Actor
-
19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు
జుట్టు రాలిపోవడం ఎంత పెద్ద సమస్య అనేది అనుభవించినవారికే తెలుస్తుంది. అందులోనూ చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంటే దాన్ని అరికట్టలేక, కవర్ చేయలేక నానాతంటాలు పడేవారు చాలామంది ఉంటారు. ఈ ఇబ్బందులు తానూ పడ్డానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఛావా సినిమా (Chhaava Movie)లో ఔరంగజేబుగా నటించి విశేష గుర్తింపు సంపాదించుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాడు. ఆ బాధ నాకు తెలుసు'చిన్న వయసులోనే తలపై వెంట్రుకలు ఊడిపోతే (Early Balding) ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా, కష్టంగా ఉండేది. నాకది పెద్ద సమస్యలాగే కనిపించేది. 19 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోతుంటే భరించలేకపోయాను. అది మానసికంగా, వృత్తిపరంగా నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నటుడిగా కొనసాగాలనుకునే వ్యక్తికి జుట్టు చాలా అవసరం. సడన్‌గా కంటిచూపు మందగిస్తే ఎలా ఉంటుంది?మనకు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్నదాన్ని బట్టే ఎలాంటి ఆఫర్స్ వస్తాయనేవి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జుట్టు రాలడాన్ని మనం తగ్గించలేం అన్న నిజాన్ని జీర్ణించుకునేవరకు తిప్పలు తప్పవు. కానీ చిన్న వయసులో జుట్టు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగేకొద్దీ కంటిచూపు సైతం మందగిస్తుంది. సడన్‌గా ఒక రోజు ఉదయం పేపర్ తిరగేద్దామంటే అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తున్నాయనుకోండి. ఎలా ఉంటుంది? భయపడ్డా.. ఫోకస్ చేశాఅదేంటి నా కంటిచూపుకేమైంది? ఇకమీదట అద్దాలు పెట్టుకుంటే మాత్రమే కనిపిస్తాయా? అని ఆందోళన చెందుతాం కదా.. ఈ బట్టతల కూడా అలాంటిదే! దీనివల్ల నాకు సినిమా అవకాశాలు ఏమైనా తగ్గిపోతాయేమోనని భయపడ్డాను. కానీ తర్వాత నా లుక్స్ కంటే కూడా యాక్టింగ్ స్కిల్స్‌పైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అందువల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను' అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.చదవండి: భార్యకు విడాకులిచ్చి హీరోయిన్‌తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో -
నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా భావోద్వేగం
కబలి (కబడ్డీ).. కబలి.. నేను ఆళ్తా.. అంటూ తన డైలాగులతో నవ్వించాడు చిన్నా అలియాస్ జితేంద్ర రెడ్డి. కామెడీ పాత్రలే కాదు ఆ ఇంట్లో వంటి చిత్రాలతో సీరియ్ పాత్రలు కూడా చేశాడు. శివ, పుట్టింటి పట్టుచీర, మనీ మనీ, మధురానగరిలో, పిట్టల దొర, అల్లుడా మజాకా, మురారి, సొంతం, గౌతమ్ ఎస్ఎస్సీ, ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నటుడు చిన్నా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. మాజీ సీఎం మేనల్లుడిని..చిన్నా (Actor Chinna) మాట్లాడుతూ.. మాకు 25 ఎకరాల భూమి.. పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటర్లో ఉంది. కానీ నాకు సినిమాలపై ఆసక్తి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధించాను. తొలిసారి ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు సీనియర్ డైరెక్టర్ వంశీ హేయ్.. వెళ్లు అంటూ తరిమేశారు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అనిపించింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కష్టపడి అవకాశాలు సాధించాను. ఇక్కడో విషయం చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సోదరే మా అమ్మ. అనారోగ్యం బారిన చిన్నా భార్యనేను నటుడిగా పేరు తెచ్చుకున్నాక కేబినెట్ మీటింగ్‌కు పిలిచాడు. ఈయనెవరో తెలుసా? నా మేనల్లుడు అంటూ అక్కడున్నవారికి గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఎవరికీ నేను నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకునేవాడిని కాదు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ పెళ్లయిన పదేళ్లకు ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజు ఆమె నడవలేకపోతున్నానంది. మల్టిపుల్ క్లీరోసిస్ వ్యాధి వల్ల వీల్‌చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. రెడీ చేయడం దగ్గర్నుంచి అన్నీ నేనే..రూ.4 లక్షలు పెట్టి తైవాన్ నుంచి వీల్‌చైర్ తెప్పించాను. అది మనం కూర్చోవడానికే కాకుండా నిలబడేందుకు సాయపడుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా చాలాసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఐదారేళ్లపాటు వీల్‌చైర్‌లోనే ఉంది. చివరి రెండేళ్లయితే తనకు రెడీ చేయడం, డ్రెస్ వేయడం, తినిపించడం.. అన్నీ నేనే చేశాను. అయితే ఎక్కువసేపు మంచానికే పరిమితవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. అది ఎక్కువవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడింది. నా చేయి పట్టుకుని..మా ఆయన్ను చూడాలనుందని అక్కడివారికి చెప్పింది. ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఏదైనా తాగాలనుందంది. గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి మూడు, నాలుగు చెంచాలు తాగిపించాను. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగోలేదు అని చిరాకు పడటంతో స్పెషల్ ఐసీయూకు షిఫ్ట్ చేయిస్తానన్నాను. తనను స్ట్రెచర్‌పై పడుకోబెట్టగానే నా చేయి పట్టుకుని నేనిక బతకనేమో అంది. అదే తన చివరి మాట. ఏం కాదు అని ధైర్యం చెప్పాను. కానీ 24 గంటల్లో అంతా అయిపోయింది.ఒంటరినయ్యా..ఇద్దరు కూతుర్ల పెళ్లి చూడకుండా 42 ఏళ్ల వయసులోనే తను మాకు దూరమైంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా కూతుర్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇద్దరికీ పెళ్లయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరినయ్యాను. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే శూన్యంలా అనిపిస్తుంది. రోజూ నా భార్య ఫోటోకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు! -
పుష్ప విలన్ జాలిరెడ్డి పెళ్లి పనులు షురూ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (ఫోటోలు)
-
ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
ది ఫ్యామిలీ మ్యాన్-3 విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్ ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహం స్మార్ట్ తయారైనాడు. ఐదు నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా 109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు. ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్ లాంటివి కాకుండా 27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్ వెయిట్‌లాస్ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్ లోక్‌లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే విలన్‌గా గాకుండా రొమాంటిక్ మూవీలు చేయాలని ఉందనే కోరికనుకూడా వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్ టాస్ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు. చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం. లాక్డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని, మళ్లీ టోన్డ్ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేశాడు. 2024లో సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.అహ్లవత్ పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలుబరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు నష్టపోకుండా కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం, ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.హైడ్రేటెడ్‌గా ఉంటూ, ఎలక్ట్రోలైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది. కనుక శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు ఇలాంటి పారామీటర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు. ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్ ఇన్‌టేక్ పెంచడం, లేదా ఇంటర్మిటెంట్ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. -
'ప్రయాగ్ రాజ్‌లో ప్రకాశ్ రాజ్'.. సోషల్ మీడియాలో వైరల్
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళాలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్నానం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. నదిలో ఆయన స్నానం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇది నకిలీ వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడమే వారి పని. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు' అని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ಸುಳ್ಳು ಸುದ್ದಿ“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ 😊 #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025 -
శ్రీమంతుడు విలన్ రెండో పెళ్లి.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)
-
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నితిన్ భార్య (ఫోటోలు)
-
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
'షో చేస్తున్నావేంటి? నీ కంటికి మా హీరోయిన్ ఎలా కనిపిస్తోంది?'
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈ ఏడాది క్రూ, సింగం అగైన్ వంటి హిట్ చిత్రాలతో అలరించింది. ఓ పక్క స్టార్ హీరోలతో జత కడుతూనే మరోపక్క క్రూ, ద బకింగ్‌హామ్ మర్డర్స్ వంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు చేస్తోంది. 44 ఏళ్ల వయసులోనూ పడుచు హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అయితే ఓ పాకిస్తాన్ నటుడు మాత్రం ఆమెకు వయసు పెరిగిపోయిందంటున్నాడు. ఆమెకు కుమారుడిగా మాత్రమే నటిస్తాపాక్ నటుడు ఖాఖన్ షానవాజ్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్‌తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. అందుకతడు.. అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమె కుమారుడిగా మాత్రమే నటించగలను అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బెబో (కరీనా కపూర్) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడిపై ట్రోలింగ్'నువ్వు ఆమెతో కనీసం స్టేజీ కూడా పంచుకోలేవు. అలాంటిది ఏకంగా తనతో సినిమా చేస్తాననుకుంటున్నావా? ఇంకో విషయం తనకు కేవలం 44 ఏళ్లు మాత్రమే..', 'తనతో నటించే ఛాన్స్ నీకెవరు ఇస్తారు?', 'పెద్ద గొప్పలు పోతున్నావ్ కానీ ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయ్..', 'ఏజ్ షేమింగ్ చేస్తున్నావేంటి? ఒకసారి కరీనా కుమారుడిని చూసి నీ ముఖం అద్దంలో చూసుకోపో.',.' ఫ్లాప్ హీరోయిన్స్ కూడా నీతో కలిసి పని చేయాలనుకోరు' అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.చదవండి: 'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి -
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
ఇతడేమో టాలీవుడ్ విలన్.. భార్య విదేశీ సింగర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
లేడీ లవ్‌తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్
నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.అది నా మొదటి పెళ్లితాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్‌మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.కోకిల నా రెండో భార్యకానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. అది లీగల్ మ్యారేజ్ కాదునిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.బాలా- అమృత విడాకులుసింగర్ అమృతా సురేశ్‌తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.చదవండి: పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున -
'అమరన్'ని సత్కరించిన ఆర్మీ అధికారులు (ఫొటోలు)
-
కొరియన్ డ్రామా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్(39) తన ఇంటిలో కన్నుమూశారు. సాంగ్ జే రిమ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. కే-డ్రామాలు 'ది మూన్ ఎంబ్రేసింగ్ ది సన్', 'క్వీన్ వూ'లో కీలక పాత్రలు పోషించిన జే రిమ్ మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు.సాంగ్ జే రిమ్ మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన నటుడు ఇక ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.మీడియాకు అందిన సమచారం ప్రకారం పోలీసులు సాంగ్ జే రిమ్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. జే రిమ్ ఇంటిలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు జే రిమ్ కుటుంబ సభ్యులు లేదా ఇటు సియోల్ పోలీసులు గానీ మీడియాకు నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.సాంగ్ జే రిమ్ అంత్యక్రియలు నవంబర్ 14న జరగనున్నాయి. సాంగ్ జే రిమ్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 2009లో సాంగ్ జే రిమ్ నటనను ప్రారంభించారు. తొలుత 2011లో మూన్ ఎంబ్రేసింగ్ ది సన్‌లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
నా కుమారుడు చావు అంచులదాకా వెళ్లొచ్చాడు: నటుడు
పిల్లలు జబ్బుపడితే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. అలాంటిది ప్రాణాపాయంలో ఉంటే ఆ పేరెంట్స్ గుండె ఎంత విలవిల్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనక్కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్.ఊపిరాడలేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా పెద్ద కొడుకు జిడాన్కు మూడేళ్ల వయసున్నప్పుడు శ్వాసకోస సమస్యతో బాధపడ్డాడు. ఓసారి లండన్‌లో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. నాన్న, ఊపిరాడటం లేదు, సాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంతలో నా భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. 15 నిమిషాల్లో అంబులెన్స్ రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన నర్స్ ఒకరు బతకడం కష్టమన్నారు.దేవుడి దయ వల్ల..నా సంతకం తీసుకున్నాక జిడాన్కు అడ్రినలైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే సిటీలో ఎక్కడెక్కడో ఉన్న నలుగురు డాక్టర్లను ఆస్పత్రికి పిలిపించారు. స్టెరాయిడ్లు పని చేయకపోతే మెడ దగ్గర కోసి సర్జరీ చేస్తామన్నారు. దేవుడి దయ వల్ల కాసేపటికే స్టెరాయిడ్స్ పని చేయడంతో సర్జరీ అవసరం లేదన్నారు. లండన్‌లోని హెల్త్ కేర్ సిస్టమ్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే' అన్నాడు. కాగా జాయేద్-మలైకా దంపతులకు 2008లో జిడాన్లో జన్మించాడు. 2011లో ఆరిజ్ అనే మరో కుమారుడు పుట్టాడు. -
హిందూ పద్ధతిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం: నటుడు
ప్రేమకు హద్దుల్లేవు, కులమతభాష పట్టింపులు అంతకన్నా లేవని నిరూపించిన జంటలు కోకొల్లలు. బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్- మలైకా పరేఖ్ ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నారు. అయితే దానికంటే ముందు సీక్రెట్‌గా హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నామంటున్నాడు జాయేద్ ఖాన్.సర్ప్రైజ్ ప్లాన్జాయేద్ దంపతులు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము మా పెళ్లికి దాదాపు రెండువేల మంది అతిథుల్ని పిలవాలనుకున్నాం. కానీ అప్పుడిది పెళ్లికి బదులు సర్కస్‌గా మారిపోతుందని భావించాం. అందుకే, ఆ గ్రాండ్ వెడ్డింగ్ కంటే ముందు ఇంకేదైనా చేయాలనుకున్నాం. 30 మంది ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాం.. రహస్య వివాహంగోవాలో తాజ్ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాం. అలా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. పండితుడిని మాట్లాడటం, పెళ్లిలో పాటించే ఆచారాలు వంటివన్నీ మలైకా చూసుకుంది. తను ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను. మేము అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేశాం. ఎంత అందంగా గడిచిందో ఆ రోజు!అన్ని పండగలు సెలబ్రేట్ చేస్తాంఅలా అఫీషియల్ పెళ్లికంటే ముందే మేము భార్యాభర్తలమయ్యాం. మా ఇంట్లో అన్నిరకాల పండగలు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి దేవుడిని పూజిస్తాం అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ ఖాన్ తనయుడే జాయేద్. ఇతడు 2005లో మలైకాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జిడాన్, అరిజ్ అని ఇద్దరు సంతానం.చదవండి: Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు అర్జున్ మాథుర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలి తియా తేజ్‌పాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈనెల 9న వీరి వివాహ వేడుక జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.కాగా.. అర్జున్ మాథుర్ చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్-2 వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో కరణ్ మెహ్రా పాత్రను పోషించాడు ఈ సిరీస్‌లో నటనకు గానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా అర్జున్ మాథుర్.. లక్ బై ఛాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by A r j u n (@arjun__mathur) -
మళ్లీ పెళ్లెప్పుడు? సల్మాన్ సోదరుడి రియాక్షన్ ఇదే!
హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, జై చిరంజీవ ఫేమ్ అర్బాజ్ ఖాన్ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. 21 ఏళ్ల కుమారుడు ఉండగా మరో పెళ్లి చేసుకోవడమేంటని జనాలు ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఇతడికి ఐటం సాంగ్ డ్యాన్సర్ మలైకా అరోరాతో 1997లోనే పెళ్లయింది. వీరి సంతానమే అర్హాన్. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2017లో విడిపోయారు.గతేడాది రెండో పెళ్లితర్వాత జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్‌లో ఉండి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఆ వెంటనే (గతేడాది డిసెంబర్ 24న) మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అప్పటినుంచి భార్యతో కలిసి పార్టీలు, డిన్నర్లు అంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అతడు ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ చేశాడు. మళ్లీ పెళ్లెప్పుడు?ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నారని ఓ ఫ్యాన్ అడగ్గా.. అది నాకూ తెలియదు, కానీ నా భార్య షురా కూడా ఇదే మాట అంటూ ఉంటుందని రిప్లై ఇచ్చాడు. కుమారుడు అర్హాన్‌తో మీ బంధం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు వాడికి నేను చాలా క్లోజ్. ఒకరకంగా చెప్పాలంటే అర్హాన్ నా ఫ్రెండ్ అని సమాధానమిచ్చాడు. తర్వాతి పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఆల్రెడీ అయిపోయింది సోదరా.. అంటూ నవ్వుతున్న ఎమోజీలు జత చేశాడు.చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు? -
క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నా: హీరో
సక్సెస్ ఒక్కరోజులో రాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన తర్వాతే విజయం చేతికి అందుతుంది. బాలీవుడ్ నటుడు అభయ్ వర్మ విషయంలోనూ ఇదే నిజమైంది. ముంజ్య సినిమాతో ఇప్పుడితడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచాడు. తాజాగా అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.సంబంధం లేకుండా మాట్లాడారుఅవకాశాల కోసం ఎదురుచూస్తున్నరోజుల్లో జరిగిందీ ఘటన.. ముంబై నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశాను. తీరా అక్కడికి వెళ్లాక నా టాలెంట్ గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడారు. నా ప్రతిభను చూపించుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్లింకేదో ఆశించారు. నా విలువలను నాశనం చేసుకోలేక నో చెప్పాను. తొలి మీటింగ్‌లోనే చేదు అనుభవం ఎదురవడంతో నిరాశచెందాను. ముంబై వదిలేసి నా స్వస్థలమైన పానిపట్(హర్యానా)కు తిరిగి వచ్చేశాను. కానీ నటుడవ్వాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. మళ్లీ అడుగుపెట్టా..ఎవరికోసమో భయపడి నేనెందుకు వెనకడుగు వేయాలనుకున్నాను. మరింత క్లారిటీతో మళ్లీ ముంబైలో అడుగుపెట్టాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా నటుడిగా నా కెరీర్ మొదలైంది అని ఎప్పుకొచ్చాడు. కాగా అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ముంజ్య మూవీ జూన్ 7న విడుదలైంది. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లపైనే రాబట్టింది. ఇకపోతే అభయ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్ మన్రో జీవితం..!
పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త సీరియస్‌గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్ బాల్ స్టార్ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మార్లిన్ మన్రో బర్త్ డే సాంగ్ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్ తాలూకు ప్రైవేట్ ప్రపంచంపై ‘ది ఫిక్సర్’ పుస్తకం దృష్టి సారిస్తుంది. మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్ ఒటాస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ మాత్రమే కాకుండా ‘డెయిలీ మెయిల్’ పత్రికలో వన్స్ అపాన్ ఏ టైమ్ వచ్చిన ‘ఆస్క్ నాట్’ సీరియల్లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్’ రచయితలు జోష్ యంగ్, మాన్ఫ్రెడ్లు వాడుకున్నారు. మార్లిన్ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.(చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?) -
డాక్టర్ టు సినీ యాక్టర్
-
బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
అల్టిమేట్ బీచ్ ప్రపోజల్ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవబర్డ్స్ తమ రిలేషన్‌ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్ ప్రపోజల్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే.. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్ ఆదార్ జైన్. గత కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నటుడు ‘‘నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్‌తో సంతోషకర వార్తను పంచుకున్నాడు. ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్ స్పందించింది. కాగా ఆధార్ జైన్ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్నెస్ కమ్యూనిటీ క్రియేటివ్ వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మై లైఫ్ ఆఫ్ లైట్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్‌గా మారడంతో జైల్లో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ సొంతం! (ఫొటోలు)
-
పుష్ప 2 కోసం 8 సినిమాలు వదిలేశా: నటుడు
పుష్ప, ధమాకా, మంగళవారం.. ఇలా విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీతేజ్. ఈయన ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈయన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చేతిదాకా వచ్చిన ఏడెనిమిది ప్రాజెక్టులను పోగొట్టుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.గడ్డం కోసం సినిమాలు వదిలేశాశ్రీతేజ్ మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. పది నెలల్లో ఎనిమిది ప్రాజెక్టుల దాకా వదిలేశాను. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏ క్షణాన పిలిచినా చేసేందుకు రెడీగా ఉండాలి. షెడ్యూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. గడ్డం తీసేస్తే మళ్లీ ఈ స్థాయిలో పెరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది' అని పేర్కొన్నాడు.చదవండి: నటికి సర్జరీ? ట్రాన్స్‌జెండర్‌లా ఉందంటూ ట్రోల్స్ -
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ బర్త్‌డే స్పెషల్.. రేర్ ఫొటోలు
-
అనంత్-రాధిక పెళ్లిపై నటుడి సెటైర్స్.. బంధాలు నిలబడట్లేదంటూ..
అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేస్తామంటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. వివాహం కోసం స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆరాటపడుతున్నారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే దిగ్గజ పారిశ్రామికవేత్త, వేలకోట్ల సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లంటే ఇంకెలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోదు!సెలబ్రేషన్స్ చేసినన్ని రోజులు కలిసుండట్లేదుఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. జూలై 12న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు లండన్‌కు వెళ్లి అక్కడ కూడా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారట! ఈ వేడుకలపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.నీకేంటి సమస్య?ఇది చూసిన జనాలు నటుడిని తిట్టిపోస్తున్నారు. 'వాళ్లు సంతోషంగానే ఉన్నారు.. మధ్యలో నీకేంటి సమస్య?', 'వాళ్లను చూసి కుళ్లుకుంటున్నావ్ కదూ..', 'అనంత్-రాధిక చిన్ననాటి స్నేహితులు.. వారి ప్రేమలో నిజాయితీ ఉంది. వారి బంధం తెగిపోయేంత బలహీనమైంది కాదు', 'నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోవడం లేదుగా.. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావ్..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా? -
తెలుగులో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే.. లిస్ట్ ఇదే!
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ తారలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి టాప్ టెన్‌లో ఉన్న హీరోల జాబితాను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు.మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ పేరిట ఈ జాబితాను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పవన్ కల్యాణ్, నాని, రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండ టాప్‌టెన్‌లో నిలిచారు. ప్రభాస్ తొలిస్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రెబల్ స్టార్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/XNWOfiaDaA— Ormax Media (@OrmaxMedia) July 15, 2024 -
25 రోజులు మిస్సింగ్.. నటుడిని గుర్తుపట్టని తల్లి!
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.చూడగానే గుర్తుపట్టలేదుఇంటికి వెళ్లాక తన పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో ఏడ్చేశాంముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్.. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
వివాదంలో రాజ్‌తరుణ్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ (ఫోటోలు)
-
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేశ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్‌కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్‌గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్‌కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్‌గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్‌లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్‌లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో యూఎస్‌లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్‌లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్‌లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి -
ఎన్డీఏకి చుక్కలు చూపిస్తున్న ‘పవర్ స్టార్’
కొంత కాలం క్రితం వరకు బీహార్‌లోని కరకాట్ లోక్‌సభ నియోజకవర్గం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్డీఏ తరపున సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పోటీలో ఉన్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఒక సీటు లభించింది. ఆయనకు ప్రత్యర్థిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజారామ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు భోజ్‌పురి పవర్ స్టార్‌గా పేరొందిన నటుడు పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, ఎన్డీఏకు చుక్కలు చూపిస్తున్నారు.వివరాల్లోకి వెళితే బీజేపీ గతంలో పవన్సింగ్కు అసన్సోల్ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది. అయితే తనకు అసన్సోల్ వద్దని, తాను కరకాట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బీజేపీకి స్పష్టం చేశారు. కానీ అప్పటికే బీజేపీ ఆ సీటు టిక్కెట్‌ను ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించింది. దీంతో భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ బీజేపీపై దండెత్తి, కరకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇది ఎన్డీఏకు పెద్ద సవాల్‌గా మారింది.16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కరకాట్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 400 రైస్ మిల్లులు ఉన్నాయి. పవన్ సింగ్ రాకతో కరకాట్ రాజకీయ వాతావరణం వేడెక్కిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరకాట్ 2009లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి మొదటి ఎంపీ జేడీయూకి చెందిన మహాబలి సింగ్. 2014లో ఎన్డీఎ భాగస్వామ్య ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. 2019లో మహాకూటమి నుంచి పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహాను జేడీయూకు చెందిన మహాబలి సింగ్ ఓడించారు.పవన్ సింగ్ రాజ్‌పుత్ వర్గానికి చెందినవాడు కావడమే అతనికున్న బలం. ఇది కుష్వాహా వర్గపు ఆధిపత్య సీటు అయినప్పటికీ, ఇక్కడ కుష్వాహా, రాజ్‌పుత్, యాదవ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లక్షన్నర మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
బలగం సినిమాతోనే గుర్తింపు: సంజయ్‌కృష్ణ
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్‌కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లోని కరకట్ లోక్‌సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్‌కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ పవన్ సింగ్‌కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్‌లోని లాహోర్‌లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్‌లో కార్ట్‌రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్‌తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్‌కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్‌తో విడిపోయారు. -
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
-
మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ అనే కుమారుడు, ఇరా ఖాన్ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్ దంపతులు విడాకులు తీసుకున్నారు.విడాకులు2005లో ఆమిర్.. కిరణ్ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఆమిర్ హాజరయ్యాడు.షోలో ఆమిర్ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. రెండు సినిమాలూ వర్కవుట్ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్ కపిల్ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్ వేశాడు.టైం వేస్ట్!ఇంతలో అర్చన పూరన్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్.. సెటిల్ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్ లాహోర్ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Ab hogi comedy ki dangal with one and only Aamir Khan 😁Dekho #TheGreatIndianKapilShow this Saturday 8 pm sirf Netflix par ✨ pic.twitter.com/ukDIKk0U2D— Netflix India (@NetflixIndia) April 24, 2024 చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన దర్శకనటుడు -
ప్రముఖ దర్శకుడి ఇంట పెళ్లి.. స్టార్స్ సందడి
ప్రముఖ దర్శకనటుడు చేరన్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అతడి పెద్ద కూతురు నివేద ప్రియదర్శిని పెళ్లిపీటలెక్కింది. వ్యాపారవేత్త సురేశ్ ఆదిత్యతో ఏడడుగులు వేసింది. ఏప్రిల్ 22న చెన్నైలో ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సముద్రఖని, సీమన్, పాండిరాజ్, కేఎస్ రవికుమార్ తదితర కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.డైరెక్షన్ మీద ఆసక్తితో..తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిథుల ఫోటోలను చేరన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తమిళనాడులోని మధురైకి చెందిన చేరన్ డైరెక్షన్ మీద ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. మొదట్లో పలు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశాడు. పురియత పూజం అనే సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. పెద్ద సినిమాలకు సైతం సహాయ దర్శకుడిగా పని చేసిన ఇతడు తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించాడు. అనంతరం 'భారతీ కన్నమ్మ' చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు.తొలి సినిమాతోనే హిట్తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరన్ ఆటోగ్రాఫ్ అనే మూవీకి డైరెక్టర్‌గా పని చేయడంతోపాటు అందులో నటించడం విశేషం. ఈ చిత్రం అతడికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి తను డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ఆయన పని చేసిన నాలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం చేరన్.. కిచ్చా సుదీప్తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోంది. திருமணத்தை மனப்பூர்வமான வாழ்த்துடன் நடத்தித்தந்த திரு.ரவிக்குமார் சார், மரியாதைக்குரிய திருமதி ரவிக்குமார் அவர்களுக்கும், எங்கள் பெருமைக்குரிய இயக்குனர் இமயம் திரு.பாரதிராஜா, அன்பு அண்ணன் சீமான், திருமதி சீமான் அவர்களுக்கும் எங்கள் குடும்பத்தினர் சார்பாக மகிழ்ச்சியும் நன்றியும். pic.twitter.com/owMd4lDBkW— Cheran (@directorcheran) April 23, 2024 చదవండి: నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్ -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
రాముడికి ఓ బెంజ్.. 10 కోట్ల ఆస్తులు!
సాక్షి, నేషనల్ డెస్క్ : రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ గురించి! 80వ దశకంలో దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం సీరియల్‌కు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఆదివారమొస్తే చాలు.. ఉదయాన్నే దేశమంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ’ను వింటూ టీవీలకు అతుక్కుపోయిన రోజలవి. ఇప్పటికీ అరుణ్ గోవిల్ ఎక్కడ కన్పించినా రామున్నే చూసినంత ఆనందంతో కాళ్లకు నమస్కరించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ 72 ఏళ్ల టీవీ రాముడు యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్‌తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో గోవిల్ వెల్లడించారు. రూ.14.64 లక్షల కారు రుణముందని చెప్పారు. సీరియల్లో రాక్షససంహారం చేసిన ఈ టీవీ రామునిపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవండోయ్! 17 ఏళ్లకు సొంతూరికి... గోవిల్ పుట్టింది మీరట్లోనే. ముంబైలో స్థిరపడ్డారు. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో అడుగుపెడితే ఈ టీవీ రాముడు 17 ఏళ్ల ‘సిటీ’వాసం తర్వాత సొంతూరికి చేరారు. ఆయన కోసం మీరట్‌లో 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రాజేంద్ర అగర్వాల్‌ను బీజేపీ పక్కనబెట్టింది! సమాజ్‌వాదీ నుంచి అతుల్ ప్రధాన్, బీఎస్పీ తరఫున దేవవ్రత్ త్యాగి గోవిల్ ప్రత్యర్థులు. ‘‘ఈ ఎన్నికలతో నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. రాముడి ఆశీ్వర్వాదం తప్పకుండా ఉంటుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు గోవిల్. అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకల్లో ఆయన సీరియల్ సీత దీపికా చిఖలియా, లక్ష్మణుడు సునీల్ లాహరితో సహా పాల్గొనడం విశేషం. – -
బర్త్‌డే రోజు కళ్లముందే ఘోరం.. నా కుటుంబమంతా నిర్జీవంగా..
