మళ్లీ పెళ్లెప్పుడు? సల్మాన్‌ సోదరుడి రియాక్షన్‌ ఇదే! | Arbaaz Khan Reply to a Fan Who Asks About His Next Marriage | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌.. నటుడికి ఊహించని ప్రశ్న

Published Mon, Oct 7 2024 4:20 PM | Last Updated on Mon, Oct 7 2024 4:47 PM

Arbaaz Khan Reply to a Fan Who Asks About His Next Marriage

హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, జై చిరంజీవ ఫేమ్‌ అర్బాజ్‌ ఖాన్‌ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. 21 ఏళ్ల కుమారుడు ఉండగా మరో పెళ్లి చేసుకోవడమేంటని జనాలు ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఇతడికి ఐటం సాంగ్‌ డ్యాన్సర్‌ మలైకా అరోరాతో 1997లోనే పెళ్లయింది. వీరి సంతానమే అర్హాన్‌. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2017లో విడిపోయారు.

గతేడాది రెండో పెళ్లి
తర్వాత జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్‌లో ఉండి ఆమెకు బ్రేకప్‌ చెప్పేశాడు. ఆ వెంటనే (గతేడాది డిసెంబర్‌ 24న) మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అప్పటినుంచి భార్యతో కలిసి పార్టీలు, డిన్నర్‌లు అంటూ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా అతడు ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియా వేదికగా చిట్‌చాట్‌ చేశాడు. 

మళ్లీ పెళ్లెప్పుడు?
ఇంత హ్యాండ్‌సమ్‌గా ఎలా ఉన్నారని ఓ ఫ్యాన్‌ అడగ్గా.. అది నాకూ తెలియదు, కానీ నా భార్య షురా కూడా ఇదే మాట అంటూ ఉంటుందని రిప్లై ఇచ్చాడు. కుమారుడు అర్హాన్‌తో మీ బంధం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు వాడికి నేను చాలా క్లోజ్‌. ఒకరకంగా చెప్పాలంటే అర్హాన్‌ నా ఫ్రెండ్‌ అని సమాధానమిచ్చాడు. తర్వాతి పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఆల్‌రెడీ అయిపోయింది సోదరా.. అంటూ నవ్వుతున్న ఎమోజీలు జత చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement