
బుల్లితెర నటి ఆర్తి సింగ్ పెళ్లి చేసుకుంది. 39 ఏళ్ల వయసులో బిజినెస్‌మెన్ దీపక్ చౌహాన్‌తో ఏడడుగులు వేసింది. ముంబై జుహులోని ఇస్కాన్ ఆలయప్రాంగణంలో బుధవారం ఈ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికొడుకు దీపక్ గుర్రపు స్వారీ చేసుకుంటూ కల్యాణ మండపానికి వచ్చాడు. తెల్లని షేర్వాణీ ధరించిన అతడు తలపై పింక్ టర్బన్ పెట్టుకున్నాడు. ఆర్తి రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది.
సిగ్గుతో ముడుచుకుపోయిన నటి
పెళ్లికొడుకు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకింత సంతోషం, ఒకింత సిగ్గుతో ముడుచుకుపోయింది నటి. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరి పెళ్లికి విక్కీ జైన్- అంకిత లోఖండే, దేవలీనా భట్టాచార్జి, రష్మీ దేశాయ్, యువిక చౌదరి, కరణ్ సింగ్ గ్రోవర్-బిపాషా బసు.. తదితర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆ షోలతో ఫేమస్
కాగా ఈ వారం ప్రారంభంలోనే ఆర్తి ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ సైతం ఘనంగా జరిగాయి. ఆర్తి కెరీర్ విషయానికి వస్తే.. మాయ్క అనే సీరియల్‌తో 2007లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. తోడ హై బాస్ తోడే కీ జరూరత్ హై, పరిచయ్, వారీస్ అనే షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment