Arbaaz Khan
-
మళ్లీ పెళ్లెప్పుడు? సల్మాన్ సోదరుడి రియాక్షన్ ఇదే!
హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, జై చిరంజీవ ఫేమ్ అర్బాజ్ ఖాన్ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. 21 ఏళ్ల కుమారుడు ఉండగా మరో పెళ్లి చేసుకోవడమేంటని జనాలు ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఇతడికి ఐటం సాంగ్ డ్యాన్సర్ మలైకా అరోరాతో 1997లోనే పెళ్లయింది. వీరి సంతానమే అర్హాన్. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2017లో విడిపోయారు.గతేడాది రెండో పెళ్లితర్వాత జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్‌లో ఉండి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఆ వెంటనే (గతేడాది డిసెంబర్ 24న) మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అప్పటినుంచి భార్యతో కలిసి పార్టీలు, డిన్నర్లు అంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అతడు ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ చేశాడు. మళ్లీ పెళ్లెప్పుడు?ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నారని ఓ ఫ్యాన్ అడగ్గా.. అది నాకూ తెలియదు, కానీ నా భార్య షురా కూడా ఇదే మాట అంటూ ఉంటుందని రిప్లై ఇచ్చాడు. కుమారుడు అర్హాన్‌తో మీ బంధం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు వాడికి నేను చాలా క్లోజ్. ఒకరకంగా చెప్పాలంటే అర్హాన్ నా ఫ్రెండ్ అని సమాధానమిచ్చాడు. తర్వాతి పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఆల్రెడీ అయిపోయింది సోదరా.. అంటూ నవ్వుతున్న ఎమోజీలు జత చేశాడు.చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు? -
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
నా దృష్టిలో పాన్ ఇండియా అంటే అదే: టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్‌ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్‌గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024 -
నా భార్యకేమీ 16 ఏళ్లు కాదు, తనకేం కావాలో అన్నీ తెలుసు: నటుడు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నప్పటినుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ల కిందట ఐటం గర్ల్ మలైకా అరోరాను పెళ్లి చేసుకుని తర్వాత విడాకులిచ్చాడు. అనంతరం జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్‌లో ఉండి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఈ బ్రేకప్ వార్తలు ఆలస్యంగా బయటకు రాగా, అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది డిసెంబర్ 24న మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. వీరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలు అయిపోయాక భార్యతో కలిసి లంచ్, డిన్నర్, పార్టీలు, షోలు.. అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. జీవితంలో ఏం కావాలో తనకు తెలుసు అయితే షురా ఖాన్.. అర్బాజ్ కంటే చాలా చిన్నది. దీంతో అర్బాజ్‌పై ట్రోలింగ్ జరిగింది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా? చూస్తుంటే ఆ అమ్మాయిది చాలా తక్కువ వయసుగా కనిపిస్తోందని విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై అర్బాజ్ స్పందించాడు. 'నా భార్య నాకంటే చిన్నదే కావచ్చు. కానీ ఆమె 16 ఏళ్ల చిన్న పిల్ల కాదు. జీవితంలో తనకు ఏవి అవసరం? ఏవి అనవసరం అన్న విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉంది. అలాగే నా జీవితానికి ఏం అవసరం అనేది నాకు తెలుసు. మేమిద్దరం ఏడాదిపాటు ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మాకు ఏం కావాలి? భవిష్యత్తులో ఎలా ఉండాలనేది అన్నీ పరిశీలించుకున్నాం. వయసు దాచిపెట్టి పెళ్లి చేసుకోలే అంతేతప్ప ముందూవెనకా ఆలోచించకుండా తొందరపడి పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏజ్ గ్యాప్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. నేనేమీ నా వయసు దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసు. మేము తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో కూడా తెలుసు. అయినా ఒకే వయసులో ఉన్న ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి ఉండవచ్చు లేదంటే ఏడాదికే విడిపోవచ్చు. కాబట్టి ప్రేమకు, బంధానికి వయసుతో పని లేదని గుర్తుంచుకోండి. ఇంకా చెప్పాలంటే ఏజ్ గ్యాప్ ఎక్కువున్న జంటలు ఎక్కువకాలం కలిసే ఉన్నారు. అలాంటి జంటల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు! -
సరికొత్త కథతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న అర్బాజ్ ఖాన్!
'జై చిరంజీవ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు. యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథలో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అర్బాజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని అన్నారు. -
తమ్ముడి రెండో పెళ్లి.. నా మాట ఎప్పుడు విన్నాడని?: సల్మాన్
ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలా? ఇదేం ప్రశ్న అనుకునేరు.. చాలామంది ప్రేమలో పడుతున్నారు.. కానీ ఎక్కువకాలం కొనసాగలేక బ్రేకప్ చెప్పుకుంటున్నారు. చివరాఖరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లితో పవిత్రబంధంగా మార్చుకుంటున్నారు. అయితే బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ మాత్రం షాదీ చేసుకునేదే లేదంటున్నాడు. అందుకే 58 ఏళ్ల వయసొచ్చినా సింగిల్‌గానే ఉంటున్నాడు. అతడి తమ్ముడిది ఇంకో దారి! 56 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లి ఐటం సాంగ్ హీరోయిన్ మలైకా అరోరాను పెళ్లాడిన ఇతడు కొడుకు పుట్టాక ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. 56 ఏళ్ల వయసులో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా గతేడాది చివర్లో నిఖా చేసుకున్నాడు. ఆదివారం నాడు(జనవరి 29న) సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కమెడియన్ భారతీ సింగ్.. పెళ్లికి తననెందుకు పిలవలేదని నిలదీసింది. ఇంకెక్కడ పెళ్లి? ఇందుకు అర్బాజ్.. నెక్స్ట్ పెళ్లికి పిలుస్తానులే అని సరదాగా వ్యాఖ్యానించాడు. 'తమ్ముడి పెళ్లిపై నీ రియాక్షన్ ఏంటి? నువ్వు ఎలాంటి సలహాలిచ్చావు?' అని సల్మాన్‌ను ప్రశ్నించింది లేడీ కమెడియన్. అందుకు సల్లూభాయ్ స్పందిస్తూ.. 'అతడు నా మాట ఎప్పుడు విన్నాడని? నా మాటలు విని ఉంటే..' అని మధ్యలోనే ఆపేశాడు. దీంతో అర్బాజ్ తన ప్రేమ-పెళ్లి వ్యవహారాల్లో సొంత అన్న మాట కూడా వినడని అర్థమైంది.ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు సల్మాన్ బదులిస్తూ.. 'ఇంకెక్కడ పెళ్లి.. నా జీవితంలో ఆ ముచ్చట ఉండదు' అని తేల్చేశాడు. ఇకపోతే బిగ్‌బాస్ 17వ సీజన్లో మునావర్ ఫరూఖి విజేతగా నిలిచాడు. age dekhiye #BB17 main hone walah hai #BhartiSingh comedy with #sohail & #arbaazkhan . AND MILEGA TOP 3 SE TOP 2 of #BB17Finale . . HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta #MannaraFam pic.twitter.com/hZgYJxSGBs — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 చదవండి: భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. ఆప్యాయంగా ముద్దాడుతూ.. -
56 ఏళ్ల వయసులో నటుడి పెళ్లి ప్రపోజల్..
-
ప్రియురాలికి నటుడి ప్రపోజ్.. చప్పట్లు కొట్టిన తనయుడు
ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలవుతుందో ఎవరూ ఊహించలేరు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లాగా సులువుగా ప్రేమలో పడతారు.. నచ్చిన వెంటనే ప్రపోజ్ చేసుకుంటారు. ఉన్నన్నాళ్లూ కలిసుంటారు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని మళ్లీ వేరేవాళ్లతో లవ్‌లో పడతారు. బాలీవుడ్లో అయితే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్.. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ కూడా ఈ కోవలోకే వస్తాడు. 56 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు అర్హాన్ ఖాన్ సమక్షంలో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షురా ఖాన్ ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో అర్బాజ్ మోకాళ్లపై కూర్చుని షురాకు పూల బొకేతో ప్రపోజ్ చేశాడు. బార్లో అందరి ముందు తనకు ప్రపోజ్ చేయడంతో ఆమె సిగ్గులమొగ్గైంది. అంతా చాలా త్వరగా ఇక తండ్రి ప్రపోజల్‌ను అక్కడే ఎదురుగా ఉండి చూస్తూ ఆనందించాడు అర్బాజ్ తనయుడు అర్హాన్. పుష్పగుచ్ఛాన్ని స్వీకరించిన తర్వాత షురాకు ఉంగరం తొడిగి ఆమె నుదుటన ముద్దు పెట్టాడు అర్బాజ్. తండ్రికి భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చప్పట్లు కొట్టాడు అర్హాన్. '19వ తారీఖున ఎస్ చెప్పడం దగ్గరి నుంచి డిసెంబర్ 24న పెళ్లి చేసుకోవడం వరకు.. అంతా చాలా త్వరగా జరిగిపోయింది' అని రాసుకొచ్చింది షురా. వీరిద్దరికీ 'పాట్న శుక్ల' సినిమా సెట్స్‌లో పరిచయం ఏర్పడగా తర్వాత అది ప్రేమకు దారి తీసినట్లు కనిపిస్తోంది. అర్బాజ్కిది రెండో పెళ్లి కాగా అర్బాజ్.. గతంలో ఐటం సాంగ్ డ్యాన్సర్ మలైకా అరారోను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు సంతానం. తర్వాత ఓ నటిని ప్రేమించగా ఇది పెళ్లి వరకు రాకుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ మధ్యే షురా ఖాన్‌ను ప్రేమించి షాదీ చేసుకున్నాడు. చదవండి: ఓటీటీల్లో ఈ వారం 25 సినిమాలు రిలీజ్.. అవి మాత్రం ప్రత్యేకం! -
Arbaaz Khan: 56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'జై చిరంజీవ' విలన్ (ఫొటోలు)
-
రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?
