
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.

ఎవరీ సురభి జ్యోతి?
పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్‌బాజ్, కోయి లౌట్‌కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు.

అప్పటి నుంచే లవ్
సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment