఓ అవకాశం ఇచ్చి చూడాలి కదా..' అని చెప్పుకొచ్చింది నటి స్నేహల్. కాగా స్నేహల్ ఇష్క్ కా రంగ్ సీరియల్లో నటించింది. నటిగానే కాకుండా మోడల్‌గా, యాంకర్‌గా రాణిస్తోంది. -
అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి
తన తల్లి కారణంగా మలయాళ నటి ఆర్య పార్వతి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అంతేకాదు తాను అక్కను అయ్యానంటూ తన బుల్లి చెల్లి ఫొటో షేర్ చేస్తూ మురిసిపోయింది. అయితే లేటు వయసులో తన తల్లి బిడ్డకు జన్మనివ్వడంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆర్య పార్వతి స్పందించింది. ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అందులో సిగ్గుపడాల్సింది ఏముందని అభిప్రాయపడింది. చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం మా నాన్న ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె 8నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో.. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. షాక్ అయ్యాను అనేకంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. కానీ, నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం 7వ నెలలో తెలిసింది’ అంటూ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత ‘అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ-నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారు’ అని పేర్కొంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి తన అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చానని చెప్పింది. ‘నిజానికి నేను ఎంతోకాలం దీనికోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను’ అని అమ్మతో చెప్పానని ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో ఆమె ఈ గుడ్‌న్యూస్ షేర్ చేయడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. -
'పసివాడి ప్రాణం' చిత్రంలోని చిన్నోడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలో విజయశాంతి జోడిగా నటించింది. 1987లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్లోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సుమలత ముఖ్యపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన బాబుపైనే అందరి దృష్టి పడింది. ముద్దుగా కనిపించే అబ్బాయి పాత్రలో నటించింది ఎవరో మీకు తెలుసా? అతను ఇప్పుడెలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేద్దాం పదండి. అబ్బాయి కాదు అమ్మాయే పసివాడి ప్రాణం చిత్రంలో మెప్పించిన ఆ చిన్నారి అబ్బాయి కాదు.. అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మనందరికి తెలుసు. తాను మరెవరో కాదు సీరియల్ నటి సుజిత. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. ఇక్కడే కాదు.. సుజిత చిన్నప్పుడు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. సుజిత ఎవరంటే.. 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
ఆరోజు హోటల్లో కావాలని ఇరికించారు.. ఇప్పటికీ వేధిస్తున్నారు : యమున
వెండితెరపై హీరోయిన్గా అలరించిన నటి యమున ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం, అభినయంతో చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే ఓ చేదు సంఘటన ఆమెకు ఎదురైంది. 2011లో బెంగుళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలనే తనని ఇరికించారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ తనను వేధిస్తున్నారని, ఆ సంఘటనకు సంబంధించి అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆవేదనను వెల్లడించింది. ''ఆ సంఘటన తాలూకూ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆరోజు అసలేం ఏం జరిగిందన్నది ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది.కానీ సోషల్‌మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది'' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్‌లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
10 ఏళ్ల కొడుకే ఆమె ప్రాణం.. రెండో పెళ్లికి సిద్ధమైన నటి, ఆరోజే వెడ్డింగ్!
రెండక్షరాల పెళ్లి రెండు జీవితాలనే కాదు రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. జీవితాంతం కలిసి ఉండమని దంపతులను ఆదేశిస్తుంది. జంటగా కష్టసుఖాల సంసార సాగరాన్ని దాటాలని హితబోధ చేస్తుంది. కానీ కాలం మారేకొద్దీ పెళ్లిళ్లు చేసే విధానాలు మారిపోతున్నాయి. కానీ ఆ వివాహబంధం చెప్పే సూత్రాలు మాత్రం అలాగే నిలిచుండిపోయాయి.బాలీవుడ్లో అయితే ప్రేమ, పెళ్లి, విడాకులు, మరో పెళ్లి.. ఇది చాలా కామన్ అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి నటి, బిగ్‌బాస్ బ్యూటీ దల్జీత్ కౌర్ వచ్చి చేరింది. త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది. యూకేకు చెందిన నిఖిల్ పటేల్‌తో మార్చి 18న ఆమె వివాహం జరగనుంది. 17వ తేదీ నుంచి ఆమె పెళ్లి పనులు షురూ కానున్నాయి. ఇటీవలే తన లవ్‌స్టోరీని బయటపెట్టింది దల్జీత్. ఫ్రెండ్స్ పార్టీలో ఒకరినొకరు తొలిసారి కలుసుకోగా ఇద్దరూ వారివారి పిల్లల గురించే కబుర్లు మాట్లాడుకున్నారు. పిల్లలపై ఉన్న బాధ్యతే తమను ప్రేమలో పడేలా చేసిందని వెల్లడించింది. ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే నిఖిల్ ప్రస్తుతం నైరోబీలో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి పెళ్లవగానే మొదట దల్జీత్ నైరోబీకి వెళ్లనున్నట్లు పేర్కొంది. అక్కడ పని పూర్తవగానే అతడి స్వస్థలమైన లండన్‌కు చెక్కేస్తారట! ఇకపోతే దల్జీత్ కౌర్ హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొంది. గతంలో ఆమె షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. అతడు ఇటీవలే బిగ్‌బాస్ 16వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేశాడు. వీరికి జైడన్ అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కానీ దల్జీత్, షాలిన్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దల్జీత్.. కులవధు, సంతాన్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ?(చూపులు కలిసిన శుభవేళ), కాలా టీకా, కాయామత్కీ రాత్, గుడ్డన్: తుమ్సే నా హో పాయేగా, సాసురాల్ జెండా ఫూల్ 2 వంటి సీరియల్స్‌లో నటించింది. అటు నిఖిల్‌కు కూడా ఇదివరకే పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు తల్లితో ఉంటే మరొకరు తండ్రితో ఉంటున్నారు. View this post on Instagram A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet) చదవండి: ఊహించని సర్ప్రైజ్.. ఏడ్చేసిన మంచు విష్ణు -
చందమామలా మెరిసిపోతున్న నటి ప్రణవి మానుకొండ (ఫోటోలు)
-
47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి
ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో ఓ కల్పిత కథ.. నిజ జీవితంలో చోటు చేసుకుంది. ప్రముఖ సీరియన్ నటి, బుల్లితెర హీరోయిన్ తల్లి 23 ఏళ్ల తర్వాత గర్భవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ వార్త ఇండస్ట్రలో, సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. వివరాలు.. కేరళకు చెందిన 23 ఏళ్ల ఆర్య పార్వతి మలయాళంలో పాపులర్ నటి. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తూ బుల్లితెర హీరోయిన్గా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: కృష్ణవంశీకి పిచ్చా.. ఈమె హీరోయిన్ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత ‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్ ఆమె గుర్తింపు పొందింది. ఆమె నటి మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. నటిగా, డ్యాన్సర్‌గా ఆమె ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తన తల్లి గర్భవతి అయినట్లు ప్రకటించి షాకిచ్చింది. 47 ఏళ్ల ఆమె తల్లి 23 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసి అంతా అవాక్కాయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మననిచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ విషయాన్ని నటి ఆర్య పార్వతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన బుల్లి చెల్లి ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. కాగా అచ్చం ఇలాంటి సంఘటన ఆధారంగా ఇటీవల తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. ఆర్జే బాలాజీ లీడ్ రోల్లో ‘వీట్ల విశేషం’ అనే సినిమా వచ్చింది. ఇందులో సత్యరాజ్, ఊర్వశీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో తల్లిగా కనిపించిన ఊర్వశీ మధ్య వయసులో తల్లవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరగడం గమనార్హం. View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) -
19 ఏళ్లకే ముంబైలో ఇల్లు కొన్న సీరియల్ నటి
చిన్న వయసులోనే బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది సుంబుల్ టొఖీర్. 19 ఏళ్లకే హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ నటి. ఇమ్లీ, ఇషారోన్ ఇషారోన్ మే, చంద్రగుప్త మౌర్య సహా పలు సీరియల్స్‌లో నటించిన ఆమె ఆర్టికల్ 15 సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఈ బుల్లితెర నటి ముంబై నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. 'ఇది మా కొత్తిల్లు.. ఇంకా పనులు జరుగుతున్నాయి. కొన్ని ఐడియాలు చెప్పొచ్చుగా' అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేసింది. తన కొత్తింటికి ఎలాంటి ఇంటీరియర్ అయితే బాగుంటుందో సూచనలు, సలహాలు ఇవ్వమని కోరింది. ప్రస్తుతానికి ఆ ఫ్లాట్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే సుంబుల్ చేతిలో డియర్ ఇష్క్ వెబ్ సిరీస్ ఉంది. రవీందర్ సింగ్ రాసిన 'రైట్ మి ఎ లవ్ స్టోరీ' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Sumbul Touqeer (@sumbul_touqeer) చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే! -
అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరి, స్వయంగా వెల్లడించిన నటి
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్ చేసింది. ‘ప్రస్తుతం చికెన్ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) -
పెళ్లి పీటలెక్కనున్న సీరియల్ నటి, పెళ్లిచూపులు వీడియో..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభాశెట్టి. కార్తీకదీపం సీరియల్లో డాక్టర్‌బాబు, వంటలక్కను ముప్పుతిప్పలు పెట్టిన మోనితగా అందరికీ సుపరిచితురాలే! తన పాత్రతో అల్లాడించిన శోభా తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. ఈ విషయాన్నే తనే స్వయంగా యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. 'నాకు తెలియకుండానే అమ్మ పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. ఆ అబ్బాయెవరో కూడా తెలియదు. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసింది. ఈరోజు నా బర్త్‌డే. ప్రతి ఏడాది ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటాం. కానీ ఈసారి మా అమ్మ నాకు తెలియకుండా ఓ అబ్బాయిని చూసింది. అతడు నన్ను చూడటానికి ఈ రోజు మా ఇంటికొస్తున్నాడు. అందుకోసమే రెడీ అవుతున్నా' అంటూ సిగ్గుల మొగ్గయింది నటి. పక్కా ట్రెడిషనల్‌గా పెళ్లికూతురిలా అందంగా ముస్తాబైందీ శోభా. ఆరెంజ్ పట్టుచీరలో ధగధగ మెరిసిపోయింది. ఇంటిని సైతం డెకరేట్ చేయడమే కాకుండా గేటు ముందు టెంట్ వేసి పెళ్లిచూపులకు వచ్చినవారికి విందు ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి శోభాతో ఏడడుగులు నడిచే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: నాది లవ్ మ్యారేజ్.. భర్త బతికున్నాడో, లేదో కూడా తెలీదు: నటి -
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ బుల్లితెర నటి
మరో బుల్లితెర నటికి కథానాయకి అదృష్టం వరించింది. టీవీ యాంకర్లు, సీరియల్ హీరో హీరోయిన్లు కావడం కొత్తేమి కాదు. ఇప్పుడు ప్రముఖ నటీనటులుగా రాణిస్తున్న శివ కార్తికేయన్, నటి ప్రియా భవాని శంకర్, వాణి భోజన్ వంటి వారు మొదట ప్లాట్‌ఫామ్ బుల్లితెరనే. అలా బుల్లితెరపై అనతి కాలంలోనే తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అర్చన. 2019లో ఆదిత్య చానల్లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రాజా రాణి–2 సీరియల్ ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఆ సీరియల్లో నటిగా తన సత్తా చాటుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత లవ్ ఇన్సూరెన్స్, ట్రూత్ ఆర్ డేర్ అనే షార్ట్ ఫిలిమ్స్‌లో నటించారు. ఆ తరువాత కల్యాణం వయసు వందురుచ్చి అనే వెబ్‌సిరీస్‌లో నటించి గుర్తింపు పొందారు. ఇటీవల సోనీ మ్యూజిక్ సంస్థ ధరన్‌కుమార్ సంగీతంలో రూపొందించిన తామా తుండు అనే వీడియో ఆల్బమ్‌లో అర్చన నటించారు. ఈ వీడియో వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని అర్చన పేర్కొన్నారు. దీంతో సినిమా అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అరుల్నిధికి చెల్లెలుగా డీమాంటి కాలనీ –2 చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. దీని గురించి అర్చన మాట్లాడుతూ.. తాను అచ్చ తమిళ అమ్మాయినని చెప్పారు. అందుకే దర్శకులు చెప్పే విషయాలను సులభంగా అర్థం చేసుకుని నటిస్తానని అన్నారు. మంచి నటిగా రాణించాలన్నదే తన కోరిక అన్నారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుని ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. -
‘సీరియల్ నటి ఆత్మహత్య వెనక లవ్ జిహాద్ కోణం ఉందా?’
ముంబై: బాలీవుడ్ యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్. తునీషా ఆత్మహత్య వెనుక ‘లవ్ జిహాద్’ కోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని, నేరస్థులు తప్పించుకోలేరని తెలిపారు. తునీషా కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందా?లేదా మరో అంశం దాగుందా? దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి. కానీ, తునీషా శర్మ కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇందులో లవ్ జిహాద్ కోణం దాగిఉంటే.. దాని వెనక ఏ సంస్థ ఉంది, నేరస్థులేవరు అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తారు.’ - రామ్ కదమ్, బీజేపీ ఎమ్మెల్యే. బాలీవుడ్ యువనటి తునీషా శర్మ శనివారం రోజున మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లోని వాసాయ్లో ఓ టీవీ షో సెట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలతో ఆమె సహ నటుడు షీజన్ మొహమ్మెద్ ఖాన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తునిషా తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు ఇరువురు రిలేషన్లో ఉన్నారని, 15 రోజుల క్రితమే విడిపోయినట్లు తెలిసిందన్నారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ వాసాయ్ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: Tunisha Sharma Suicde Case: సీరియల్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్ -
సీరియల్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్
ప్రముఖ సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. షూటింగ్ సెట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సహ నటుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తునీషా, షీజన్ రిలేషన్లో ఉండేవారని, అతని వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటే తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్టి చేసి విచారిస్తున్నామని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. కాగా తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
షూటింగ్ సెట్లో బుల్లితెర నటి ఆత్మహత్య
ప్రముఖ బుల్లితెర నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ముంబైలోని ఓ షూటింగ్ సెట్ మేకప్ రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. నటి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా భారత్ కా వీర పుత్ర- మహారాణ ప్రతాప్ అనే సీరియల్‌తో చిన్న వయసులోనే కెరీర్ ఆరంభించింది తునీషా. చక్రవర్తి అశోక సామ్రాట్, గబ్బర్ పూంచ్‌వాలా, షేర్ పంజాబీ: మహారాజ రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్, ఇష్క్ సుభాన్ అల్లా, అలీ బాబా: దస్తాన్ ఇ కాబుల్ వంటి ధారావాహికల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. సీరియల్స్ మాత్రమే కాకుండా ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 చిత్రాల్లోనూ అలరించింది. ఫితూర్, బార్ బార్ దేఖో సినిమాల్లో బాల కత్రినాగా నటించింది తునీషా. చదవండి: 2023లో నేను తీసుకుంటున్న నిర్ణయం అదే: అల్లు స్నేహ అలరించని బీటౌన్ స్టార్స్, 2022లో దారుణ డిజాస్టర్స్ -
మిస్క్యారేజ్ అయింది, సీరియల్ మానేశా: నటి
సీరియల్ నటి కరుణ భూషణ్ ఎక్స్పోజ్డ్ 24 వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకూ దగ్గరైంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అయింది. 'అమ్మది బాంబే. నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనే.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకున్నా. అతడు బాలీవుడ్ డైరెక్టర్. 2007లో నేను అతడ్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను. మాకొక అబ్బాయి. తర్వాత ఒకసారి మిస్క్యారేజ్ అయింది. అప్పుడు ఒక సీరియల్ కూడా మానేశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నటిస్తున్నాను. నా తొలి సినిమా ఆహా. 30కి పైగా సినిమాల్లో నటించాను. నటించకపోయుంటే డాక్టర్ అయ్యేదాన్ని. నేను బాగా నమ్మిన కొందరు నాకు హ్యాండిచ్చారు. అప్పటినుంచి ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని అర్థమైంది. ఈ మధ్యకాలంలో స్వీట్ మెమొరీస్ అంటే.. మా ఆయన నాకు ఐఫోన్ 14 ప్రో మాక్స్ గిఫ్టిచ్చాడు. అతడికి ఈ ఫోన్ గిఫ్టిద్దామని హైదరాబాద్ అంతా తిరిగాను. ఎక్కడా దొరకలేదు. చివరికి అతడే నాకది గిఫ్టిచ్చాడు. అది నిజంగా సర్ప్రైజ్. ఆ తర్వాత మా పెళ్లిరోజుకు నేను కూడా ఐఫోన్ 14 ప్రో మాక్స్ బహుమతిగా ఇచ్చా' అని చెప్పుకొచ్చింది నటి. చదవండి: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల 18 పేజీస్ మూవీ రివ్యూ -
బుల్లితెర నటి పెళ్లి, మూడు ముళ్ల వీడియో వైరల్
నెగెటివ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి సునందమాల పెళ్లి పీటలెక్కింది. శంకర్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. ఈ పెళ్లికి బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి, కమెడియన్ రోహిణి, సీరియల్ నటి తనూజ సహా తదితరులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన వధూవరులతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సునంద పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వధువు మెడలో వరుడు తాళి కడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా సునంద- శంకర్ల నిశ్చితార్థం ఇటీవలే వైజాగ్‌లో ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థం నుంచి ప్రీవెడ్డింగ్ వరకు అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ వచ్చింది సునంద. పెళ్లి పనుల వీడియోను సైతం యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) చదవండి: హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి -
నటి కస్తూరి తన సంపాదనను ఏం చేస్తుందో తెలుసా? బయటికొచ్చిన షాకింగ్ నిజాలు
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సామాజం ఆమె ఎదుర్కొనే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఆమె సామాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుందనే విషయం తెలిసిందే. ఇటీవల నయనతార సరోగసిపై ట్వీట్ చేసి వివాదానికి తెరలేపింది. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం అలా గతంలో ఆమె ఎన్నో అంశాలపై ఆమె ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల చెన్నై మెట్రోలో ప్రయాణించిన ఆమె తన ఫోన్ పొగొట్టుకుందట. దీంతో కస్తూరి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఫోన్‌ను వెతికిపెట్టి ఇచ్చారట. దీంతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీసెంట్గా ఆమె ట్వీట్ చేసింది. ‘చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది. మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు. పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది. ఇలా ఉంతోమంది ప్యాసింజర్ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు. అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్ ఇక ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘మీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దీంతో మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెలబ్రెటీ అయి ఉండి ఆడంబరాలకు పోకుండ సాధారణ జీవితం గడుపుడుతూ ఉన్నంతో ఇతరులకు సాయం చేస్తున్న ఆమె పట్ల గౌరవం పెరిగిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా కస్తూరి నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. OMG @cmrlofficial found my phone! No words to praise the dedication and integrity of CMRL staff. Many passengers have gotten back lost valuables. Special thanks to Mr Vijay Varadhan, joint GM . I already am a Chenno metro loyalist, now I have one more reason to love them! https://t.co/UGLpAYrFbR — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 I don't own a car. I don't have tv. I don't use Air conditioning. I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి పల్లవి
బుల్లితెరపై సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది పల్లవి రామిశెట్టి. పలు సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి ఆగస్టులో సీమంతం జరుపుకోగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. మా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశాడోచ్ అంటూ పసివాడి పాదాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తల్లిదండ్రులుగా మారిన పల్లవి-దిలీప్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by pallavi Ramisetty official (@pallaviramisettyofficial) చదవండి: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా? టాలీవుడ్లో విషాదం, నటుడు కన్నుమూత -
సీరియల్ నటి ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి
టీవీ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆమె తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొండంత అండను కొల్పొయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తండ్రితో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా గుండె ఎప్పటికి కోలుకోలేదు డాడీ. నా సూపర్ హీరో, బిగ్గెస్ట్ బ్లెస్పింగ్ కోల్పోయాను. ప్రతి క్షణం నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను... కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విష్ణు ప్రియ భావోద్వేగానికి లోనయ్యింది. కాగా విష్ణుప్రియ ప్రస్తుతం తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో బిజీగా ఉంది. ఇక ఆమె తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నటుడు నరేశ్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
రామాయణం సీరియల్ నటి దెబీనా బొనర్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, నటుడు గుర్మీత్ చౌదరి తెలిపారు. రెండోసారి పేరెంట్స్‌గా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉందని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన డెబీనా ఆతర్వాత రెండు, మూడు సినిమాల్లోనూ నటించింది. కానీ వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా గుర్తింపు పొందింది. రామాయణం సీరియల్‌తో మరింత పాపులర్ అయిన డెబీనా ఈ సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరినే 2011లో పెళ్లాడింది. ఈ ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన డెబీనా తాజాగా రెండోసారి బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) -
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్‌రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం
ప్రముఖ బెంగాలీ నటి సోనాలీ చక్రవర్తి(59) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భర్త శంకర్ కూడా నటుడే కాగా.. వారికి ఓ కుమార్తె ఉన్నారు. బెంగాలీ అభిమానులకు సుపరిచితురాలైన సోనాలి కాలేయ సమస్యలతో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: వాటిని నేను పట్టించుకోను.. కాంతార హీరో రిషబ్ శెట్టి) బెంగాలీకి చెందిన బుల్లితెర నటి సోనాలీ దాదర్ కీర్తి (1980), హర్ జీత్ (2002), చోఖేర్ బాలి (2003), బంధన్ (2004) వంటి చిత్రాలలో కూడా కనిపించారు. చివరగా ఆమె నటించిన మెగా సీరియల్ గాట్చోరలో కనిపించింది. ఆమె మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్‌పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్‌జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్‌తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్‌గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్‌గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో కీలక మలుపు!
నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని తన నివాసంలో ఇవాళ ఉరేసుకుని చనిపోగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ నటి నివాసంలో దొరికిన సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు పొరుగున ఉండే రాహుల్ వేధింపులు తట్టుకోలేకే నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ తెలిపారు. వైశాలి టక్కర్ ఈ-గాడ్జెట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ వెల్లడించారు. రాహుల్ ఆమెను వేధింపులకు గురి చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని రాహుల్‌కు తెలియడంతో ఆటంకాలు కలిగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నాడని ఏసీపీ రెహమాన్ పేర్కొన్నారు. (చదవండి: ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి! వీడియో వైరల్) కెన్యాలో పనిచేసే అభినందన్ సింగ్ అనే సర్జన్‌తో వైశాలి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని మహిద్‌పూర్ పట్టణం. గత రెండేళ్లుగా వైశాలి టక్కర్ ఇండోర్‌లో నివసిస్తున్నారు. 2015లో 'యే రిష్తా క్యా కెహ్లతా హై'తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 'సూపర్ సిస్టర్స్', 'మన్మోహిని 2' వంటి షోలలో కూడా పనిచేసింది. ఆమె చివరిగా 'రక్షాబంధన్' సీరియల్లో కనిపించింది. అంతేకాకుండా, ఆమె 'యే హై ఆషికి'లోని కొన్ని ఎపిసోడ్లలో కూడా భాగమైంది. #UPDATE | Her (TV actor Vaishali Takkar) e-gadgets will be probed. Her neighbour Rahul harassed her, because of whom she took this extreme step. She was about to get married to another man, but he hindered that too. Rahul is absconding; search on to nab him: Indore ACP M Rahman pic.twitter.com/ttGMak8WJm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 16, 2022 -
వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నటీనటులను పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈచిత్రంలో లెజెండరి నటుడు శరత్ కుమార్, నటి ప్రియమణి, కమెడియన్ వెన్నెల కిషో, సంపత్ రాజా వంటి స్టార్ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి తాజాగా ఇందులో బుల్లితెర క్వీన్, నటి ప్రేమి విశ్వనాథ్(కార్తిక దీపం సీరియల్ ఫేం దీప) కూడా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్‌కు సెట్లోకి స్వాగతం పలుకుతూ తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు వెల్కమ్ ఆన్‌బోర్డ్ అంటూ ప్రేమి విశ్వనాథ్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
సీరియల్స్‌లో బిజీ ఆర్టిస్టుగా శ్రావణి.. అలా అవకాశం
శ్రీకాకుళం (టెక్కలి): కార్తీకదీపం సీరియల్లో తులసిగా..గీతాగోవిందంలో జయమ్మగా..గుప్పెడంత మనసులో ధరణిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.. సుమారు 14 టీవీ సీరియల్స్, మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్‌లో నటిగా, అమమ్మగారిల్లు, పేపర్‌బాయ్ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వర్ధమాన టీవీ సీరియల్ నటి తాండ్ర శ్రావణి అలియాస్ సీతామహాలక్ష్మి ఇటీవల టెక్కలి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె స్వస్థలం కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామం. టెక్కలిలోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మారుమూల ప్రాంతానికి చెందిన తనను టీవీ సీరియల్స్ అభిమానులు ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారని చెప్పారు.2వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లామన్నారు. 2011లో హైదరాబాద్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారోంభోత్సవంలో భాగంగా తనకు నటిగా అవకాశం వచ్చిందన్నారు. మొదట తమిళంలో కడాసి బెంచ్ అనే సీరియల్లో నటించినట్లు తెలిపారు. తర్వాత మొగలిరేకులు, ఒకరికొకరు, అభిషేకం , కార్తీకదీపం, గోరింటాకు, గీతాగోవిందం, గుప్పెడంత మనసు, ఆడదే ఆధారం, పౌర్ణమి, అగ్నిపూలు తదితర సీరియల్స్‌లో అనేక పాత్రలు పోషించినట్లు వివరించారు. వీటితో పాటు మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు హైదరాబాద్‌లో అనాథ పిల్లలకు అండగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పిన ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి తరచూ కొత్త వీడియోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా ఆమె కొత్త వీడియో రిలీజ్ చేస్తూ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. చదవండి: నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్ కామెంట్స్ తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్ చానల్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వైష్ణవి.. తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెబుతూ అసలు విషయం చెప్పేసింది. ‘మా ఇంట్లోకి ఓ కొత్త మెంబర్ రాబోతున్నారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా వేయిట్ చేసిన అనంతరం ఇప్పుడు మీతో ఈ గుడ్‌న్యూస్ పంచుకుంటున్నా’ అని పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని, ఏం తిన్న వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చిది. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇంట్లో అందరు ప్రతి రెండు, మూడు గంటలకు తిను తిను అంటూ ఇబ్బంది పెడుతున్నారంంది. అనంతరం ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతినని తెలిపింది. అంతేగాకు ప్రెగ్నెన్సి సమయంలో తల్లిగా తను పాటించాల్సి జాగ్రత్తలు ఎంటనేవి కూడా కామెంట్స్ రూపంలో సూచించాలని, మీ అందరి సహకారం కావాలంటూ ఫాలోవర్స్‌ను కోరింది. ఆమె షేర్ చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వైష్ణవి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రం.. నటికి భర్త మాత్రం లేడు!
అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం చూశాం. అబ్బాయి అబ్బాయి లివింగ్ రిలేషన్షిప్లో ఉండటం విన్నాం. ఈ మధ్య కాలంలో అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాం. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు తనను తానే వివాహమడిన విషయం తెలిసిందే. ఈమె బాటలోనే తనకు తాను వివాహ బంధంతో ఒక్కటైంది సీరియల్ నటి కనిష్క సోని. 'దియా ఔర్ బాతీ హమ్' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది కనిష్క సోని. ఈమె ఇటీవల తనను తానే పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒక హిందూ సాంప్రాయదాయ మహిళగా కనిపించేలా నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు 'నా కలలన్నింటినీ నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల తనపై చూపించిన ద్వేషంపై స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ ''నన్ను నేను పెళ్లి చేసుకున్న అని పెట్టిన పోస్ట్‌పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు విచిత్రంగా రియాక్ట్ అయితే, మరికొంతమంది నన్ను ద్వేషిస్తున్నారు. అందులో నా లైంగిక జీవితం గురించి అడిగారు. వారందరికి నేను నిజాయితీగా నేను చెప్పేది ఒక్కటే. నేను గుజరాత్‌కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని. పెళ్లి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో మంచి అనుభూతి ఉండేది. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడు ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు. అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడు ఉండరని నాకు అర్థమైంది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి నేటి సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. మనిషి లేకుండా నా జీవితాంతం సంతోషంగా జీవించగలను అని నేను నమ్మడానికి కారణం అదే. శృంగారం కోసం పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను. వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. అది ప్రేమ, నిజాయితీకి సంబంధించినది. అంతేకాకుండా నేను సంపాదిస్తే ఇంకో మనిషి అవసరం నాకు లేదు. నేను నా కలలను స్వేచ్ఛగా నేరవేర్చుకోగలను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. హాలీవుడ్ వైపు నా కెరీర్ సాగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపింది'' కనిష్క సోని. View this post on Instagram A post shared by Kanishka Soni (@itskanishkasoni) View this post on Instagram A post shared by Kanishka Soni (@itskanishkasoni) -
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న బుల్లితెర నటి
బుల్లితెర నటి షబీనా షేక్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది.ఈ మేరకు తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. జులై 17ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో సీరియల్ నటులు సహా పలువురు ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షబీనా తొలుత ‘కస్తూరి’, ‘గృహలక్ష్మీ’, ‘నా పేరు మీనాక్షి’ వంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోకు ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు సంపాదించుకుంది. కాగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న షబీనా కొంతకాలంగా సీరియల్స్‌లో కనిపించడం లేదు. టీవీ షోస్‌లోనూ అప్పుడప్పుడూ తళుక్కుమంటుంది. దీంతో పెళ్లి అయ్యాక షబీనా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందా? లేదా అన్న సందేమం కలుగుతుంది. View this post on Instagram A post shared by SHABEENA SHAIK (@shabena_official) -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎందరో అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే ఇలా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడం పోలీసులకు సాహసమనే చెప్పాలి. కానీ ముంబైలోని ఓషివారా పోలీసులు మాత్రం ఓ సైబర్ క్రైమ్‌ను చేధించి అతి త్వరగా ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాందిచుకుంది బుల్లితెర బ్యూటీ అమన్ సంధు (Aman Sandhu). ప్రస్తుతం గోరేగామ్లో నివసిస్తోన్న అమన్ తాజాగా సైబర్ నేరగాళ్ల (Cyber Crime) ట్రాప్‌లో పడింది. తన తల్లికి డాక్టర్ అపాయింట్మెంట్ కోసమని జుహుకి చెందిన ఆస్పత్రి వెబ్సైట్ కోసం జులై 6న నెట్లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్సైట్లా కనిపించే నకిలీ సైట్లో తన నెంబర్‌ను నమోదు చేసింది. ఆమె నెంబర్‌కు కాల్ చేసిన వ్యక్తి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం పంపిన వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయాలని సూచించాడు. ఆ లింక్‌పై నటి అమన్ సంధు క్లిక్ చేయగానే తన మూడు ఖాతాల నుంచు రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన అమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య సత్వరమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా ఆ డబ్బును రికవరీ చేశారు. అలాగే కాజేసిన అకౌంట్‌ను బ్లాక్ చేశామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి అమన్ సంధు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఓషివారా పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. 'నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి. కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు' అని ఇన్‌స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్.. పెళ్లికి రెడీ అయిన బుల్లితెర బ్యూటీ!.. అతనెవరంటే ? View this post on Instagram A post shared by Aman Sandhu 🧿ਜੱਟੀ (@officialamansandhu) -
పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
Jabardasth Lady Comedian Rithu Chowdary Getting Married: బుల్లితెర షో జబర్దస్త్‌తో ఫేమ్ సంపాదించిన వారిలో రీతూ చౌదరి ఒకరు. లేడీ కమెడియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతూ చౌదరి పలు సీరియల్స్‌తోనూ తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు తదితర సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రీతూ పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫొటో చూసిన వారంతా రీతూ చౌదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని ఊహిస్తున్నారు. అయితే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు కానీ, ఈ ఫొటోకు రితూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే దాదాపు ఆమె పెళ్లి కాయమైనట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తితో రీతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలో రీతూతో ఉన్నది ఎవరా ? అనే ఆసక్తి నెటిజన్స్‌లో మొదలైంది. వివరాల్లోకి వెళితే రీతూతో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్ అని, అతను సంపన్న వ్యాపారస్థుడని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. చదవండి: రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి, ఫొటోలు వైరల్!
హిందీ సీరియల్ నటి శ్రీతమ ముఖర్జీ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు ఆకాశ్ సాహ్నితో ఏడడుగులు వేసింది. ముంబైలోని స్టార్ హోటల్లో జూన్ 23న వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. తన స్పెషల్ డేను మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఎంతో అందంగా ముస్తాబైంది శ్రీతమ. ఎరుపు రంగు చీర కట్టి, బంగారు నగలు ధరించి, నుదుటన ఎర్రటి బొట్టు పెట్టి, జడ కొప్పు వేసుకుని పెళ్లి కూతురిగా సింగారించుకుంది. వరుడు పేస్టల్ కలర్ షేర్వానీలో వధువకు పోటీనిచ్చేలా రెడీ అయ్యాడు. ఈ నూతన వధూవరులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా శ్రీతమ ముఖర్జీ.. 'దేఖా ఎక్ క్వాబ్', 'కుచ్ తో హై తేరీ మేరే డర్మియాన్' సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. 'మేము ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. ఓసారి బెంగళూరులో షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై తిరిగి పయనమయ్యాను. కానీ నా డ్రైవర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నన్ను పిక్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ ఓ హ్యాండ్సమ్ అబ్బాయిని పంపించింది. అలా ఇద్దరం స్నేహితులమయ్యాం, తర్వాత ప్రేమించుకున్నాం. ఏడేళ్లు డేటింగ్ చేశాక ఇద్దరం కలిసి ఈ నెల 9న టీజీఎమ్ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం. బిజినెస్‌లోనే కాదు ఇప్పుడు జీవితంలో కూడా భాగస్వాములమయ్యాం' అని చెప్పుకొచ్చింది. చదవండి: అత్యాశ..అవకాశాల్లేవు.. కేజీయఫ్ బ్యూటీ పరిస్థితి ఇలా అయిందేంటి? ‘7 డేస్ 6 నైట్స్’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్ రాజు -
ఏక్ నెంబర్ సీరియల్.. రెండేళ్లుగా నటికి డబ్బులెందుకివ్వట్లే?
తారక్ మెహతా కా ఉల్టా చష్మా.. ఈ పేరు తెలియని హిందీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫేమస్ అయిందీ సీరియల్. ఇందులో నటించిన నటీనటులకు సైతం మంచి పేరుప్రఖ్యాతలు దక్కాయి. అయితే ఈ సీరియల్ నిర్మాతలు తనకు డబ్బులివ్వడం లేదంటూ నటి నేహా పలుమార్లు మీడియా ముందు వాపోయింది. ఈ ధారావాహికలో తారక్ మెహతా భార్య అంజలి మెహతా పాత్రలో నటించిన నేహ 2020లోనే సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఆరు నెలల నుంచి రెమ్యునరేషన్ అందలేదని, ఈ బకాయిలను ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో తనకింతవరకు పూర్తిగా పారితోషికం అందనేలేదని అసహనానికి లోనైంది నేహ. తాజాగా ఆమె ఆరోపణలపై తారక్ మెహతా కా ఉల్టా చష్మా నిర్మాతలు స్పందించారు. 'ఆర్టిస్టులను మేము కుటుంబంగా పరిగణిస్తాం. నేహా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాక కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పాం. ఈ ధారావాహిక నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లుగా కొన్ని పత్రాలపై సంతకం చేయాలని సూచించాం. కంపెనీ పాలసీ ప్రకారం ఆ సంతకం చేసిన తర్వాతే ఆమెకు సెటిల్మెంట్ చేయగలం. ఆమెతో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఆమె ఖాతరు చేయడం లేదు. అంతేకాదు ఈ సీరియల్ నుంచి కూడా చెప్పాపెట్టకుండా తప్పుకుంది. 12 ఏళ్లపాటు ఫేమ్, మంచి కెరీర్‌ను ఇచ్చిన మేకర్స్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా మెయిల్స్‌కు స్పందిస్తే బాగుంటుంది' అంటూ నీలా ఫిలిం ప్రొడక్షన్స్ ఓ లేఖను విడుదల చేసింది. ఇకపోతే తారక్ మెహతా కా ఉల్టా చష్మా 2008లో ప్రారంభమైంది. 13 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ నిర్విరామంగా ముందుకు సాగుతోంది. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ ఘనంగా నాగశౌర్య సోదరుడి వివాహం, ఫొటోలు వైరల్ -
పెళ్లిపీటలెక్కిన సీరియల్ నటి, ఫొటోలు వైరల్
'పాండ్యా స్టోర్' సీరియల్ నటి శ్రష్ఠి మహేశ్వరి పెళ్లి పీటలెక్కింది. ఇంజనీర్ కరణ్ వైద్యాను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జైపూర్‌లో ఘనంగా వీరి వివాహం జరిగింది. జూన్ 19న జరిగిన ఈ పెళ్లి విషయాన్ని అభిమానులకు ఆలస్యంగా వెల్లడించింది మహేశ్వరి. తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా శ్రష్ఠి మహేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కరణ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి, నాకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. కరణ్‌తో కలిసి ఆడుతున్నాను, పాడుతున్నాను. నా పెళ్లిని చాలా ఎంజాయ్ చేశాను. నా భర్త చాలా రొమాంటిక్. అతడిలో నాకదే నచ్చుతుంది. అతడు నన్ను ఎత్తుకుని పెళ్లి మండపంలోకి తీసుకెళ్లాడు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భర్త కోసమే పూర్తి సమయం కేటాయిస్తున్న ఆమె ఈ నెలాఖరుకు ముంబై వచ్చి తిరిగి సెట్స్‌లో అడుగుపెడతానంటోంది. View this post on Instagram A post shared by mahimamahwari (@mahimamahwari) View this post on Instagram A post shared by ♡vidhee♡chouhan♡ (@vidhee_9818) View this post on Instagram A post shared by ♡vidhee♡chouhan♡ (@vidhee_9818) View this post on Instagram A post shared by shrashti maheshwari (@mahimaheshwari11) View this post on Instagram A post shared by mahi dii ki bigg fan (@mahimeswari11) View this post on Instagram A post shared by kashti (@pyaarkikashti) చదవండి: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్ స్క్రీన్ హీరోనే! ఓటీటీలో హిట్ కొట్టిన అనకాపల్లి డైరెక్టర్, ఇంతకీ ఆయనెవరో తెలుసా? -
13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
Pandya Store Actress Simran Budharup Gets Rape Threats Because Of Role: ఇటీవల అత్యధిక పాపులారిటీ సంపాందించుకున్న షోలలో 'పాండ్యా స్టోర్' ఒకటి. ఇందులో రిషితా ద్వివేది పాండ్యా పాత్రను నటి సిమ్రాన్ బుధారుప్ పోషించింది. అయితే ఈ పాత్ర కారణంగా నిజ జీవితంలో తనకు ఎదురైన బెదిరింపు సంఘటనలను తాజాగా తెలిపింది సిమ్రాన్. సోషల్ మీడియా వేదికగా తనకు అత్యచారం, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఆ బెదిరింపులు తట్టుకోలేక చివరికీ వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది సిమ్రాన్ బుధారుప్. 'పాండ్యా సోర్ట్ షోలో లీడ్ రోల్స్ అయిన రవి, దేవ్ మధ్య సంబంధాన్ని విడగొట్టే పాత్ర నాది. ఇది చూసిన ప్రేక్షకులు నన్ను దుర్బాషలాడడం మొదలు పెట్టారు. యువకులు, బాలికల సమూహం సోషల్ మీడియాలో అత్యచారం, చావు బెదిరింపులతో వేధించింది. వారు సుమారు 13-14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలే. చదువు కోసమని వారి తల్లిదండ్రులు ఫోన్ల్ ఇచ్చారు. కానీ ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశారు. వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అందుకే వారు ఇలా చేశారు. పరిస్థితులు దిగజారడంతో తప్పలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. పిల్లలు మంచి, చెడుల మధ్య తేడాను అర్థం చేసుకోలేరు. కాబట్టి వారిని ఎప్పుడూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.' అని సిమ్రాన్ తెలిపింది. చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
సినిమా, వెబ్ సిరీస్ ఛాన్స్‌లు పట్టేస్తున్న సీరియల్ నటి
ఈ అమ్మాయి పేరు ప్రతిభా రాంటా. జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ చూసిన వాళ్లందరికీ ఆమె సుపరిచితురాలు. తనకున్న నాట్య కళను నటనారంగంలో అడుగు మోపడానికి ఊతంగా మలచుకుంది. విజయవంతం అయింది. సినిమా రంగంలోనూ అవకాశాన్ని సాధించి! అంతకుముందే దేశమంతా అభిమానులను సంపాదించికుంది వెబ్ సిరీస్‌లోనూ తన ప్రతిభను చాటి! ► ఆమె పుట్టింది సిమ్లాకు దగ్గర్లోని దరోటీలో. పెరిగింది సిమ్లాలో. తల్లి .. సందేశనా రాంటా, తండ్రి .. రాజేశ్ రాంటా. ► ప్రతిభాకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. అందుకే నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఎన్నో పోటీల్లో పాల్గొంది.. ఫస్ట్ నిలిచింది. సిమ్లా డాన్స్ సెంటర్ నుంచి డిగ్రీ తీసుకుంది. ► నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవడానికి ముంబై చేరింది. అక్కడి ఉషా ప్రవీణ్ గాంధీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫిల్మ్‌మేకింగ్‌లో శిక్షణ తీసుకుంది. ► ఆ సమయంలోనే మోడలింగ్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అప్పుడే (2018) మిస్ ముంబై అందాల పోటీల్లోనూ పాల్గొంది.. మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. ► ఆ గెలుపు టీవీ కమర్షియల్స్‌లో ఛాన్సెస్ తెచ్చి పెట్టింది. ► అలా కమర్షియల్స్‌తో బిజీగా ఉన్న టైమ్‌లోనే జీటీవీ ‘ఖుర్బాన్ హువా’ సీరియల్లో ప్రధాన భూమిక లభించింది. ► ఆ సీరియల్లో ఆమె కనబర్చిన నటనే ‘ఆధా ఇష్క్’ అనే వెబ్‌సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. అది వూట్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆధా ఇష్క్‌తో ప్రతిభా ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు మనసునే దోచేసింది. తన దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో ప్రతిభాకు కథానాయిక వేషం ఇచ్చింది. దాంతో ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. చదవండి: 16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
ఆ అమ్మాయి కోసం నన్ను కొట్టేవాడు: బుల్లితెర నటి
Mythili Sridhar Reddy: ప్రముఖ టీవీ నటి మైథిలి తన భర్తపై, పోలీసులపై ఆరోపణలు చేసింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం తన భర్తను భరించలేకపోవడమేనని తెలిపింది. మైథిలి సోమవారం (మే 30) పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసిన అనంతరం సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైథిలి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, తాను అనుభవించిన మనోవేదనను చెప్పుకొచ్చింది. ''నా భర్త సామ శ్రీధర్ రెడ్డి ఓ మహిళ ప్రోగ్రాం డైరెక్టర్. మాది పెద్దలు కుదిర్చిన వివాహం ఇది మా ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్. అప్పటికే నాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు చాలా మంచివాడిలా నటించాడు. మనకు ఇక పిల్లలు వద్దు ఈ బాబుని నా కొడుకులాగా చూసుకుంటా అన్నాడు. కానీ పెళ్లైన కొద్ది నెలల్లోనే తన రంగులు ఒక్కోటి చూపించాడు. మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో తనకు ముందునుంచే రిలేషన్ ఉంది. తన విషయంలో గొడవలు కూడా జరిగాయి. ఆ అమ్మాయి విషయంలో నన్ను కొట్టే వాడు. కట్నం డబ్బు, కారు, బంగారం ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తూ మోసం చేసాడు. సొంత భర్తే 65 తులాల బంగారం దొంగతనం చేస్తే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి. నిత్యం గోడవలు జరిగేవి, కొట్టేవాడు. రజితను ఒక సారి ఫ్రెండ్ అంటాడు. మరోసారి దూరం చుట్టం అంటాడు. రజిత మా ఇంటికొచ్చి మా మధ్య పెత్తనం చేసేది. మోతే పోలీస్ స్టేషన్లో తన మీద ఐపీసీ సెక్షన్ 498 కింద కేసు పెట్టాము. 2021 సెప్టెంబర్‌లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టా. పంజాగుట్ట పోలీస్‌లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శ్రీధర్ రెడ్డికి పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సపోర్ట్ ఉంది. సొంత భర్తే నన్ను మోసం చేసాడు. దాదాపు రెండేళ్లుగా నాతో ఉండట్లేదు. నాకు తెలీకుండానే డివోర్స్‌కు అప్లై చేసాడు. పిల్లలు ఉన్నారని ఇన్ని రోజులు అన్ని భరించాను. నాకు ఇక మానసికంగా ధైర్యం సరిపోలేదు. ఆ బాధను తట్టుకోలేకే పంజాగుట్ట పోలీసులకు పోన్ చేశాను. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేశాను. నాకు తగిన న్యాయం కావాలి. మోసం చేసిన నా భర్తను శిక్షించాలి.'' అని ఆవేదన వ్యక్తం చేసింది మైథిలి. -
క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి
Chhavi Mittal About Her First Radiation Therapy Experience: ప్రముఖ టీవీ నటి ఛవి మిట్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత నెల తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన ఆమె ఏమాత్రం బాధపడకుండా తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా వేదికగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్న ఆమె ఈ రోజు తొలి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తొలి రేడియేషన్ థెరపీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ‘నా రేడియేషన్ థెరపీ ఈ రోజే మొదలైంది. దీనికి ముందు ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని కొందరితో చర్చించాను. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి మన ప్రాణాలు కాపాడడంపైనే కానీ, మన సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరం చేయడంపై కాదు’ ఆమె రాసుకొచ్చింది. చదవండి: భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్ ‘అయితే నేను కేవలం జీవించాలనుకోవడం లేదు. నా లైఫ్‌ని సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఎలాగు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను. అందుకే రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఈ జర్నీలో నాకు సహాకరిస్తూ వెన్నంటే ఉంటున్న నా డాక్టర్లకు కృతజ్ఞతలు. ఈ రేడియేషన్ థెరపీ అనేది 4 నెలల పాటు వారానికి లేదా 5 రోజుల చొప్పున 20 సైకిల్స్‌గా ఇవ్వనున్నారు’ అని ఛవి మిట్టల్ పేర్కొంది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్
Serial Actress Deepa Jagadeesh Got Married: కన్నడ, తెలుగు సీరియల్స్‌తో పాపులర్ అయిన నటి దీపా జగదీష్. 2018లో ప్రీతి కేళి స్నేహ కలేడుకొల్లబెది చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత తెలుగు సీరియల్ ప్రేమ నగర్లో వాణి శ్రీ, ముఖేష్ గౌడ్, ప్రమోధినితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సీరియల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనంతరం మనసినక్కరే, బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి, క్రిటికల్ కీర్తనేగలు, మల్లి నిండు జాబిలి వంటి తదితర సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. బుధవారం (మే 18) దీపా జగదీష్ వివాహం జరిగింది. సాగర్ అనే వ్యక్తిను పెళ్లాడింది. దీపా జగదీష్‌కు తాళి కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్ View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య
కోల్‌కతా: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టీనా మాస్టర్, నటి షహానాల మృతి మరవకముందే మరో నటి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బుల్లితెర నటి పల్లవి డే (25) ఆదివారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక విచారణలో నటి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ షగ్నిక్ చక్రవర్తిని సైతం విచారించారు. ఆదివారం ఉదయం సిగరెట్ తాగివచ్చేసరికి గది లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉందని, దీంతో డోర్ పగలగొట్టగా పల్లవి ఉరి వేసుకుని కనిపించిందని ఆమె ప్రియుడు తెలిపాడు. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం పల్లవిది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పల్లవి తన ప్రియుడు షగ్నిక్తో సహజీవనం చేస్తోంది. గత నెల రోజులుగా వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. అయితే షగ్నిక్ రెండేళ్ల క్రితం ఓ అమ్మాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని, ఆ విషయం ఈ మధ్యే తెలిసిందని, దాని వల్లే పల్లవి జీవితంలో ఏమైనా సమస్యలు తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు నటి తండ్రి నీలూ డే. పల్లవి డే మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పల్లవి.. ఆమీ సైరాజెర్ బేగం, రేష్మ జపి, కుంజో ఛాయ, సరస్వతి ప్రేమ్, మొన్ మనే నా వంటి పలు బెంగాలీ సీరియల్స్‌లో నటించింది. చదవండి: రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. -
ప్రముఖ సీరియల్ నటి లగ్జరీ ఇల్లు చూశారా?
అష్మిత కర్ణని.. తెలుగు సీరియల్స్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో పాపులర్ సీరియల్స్‌లో నటించిందీవిడ. దాదాపు 15కు పైగా ధారావాహికల్లో నటించిన అష్మిత అడపాదడపా సినిమాలు కూడా చేసింది. కొరియోగ్రాఫర్ సుధీర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడీ అనే షోలోనూ పాల్గొంది. ఇక 2020 మేలో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన అష్మిత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తన హోమ్ టూర్ వీడియో షేర్ చేసింది. ఇందులో తన ఇంటీరియర్ డిజైన్ చూపిస్తూ ఇల్లంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డామంది. తక్కువ స్థలాన్నే అందంగా తీర్చిదిద్ది లగ్జరీ ఇంటిగా మార్చుకున్నామని తెలిపింది. డైనింగ్ టేబుల్, కుర్చీలు బయట ఎక్కడా కొనుక్కోలేదని తమ కోసం సెపరేట్‌గా తయారు చేయించుకున్నామని చెప్పింది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కిచెన్‌ను మూసేందుకు వీలుగా ఒక స్లైడింగ్ బోర్డ్ చేయించుకున్నామంటూ దానిని చూపించింది. ఇంటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మూలల్లో మొక్కలను పెట్టామంది. హాల్, కిచెన్‌తో పాటు తనకో బెడ్రూమ్, తన భర్తకో బెడ్రూమ్ ఉందని ఆ గదులన్నీ చూపించింది. ఇక మరో చిన్న గదిలో హోమ్ థియేటర్ కూడా పెట్టుకున్నారు. చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్ తల్లి -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుల్లితెర నటి..
యశవంతపుర (కర్ణాటక): రోడ్డు గుంతల వల్ల బుల్లితెర నటి గాయపడింది. ఈ సంఘటన ఆదివారం (మే 8) బెంగళూరులో చోటుచేసుకుంది. టీవీ నటి సునేత్రా పండిట్ ఎన్ఆర్ కాలనీ 9వ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తూ హంప్స్ వద్ద గుంతల్లో ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడింది. ఆమె తల, చేతికి గాయాలు తగిలాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు నటి సునేత్రా పండిట్‌ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా నటికి వైద్యులు సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. బీబీఎంపీ అధికారులు తక్షణం గుంతల రోడ్లను సరిచేయాలని స్థానికులు కోరారు. సునేత్ర పండిట్ ప్రముఖ సీరియల్ 'సిల్లి లిల్లి'తో పాపులర్ అయింది. చదవండి: సంచలనాల 'లాకప్' షో విన్నర్ గెలుచుకుంది ఎంతో తెలుసా ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎంగేజ్మెంట్ చేసుకున్న సీరియల్ జంట, ఫొటోలు వైరల్
ఆన్‌స్క్రీన్ మీద జంటగా కనిపించే తారలు నిజజీవితంలోనూ ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. రీల్ లైఫ్‌లో హిట్ పెయిర్ అనిపించుకున్న మరాఠీ జంట రియల్ లైఫ్‌లోనే జత కట్టేందుకు రెడీ అయింది. 'తుజ్యత్ జీవ్ రంగ్ల' అనే సీరియల్లో హీరోహీరోయిన్‌గా నటించిన హార్దిక్ జోషి, అక్షయ డియోధర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు మే 3న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అతి కొద్దిమంది బంధుమిత్రుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని అక్షయ 'ఎట్టకేలకు మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది' అన్న క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులోని ఓ వీడియోలో అక్షయను తన మోకాలిపై కూర్చోబెట్టుకుని ఆమె వేలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు హార్దిక్. అనంతరం అక్షయ అతడి వేలికి ఉంగరం తొడిగి కాబోయే భర్తను హత్తుకుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాబోయే దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by HARDEEK JOSHI (@hardeek_joshi) View this post on Instagram A post shared by Madhuri Kobal (@madhurikhese_makeupartist) చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
కమిటెడ్, కాబోయేవాడు ఏ అమ్మాయితో క్లోజ్‌గా ఉన్నా భరించలేను
ఫ్రెండ్స్ అందరూ బాయ్‌ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే తెగ బాధపడిపోయింది హిందీ సీరియల్ నటి హిబా నవాబ్. తనక్కూడా ఓ ప్రియుడు ఉంటే బాగుండనుకుంది. అందుకని డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసింది. కానీ అందులో సరైనవాడిని వెతికే క్రమంలో తింగరివేషాలు వేసేవాళ్లు ఎక్కువగా కనిపించడంతో ఆ యాప్స్ అన్నీ డిలీట్ చేసింది. ఎట్టకేలకు ఈ మధ్యే తనకు కావాల్సినవాడు దొరకడంతో ప్రియుడు దొరికేశాడోచ్ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బుల్లితెర నటి. 'ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా? అని నేను తెగ ఎదురుచూస్తున్నాను. ఈ విషయం గురించి నా తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. చాలామటుకు అందరు పేరెంట్స్ పెళ్లి విషయంలో తొందరపెడతారు, కానీ మా నాన్న మాత్రం పెళ్లికెందుకు తొందర అంటున్నారు. 30 ఏళ్లు వచ్చేవరకు కెరీర్ మీద ఫోకస్ పెట్టి, అనుకున్నది సాధించి ఆ తర్వాత వివాహం చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయని ఆయన అభిప్రాయం. లైఫ్‌లో సెటిల్ అవడానికంటే ముందు అనుకున్నది సాధించాలని ఆయన ఉద్దేశం. ఆ మధ్య నాకు, పెరల్ వీ పూరీకి లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. మేమిద్దరం రోజులో 20 గంటలు కలిసి పని చేసిన సందర్భాలున్నాయి. అలా ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారాము. అంతకుమించి మామధ్య ఏమీ లేదు. పైగా నాకు నటుడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను చాలా పొజెసివ్. నన్ను పెళ్లాడే వ్యక్తి వేరొక నటితో ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తే నేను భరించలేను. అలాంటిది యాక్టర్‌ని పెళ్లాడి అతడు ఇంకొకరితో క్లోజ్‌గా ఉండకూడదు అంటే అది జరగని పని. కొన్ని నెలల క్రితం మా ఫ్రెండ్స్ అందరూ రిలేషన్షిప్లో ఉంటే నేనొక్కదాన్నే సింగిల్‌గా ఉన్నాను. డేటింగ్ యాప్స్ ట్రై చేశా. కానీ చిత్రవిచిత్ర మనుషులను చూశాక ఆ యాప్స్ డిలీట్ చేశాను. మొత్తానికి నేను ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలిశాను. అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మాత్రం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు అతడి గురించి, పెళ్లి గురించి అన్ని వివరాలు వెల్లడిస్తాను. అప్పటివరకు నా రిలేషన్ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉందని రాసుకోండి' అని చెప్పుకొచ్చింది నవాబ్. చదవండి: హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా? -
క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్
Actress Chhavi Mittal Suffering With Breast Cancer: హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ దక్కించుకుంది ఛవి మిట్టల్. తాజాగా ఛవి మిట్టల్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్‌లో వర్క్అవుట్ చేస్తుండగా ఛవి గాయపడింది. వెంటనే డాక్టర్లను సంప్రదించగా రొమ్ములో కణితి ఉందని గుర్తించారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. త్వరలో సర్జరీ చేయించుకోనుంది ఛవి మిట్టల్. అయితే ఇలాంటి క్యాన్సర్ బారిన పడితే సాధారణంగా ఎవరైనా భయపడుతారు. కానీ ఛవి మాత్రం ఈ విషయం తెలిసినప్పటినుంచి తనలా బాధపడుతున్న మరెంతో మందికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. అలాగే తనకు క్యాన్సర్ అనే విషయాన్ని చెబుతూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. 'డియర్ బ్రెస్ట్స్.. ఇది మీకు అభినందనల పోస్ట్. మీ మ్యాజిక్ ఏంటో మీరు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చినప్పుడు నేను తొలిసారి గమనించాను. ఈరోజు మీలో ఒకరు క్యాన్సర్‌తో పోరాడినప్పుడు మీకు అండగా ఉండటం నా వంతు. ఇలా జరగడం గొప్పేమి కాదు గానీ విచారించాల్సిన అవసరం లేదు. ఇది సులభమైనదేం కాదు. అలా అని కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మళ్లీ అదే విధంగా కనిపించకపోవచ్చు. అలాగే కచ్చితంగా నాకు భిన్నమైన అనుభూతి కలగదు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచి వారందరి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతున్నానో మీకు తెలియదు. అలాగే, మీలో ఇప్పటికే తెలిసిన వారికి, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చేసే ప్రతీ కాల్కి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ రాసుకొచ్చింది ఛవి మిట్టల్. 41 ఏళ్ల మొహీత్ హుస్సేన్‌ను వివాహం చేసుకుంది ఛవి మిట్టల్. వారికి అర్హమ్ అనే కుమారుడు, అరీజా అనే కుమార్తె ఉన్నారు. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన 'దేవత' సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే! సురేశ్ అనే వ్యక్తితో త్వరలోనే ఏడడుగులు నడవనుంది. తాజాగా వైష్ణవి తన యూట్యూబ్ చానల్లో నిశ్చితార్థపు వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే దంపతులు దండలు మార్చుకుని ఇద్దరూ ఉంగరాలు తొడుక్కుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేశారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు వచ్చినవాళ్లతో పాటు వీడియో చూసి తమను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది వైష్ణవి. కాగా వైష్ణవి దేవత సీరియల్లో సత్య పాత్రతో ప్రేక్షకులకు చేరువైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ధారావాహిక నుంచి తప్పుకుంది. చదవండి: ఫోన్ చేస్తే బిజీ.. ఆరేళ్ల తర్వాత వేరొకరితో అలా... అఖిల్ బ్రేకప్ స్టోరీ ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
ఘనంగా 'దేవత' సీరియల్ నటి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
దేవత సీరియల్‌తో పాపులర్ అయిన నటి వైష్ణవి గాదే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. శనివారం ఆమె ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాదాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సన్నిహితులు, కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బుల్లితెరపై పాపులర్ సీరియల్స్‌లో ఒకటైన దేవత సీరియల్లో సత్య పాత్ర ద్వారా వైష్ణవి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో కొన్ని నెలల క్రితమే ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. అంతేకాకుండా ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఆ సమయంలో ఆమెను బ్యాన్ చేశారంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తల్లో నిజం లేదంటూ వైష్ణవి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్‌మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
బుల్లితెర ప్రేక్షకులకు కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గోరింటాకు సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్న కావ్య శ్రీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె బెంగళూరులోని తన డూప్లెక్స్ ఇంటిని చూపించింది. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, పూజా గది, మోడ్రన్ కిచెన్, డైనింగ్ హాల్, ఒక బెడ్ రూమ్ ఉన్నాయి. మొదటి అంతస్థులో ఒక హాల్‌తో పాటు మరో రెండు గదులున్నాయని పేర్కొంది. అందులో ఒకటి తన తండ్రి వాడుతుండగా మరొక గదిలో తనతో పాటు చెల్లె ఉంటుందని చెప్పుకొచ్చింది. హ్యాండ్ బ్యాగులంటే ఇష్టమైన కావ్య గదిలో 15 కంటే ఎక్కువ బ్యాగులు కనిపించాయి. పనిలో పనిగా తన బర్త్‌డేకు ఫ్రెండ్స్, ఫ్యాన్ పేజెస్ ఇచ్చిన కానుకలను చూపించింది. చదవండి: ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో అనన్య పాండే! -
పెళ్లిరోజు భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బుల్లితెర నటి, కాకపోతే!
బుల్లితెర నటి నవీన ఇటీవలే తన కలల ఇంట్లోకి గృహప్రవేశం చేసి వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు ఆమె లక్ష రూపాయల చీర కట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్న నవీన తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి కార్ల షోరూంకు వెళ్లిన నటి అక్కడున్న కార్లన్నింటిపై ఓ లుక్కేసింది. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బీఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సన్ రూఫ్ ఉన్న కారు లేదని, దీనికి మాత్రం పైన ఓపెన్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక షోరూమ్‌లోనే కేక్ కట్ చేసి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకుని సంతోషపడిపోయింది. అనంతరం కారుకు పూజ చేయించి నెక్లెస్ రోడ్లో మరోసారి కేక్ కట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
ఈ సీరియల్ నటి ఒకరోజు పారితోషికమే అన్ని లక్షలా?!
TV Serial Actress Rupali Ganguly Shocking Remuneration: హిందీ సీరియల్స్ వీక్షించేవారికి రూపాలీ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాదిన్నరగా టీఆర్పీలో దూసుకుపోతూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్న ఏకైక సీరియల్ అనుపమ. ఇందులో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వాటికి ఎదురీదుతున్న గృహిణి అనుపమగా అదరగొడుతోంది బుల్లితెర నటి రూపాలీ గంగూలీ. మరి ఈ సీరియల్లో నటించినందుకు రూపాలీకి ఎంతొస్తుందో తెలుసా? అక్షరాలా లక్షన్నర రూపాయలు. ఇదంతా నెలకో, వారానికో కాదు.. కేవలం ఒక్కరోజు షూటింగ్లో పాల్గొన్నందుకే ఆమె ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుందట. రోజురోజుకీ తన పాత్రకు ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గకపోవడంతో తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసిందట. అంటే ప్రస్తుతం ఆమె ఒక్క రోజుకే మూడు లక్షలు తీసుకుంటున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పారితోషికంలో తగ్గేదేలే అంటున్న రూపాలీ.. రామ్ కపూర్, రోణిత్ బోస్ రాయ్ వంటి వారిని సైతం వెనక్కి నెట్టి మరీ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా రికార్డుకెక్కింది. కొన్ని నెలల క్రితమే తన పారితోషికాన్ని పెంచినట్లు టాక్ వినిపిస్తుండగా ఆమె నటనకు ఆమాత్రం ఇవ్వడంలో తప్పే లేదంటున్నారు ఆమె అభిమానులు. కాగా రూపాలీ గంగూలీ గతంలో హిందీ బిగ్‌బాస్ 1లో పాల్గొంది. -
ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి, ఫొటోలు వైరల్
బుల్లితెర నటి మాన్సి శ్రీవాత్సవ ప్రియుడు కపిల్ తేజ్వానీని పెళ్లాడింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడితో ఆమె ఏడడుగులు నడిచింది. శనివారం (జనవరి 22న) జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా కపిల్ వృత్తిరీత్యా ఓ ఫొటోగ్రాఫర్. ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్న సమయంలో మాన్సితో అతడికి పరిచయం ఏర్పడింది. 2019లో మరోసారి కలుసుకున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకుని జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు రంగు లెహంగాలో మాన్సి ధగధగ మెరిసిపోతుందని, ఆమె ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా మాన్సి.. అర్జున్, రబ్సే సోనా ఇష్క్, యే హై ఆషికి, ఇష్క్బాజ్, లాల్ ఇష్క్, దివ్య దృష్టి, విద్య, ఇష్క్ మై మర్జావా 2, కుండలీ భాగ్య వంటి పలు సీరియల్స్‌లో నటించి విశేషమైన పాపులారిటీ సంపాదించుకుంది. 2016లో మోహిత్ అబ్రల్ను ప్రేమించిన ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. కానీ అంతలోనే ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. View this post on Instagram A post shared by Navin Gupta (@makeuphairbynavin) View this post on Instagram A post shared by Navin Gupta (@makeuphairbynavin) -
ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా
Mouni Roy Return To Small Screen After 5 Years As A Judge: బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌని రాయ్ హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన గ్రామరస్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హిందీ సీరియల్స్‌లో నటించిన తర్వాత ఆమెకు వరుసగా బీటౌన్ మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గోల్డ్, రాజ్ కుమార్ రావుకు జంటగా మేడ్ ఇన్ చైనాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న మౌని.. సుమారు ఐదేళ్ల తర్వతా మళ్లీ బుల్లితెరపైన సందడి చేయనుంది. ఆమె తొలిసారిగా నటనను ప్రారంభించిన వేదికపైకి మళ్లీ వెళ్లనుంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ షోలలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' ఒకటి. ఈ షో ఐదో సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది మౌని రాయ్. ఈ విషయం గురించి మౌని మాట్లాడుతూ 'నాకు డ్యాన్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. వివిధ కళారూపాల సమ్మేళనం. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోకు న్యాయనిర్ణేతగా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై చిన్న పిల్లల ప్రతిభను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.' అని తెలిపింది. 'క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ', 'దేవోన్ కీ దేవ్.. మహాదేవ్' సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ 'నాగిన్'తో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇదీ చదవండి: తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని -
నటి యమున కొత్త ఇల్లు ఎంత బాగుందో చూడండి!
Actress Yamuna New Home Tour: బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ఆడియన్స్‌కు కూడా బాగా సుపరిచితురాలు నటి యమున..ప్గతంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో కాలు మోపింది. అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ఎంతోమంది నటీనటులు వస్తూపోతున్నా యమున మాత్రం పోటీని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే యమున ఆ మధ్య హోమ్ టూర్ వీడియో చేసింది. దీన్ని పదిహేను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో పెట్టి నెల రోజులైందో లేదో మరో హోమ్ టూర్ వీడియో చేసింది యమున. భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా హైదరాబాద్ సిటీకి దూరంగా స్థలాన్ని కొనుగోలు చేసింది. మహేశ్వరం ప్రాంతంలో 360 గజాల్లో స్థలం సొంతం చేసుకుని తనకు నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకుంది. హాల్, పూజ గది, కిచెన్, డైనింగ్ ఏరియా, 3 బెడ్ రూమ్స్, ఒక ఆఫీస్ రూమ్ ఇలా అన్నింటినీ చూపించింది. భవిష్యత్తులో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కొంత ఖాళీ స్థలాన్ని ఉంచానంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు సింపుల్‌గా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో ఇల్లు కట్టుకోవడమే కాక అందంగా, నీట్‌గా డిజైన్ చేశారని మెచ్చుకుంటున్నారు. -
ప్రముఖ సీరియల్ నటికి కరోనా.. త్వరగా కోలుకోవాలని సందేశాలు
Television Actress Drashti Dhami Tested Positive For Covid 19: ఇండియాలో కొవిడ్ మహామ్మారి తన సత్తా చాటుతోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికి పెంచుకుంటూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అలయ ఎఫ్, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్ ఇరానీ, ప్రేమ్ చోప్రా వంటి పలువురు బీటౌన్, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి కొవిడ్‌కు గురయ్యింది. ప్రముఖ టెలివిజన్ సీరియల్ 'మధుబాల' నటి ద్రష్టి ధామికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ప్రకటించింది ద్రష్టి. తాను ఇటీవల నటించిన 'ది ఎంపైర్' వెబ్ సిరీస్‌ను వీక్షిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ 'నేను మూడో వేవ్‌తో పోరాడుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు మాత్రమే నాకు తోడుగా ఉన్నాయి. లక్కీగా నేను ఇప్పుడు లిల్లీ పూల వాసను పసిగట్టవచ్చు, ట్విక్స్ చాక్లెట్ రుచిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ అదృష్టాన్ని లెక్కపెడుతూ ప్రేమ, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను.' అని ద్రష్టి తెలిపింది. ఈ పోస్ట్‌కు కరిష్మా తన్నా, కరణ్ వి గ్రోవర్, అర్జిత్ తనేజాతో పాటు పలువురు త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టారు. View this post on Instagram A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti) ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ -
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కారులో ప్రముఖ సీరియల్ నటి
Gruhalakshmi Serial Actress Lahari, Collided With Car At Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ సీరియల్ నటి లహరి కారు, బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్లు తెలిసింది. (చదవండి: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్) ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్‌తో పాటు లహరిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయనున్నారు. చదవండి: ‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’ -
ట్యూషన్ టీచర్ నాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు: నటి
Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident In Her Childhood: ప్రముఖ హిందీ సీరియల్ నటి దేవొలీనా భట్టాచార్య.. చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ..'చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్తే మ్యాథ్స్ టీచర్ తనతో చాలా తప్పుగా ప్రవర్తించాడని పేర్కొంది. అతనికి చాలా మంచి టీచర్ అని గుర్తింపు ఉండేది. నా ఫ్రెండ్స్ సహా చాలా మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్‌కు వెళ్లేవారు. అయితే వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ట్యూషన్‌కు వెళ్లడం మానేశారు. ఏం జరిగింది అని అడిగినా చెప్పలేదు. ఆ తర్వాత ఓరోజు ఎప్పటిలాగానే నేను ట్యాషన్‌కు వెళ్లాను. అయితే అతను నాపై లైంగిక చర్యకు ప్రయత్నించాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అమ్మకి వివరించాను. ఆ తర్వాత ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిందంతా చెప్పాం. ఆ సమయంలో ఆ టీచర్‌పై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనిపించింది. కానీ ఇంట్లో వాళ్లు అలా చేయలేదు. దయచేసి మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. అంతే తప్పా చూసీ చూడకుండా వదిలేయకండి' అంటూ తల్లిదండ్రులకు విఙ్ఞప్తి చేసింది. -
ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్
Serial Actress Ashika Padukone Married To Business Man Chethan: ప్రియుడు, బిజినెస్ మ్యాన్ చేతన్ శెట్టితో బుల్లితెర నటి ఆషికా పదుకొణె వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, ఇండస్ర్టీకి చెందిన కొద్ది మంది స్నేహితుల సమక్షంలో సోమవారం(అక్టోబర్ 18)న వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గతేడాది బెంగళూరులోని ఓ హోటల్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చేతన్ తనకు బాగా తెలుసని, లాక్డౌన్లో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆషికా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తాను సీరియల్స్‌లో నటిస్తానని స్పష్టం చేసింది. కాగా కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన ఆషికా..తొలి సీరియల్‌తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈమెకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆషికా త్రినయని అనే సీరియల్లో నటిస్తుంది. చదవండి: రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు -
తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా
TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan: ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. 'మా ఆనందాలకు చిరునామా..మా బేబీ సయ్యద్ అర్హాన్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను ఎదుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. నా మేనకోడళ్లు, అల్లుళ్లు, ఫ్రెండ్స్ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఇప్పడు నా కన్నబిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం అయిన దేవుడికి ధన్యవాదాలు. థ్యాంక్యూ అర్హాన్..మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలక్ట్ చేసుకున్నందుకు. నీకు బెస్ట్ మథర్గానే కాకుండా, బెస్ట్ ఫ్రెండ్‌గా కూడా ఉంటానని మాటిస్తున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది. కాగా 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో ఎంతోమంది ఎంటర్టైన్ చేస్తుంది. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
స్టార్ కిడ్స్ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి
Nia Sharma Slams Star Kids: ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ తనపై చేస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన ఆమె స్టార్ కిడ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'చాలామంది నేను అందంగా లేనని, నా పర్సనాలిటీ బాగోదని, అందుకే సినిమాల్లో అవకాశాలు రావట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మాట్లాడే వాళ్లు ఒక్కసారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ ముఖాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ల పేరేంట్స్ పేర్లు పక్కన లేకపోతే రెండోసారి వాళ్ల ముఖాలు ఎవరూ చూడలేరు. స్టార్ స్టేటస్ ఉంది కాబట్టి వాళ్లు సినిమాలు చూస్తున్నాం తప్పా వాళ్లకంత సీన్ లేదు. నిజం చెప్పాలంటే నేను స్టార్ కిడ్స్ కంటే వంద శాతం బెటర్' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇక మణికర్ణిక సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడగ్గా.. దాని గురించి మాట్లాడటం తెలివి తక్కువ పనే అవుతుందని, అంతేకాకుండా తన టైం కూడా వేస్ట్ అని పేర్కొంది. ఇక హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన నియా శర్మ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చదవండి : ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి
'మౌనరాగం' సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్లో మెయిన్ లీడ్ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. 'ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు. అప్పట్లో వారు ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఈ రోజు మళ్లీ పెళ్లి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల క్షేమాన్ని, సంతోషాన్నే కోరుకుంటారు. కానీ పిల్లలుగా ఈసారి మేం వాళ్లకు మర్చిపోలేని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. 24వ వివాహ వార్షికోత్సవాన్ని మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అందుకే వాళ్లకు మళ్లీ పెళ్లి చేశాం' అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో హల్దీ, మెహందీ సహా అన్ని కార్యక్రమాలను ప్రియాంక దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి : హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి కీర్తి ధునుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చిన్నారికి అప్పుడే రుద్వేద్‌గా పేరు పెట్టారు. కీర్తి-ధనుష్ తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో బుల్లితెర నటులు సహా నెటిజన్లు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇటీవలె కీర్తి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా కీర్తి బావ నిరుపమ్ అలియాస్ డాక్టర్‌బాబు అన్న విషయం తెలిసిందే. నిరుపమ్ భార్య మంజులా పరిటాల స్వయానా కీర్తికి అక్క. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. View this post on Instagram A post shared by 🅹🅰️🅸🅳🅷🅰️🅽🆄🆂🅷 (@jaidhanushofficial) -
సినీ నటిని పెళ్లాడబోతున్న 'బిగ్‌బాస్' ఫేం స్నేహన్
చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి కన్నిక రవిని స్నేహన్ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు. స్నేహన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు. -
ఆస్తులమ్ముకున్న నటికి మాధురీ దీక్షిత్ సాయం!
Shagufta Ali: 36 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుల్లితెర తార షగుఫ్త అలీ. ఎన్నో సీరియళ్లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఇప్పుడు కనీస అవకాశాలు రాక దీన స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. దీనికితోడు రోజురోజుకూ తనను అనారోగ్యం మరింత కుంగ తీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో సాయం కోసం అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి విని చలించిపోయిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న షగుఫ్త తాజాగా డ్యాన్స్ దీవానీ 3 షోకు వెళ్లగా అక్కడ తన బాధలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. "ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 36 ఏళ్లలో 32 ఏళ్లు అద్భుతంగా నడిచాయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతగానో పని చేశాను, నాకు, నా కుటుంబానికి మద్దతుగా నిలిచాను. కానీ నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లాను, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. పైగా ఆ సమయంలో మధుమేహం వల్ల నా కాలు నొప్పి తీవ్రం కాసాగింది. అది నెమ్మదిగా నా కంటిచూపును దెబ్బ తీయడం మొదలు పెట్టింది. నాలుగేళ్లుగా ఈ బాధను భరించలేకపోతున్నాను. చిత్రపరిశ్రమ నాకు సొంతిల్లులాంటిది. 36 ఏళ్ల జీవితాన్ని దీనికి అంకితమిచ్చాను" అంటూ ఏడ్చేసింది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) షగుఫ్త మాటలతో అక్కడున్న వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రియాలిటీ షో జడ్జి, నటి మాధురీ దీక్షిత్ వెంటనే షగుఫ్తను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మడానికి కూడా ఏమీ మిగల్లేని దీన స్థితికి చేరుకున్నందుకు విచారం వ్యక్తం చేసింది. డ్యాన్స్ దీవానే టీమ్ తరపు నుంచి రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. దీంతో చెక్‌ను అందుకున్న నటి భావోద్వేగానికి లోనైంది. గతంలో నీనా గుప్తా, సుమీత్ రాఘవన్, సుశాంత్ సింగ్ తనకు సాయం చేశారని గుర్తు చేసుకుంది. అలాగే తాజాగా రోహిత్ శెట్టి కూడా ఆమెకు ఆర్థిక సాయం చేశాడని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ మీడియాకు వివరించాడు. -
కారు, నగలు అమ్ముకుని రోడ్డున పడ్డ బుల్లితెర నటి
పలు సీరియళ్లలో నటించిన ప్రముఖ సీనియర్ నటి షగుఫ్త అలీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీనికి తోడు కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి. కరోనా వల్ల ఉపాధి లేక ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. దీంతో తనను ఆదుకోండంటూ దీనంగా అర్థిస్తోందీ సీనియర్ నటి. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నానని, కానీ తనను అనారోగ్య సమస్యలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయంది. నాలుగేళ్లుగా మరీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానంది. మధుమేహం, కంటిచూపు మందగింపు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కారు, బంగారు నగలను కూడా అమ్మేసానని తెలిపింది. ఇప్పుడు ఆస్పత్రికి కూడా ఆటోలోనే వెళ్తున్నానని పేర్కొంది. యాక్టింగ్ ఆఫర్లు కూడా రాకపోవడంతో 30 ఏళ్లుగా ఎంతో గౌరవంగా బతికిన తాను ఇప్పుడు దుర్భర పరిస్థితిలో జీవితం నెట్టుకొస్తున్నాని దీనంగా చెప్పుకొచ్చింది. ఏమైనా భరోసా కల్పిస్తాడేమోనన్న ఆశతో ఆమె సోనూసూద్‌ను సైతం సంప్రదించాలనుకుంది. అయితే వారు సేవలందిస్తారే తప్ప డబ్బు సాయం చేయరని తెలిసి నిట్టూర్పు విడిచింది. ఆమె పరిస్థితి గురించి తెలిసిన సింటా (సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నటికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కానీ వారు ఇవ్వాలనుకుంది చిన్న మొత్తం కావడంతో ఆ సాయాన్ని ఆమె నిరాకరించింది. ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ.. "ఇప్పటివరకు నాకు ఎలాంటి సాయం అందలేదు. సింటా సాయం చేస్తానంది కానీ, వాళ్లు ఇవ్వాలనుకున్న మొత్తం నాకు దేనికీ సరిపోదు. అందుకే వద్దన్నాను. సోనూసూద్‌ను కూడా కలవాలనుకున్నా. కానీ వాళ్లు ఆర్థికసాయం చేయరని తెలిసి ఆగిపోయాను. నాకిప్పుడు ఆర్థిక సాయం చాలా అవసరం, దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి" అని దీనంగా అర్థిస్తోంది షగుఫ్త అలీ. -
‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఈ నేపథ్యంలో తను నటించిన ఆమె కథ సీరియల్ సహ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు ఇంటర్వ్యూలో నవ్య అవి వట్టి పుకార్తేనని, తమ మధ్య ఏం లేదని స్పష్టిచేసింది. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడం, నవ్య షేర్ చేసిన ఫొటోలకు రవి కృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆ వార్తలకు మరింత బలం చూకూరుతుంది. తాజాగా ఆమె ఫొటోపై రవి కృష్ణ ఇలాగే స్పందించడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి సోషల్ మీడియాలో చర్చికుంటున్నారు. ఓ నెటిజన్ ‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చదవండి: ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
ఆ పనులు చేయడమంటే పిచ్చి ఇష్టం : నటి నవ్య స్వామి
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీకి అడుగుపెట్టి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అబ్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. కన్నడలో ఆమె నటించి తొలి సీరియల్ 'తంగళి' సూపర్ హిట కావడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఓ సీరియల్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక కొంతకాలంగా టీవీ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చూకూరినట్లయ్యింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న నవ్య తనకు సంబంధించి చాలా విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్‌లో తాను చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, తనకు కరోనా వచ్చిందని తెలిసి గేటెడ్ కమ్యూనిటీలోకి రానివ్వలేదని తెలిపింది. ఆ సమయంలో ఎంతో బాధ పడ్డానని, తన లైఫ్‌లో అంతలా ఏడ్చిన సందర్బం అదేనని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక తనకు ఇళ్లు సర్దడం, వంటి చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పాలంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. దీంతో మరో నటి తన ఇంటికి రావాలంటూ ఫన్నీగా సెటైర్ వేసింది. చదవండి : Pavala syamala : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన నటుడు కరోనా బాధితుల కోసం యాంకర్ వింధ్య వినూత్న ఆలోచన -
'ఓ వైపు తుపాను, నువ్వేమో డ్యాన్సులు.. ఛీ, సిగ్గుచేటు"
చిటపట చినుకులు పడుతుంటే వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటుంటారు. ఓ మోస్తరు వర్షం పడుతుంటే పడవలు చేసుకుని వాటిలో నీటిలో వదులుతూ ఆటలాడతారు. పిల్లలైతే డ్యాన్సులు చేస్తూ వానలో తడిసి ముద్దవుతారు కూడా! కానీ భారీ వర్షం వస్తే గుండె ఝల్లుమంటుంది, అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా తుపాను ప్రభావంతో కుంభవృష్టి కురిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. కాగా పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన టౌటే తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) అయితే ఇలాంటి సమయంలో దియా ఔర్ బాతీ హమ్(ఈ తరం ఇల్లాలు) సీరియల్ నటి దీపికా సింగ్ చేసిన పనికి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కారణం ఆమె రోడ్డు మీద విరిగిపడిన చెట్ల దగ్గరికు వెళ్లి ఫొటోషూట్ చేయడమే. "తుపానును మీరు ఆపలేరు, కాబట్టి దాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయకండి. అలా అని సైలెంట్‌గా కూర్చోకుండా ప్రకృతిని ఆలింగనం చేసుకోండి.. ఈలోగా తపాను వచ్చినదారినే వెళ్లిపోతుంది", "మా ఇంటి పక్కన ఓ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, కానీ దాన్ని అక్కడ నుంచి తొలగించే క్రమంలో ఈ టౌటే తుపానును గుర్తుంచుకునేందుకు నా భర్త రోహిత్, నేను కొన్ని ఫొటోలు తీసుకున్నాం" అని తను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) దీనికి తోడు వర్షంలో డ్యాన్స్ చేసిన వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. ఇది చూసి నోరెళ్లబెట్టిన జనాలు 'ఫొటోషూట్లు, డ్యాన్సులు చేయడానికి సమయం, సందర్భం అక్కర్లేదా?' అని తిట్టిపోస్తున్నారు. 'ఓ పక్క తుపాను వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఛీ, సిగ్గుచేటుగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు, కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకపోతేనే మంచిది' అని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) Today we have a girlboss posing with (in?) a tree that fell because of the cyclone currently ravaging India’s west coast. pic.twitter.com/gmBVlkWZH3 — Iva (@ivadixit) May 18, 2021 Love that girlboss is #collectingmoments in a cyclone that is wrecking people’s homes. Such moments are truly the equivalent to #fullmadness and #therapy — B (@pseudosabya) May 18, 2021 I'm sorry but stupidly posing with a fallen tree during cyclone is hazardous. I heard that people died. It's unsafe and unnecessary. U don't need motivation from people like these. — The Nocturnal (@nocturnalnkid) May 19, 2021 చదవండి: ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ బిపాసా బసు - జాను అబ్రహాంల విఫల ప్రేమ కథ -
ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..?
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రముఖ సీరియల్ నటితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరాఠి బుల్లితెరపై పాపులర్ అయిన సయాలి సంజీవ్‌తో ఈ చెన్నై ఆటగాడు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న విషయంపై నెట్టింట విస్తుృతంగా చర్చ నడుస్తోంది. జీ మరాఠిలో వచ్చే ‘కహ్ దియా పర్దేస్'తో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సయాలీ..'గౌరీ' తదితర సీరియళ్లతో మరింత పాపులర్ అయ్యింది. స్వతాహాగా మోడల్ అయిన సయాలీ.. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది. కాగా, ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా రుతురాజ్, సయాలీ మధ్య జరిగిన సంభాషణ చూస్తే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న విషయం అర్థమవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. సయాలి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై తొలుత రుతురాజ్ స్పందిస్తూ.. "వావ్" అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సయాలీ బదులిస్తూ.. లవ్ సింబల్స్‌తో ఉన్న ఏమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరి మధ్య ఏదో నడుసోందన్న వార్తలు గుప్పుమన్నాయి. సయాలి అందానికి రుతురాజ్ క్లీన్ బౌల్డయ్యాడంటూ నెట్టింట మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఆ పుకార్లను రుతురాజ్ పరోక్షంగా ఖండించాడు. బౌలర్లు తప్ప తననెవరూ బౌల్డ్ చేయలేరని, ఈ విషయం అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధమవుతుందని మరాఠీలో కామెంట్ చేశాడు. దీంతో ఈ లవ్ రూమర్స్‌కు ఆదిలోనే బ్రేక్ పడినట్లైంది. రుతురాజ్ పైకి ఇలా స్పందిస్తున్నా లోపలో మాత్రం ఏదో నడుస్తోందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రకు చెందిన రుతురాజ్.. గత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో కరోనా బారిన పడటంతో జట్టుకు దూరమైన రుతురాజ్.. సీజన్ ఎండింగ్లో వరుస హాఫ్ సెంచరీలతో అలరించాడు. ప్రస్తుత సీజన్లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను.. 128.94 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి 70 సెంచరీలు చేశాడు.. మరి నువ్యు..?