స్టార్ హీరో తమ్ముడు, ప్రముఖ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆదివారం రాత్రి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇంతకీ ఎవరా నటుడు? ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.. నటుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1998లోనే నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నాడు. 2017 వరకు వీళ్లు సంసారం చేశారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. మలైకా- హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. అటు అర్బాజ్.. నటి జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లు ప్రేమలో ఉండి ఇటీవలే బ్రేకప్ చెప్పాడు. అయితే కొన్నిరోజుల నుంచి అర్బాజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) అయితే పెళ్లి నిజమా కాదా? అని అందరూ అనుకున్నారు. తాజాగా ముంబయిలోని తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్‌తో నిఖా చేసుకున్నాడు. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అర్బాజ్ పెళ్లిలో అతడి కొడుకు కూడా కనిపించడం విశేషం. తన పెళ్లి ఫొటోల్ని పోస్ట్ చేసిన అర్బాజ్.. అందరి ఆశీర్వాదం కావాలని క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం కొత్తజంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. హిందీలో నటుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేసిన అర్భాజ్.. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. 2017లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలోనూ నటించాడు. అయితే ఇక్కడ ఆఫర్స్ రాలేదో ఏమో గానీ చాలావరకు హిందీలో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) -
బ్రేకప్ చెప్పి నెలరోజులు కాలేదు.. అప్పుడే మరో పెళ్లా?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. మేకప్ ఆర్టిస్ట్ శురా ఖాన్‌ను డిసెంబర్ 24న పెళ్లాడబోతున్నట్లు బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వివాహ వేడుక ముంబైలో ఇరుకుటుంబసభ్యులు, అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అర్బాజ్ గతేడాది పాట్నా శుక్ల అనే సినిమా చేశాడు. ఈ మూవీలో అనుష్క కౌశిక్, రవీనా టండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సెట్స్‌లో పరిచయం.. ఇకపోతే రవీనా టండన్‌కు షురా మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా సెట్స్‌లో షురా, అర్బాజ్‌ల మధ్య పరిచయం ఏర్పడగా అది తర్వాత ప్రేమగా మారినట్లు భోగట్టా! కాగా అర్బాజ్ ఖాన్.. గతంలో ఐటం గర్ల్, నటి మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. ఏళ్ల తరబడి అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత అర్బాజ్.. నటి జియార్జియా ఆండ్రియానితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇటీవలే బ్రేకప్ చెప్పుకుంది. జియార్జియా ఆండ్రియాని, అర్బాజ్ ప్రేమికులుగా బ్రేకప్.. ఫ్రెండ్స్‌గా ఉంటాం.. ఈ విషయాన్ని జియార్జియా సైతం మీడియాకు ధ్రువీకరించింది. అయితే తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని చెప్పింది. అయితే వీరు విడిపోయినట్లు ప్రకటించి నెలరోజులైనా కాకముందే అర్బాజ్ మరోసారి ప్రేమలో పడ్డాడు, పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు.. ఏది నిజం? ఏది అబద్ధం? తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరి దీనిపై అర్బాజ్ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చేలా లేదు! చదవండి: రైతుబిడ్డకంత నాలెడ్జ్ లేదు.. మానసిక క్షోభ అంటూ ఏడ్చేసిన సింగర్ -
నాలుగేళ్లుగా డేటింగ్.. నటుడికి బ్రేకప్ చెప్పిన నటి.. ఎందుకంటే?
హీరోయిన్, ఐటం సాంగ్ డ్యాన్సర్.. మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే ఇతడి కంటే ముందు ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. అతడే నటుడు అర్బాజ్ ఖాన్. 1998లో అర్బాజ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ 2017లో అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. మలైకా.. అర్జున్‌తో ప్రేమలో పడగా, అర్బాజ్ నటి జియార్జియా ఆండ్రియానిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న అర్బాజ్- జియార్జియా తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారు. ద్వేషపూరిత రిలేషన్ ఈ బ్రేకప్ గురించి జియార్జియా మాట్లాడుతూ.. 'అతడు (అర్బాజ్) నాతో బాగానే ఉన్నాడు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డాడు. అతడి గురించి ఎప్పటికీ నేను చెడుగా అనుకోను. విడిపోయినంత మాత్రాన మొత్తానికే మాట్లాడకుండా ఉండిపోను. విద్వేషపూరిత బంధం(టాక్సిక్ రిలేషన్షిప్)లో ఉన్నప్పుడే అవతలి వ్యక్తిని దూరం పెట్టాలనుకుంటాం. అతడి నీడని కూడా ద్వేషిస్తాం. అతడితో నా రిలేషన్ మరీ అంత ద్వేషపూరితమైనది కాదు. కాబట్టి అతడితో పూర్తిగా సంబంధాలు తెంచేసుకోను. మేము ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. అది చాలా కష్టమైన ప్రక్రియ. చివరకు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు బాధగా ఉంది' అని చెప్పుకొచ్చింది. స్వేచ్ఛ హరించుకుపోయింది! బ్రేకప్‌కు గల కారణాల గురించి మాట్లాడుతూ.. అతడు ఏదీ దాచుకోడు. తనకు ఏమనిపిస్తే అదే చేస్తాడు. అది కాదు సమస్య.. నేను బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తాను.. అతడు మరేదో ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ మొదలువుతుంది. ఆ సమయంలో నాకు స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. మనసుకు నచ్చింది చేయకపోయినా, నచ్చిన చోటకు వెళ్లలేకపోయినా మన స్వేచ్ఛ హరించుకుపోయినట్లే అనిపిస్తుంది. బ్రేకప్ తర్వాత నేను చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నాకు నచ్చినట్లు ఉండగలుగుతున్నాను' అని పేర్కొంది జియార్జియా. చదవండి: గొడవలు- విడాకులు.. మూడుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించా.. సీనియర్ హీరోయిన్ -
తొమ్మిది నెలలు నడిచాను
సుప్రసిద్ధ నటి హెలెన్ గొప్ప నాట్యగత్తెగా అందరికీ తెలుసు.రచయిత సలీం భార్యగా, సల్మాన్ ఖాన్ మారుతల్లిగా కూడా తెలుసు.కాని ఆమెకు ఒక వెంటాడే గతం ఉంది.తన కుమారుడు అర్బాజ్ ఖాన్ చేస్తున్న తాజా షోలోఆమె ఆ గతాన్ని గుర్తు చేసుకుంది.ఆ జ్ఞాపకాలు కదిలించేవిగా ఉన్నాయి. ‘నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, సినిమాల్లో నిలబడ్డానంటే దానికి మా అమ్మే కారణం. ఆమె చాలా ఆత్మస్థయిర్యం ఉన్న స్త్రీ’ అని గుర్తు చేసుకున్నారు 84 ఏళ్ల హెలెన్. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే హెలెన్ నటుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో ‘ది ఇన్విన్సిబుల్స్’లోపా ల్గొని మాట్లాడింది. ఆ సందర్భంగా తన బాల్యాన్ని, తల్లిని గుర్తు చేసుకుంది. ‘మా అమ్మది బర్మా (మయన్మార్). నాన్న ఆంగ్లో ఇండియన్. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు. చెల్లెలు. 1943లో అమ్మ గర్భంతో ఉండగా నాన్న చనిపోయాడు. అప్పుడే బర్మాను జపాన్ ఆక్రమించింది. అంతటా రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు. బర్మాలో ఉండే పరిస్థితి లేదు. ఆ సమయానికి నాకు ఆరేళ్లు. అమ్మ నన్ను తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని ఇండియా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళితే సరిగ్గా మేము వెళ్లే సమయానికి జపాన్ విమానాలు వచ్చి బాంబులు వేశాయి. ఇక విమానంలో వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 350 మంది నడక ద్వారానే ఇండియాకు బయలుదేరాం. అమ్మ ప్రెగ్నెంట్ అయినా భయపడక నన్ను, తమ్ముణ్ణి, చెల్లెల్ని తీసుకుని ఆ బిడారులో బయలుదేరింది. 9నెలలపా టు నడిచాం. దారిలోని పల్లెల్లో కొంతమంది మాకు అన్నం పెట్టేవాళ్లు. బ్రిటిష్ సైనికులు కనిపించి తినడానికి ఇచ్చేవారు. దారిలో అమ్మకు అబార్షన్ అయ్యింది. చెల్లెలు చనిపోయింది. నేను, తమ్ముడు ఎముకల గూడుగా మారాం. ఇండియా చేరేనాటికి 350 మందిలో సగం మందిమే మిగిలాం. మేము మొదట అస్సాంకు తర్వాత కోల్‌కతాకు చేరాం. ఆ తర్వాతే బాంబే వచ్చి స్థిరపడ్డాం’ అని చెప్పిందామె. మరి సినిమా రంగానికి ఎలా వచ్చారు అని అర్బాజ్ అడగగా– ‘బాంబేలో మేమున్న ఇంటి ఎదురుగా ఒక మణిపూరి డాన్సర్ ఉండేది. ఆమె దగ్గర అమ్మ నాకు మణిపురి నేర్పించింది. ఆ రోజుల్లో కుకూ అనే డాన్సర్ సినిమాల్లో ఫేమస్. ఆమెకు అమ్మతో స్నేహం కుదిరింది. ఆమెలా నేనూ డాన్సర్ అవ్వాలని అమ్మ అనుకుంది. కుకు నన్ను సినిమాల్లోకి గ్రూప్ డాన్సర్‌గా తీసుకెళ్లింది. దేవ్ ఆనంద్ నటించిన ‘బారిష్’ (1957)లోని ‘మిస్టర్ జాన్ బాబాఖాన్’పా టతో ఐటమ్ గర్ల్‌గా మారాను. ‘హౌరాబ్రిడ్జ్’ (1958)లోని ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’పా టతో నాకు స్టార్డమ్ వచ్చింది’ అని చెప్పిందామె. ‘మా నాన్న (రచయిత సలీం ఖాన్)తో మీ స్నేహం ప్రేమ, పెళ్లి దాకా ఎలా దారి తీసింది’ అని అర్బాజ్ అడగగా ‘1970లో నా ఆస్తి మొత్తం పోయింది (హెలెన్ మొదటి భర్త పి.ఎన్.అరోరా వల్ల). కోర్టు కేసుల్లో చిక్కుకున్నాను. ఆ సమయంలో మీ నాన్న నా ఇబ్బందిని గమనించి తాను రాసే సినిమాల్లో నాకు వేషాలు వచ్చేలా చూశాడు. అలా ప్రేమ ఏర్పడింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా కోసం ఆయన తన కుటుంబం నుంచి విడిపోయి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ కలసి ఉండేలా చూడమని గట్టిగా కోరాను. మీ అమ్మ (సల్మా ఖాన్), మీరు ఆ రోజుల్లో ఎక్కువ వేదన అనుభవించి ఉంటారు. నేనైతే మీ అమ్మకు ఎదురుపడటానికి కూడా భయపడేదాన్ని. ఏమైనా కొన్నాళ్లకు మీరంతా నన్ను యాక్సెప్ట్ చేశారు. నన్ను హెలెన్ ఖాన్‌గా గౌరవించారు. సల్మా, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అర్పిత (సల్మాన్ చెల్లెలు) పెళ్లిలో శుభలేఖలో నా పేరు కూడా వేశారు. ఇంతకన్నా ఏం కావాలి?’ అందామె. -
జీవితమంతా ఒత్తిడికి లోనవుతూనే ఉన్నా: నటి మాజీ భర్త
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తాజాగా తనావ్(ఒత్తిడి) అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్ ఈ నెల 11 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానుంది. సిరీస్ ప్రమోషన్లలో భాగంగా అతడు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తను ఒత్తిడి గురించి చెప్పుకొచ్చాడు. మనం నిత్యం ఒత్తిడితో సతమతమవుతూనే ఉంటాం. జీవితంలో ఒత్తిడికి లోనవని సందర్భాలంటూ ఉండవు. ఎప్పుడూ మన మెదడులో ఏదో ఒక స్ట్రెస్ ఉండనే ఉంటుంది. పని గురించో, డబ్బు గురించో, రిలేషన్షిప్ గురించో లేదంటే ఆరోగ్యం గురించైనా కావచ్చు. అలా నిత్యం ఏదో ఒకదాని కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ క్రమంలో జీవితమంతా కాస్తో కూస్తో ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. చిన్నవయసులో నేను చాలా వాటి కోసం టెన్షన్ పడేవాడిని. 20 ఏళ్ల వయసులో కెరీర్ గురించి, తర్వాత జీవితం గురించి.. ఇలా ఒత్తిడి అనేది ఏదో ఒక రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నింటినీ స్వీకరిస్తూ ఏది జరిగినా మనమంచికే అనుకుని ముందుకు వెళ్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అర్బజ్.. దబాంగ్ సినిమాతో నిర్మాతగా మారాడు. 1998లో సీనియర్ నటి మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2002లో అర్హాన్ ఖాన్ జన్మించాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. చదవండి: నేనెక్కడికీ వెళ్లలేదు, తిరిగొస్తా: విజయ్ దేవరకొండ చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ రాయల్ పోస్ట్ వైరల్ -
భర్త నుంచి విడిపోయాక ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా: నటి
భర్త అర్బాజ్‌ఖాన్‌తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్‌ఖాన్ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్షిప్లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్‌కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్‌ఖాన్ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్ బెస్ట్ డాన్సర్ షోకు ఆమె గతంలో జడ్జిగా వ్యవహరించింది. ఇక అర్బాజ్ సోని లివ్ షో ప్రసారం చేయనున్న పొలిటికల్ డ్రామా తానావ్లో నటిస్తున్నాడు. -
'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?'
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న లెవర్ కప్ టోర్నీ ఫెదరర్‌కు ఆఖరిది కానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఫెదరర్ పూర్తిగా ఆటకు దూరమవ్వనున్నాడు. ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అతనిపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫెడ్డీ ఫోటోలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఫెదరర్ రిటైర్మెంట్పై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా కన్ఫూజ్ అయ్యాడు. ఫెదరర్‌కు విషెస్ చెబుతూ అతనికి బదులు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు.. నటుడు అర్బాజ్ ఖాన్ ఫోటో షేర్ చేశాడు. ''వి మిస్ యూ ఫెదరర్.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే హన్సల్ మెహతా కన్ఫూజ్ కావడానికి ఒక కారణం ఉంది. దూరం నుంచి చూస్తే ఫెదరర్, అర్బాజ్ ఖాన్లు ఒకేలా కనిపిస్తారు. దాదాపు ఇద్దరి ముఖాలు ఒకేలా కనిపిస్తాయి. అందుకే హన్సల్ మెహతా కన్ఫూజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక హన్సల్ మెహతా ట్వీట్‌పై అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''నాకు తెలిసి ఫెదరర్ గురించి ఇదే బెస్ట్ ట్వీట్.. ఫెదరర్‌కు, అర్బాజ్ ఖాన్‌కు తేడా తెలియడం లేదా.. '' అంటూ పేర్కొన్నారు. దర్శకుడు హన్స్ల్ మెహతా గురించి పరిచయం అక్కర్లేదు. స్కామ్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసింది ఈయనే. ఈ వెబ్ సిరీస్‌లో హర్షద్ మెహతా జీవిత చరిత్ర, షేర్ మార్కెట్లో లొసుగలు, మ్యాజిక్, జిమ్మిక్కులను హన్సల్ మెహతా తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. Going to miss you champion. #RogerFederer. pic.twitter.com/ZNmQaNROaD — Hansal Mehta (@mehtahansal) September 16, 2022 చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' -
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చిరాలేదా?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బ్రేకప్ కహానీలు ఎక్కువ. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ హీరోయిన్ మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో తమ్ముడు సోహైల్ ఖాన్ సైతం విడాకుల లిస్ట్‌లో చేరిపోయాడు. మరోవైపు ఎంతో మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయాడు. అటు చాన్నాళ్ల కిందటే పెళిళ్లు చేసుకున్న ఆయన తమ్ముళ్లు విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదేమో అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. చదవండి: విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్ -
భర్తతో విడాకులపై తొలిసారి నోరువిప్పిన హీరోయిన్
Malaika Arora Comments About Working As Single Mother: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ తాజాగా తన విడాకుల గురించి తొలిసారి నోరు విప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. సింగిల్ మదర్‌గా నా కొడుకును సరిగ్గా పెంచగలనా లేదా అని చాలాసార్లు ఆలోచించాను. తల్లిగా నీ బాధ్యతని ఎలా నిర్వహించబోతున్నావని ప్రపంచం మొత్తం నన్ను అడుగుతున్నట్లు అనిపించింది. ఈ ఆలోచనలన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రపంచం మొత్తం క్రాష్ అవుతున్నట్లు అనిపించేది. కానీ ఒకరోజు ముందడుగు వేసి నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం నేను సింగిల్ మదర్ని. అదే నన్ను ఇంకా బాధ్యతగా ఉండేలా చేస్తోంది. కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలైకా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మలైకా-అర్బాజ్‌లకు 1998లో వివాహం అయ్యింది. 19 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా.. అర్బాజ్ ఇటాలియన్ మోడల్‌తో రిలేషన్లో ఉన్నారు. -
పెళ్లి నా కెరీర్‌పై ప్రభావం చూపలేదు: నటి కామెంట్స్ వైరల్
Malaika Arora About Her Early Marraige And Motherhood: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ తాజాగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే 25ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బిడ్డను కనడం తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని మలైకా పేర్కొంది. గ్లామరస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఆ సమయంలో ఎదురైన అడ్డంకుల్ని అధిగమించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక చాలా తక్కువ మంది సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాగే నటనకు నేను గ్లామర్ ఇండస్ట్రీగానే భావిస్తాను. ఆ విధంగా గ్లామరస్‌గా ఉండేందుఎకు ప్రయత్నిస్తూనే అవకాశాలు సొంతం చేసుకున్నాను అని వెల్లడించింది. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
మాజీ భర్తతో ఎయిర్‌పోర్ట్‌లో మలైకా.. ఫోటోలు వైరల్
Malaika Arora Reunites With Ex Husband Arbaaz Khan Photo Viral: బాలీవుడ్ నటి మలైకా అరోరా, మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మాజీ భార్యభర్తలిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరి కుమారుడు అర్హాన్‌ను రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన అర్హాన్.. క్రిస్టమస్ సెలవుల సందర్భంగా ఇండియా వచ్చాడు. కుమారుడిని రిసీవ్ చేసుకోవడం కోసం మలైకా-అర్బాజ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. (చదవండి: ఎంతోసేపటిదాకా ఏడుస్తూనే ఉండిపోయా: హీరోయిన్) అర్హాన్ని చూసి మలైకా భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడిని కౌగిలించుకుని కంట తడిపెట్టారు. అర్బాజ్ కూడా అర్హాన్‌ను కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. వీరు ముగ్గురు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో కూడా ఓ సారి మలైకా మాజీ భర్త అర్బాజ్‌తో కలిసి కనిపించారు. అర్హాన్‌తో కలిసి మాజీ దంపతులిద్దరూ లంచ్ కోసం బయటకు వెళ్లారు. (చదవండి: మలైకతో అర్జున్ డేటింగ్, తన గతాన్ని గౌరవిస్తున్నాను) మలైకా-అర్బాజ్‌లకు 1998లో వివాహం అయ్యింది. 18 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కుమారుడు అర్హాన్ కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా.. అర్బాజ్ ఇటాలియన్ మోడల్‌తో రిలేషన్లో ఉన్నారు. చదవండి: రేర్ వీడియో: పార్టీలో సల్మాన్ సోదరుల జోష్, వీడియో వైరల్! -
‘సల్మాన్‌కు దుబాయ్‌లో భార్య, 17 ఏళ్ల కూతురు’.. నటుడి కామెంట్
అర్బాజ్ ఖాన్ తన టాక్ షో ‘పించ్’ కొత్త సీజన్ ద్వారా అలరించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్ నడుస్తోంది. దీని మొదటి ఎపిసోడ్ జూలై 21న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ షోలో సోషల్ మీడియాలో తమ మీద వచ్చినటువంటి ట్రోల్సింగ్స్ గురించి సెలబ్రిటీలు సమాధానం చెప్పడం మెయిన్ థీమ్.ఈ షోకు మొదటి అతిథిగా బాలీవుడ్ కండల వీరుడు, అర్బాజ్ ఖాన్ సోదరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్లూ భాయ్ తన వయసు, సినిమాలు, జీవితం మీద వచ్చిన గాసిప్స్‌పై స్పందించి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో గతంలో ఓ ట్విటర్ యూజర్ సల్మాన్‌కు దుబాయ్‌లో నూర్ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నిజమేనా అని ప్రశ్నించాడు. దీనిపై సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఈ జనాలకు సమాచారం బాగానే అందుతుంది. కానీ అసలివి నాకు సంబంధంలేని విషయాలు. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. దీనికి నేను సమాధానం చెప్పాలని వారు అనుకుంటున్నారా. నాకు భార్య లేదు, నేను హిందూస్తాన్, గెలాక్సీ అపార్టుమెంటులో నివసిస్తున్నాను. నా తండ్రి కూడా నా పై ఇంటిలో నివసిస్తున్నారు. ఇది భారత్‌లో అందరికీ తెలిసిన విషయం’. అని బదులిచ్చాడు. అలాగే మరో ట్వీట్‌ను అర్బాజ్ చదివి వినిపించాడు. అందులో సల్మాన్ నకిలీ వ్యక్తి అ అతను మంచివాడిలా నటిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ. అతనికి ఎక్కడో ఒక చెడు అనుభవం ఎదురై ఉండాలి. ఒకవేళ తన భార్య నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి లేదా తన కూతురు నా సినిమా చూపించాలని పట్టుబట్టి ఉంటారని సరదాగా సమాధానమిచ్చాడు. మరోవైపు హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌కు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనదైన యంకరింగ్తో భాయిజాన్ ఈ సీజన్‌కు షోను ఆసక్తిగా మలిచేందుకు సిద్ధమవుతున్నాడు. -
రేర్ వీడియో: పార్టీలో సల్మాన్ సోదరుల జోష్, వీడియో వైరల్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరులతో కలిస డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్, అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు డ్యాన్స్ చేస్తున్న ఈ రేర్ వీడియో చివరలోనే వారి బావ ఆయుష్ శర్మ కూడా వారితో కాలు కదిపాడు. ఎప్పుడు షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు కలిసి పార్టీలకు, కార్యక్రమాలకు హజరవడం అరుదు. ఈ నేపధ్యంలో గత 2018 క్రిస్మస్ వేడుకలో భాగంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట చేరి ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో ఈ సల్మాన్, అర్భాజ్, సోహైల్‌లు వారి బావతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఒక్కచోట ముగ్గురు అన్నదమ్ములను చూసి అభిమానులు, నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ ఇటీవల నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ మూవీ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈధ్ సందర్భంగా డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు కాంట్రవర్శీల్లో చిక్కుకుంది. విడుదలైన కొన్ని గంటల ముందే ఈ మూవీ ఆన్లైన్లో లీక్ అయ్యింది. ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన రాధేలో సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై ఎఫ్ఐఆర్
ముంబై: కరోనా వైరస్‌ను అరికట్టెందుకు మన ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికి కొందరు మాత్రం వాటిని లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను లెక్కచేయని వారిలో సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కూడా చేరారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారంటూ వారిపై ఓ వైద్యాధికారి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలో ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని మహా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సోహైల్ తనయుడు నిర్వాన్ ఖాన్లు గతేడాది డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లేక్క చేయకుండ ఆర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్‌లు నిబంధలను ఉల్లఘించడంతో ముగ్గురిపై ముంబై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్లాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ వారు నేరుగా ఇంటికి వెళ్లారని, కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్లో ఉండాలని చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని సదరు వైద్య అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘ఆ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు’
ముంబై: ‘దబాంగ్’ దర్శకుడు అభినవ్ కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తన సోదరుడు అర్బాజ్ ఖాన్లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ అభినవ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అర్భాజ్ స్పందిస్తూ... ‘నన్ను నా సోదరులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, మా తండ్రి సలీం ఖాన్‌లపై సోషల్ మీడియాలో కశ్యప్ తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడు. ఇక తనపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు. (సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ దర్శకుడు) 2013లో తన బేషారం చిత్రం విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారని కశ్యప్ చేసిన ఆరోపణపై ఆర్భాజ్ మాట్లాడుతూ... ‘‘అభినవ్ దర్శకత్వం వహించిన 2010 చిత్రం ‘దబాంగ్’లో నేను, సల్మాన్ నటించాం. ఆ తర్వాత ‘దబాంగ్-2’ నుంచి అభినవ్ తప్పుకున్నాడు. అప్పటీ నుంచి మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. వృత్తిపరంగా మేము విడిపోయాం. అయినా ఇలాంటి ఆరోపణలు అభినవ్ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అయితే త్వరలోనే మేము కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..) కాగా ఇటీవల కశ్యప్.. సల్మాన్ ఖాన్, తన సోదరులు నా కెరీర్‌ను నాశనం చేశారని, 2010 విడుదలైన ‘దబాంగ్’ సీక్వెల్‌ను కూడా తానే చేయాల్సి ఉండేదని, అయితే సల్మాన్ సోదరులు అర్బాజ్, సోహైల్‌లు ‘దబాంగ్ 2’ నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారన చెప్పాడు. వారు నా జీవితాన్ని నియంత్రించాలని చుశారన్నాడు. అంతేకాదు తను దర్శకుడిగా వ్వవహరించిన ‘బేషారం’చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారంటూ అభినవ్ ఫేస్బుక్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు) -
‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు బహిరంగంగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ పలు సంచలన ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ వేదికగా సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన అభినవ్ కశ్యప్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 2010లో సల్మాన్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దబాంగ్ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సీక్వెల్‌కు కూడా అతనే దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అందుకు సల్మాన్ సోదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌లే కారణం అని అభినవ్ తెలిపారు. వారు తనిని బెదిరించడం ద్వారా సల్మాన్ సోదరులు తన కెరీర్‌ను నియంత్రించాడనికి ప్రయత్నించారని దబాంగ్ దర్శకుడు ఆరోపించారు. తాను అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తన భవిష్యత్తును నాశనం చేసి సల్మాన్ ఖాన్ కుటుంబం ప్రతీకారం తీర్చుకున్నదని తెలిపారు. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) 2013లో అభినవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేషారం’. ఇదే అతడి ఆఖరి చిత్రం. ఈ చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారని అభినవ్ ఆరోపించాడు. ‘నా శత్రువులు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి గురించి అందరికి తెలియాలి. వారు సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్’ అని ఆరోపించారు. అంతేకాక వారు తనను బెదిరిస్తూ మెసేజ్‌లు కూడా చేశారని తెలిపాడు. ఈ సుదీర్ఘమైన ఫేస్బుక్ పోస్ట్‌లో అభినవ్ టాలెంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ హౌస్‌ల కుతంత్రాల గురించి వివరించారు. ‘వీరు తమ కంటూ ఓ కెరీర్‌ను ఏర్పర్చుకోరు. కానీ వారు మీ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తారు’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని తన పోస్టులో అభినవ్ ప్రభుత్వాన్ని కోరారు. (ముసుగులు తొలగించండి) -
విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..
అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకునే సమయంలో తాను కఠిన పరిస్థితులను ఎదుర్కోన్నానని బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పారు. ఇటీవల కరీనా కపూర్ టాక్ షోకు అతిథిగా వచ్చిన ఆమె తన విడాకుల విషయంపై మాట్లాడుతూ.. ‘నేను విడాకులు తీసుకోవడం సరైనది కాదని ప్రతి ఒక్కరూ హెచ్చరించేవారు. అలాగే నీ నిర్ణయానికి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి నువ్వు విడాకులు తీసుకోకపోవడమే మంచిది అని సూచించేవారు. విడాకులు తీసుకోవడానికి ముందు రోజు రాత్రి కూడా నా కుటుంబ సభ్యులు సైతం ‘నువ్వు డైవర్స్‌కు సిద్ధంగానే ఉన్నావా?’ అని అడిగారు’ అంటూ చెప్పుకొచ్చారు. (కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్ ఖాన్) ‘‘మనం తీసుకోనే ఓ నిర్ణయం మన జీవితాన్ని సులభంగా సాగిపోనివ్వదు. చివరికి కొంతమందితో నిందలు పడాల్సినా పరిస్థితులను తీసుకువస్తుంది. అయితే మన కోసం మనచూట్టూ ఉండేవారి కోసం ఇది సరైనదని భావించే నేను, అర్భాజ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు. అలాగే తన కుమారుడు అర్హాన్ ఎలా మీ ఈ నిర్ణయాన్ని అంగీకరించాడని అడగ్గా.. ‘‘ఏ తల్లైనా తన పిల్లలకు సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది. తన ముందున్న పరిస్థితుల వల్ల ఆ సమయంలో అర్హాన్ కూడా నన్ను సమర్ధించాడు. ఓ రోజు అర్హాన్ నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఎలా అనందంగా ఉంటావో అదే చేయి.. ఎందుకంటే నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను’’ అని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. కాగా మలైకా అరోరా, అర్భజ్ ఖాన్లు 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరి వైవివాహిక బంధంలో అభిప్రాయ భేధాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. బద్రాలోని ఫ్యామిలీ కోర్టులో 2017 మేలో ఈ వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినట్లు అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉండగా.. అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. -
కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్ ఖాన్
బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్ విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితిని మీడియాతో పంచుకున్నాడు. పిల్లలు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం కష్టమని, కానీ తప్పదని పేర్కొన్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మలైకా అరోరా, నేను విడిపోయే నాటికి నా కొడుకు అర్హాన్ వయసు 12 సంవత్సరాలు. ఇంట్లో రోజూ ఏం జరుగుతుందనేది వాడికి తెలుసు. వాడిది అర్థం చేసుకునే వయస్సు కాబట్టి విడాకుల గురించి వాడితో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం రాలేదు’ అని తెలిపాడు. అర్హాన్ తనకే దక్కాలని, పూర్తిగా తన దగ్గరే ఉండిపోవాలని ఎప్పుడూ పోరాడలేదని అర్బాజ్ చెప్పుకొచ్చాడు. పిల్లలకు తల్లి ఎంత అవసరమన్నది తనకు తెలుసని, అందుకే అర్హాన్ మలైకాతో ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదన్నాడు. అర్హాన్‌కు ఇంకో ఏడాది ఆగితే 18 సంవత్సరాలు వస్తాయని, అప్పుడు వాడికి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండవచ్చన్నాడు. కాగా అర్బాజ్‌ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. అభిప్రాయబేధాల వల్ల 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ 2017లో విడిపోయారు. ప్రస్తుతం మలైకా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం జరుపుతుండగా అర్బాజ్ ఖాన్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్లో ఉన్నారు. -
ఖాకీ వేస్తే పోలీస్... తీస్తే రౌడీ
‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ కిక్ ఇచ్చేలా ఉంది. ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్ మాస్ ఫిల్మ్. సౌత్ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్. ‘‘దబాంగ్ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా. -
‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’
విడాకులు తీసుకున్నంత మాత్రాన మేం ద్వేషించుకుంటున్నట్లు కాదు అంటున్నారు నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్. ఇప్పటికి తన మాజీ భార్య మలైకాతో, ఆమె కుటుంబ సభ్యులతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు అర్బాజ్. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మేమిద్దరం చాలా ఏళ్లు కలిసి జీవించాం. మా మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు. కాబట్టి ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండలేం అనుకున్నాం. కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయాం. దానర్థం మేం ఒకర్నొకరం ద్వేషించుకుంటున్నట్లు కాదు. ఇద్దరం హుందాగా పరిస్థితుల్ని చక్కదిద్దుకున్నాం. ఇప్పుడు కూడా మలైకా కుటుంబ సభ్యులతో నేను స్నేహంగానే ఉన్నా. పిల్లలు పెద్దయ్యే సరికీ అన్నీ చక్కబడతాయి. మా కుమారుడు అర్హాన్ మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’ అన్నాడు అర్బాజ్. అర్బాజ్, మలైకా 1998లో వివాహం చేసుకున్నారు. కానీ అభిప్రాయబేధాల వల్ల 2017లో విడిపోయారు. తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు అధికారికంగా వెల్లడించారు. ముందు చూపుతో ఆలోచించి, పరిస్థితులకు అనుగుణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మలైకా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అర్జున్ కూడా పరోక్షంగా ఒప్పుకొన్నారు. అర్బాజ్ కూడా ఇటలీకి చెందిన ఓ మోడల్‌ను ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. కానీ ఆమె పేరు బయటపెట్టలేదు. -
విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!
దంపతులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా తామెప్పుడూ కలిసే ఉంటామని బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ అన్నాడు. పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్ జంట మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ విడాకులు, కొత్త బంధాల గురించి అర్భాజ్ మాట్లాడుతూ... డైవోర్స్ తీసుకున్న తర్వాత కూడా మలైకా, ఆమె కుటుంబ సభ్యులతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ఇప్పటికీ తామిద్దరం స్నేహితులుగా మెలగడానికి తమ కుమారుడే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. విడిపోయినంత మాత్రాన మలైకాను ద్వేషించాలా? ‘ చాలా ఏళ్లపాటు మేము కలిసి ఉన్నాం. ప్రస్తుతం మలైకా, నేను ఒకే కప్పు కింద లేనప్పటికీ ఒకరి మంచి ఒకరం కోరుకుంటాం. అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. ఒకరినొకరు గౌరవించుకునే మానసిక పరిపక్వత మాకు ఉంది. నిజానికి ఇప్పటికీ మా మధ్య అనుబంధం కొనసాగడానికి అర్హానే కారణం. పెద్దవుతున్నా కొద్దీ వాడు మా గురించి పూర్తిగా అర్థం చేసుకుంటాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన మాజీ జీవిత భాగస్వామి పట్ల ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మలైకా, నేను సఖ్యతతో మెలుగుతూ మా జీవితాల్లో ముందుకు సాగుతున్నాం’ అని అర్భాజ్ వ్యాఖ్యానించాడు. కాగా మలైకా ప్రస్తుతం యువ నటుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్షిప్లో ఉండగా.. అర్భాజ్ ఓ ఇటాలియన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడు. ఇరు జంటలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూంటాయన్న సంగతి తెలిసిందే. -
‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నా..
‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నానని బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. చిత్ర పరిశ్రమలో నైపుణ్యం ఉన్న నటులు చాలా మంది ఉన్నారని.. కానీ వారికి ఇంకా పద్మశ్రీ రాలేదన్నారు సైఫ్. అర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పించ్ షోలో సైఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు చేసిన కామెంట్లను సైఫ్ గుర్తు చేసుకున్నారు. ‘తైమూర్ తండ్రి పద్మశ్రీ కొనుక్కున్నారు.. రెస్టారెంట్లో కొంత మందిని కొట్టారు.. ‘సేక్రేడ్ గేమ్స్’లో నటించే అవకాశం ఆయనకు ఎలా ఇచ్చారు.. ఆయనకు నటన రాదు.. అసలు ఆయన నవాబ్ ఏంటి’ అని నెటిజన్లు తనను కామెంట్ చేశారని సైఫ్ గుర్తు చేసుకున్నారు.ఈ విమర్శలపై సైఫ్ స్పందిస్తూ.. ‘పరిశ్రమలో నాకన్నా ఎంతో ప్రతిభ ఉన్న సీనియర్ నటులు ఎందరో ఉన్నారు. వారికి దక్కని పద్మశ్రీ నాకు రావడం పట్ల నేను కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాను. ఈ అవార్డును తీసుకోవాలని నేను అనుకోలేద’ని ఆయన తెలిపారు. అయితే ‘నటన, టాలెంట్‌లో నాకన్నా తక్కువ స్థాయిలో ఉండి అవార్డు అందుకున్న వారు కూడా ఉన్నారు కదా అనిపించింది. అయినా కూడా ఈ అవార్డును తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు. కానీ మా నాన్న ‘నువ్వు భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించకూడదు’ అని అన్నారు. దాంతో అవార్డును స్వీకరించాను. ప్రస్తుతానికి నా నటనను నేను ఆస్వాధిస్తున్నా. భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తా. చూద్దాం అప్పుడైనా జనాలు నన్ను చూసి.. ఈయన పద్మశ్రీకి అర్హుడు అంటారేమో’ అని సైఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాక జనాలు అనుకుంటున్నట్లు నవాబ్ అనే బిరుదు తనకు కూడా ఇష్టం ఉండదని.. కానీ కబాబులను మాత్రం చాలా ఇష్టంగా తింటాన’ని పేర్కొన్నారు సైఫ్. -
కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో!
‘కత్రినా.. నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్ ఇవ్వు’ .. ఇది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్. ఓ వెబ్ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్‌కు పాజిటివ్‌గా స్పందిస్తూ.. ‘ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోంది. ఈ రోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. నటుడు ఆర్బాజ్ ఖాన్ నిర్వహించే వెబ్ షో ‘పించ్’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా.. కత్రినా ఒకింత ఉద్వేగంగానే స్పందించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు. రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సింగిల్‌గానే ఉంటున్న ఆమె.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏమో ఐడియా లేదు. ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. జీవితం ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు’ అని బదులిచ్చారు. వైవాహిక వ్యవస్థపై నమ్మకముందా? అని ప్రశ్నించగా.. ‘ఒక వ్యక్తిగా నాకు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపారు. -
‘అన్న పేరుతో పైకి రాలేదు’
ముంబై : తన అన్న సూపర్ స్టార్ అయినా తనకు పాత్రలు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదని, తాను స్వయంకృషితో బాలీవుడ్లో ఈస్ధాయికి చేరుకున్నానని సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ అన్నారు. చాలామంది ఒకట్రెండు సినిమాలతోనే కనుమరుగవుతున్న రోజుల్లో తాను ఇప్పటివరకూ 70 సినిమాలు చేశానని, రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ర్టీలో కొనసాగుతున్నానని అర్బాజ్ చెప్పుకొచ్చారు. సల్మాన్ తమ్ముడిగా తనకు పని ఇచ్చేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని, సల్మాన్ వలన దర్శక, నిర్మాతలు ఒకట్రెండు సినిమాల్లో అవకాశం ఇస్తారని, నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటేనే ఫలితం ఉంటుందని చెప్పారు. తాను తన సొంత ప్రతిభతోనే ఎదిగానని, పరిశ్రమలో తన కాళ్లపై తాను నిలబడగలిగానని సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తాను పనిచేసుకుంటూ పోతానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాకు ఆదరణ పెరగనుందని, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. -
‘అలా చేస్తే మా నాన్న శ్రమను కించపర్చనట్లే’
బాలీవుడ్లో హీట్ రైజింగ్ టాపిక్ అంటే బంధుప్రీతి అనే చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కుదిరినప్పుడల్లా ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ బంధుప్రీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్ కార్యక్రమానికి హాజరయ్యారు సోనమ్ కపూర్. ఈ సందర్భంగా తనను విమర్శిస్తూ వచ్చిన ఓ ట్వీట్ గురించి మాట్లాడారు. ఎవరో ఓ వ్యక్తి ‘పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉంటున్నావ్.. ఇప్పటికి నీకు నటించడం రాద’ని విమర్శిస్తూ నెపోటిజమ్ అని హ్యాష్‌టాగ్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘పదేళ్ల నుంచి కాదు.. 11 ఏళ్ల నుంచి నేను పరిశ్రమలో ఉంటున్నాను. ఇంతకాలం నుంచి మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు.. అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. బంధుప్రీతి అనే పదానికి ఈ రోజు అసలైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. బంధుప్రీతి అనగానే అది ఓ వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఓ వ్యక్తితో ఉన్న సంబంధం వల్ల మీకు మంచి ఉపాధి దొరకడం. కానీ జనాలు తమ స్వలాభం కోసం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని.. అవతలివారిని కించపరుస్తున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘మా నాన్న ఓ ప్రముఖ కుటుంబం నుంచి రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నారు. ఇదంతా ఆయన కుటుంబం కోసం.. పిల్లల కోసమే చేస్తున్నారు. మా కోసం ఆయన పడిన శ్రమను మేం సరిగా వినియోగించుకోకపోతే.. ఆయన కష్టానికి మేము మర్యాద ఇవ్వనట్లే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది వారి పిల్లల కోసమే కదా’ అంటూ చెప్పుకొచ్చారు. సోనమ్ తొలిసారి తండ్రి అనీల్ కపూరతో కలిసి ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా లగా చిత్రంలో నటించారు. -
ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్-3’
ముంబై: సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రం షూటింగ్ ఆదివారం ఇండోర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు ప్రభుదేవాతో కలిసున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సల్లూని చూసి అభిమానులు ఈల వేయాల్సిందే. ఇక సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ముహూర్త క్లాప్నిచ్చే ఫోటోను పోస్ట్ చేస్తూ చుల్బుల్ పాండే (సల్మాన్) ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. తిరిగి జన్మస్థలానికి వచ్చేశాం అంటూ సల్మాన్ ఖాన్, అర్బజ్ ఖాన్ ఇండోర్‌లో ల్యాండ్ అయిన వీడియో క్లిప్‌ను సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సల్లూభాయ్ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా వీరి తాతగారు పోలీసుగా పని చేసిన ఆయా ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఈ మధ్యే ‘దబాంగ్ 3’ కోసం సల్మాన్ ఏస్ కొరియాగ్రాఫర్ సరోజ్‌ఖాన్‌ని కలిశారు. 2010లో అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో ‘దబాంగ్’ చిత్రం రాగా అది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అర్బజ్‌ఖాన్ దానికి సీక్వెల్‌గా ‘దబాంగ్ 2’ తీశాడు. అది కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రంతో రికార్డులు బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి. ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. -
‘సమాధానం రేపు చెప్పనా’
గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో మళ్లీ పెళ్లి వార్తల హవా ఎక్కువయ్యింది. మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్లు ఈ నెల 19న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో మలైకా, అర్జున్‌ల పెళ్లి గురించి అర్బాజ్ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. విలేకరుల సమావేశంలో భాగంగా ఓ జర్నలిస్ట్ అర్బాజ్ ఖాన్‌ను ‘వచ్చే నెలలో మీ మాజీ భార్య మలైకా అరోరా, అర్జున్ కపూర్లు వివాహం చేసుకోబోతున్నరటగా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే అర్బాజ్ ఖాన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. దాంతో అక్కడ ఉన్న విలేకరులు కూడా నవ్వడం ప్రారంభించారు. ఇదే ప్రశ్నను మరో సారి అడగ్గా అందుకు అర్బాజ్ ఖాన్ ‘ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా సమయం ఆలోచించే ఉంటారు కదా. నేను కూడా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి కాబట్టి.. రేపు చెప్పనా’ అంటూ ఆన్సర్ చెప్పకుండా దాటవేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవోతుంది. ఇదిలా ఉండగా మలైకా, అర్జున్ కపూర్లు ఈ నెల 19న వివాహం చేసుకోబోతున్నారని.. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం మలైకా బ్యాచిలరేట్ పార్టీలో భాగంగా స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram Repost @lnbolly Arbaaz reaction on Arjun and Malaikas marriage A post shared by instabollywoodfc (@lnstabollywoodfc) on Mar 28, 2019 at 11:38am PDT -
ఐపీఎల్ బెట్టింగ్: మరికొందరు బాలీవుడ్ స్టార్స్
ముంబై : ఐపీఎల్ బెట్టింగ్ విచారణలో భాగంగా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను విచారించిన పోలీసులుకు విస్తుపోయే విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సోను జలాన్ వాంగ్మూలంతో థానే పోలీసులు అర్భాజ్ ఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం ఈ రాకెట్‌తో సంబంధమున్న మరింత మంది పేర్లు పోలీసులకు తెలిసినట్లు జాతీయ మీడియా వర్గాలు కథనాలు ఉటంకిచాయి. పోలీసులకు అర్భాజ్ ఏడుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని, ఆ పేర్లు విని పోలీసులు షాకయ్యారని తెలుస్తోంది. ఇక సోను జలాన్ ను విచారించగా, కోమల్, గాయత్రి అనే ఇద్దరు బార్ డ్యాన్సర్లతో తాను సిండికేట్ అయి దందాను నడిపించినట్టు చెప్పడంతో, వారిని నేడో రేపో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. సోను జలాన్‌కు ఫోన్లో రికార్డు చేసే అలవాటుందని, అందులో భాగంగానే సెలబ్రిటీలతో మాట్లాడేవేళ, ఆ మాటలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడని, ఆపై వారిని బెదిరించేవాడని కూడా పోలీసులు తేల్చారు. సోనూ క్లయింట్లుగా హై ప్రొఫైల్ వ్యక్తులున్నారని, అర్బాజ్ ను కూడా బెదిరించే సోనూ తన సిండికేట్ లో చేర్చుకున్నాడని చెప్పారు. సోనూ క్లయింట్లుగా 1,200 మంది ఉన్నారని, ఈ సోనూ లాంటి వ్యక్తులను దేశవ్యాప్తంగా 100 మందిని ‘జూనియర్ కోల్‌కతా’ అనే వ్యక్తి నియమించుకున్నాడని తెలుస్తోంది. ‘జూనియర్ కోల్ కతా’ అండర్ వరల్డ్ డాన్ దావుద్ అనుచరుడని, బెట్టింగ్ రాకెట్ బయటకు రాగానే అతను దేశాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. మరికొందరిని విచారిస్తున్నామని, సోనూ జలన్ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరు చెప్పాడని, ఆయన్ను విచారించి స్టేట్ మెంట్ ను రికార్డు చేశామన్నారు. -
అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా!
థానె: గత ఐదారేళ్లుగా క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ అంగీకరించారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్–11వ సీజన్లో మాత్రం దాని జోలికిపోలేదని అన్నారు. ఈమధ్యే గుట్టురట్టయిన ఐపీఎల్ బెట్టింగ్ ముఠా కేసులో ఆయన శనివారం థానె పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడిన దావూద్ అనుచరుడు, బుకీ సోనూ జలన్ అరెస్టయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం పోలీసులు అర్బాజ్‌కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ వ్యవహారంలో మే 15న జలన్ సహా నలుగురు అరెస్టయ్యారు. సోనూను విచారిస్తుండగా జలన్‌తో అర్బాజ్ ఖాన్కున్న సంబంధం, బెట్టింగ్ వివరాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్‌లో జలన్కు రూ.2.80 కోట్లు కోల్పోయిన అర్బాజ్, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో జలన్ నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. అటు, బెట్టింగ్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు భాగస్వామ్యముందని పోలీసులకు జలన్ వెల్లడించారు. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని త్వరలోనే సమన్లు జారీచేస్తామని పోలీసులు తెలిపారు. ఆ నిర్మాత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సినీ నిర్మాణ, పంపిణీ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ వల్లే మలైకాతో విడాకులు! బెట్టింగ్ వ్యసనమే అర్బాజ్ వైవాహిక జీవితాన్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో పాల్గొనవద్దని భార్య మలైకా అరోరా ఎంత నచ్చజెప్పినా అర్బాజ్ పెడచెవిన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికే దెబ్బతిన్న వారి సంబంధాలు బెట్టింగ్ వల్ల మరింత క్షీణించాయని వెల్లడించాయి. సోదరులు సల్మాన్‌ఖాన్, సొహైల్ ఖాన్లు కూడా అర్బాజ్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిసింది. విడిపోతున్నామని 2016లోనే ప్రకటించిన అర్బాజ్–మలైకా దంపతులకు గతేడాది నవంబర్‌లో విడాకులు మంజూరయ్యాయి. తమ విడాకులపై వచ్చిన పలు కట్టుకథలను వారు ఖండించారు. విడిపోయిన తరువాత కూడా వారిద్దరు 15 ఏళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు. -
పోలీసులకు సహకరిస్తా: అర్బాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఝ‘పోలీసులు నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. ఈ కేసులో వారికి సహకరిస్తా’ అని తెలిపాడు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫొటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది. చదవండి: ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న సల్మాన్ సోదరుడు -
ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు విప్పిన సల్మాన్ సోదరుడు
-
ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న అర్భాజ్ ఖాన్
సాక్షి, ముంబై: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్(50) పేరు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసుల(ఏఈసీ) నుంచిసమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడంట. డైరీ ఆధారంగానే... ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్ చెల్లించకపోవటంతో జలన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారు’ అని శర్మ మీడియాకు వెల్లడించారు. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్ బుకీ జలన్తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన సీజన్లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వంద మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. అంతేందుకు ఈ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని సోనూ విచారణలో వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అయితే వారందరినీ విచారణ చేపడతారా? అన్న ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదు. ముంబై కమీషనర్ ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, మరో ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడటం గమనార్హం. స్పందించిన ఐపీఎల్ చైర్మన్... ‘ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలో ఉంది. ఐసీసీ-బీసీసీఐలకు అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులు ఆయా విభాగాలను సంప్రదించొచ్చు’ అని శుక్లా సూచించారు. -
ఐపీఎల్ బెట్టింగ్‌లో అర్బాజ్‌ఖాన్
ముంబై/థానే: 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసు విచారణలో భాగంగా లాగిన తీగతో భారీ క్రికెట్ బెట్టింగ్ డొంక కదిలింది. 2008 ఐపీఎల్ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులో దావూద్ అనుచరుడు, హైప్రొఫైల్ బుకీ సోనూ యోగేంద్ర జలన్‌ను అరెస్టు చేసి విచారించగా ఏటా ఐపీఎల్లో జరుగుతున్న బెట్టింగ్ వ్యవహారంతో పాటు తాజా సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయలు, భాగస్వాములైన బాలీవుడ్ ప్రముఖుల వివరాలూ వెల్లడయ్యాయి. గతవారం ముగిసిన 11వ సీజన్ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని ఇందులో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని సోనూ చెప్పాడు. ఈ సీజన్లో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ రూ.2.8 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అర్బాజ్ శనివారం విచారణకు రావాలంటూ థానే పోలీస్ బలవంతపు వసూళ్ల నిరోధక బృందం (ఏఈసీ) నోటీసులు పంపింది. అర్బాజ్‌ను బెట్టింగ్‌పై విచారించి అతని ఖాతాలు, లావాదేవీలను పరిశీలించనున్నారు. ‘బుకీల ద్వారానే అర్బాజ్ పెద్దమొత్తంలో డబ్బును బెట్టింగ్‌లో పెట్టారని తెలిసింది. అర్బాజ్ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అని ఈ కేసును విచారిస్తున్న ఏఈసీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ వెల్లడించారు. కాగా, బెట్టింగ్, పోలీసుల నోటీసులపై తనకు తెలియదని అర్బాజ్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. విచారణలో విస్తుపోయే అంశాలు ఓ ప్రైవేటు వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణ సందర్భంగా సోనూ తెలిపిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. అర్బాజ్ బెట్టింగ్‌కు పాల్పడ్డట్లు ఆధారాలతోపాటు.. అతని లావాదేవీల వివరాలనూ ఏఈసీ పోలీసులు సంపాదించారు. సల్మాన్ సోదరుడు దాదాపు రూ. 2.8కోట్లు కేవలం ఈ ఏడాది ఐపీఎల్ బెట్టింగ్‌లో నష్టపోయినట్లు తెలిసింది. అయితే.. ఈ రూ. 2.8 కోట్లను అర్బాజ్ ఇంకా చెల్లించలేదని తెలిసింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని అడుగుతున్నా అర్బాజ్ స్పందించడం లేదని.. దీంతో ఇరువురి మధ్య గొడవ జరుగుతోందని సోనూ పోలీసులకు తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో పేరును బయటకు చెబుతానని అర్బాజ్‌ను బెదిరించినట్లు కూడా సోనూ ఒప్పుకున్నారు. గతంలో 2 మ్యాచుల్లో అర్బాజ్ బెట్టింగ్ పెట్టాడని వెల్లడించాడు. ముంబై బుకీలకు దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలపైనా సోనూ కీలక సమాచారమిచ్చాడు. గతంలో ఐపీఎల్ కేసులో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడ్డారు. బెట్టింగ్ కింగ్ సోనూ! ముంబై సట్టా బజార్, గ్యాంబ్లింగ్ సర్కిల్స్‌లో సోనూ పేరు తెలియని వారుండరు. ఇతనికి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా,దక్షిణాఫ్రికా ఇతర దేశాల్లోనూ క్లయింట్లు ఉన్నారు. ‘బెట్ అండ్ టేక్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దీని ద్వారా ఐపీఎల్‌తోపాటు భారత్‌లో, విదేశాల్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను నడిపిస్తున్నాడు. 2016లో శ్రీలంక–ఆస్ట్రేలియా మధ్య శ్రీలంకలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌ను సోనూ ఫిక్స్ (క్యురేటర్ సాయంతో) చేసినట్లు ఆధారాలు దొరికాయి. అర్బాజ్‌తో తన సాన్నిహిత్యాన్ని తెలుపుతూ పలు చిత్రాలను సోనూ పోలీసులకిచ్చాడు. సోనూ వద్ద స్వాధీనం చేసుకున్న డైరీలో బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, షేర్‌మార్కెట్ పెట్టుబడిదారులు, 100 మంది బుకీల వివరాలున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సోనూ సహా ఆరుగురు బుకీలను అరెస్టు చేశారు. థానే జిల్లా డోంబివలీలోని ఓ హోటల్ నుంచి మే 15న మరో ముగ్గురిని బెట్టింగ్ కేసులో ఏఈసీ బృందం అరెస్టు చేసింది. వీరిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో వీరికి సాయం చేసేందుకు వచ్చిన సోనూను పోలీసులు వలపన్ని అరెస్టు చేయటం, విచారణ జరపడంతో తాజా ఐపీఎల్ బెట్టింగ్‌పై కొత్త అంశాలు బయటికొచ్చాయి. సోనూ∙నుంచి సేకరించిన సమాచారంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఒకరున్నట్లు తెలుస్తున్నప్పటికీ అది ఎవరనే విషయం బయటకు తెలియడంలేదు. సోనూ టర్నోవర్ ఏడాదికి రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ సోదరుడు!