కళ్ల ముందు కుటుంబాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దారుణం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అలాంటి విషాద, భయానక సంఘటన జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత కమల్ సదనాహ్. పీడకలలాంటి రోజును గుర్తు చేసుకుంటూ.. 'అది నా జీవితంలోనే చీకటి రోజు. మా నాన్న(దర్శకనిర్మాత బ్రిజ్ సదనాహ్) అందరినీ తుపాకీతో కాల్చేశాడు. నన్ను కూడా షూట్ చేశాడు. కానీ అది నా మెడ నరంలో నుంచి చొచ్చుకుని వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత ఆయన కూడా తనను తాను షూట్ చేసుకున్నాడు. కళ్లముందే ఘోరం.. తీవ్రంగా గాయపడ్డ అమ్మ (నటి సయూదా ఖాన్), సోదరిని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బెడ్స్ లేకపోవడంతో నన్ను మరో ఆస్పత్రిలో చేర్చారు. వాళ్లిద్దరినీ బతికించమని వైద్యులను వేడుకున్నాను. అలాగే నాన్న ఎలా ఉన్నాడని ఆరా తీశాను.. కానీ ఏ సమాధానమూ రాలేదు. నాకు రక్తస్రావం ఎక్కువ అవుతుండటంతో సర్జరీ చేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాను.. అక్కడ నా కుటుంబమంతా శవాలుగా కిందపడి ఉన్నారు. నా కళ్లముందే ఆ ఘోరాన్ని చూడాల్సి వచ్చింది. అందరూ మరణించినా నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను. అందుకే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోను ఈ సంఘటన జరిగినంతమాత్రాన మా నాన్న, ఇంట్లోవాళ్లంతా చెడ్డవారని అర్థం కాదు. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటాను. ఇది నా బర్త్‌డే రోజే జరగడం వల్ల ఎన్నోయేళ్లపాటు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటికీ ఆ సెలబ్రేషన్స్ నాకు నచ్చవు' అని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన జరిగిన రెండేళ్లకు కమల్.. బేఖుడి(1992) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రంగ్, ఫాజ్, రాక్ డ్యాన్సర్, హమ్ సాబ్ చోర్ హై, మొహబ్బత్ ఔర్ జంగ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. 2007 తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న అతడు దాదాపు 15 ఏళ్ల తర్వాత సలాం వెంకీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. గతేడాది పిప్పా మూవీలో నటించాడు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు.. -
నటుడి సాహసం.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం 'ఆడుజీవితం: ది గోట్ లైఫ్'. బ్లెస్సీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో మరో నటుడు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో హకీమ్ అనే పాత్రలో కేఆర్ గోకుల్ కనిపించారు. అతని శరీరం పూర్తిగా బక్కచిక్కపోయినట్లుగా ఈ సినిమాలో కనిపించారు. తాజాగా తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లాగే గోకుల్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు వెల్లడించారు. గోకుల్ మాట్లాడుతూ..'హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశా. ఆ పాత్రను వాస్తవికంగా పోషించడంలో నాకు సహాయపడింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది. కేవలం నీళ్లు తాగి బతికా. దీంతో బాడీలోని కేలరీలను క్రమంగా తగ్గించుకున్నా. 15 రోజులుగా ఏం తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగాను. దీంతో మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం, స్నేహితులు చాలా బాధపడ్డారు. ఇది నిజంగా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆడుజీవితం సెట్స్‌లో నేనే అందరికంటే చిన్నవాడిని' అని అన్నారు. పృథ్వీరాజ్‌తో అనుభవం గురించి మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో అందరూ నన్ను తమ కొడుకులా చూసుకున్నారు. ఆ విధమైన శ్రద్ధ ఎల్లప్పుడూ సెట్స్‌లో సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడింది. మనం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా పని చేయగలం. పృథ్వీరాజ్ నన్ను కొత్తవాడిగా కాకుండా సహానటుడిగా చూశాడు. నువ్వు నాలాగే బాగా పని చేస్తున్నావు అని నాతో చెప్పాడు' అని పంచుకున్నారు. కాగా.. బెన్యామిన్ రచించిన 2008 నవల ఆడుజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1990ల్లో పని కోసం గల్ఫ్‌కు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవలే ధియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. -
సీక్రెట్‌గా ప్రముఖ సింగర్ వివాహం.. !
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దిల్జీత్ దోసాంజ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్‌లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్‌లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్‌కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్‌తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. అందుకే సీక్రెట్‌గా..: నటి
బాబీ, రోటి కపడా ఔర్ మకాన్, రాకీ, లవ్ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్లో తొలిసారి డైరెక్టర్ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు. ఒకరంటే ఒకరికి కోపం చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల అన్నీ మేనేజ్ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్ షూట్ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది. ప్రేమలో పడిపోయాం ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్‌గా మారిపోయాడు. కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్‌కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్ వర్గం శివసేన నుంచి అమోల్ కిర్తికర్ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు. #WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO — ANI (@ANI) March 28, 2024 మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు #WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV — ANI (@ANI) March 28, 2024 ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ప్రకాష్ రాజ్ బర్త్‌డే స్పెషల్.. రేర్ పిక్స్
-
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
'ఓ నాన్న ప్రేమ'..! దూరమైన కూతుర్ని ఏకంగా ఏఐ సాంకేతికతో..!
ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'! తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్‌ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి. అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్‌లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది. తన ఏకైక బిడ్డను డిజిటల్‌గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్‌గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్‌ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్‌ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది. అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్‌ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!. (చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహార పదార్థాలివే!) -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
బాలీవుడ్ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. నివేదిక ప్రకారం, రితురాజ్ సోమవారం రాత్రి మరణించాడు. ప్యాంక్రియాటిక్ (కాలేయ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రితురాజ్ సింగ్ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చేరుకున్నాడు. అనంతరం గుండెపోటుతో మరణించాడని ఆయన స్నేహితుడు అమిత్ తెలిపాడు. అప్పటికే ఆయనకు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆపై ప్యాంక్రియాటిక్ సమస్య కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన పేర్కొన్నాడు. రితురాజ్ బాలీవుడ్లో అనేక సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించారు. గతేడాదిలో వచ్చిన అజిత్ (తెగింపు) చిత్రంలో కూడా ఆయన నటించాడు. -
మహిళా జర్నలిస్టులపై వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడికి జైలు శిక్ష
కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించించింది. వివరాలు.. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి 2018లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగింది.. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పారు. కానీ కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆ వరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారిస్తూ వచ్చారు. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు. ఎస్వీశేఖర్‌కు నెలు రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పీల్ కోసం రెండు నుంచి నాలుగు వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగి పోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్‌గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్‌లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
లేటు వయసులో గర్ల్‌ఫ్రెండ్‌తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్
హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో లేటు వయసులో తండ్రి కావడంపై స్పందించారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న నీరో , గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్‌తో కలిపి గత ఏడాది ఏప్రిల్‌లో 79 ఏళ్ళ వయసులో ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా చూసినపుడు చాగా తనకు సంతోషంగా ఉంటుదని, ఈ వయసులో సాధ్యమైనంత ఎక్కువ సమయం పాపతో గడపాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. “I'm an 80-year-old dad, and it's great. And I want to be around for as long as I can to enjoy it.” Robert De Niro gets emotional talking about his baby daughter during an interview with AARP. pic.twitter.com/C1PHzxetnP — AP Entertainment (@APEntertainment) January 25, 2024 ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో మరో అవార్డు అందుకున్నాడు. రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే మోడల్-నటి టౌకీ స్మిత్‌తో జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. దీంతో పాటు రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్ , నీరోకు పాప గియా పుట్టింది. -
మాజీ భార్యతో డేటింగ్.. నేను మారిపోయా: నటుడు
2024.. ఈ ఏడాది ప్రారంభమైన రోజు ఎంతోమంది ఎన్నో కలలు కన్నారు. వంట నేర్చుకోవాలి, జిమ్‌కు వెళ్లాలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, ధ్యానం చేయాలి, చెడు వ్యసనాలు మానేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటీ సరిగా పాటించరు. అయితే ఈ నటుడు మాత్రం పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. ఈ ఏడాది తన భార్యకు సెకండ్ ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాడు. అదేంటో చదివేయండి.. విడాకులిచ్చిన తర్వాత మళ్లీ చిగురించిన ప్రేమ బాలీవుడ్ నటుడు గుల్షాన్ దేవయ్య- నటి కలిరోయ్ జియాఫెటా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వైవాహిక జీవితాన్ని ఆరంభించిన వీరు 2020లో విడిపోయారు. అయితే దూరమైన కొంతకాలానికిగానీ వీరి మధ్య ఎంత ప్రేముందో వారికి తెలిసిరాలేదు. అందుకే తమ ప్రేమకు మరో ఛాన్స్ ఇచ్చి చూద్దామని భావించారు. విడిపోయిన మూడేళ్లకు మళ్లీ కలిశారు. గతేడాది చివర్లో డేటింగ్ మొదలుపెట్టారు. దీని గురించి దేవయ్య మాట్లాడుతూ.. 'ఇప్పటికీ మా అనుబంధం చెక్కు చెదరలేదు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మారిపోయాం.. గతంలో ఉన్న పరిస్థితుల వల్ల మేము కలిసి ఉండలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, మేమూ మారిపోయాం. ఇంకా బెటర్‌గా తయారయ్యాం. ఆ విడాకులే మమ్మల్ని ఇలా మెరుగ్గా మార్చింది. ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఏది జరిగినా స్వీకరిస్తున్నాను. ఓపికను అలవర్చుకున్నాను. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కదిద్దుకుంటున్నాను. అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని ఆందోళన చెందడం లేదు. ఇప్పుడు మేము కలిసి రెస్టారెంట్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ల వయసున్న ఇతడు కుదిరితే తన మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. చదవండి: పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్ అయిన నిహారిక -
ఒకప్పుడు పండ్లు అమ్ముకుంటూ బతికాడు.. సినిమాల్లోకి వచ్చాక..
రజనీకాంత్ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్ కండక్టర్‌గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా మొదట్లో ఫుడ్ స్టాల్లో పని చేశాడు. మోడలింగ్ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్ కపూర్. సినిమాకే అంకితమయ్యేవాడిని.. కునాల్ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా.. 'అక్స్' అనే మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కునాల్. తర్వాత నసీరుద్దీన్ షా నడిపిన యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్‌దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్ జిందగీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో' ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్‌ఫామ్. 2012లో జహీర్ అదెన్వాలా, వరుణ్ సేత్‌లతో కలిసి కునాల్ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్ కపూర్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కూ బంధువే! అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు నైనాను కునాల్ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్‌కు అల్లుడయ్యాడు. కునాల్ చివరగా ద ఎంపైర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు. చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా.. -
మాలాంటివాళ్లకు భారత్‌లో పనిచేస్తే విలువ, గుర్తింపు: పాక్ నటుడు
పాకిస్తాన్ నటీనటులు సొంత దేశంలోనే కాకుండా ఇండియా వంటి ఇతర దేశాల్లో వివిధ భాషల్లో సినిమాలు చేస్తేనే మరింత గుర్తింపు, గౌరవం దక్కుతుందంటున్నాడు. తనకు నటుడిగా ఇండియానే గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'నా కెరీర్ భారత్‌లోనే మొదలైంది. ఇక్కడే నాకంటూ గౌరవాన్ని, పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్నాను. ఇక్కడ దాదాపు ఫేమస్ అయిపోవడంతో పాకిస్తాన్లో పని చేసేటప్పుడు నాకంతగా ఇబ్బందులు ఎదురవలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక ఇండస్ట్రీలలో పని చేసిన అనుభవం ఉంది. బడ్జెట్ సమస్య కాదు పాక్ ప్రజలు తమ సొంతవాళ్లను అంత సులువుగా సపోర్ట్ చేయరు. అదే మేము ఇండియాకు వచ్చి ఇక్కడ పేరు తెచ్చుకుంటే అప్పుడు మాకు గౌరవమర్యాదలు ఇస్తారు. పాక్, ఇండియన్ సినిమాలకు మధ్య తేడా బడ్జెట్ లెక్కలే అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. అప్పట్లో బేజా ఫ్రై అని ఓ సినిమా వచ్చింది. రూ.50 లక్షలు పెడితే రూ.10 కోట్లు వచ్చింది. ఆ పది కోట్లతో సీక్వెల్ తీస్తే ఉన్నదంతా పోయింది. బడ్జెట్ ఒక్కటే ప్రధానమైన తేడా కాదు. ఇక్కడ ఎవరూ సమయపాలన పాటించరు. అన్నీ ఆలస్యంగానే అవుతాయి కమర్షియల్ షూటింగ్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. మనం సమయానికి అక్కడున్నా సరే యాడ్ షూట్ సాగుతూనే ఉంటుంది. అందరూ డీలా పడిపోతారు. సినిమా షెడ్యూల్స్‌లో భాగంగా 25 రోజుల్లో అయ్యే షూటింగ్ కూడా 50 రోజులు పడుతుంది. చాలా ప్రాజెక్టులు అనుకున్న సమయానికంటే ఆలస్యంగానే పూర్తవుతాయి. శిక్షణ పొందిన ఆర్టిస్టులు పాక్ ఇండస్ట్రీలోకి రానంతవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ నటుడు ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆ ఆర్చీస్‌లో, అలాగే హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలో కనిపించాడు. చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి -
యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి రూ.1400 కోట్ల కంపెనీ సీఈవోగా
దూరదర్శన్‌లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్‌కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈ పాపులర్ సీరియల్లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే. బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్‌లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కమిషన్ జంక్షన్లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ సీరియల్లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. -
అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది
ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు. రాములవారికి ఎలాంటి పరిస్థితి? శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు. వారి త్యాగం ఊరికే పోలేదు అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
Ramayan: అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్‌లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు. ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్‌ఘాట్, హానుమాన్గర్హి, లతాచౌక్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు. ఇదీచదవండి.. రామ్ మందిర ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్ -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న నటుడు?
కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలామంది చాలా కలలు కంటుంటారు. వేకువజామునే నిద్ర లేవాలి, జిమ్‌కు వెళ్లాలి, డైట్ మెయింటైన్ చేయాలి, జంక్ ఫుడ్ మానేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఉన్న అప్పులు తీర్చేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ కొందరే వాటిని విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులు అవుతారు. తాజాగా ఓ నటుడు ఈ ఏడాది ఓ ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇళయరాజా సోదరుడు జ్ఞాని అమరన్ చిన్న కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ అమరన్ 2024లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట! ఈ ఏడాదే పెళ్లి ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'హ్యాపీ న్యూయర్. ఈ ఏడాది నేను వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తాను' అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు.. ఈ ట్వీట్ చేసిన తర్వాతే జపాన్‌లో భారీ భూకంపం వచ్చి ఉంటుంది.. ఇంతకీ ఇది నిజమేనా మాస్టారు? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 44 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే మిగిలిపోయాడు. మరి ఈసారైనా దీన్ని సీరియస్‌గా తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడో, లేదో చూడాలి! ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాల్సిందే! అమరన్ కెరీర్ విషయానికి వస్తే.. పున్నగై పూవె సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. శింబు హీరోగా నటించిన వల్లభ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గోవా, సరోజ, బిర్యానీ, మంగత తదితర చిత్రాలు చేశాడు. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ప్రేమ్‌జీ నటించాడు. కస్టడీ, ప్రిన్స్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 68వ సినిమాలో అమరన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. Happy new year. This year I am getting married. Dot. — PREMGI (@Premgiamaren) January 1, 2024 చదవండి: హీరోగా ఆట సందీప్.. బెస్ట్ సంచాలక్ అట! పోస్టర్‌పై నెట్టింట ట్రోల్స్.. -
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
అల్లు అర్జున్ ఇల్లు కట్టింది నేనే!: మంగళవారం నటుడు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న లక్ష్మణ్ మీసాల ఈమధ్యే రిలీజైన మంగళవారం సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. ఎన్నో నాటకాల్లో యాక్ట్ చేసిన లక్ష్మణ్.. కో అంటే కోటి సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. పాతికకు పైగా సినిమాలు చేసిన ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. ఏ పనిలోనూ తృప్తి దొరకలేదు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'పదో తరగతికే చదువు ఆపేశాను. సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో పనులు చేశాను. ఏ పని చేసినా అందులో తృప్తి దొరకలేదు. అందుకని కొన్నాళ్లకే ఆ పని మానేసి మరొకటి చేసుకుంటూ పోయాను. కానీ సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇక్కడ ఆగిపోయాను. నటుడిగానే కొనసాగుతున్నాను. అయితే ఇండస్ట్రీకి రావడానికి ముందు కూలీ పని కూడా చేశాను. నాకు తెలియకుండానే కొందరు ప్రముఖుల ఇంటి నిర్మాణానికి పని చేశాను. తెలియకుండా వాళ్ల ఇంటికి పని చేశా అందులో ఒకటి అల్లు అర్జున్ ఇంటి నిర్మాణానికి పని చేయడం! ఆయన ఇంటి నిర్మాణానికి కూలీ పని చేశాను. చేసినప్పుడు తెలియదు కానీ, తర్వాత అది అల్లు అర్జున్ గారి ఇల్లని తెలిసింది. కూలీ పని చేసేటప్పుడు చాలా దెబ్బలు తగులుతాయి. అలా అక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారింది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి సైతం పని చేశాను. దర్శకరచయిత ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటికి కూడా కూలీగా పని చేశాను. ఎవరెవరి ఇంటికో తెలియకుండానే పని చేశాను' అని తెలిపాడు లక్ష్మణ్. చదవండి: కానరాని లోకాలకు కరుప్పు ఎంజీఆర్.. ఎన్ని కష్టాలు వచ్చినా.. యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే? -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్‌కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ ఇక లేరు. విజయ్‌కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్‌కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్‌కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్‌కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్‌బాబు హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్‌లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్‌కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్‌కాంత్ హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్‌రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్‌రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్‌రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్‌రాజ్ పేరుని విజయ్‌కాంత్‌గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్‌కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్‌కాంత్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్‌కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్‌కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్‌కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్‌కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్‌గా కొనియాడబడ్డారు విజయ్‌కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్‌కాంత్‌కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్. బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్‌కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్‌ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
కెప్టెన్‌గా విజయ్‌కాంత్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
డీఎండీతే అధినేత, నటుడు విజయ్‌కాంత్ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే.. "కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్‌కాంత్‌కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.