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు సమన్లు అందిన విషయం తెలిసిందే. బుకీల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. విచారణకు హాజరు కావాలని అర్భాజ్‌కు థాణే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పట్టుబడ్డ బుకీ సోనూ జలాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే టైమ్స్‌నౌ చానెల్ తెలిపిన వివరాల ప్రకారం అర్బాజ్‌ఖాన్ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు పోగట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు మూడు కోట్ల రూపాయలను అర్బాజ్‌ఖాన్ పోగొట్టుకున్నాడని, ఈ డబ్బులు సోనూ జలన్కు ఇవ్వక పోవడంతో అతను బ్లాక్ మెయిల్‌కు దిగినట్లు, అయినా అర్బాజ్‌ఖాన్ స్పందించకపోవడంతో అతని పేరు బయట పెట్టినట్లు తెలుస్తోంది. అర్బాజ్‌ఖాన్ తనకు తెలసిన వ్యక్తులతో ఈ ఐపీఎల్లో రెండు మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్లు జలాన్ పోలీసు విచారణలో వెల్లడించాడని టైమ్స్ నౌ పేర్కొంది. జలాన్‌కు అండర్ వరల్డ్ డాన్ దావుద్‌తో సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 16న ముంబైలోని డొంబీవిలీలో నలుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేయగా.. కల్యాణ్ సెషన్స్‌కోర్టు పరిసరాల్లో సోను జాలాన్ను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కేంద్రంగా బెట్టింగ్‌లకు పాల్పడిన దావుద్ ముఠాలోని అనిల్ తుండా, రయిస్ ఫరుఖీలతో జాలాన్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవాడు. బెట్టింగ్ వివరాలన్ని జలాన్ డైరీలో పుసగుచ్చినట్టు రాసుకున్నాడు. ఈ డైరీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లతో ఏం చేయలేరు.. బెట్టింగ్‌లు క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపవని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు. బాలీవుడ్ స్టార్స్ అయినా, బుకీలు నేరుగా క్రికెటర్లను సంప్రదించినా క్రికెట్‌కు ఏం కాదన్నారు. జూదం చట్టరీత్యా నేరమని పేర్కొన్నాడు. -
బెట్టింగ్ స్కాం ఆరోపణలు సల్మాన్ ఖాన్ సోదరుడికి సమన్లు
-
బెట్టింగ్ స్కాం : సల్మాన్ ఖాన్ సోదరుడికి సమన్లు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు సమన్లు అందాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. థాణే పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని అర్బాజ్ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిందని సదరు రిపోర్టులో పేర్కొన్నారు. టాప్ బుకీల ద్వారా అర్బాజ్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు దొరికిన సోనూ జలాన్ అనే బుకీ విచారణలో అర్బాజ్ పేరును బయటపెట్టినట్లు సమాచారం. కాగా, శనివారం విచారణకు అర్బాజ్ హాజరుకావాల్సివుంది. -
దబాంగ్ 3 డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలలో దబాంగ్‌ది ప్రత్యేక స్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సల్మాన్‌కి మంచి విజయాన్ని అందించింది. తాజాగా దబాంగ్ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా విశేషాలపై ఆసక్తి నెలకొంది. ఈ సీరిస్‌లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి. దబాంగ్, దబాంగ్ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ రెండింటిని నిర్మించిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దబాంగ్‌కు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, దబాంగ్ 2 కి అర్భాజ్ ఖాన్ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు ఎవరనేది తెలుసుకోవడానికి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటికి ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా తెరదించారు. ఈ సినిమాకు తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రెండు సినిమాలకు పనిచేసిన హీరోయిన్ సోనాక్షి, మ్యూజిక్ అందించిన సాజిద్-వాజిద్లతో పాటు, ఇతర బృందం అంత పాతదే ఉంటుందని, తాను ఒక్కన్ని మాత్రమే కొత్తగా చేరుతున్నానని తెలిపారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారు. సినిమా హిట్, ప్లాఫ్ అనేది హీరో భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, కానీ సల్మాన్‌కి వాటితో ఏ మాత్రం సంబంధం లేని సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుదేవా సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మహేశ్‌బాబు నటించిన తెలుగు మూవీ పోకిరి రిమేక్. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంతో, దబాంగ్ 3పై అంచనాలు మరింతగా పెరగనున్నాయి. -
మాజీ భర్త సొమ్ముతో జల్సాలా.. నటిపై విషం!
నెటిజన్‌కు దీటుగా బదులిచ్చిన మలైక బాలీవుడ్ దంపతులు మలైకా అరోరా-అర్భాజ్‌ఖాన్ తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోవడంపై సోషల్ మీడియాలో చాలా విమర్శలే వచ్చాయి. సెలబ్రిటీ కావడంతో మలైకాకు ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఆగడం లేదు. అడపాదడపా పనిలేనివారు ఆమెపై నోరుపారేసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ ఆమెపై విషం చిమ్మాడు. మాజీ భర్త భరణంగా ఇచ్చిన డబ్బుతో ఆమె ఎంజాయ్ చేస్తున్నదని విమర్శించాడు. అతని విమర్శలకు ఏమాత్రం తన హుందాతనం తగ్గకుండా దీటైన సమాధానం ఇచ్చింది మలైకా.. మొదట 'ఫీల్గుడ్ఫ్యాబ్రిక్' పేరిట ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మలైకాపై విద్వేషపూరిత పోస్టు పెట్టారు. 'ఈ రోజుల్లో కొందరు మహిళలు చేస్తున్న పని ఇదే. సంపన్నుడిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత పెద్దమొత్తంలో భరణం కోసం విడాకులు ఇవ్వడం.. అలా వచ్చిన సొమ్ముతో జల్సా చేయడం.. మీకు సంపాదించే శక్తి ఉన్నప్పుడు ఎందుకు భరణాన్ని తీసుకుంటారు... లింగబేధాలకు అతీతంగా నేను వ్యక్తులను గౌరవిస్తాను. ఆమె జీవితం ఇప్పుడు పొట్టి దుస్తులు ధరించడం, జిమ్‌లకు, సెలూన్లకు వెళ్లడం, విహారాల్లో ఎంజాయ్ చేయడం దీనికి పరిమితమైంది. ఆమెకు ఏదైనా సీరియస్ వర్క్ ఉందా? లేక భర్త ఇచ్చిన సొమ్మును(భరణాన్ని) కరిగిస్తోందా' అని కామెంట్ పెట్టాడు. ఆ నెటిజన్ కామెంట్‌పై మలైకా స్పందిస్తూ.. 'ఇలాంటి సంభాషణల్లోకి నేను దిగాను. ఇది నా హుందాతనాన్ని తగ్గిస్తుంది. అయినా, నేను నీకు సమాధానమిస్తున్నాను. నా మీద విషం చిమ్మే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. నా గురించి తెలియకుండా విమర్శలు చేయకు. తాపీగా కూర్చుని ఇతరుల జీవితాలపై జడ్జీమెంట్ ఇచ్చేముందు నీ సమయాన్ని ఏదైనా పనిచేసేందుకు వినియోగించు. అది నీకు పనికివస్తుంది' అని మలైకా హితవు పలికింది. -
బాలీవుడ్ జంటకు విడాకులు మంజూరు
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాలు 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట గత నవంబర్ నెలలో తొలిసారిగా కోర్టు మెట్లెక్కింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన అర్బాజ్, మలైకాలకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరి విడాకుల పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్బాజ్, మలైకాల వివాహం 1998లో జరిగింది. వీరికి 14 ఏళ్ల ఓ కొడుకు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా గతేడాది తాము విడిపోవాలనుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధం ముగిసినట్లు తీర్పిచ్చింది. బాబు సంరక్షణ బాధ్యతలను మలైకాకు అప్పగించగా.. బాబును కలిసి అతడితో సమయం వెచ్చించేందుకు అర్బాజ్ ను ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన వీరిద్దరూ కలిసి ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అంతా సద్దుమణిగిందని పొరపడ్డారు. స్నేహితులతో కలిసి గోవాలో వీరు న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేశారు. సల్మాన్ ఇంట్లో ప్రతి వేడుకకు మలైకా ఆరోరా రావడంతో విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావించారు. కానీ తమ కుమారుడి సంతోషం కోసమే ఈ సందిగ్ద కాలంలోనూ వారు కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా చనువుగా ఉండటమూ వీరి బంధానికి ముగింపు పలికేలా చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
విడాకులన్నారు... విందు చేసుకున్నారు!
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా జంట అభిమానులను సందిగ్దంలో పడేసింది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన వీరిద్దరూ కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. స్నేహితులతో కలిసి గోవాలో వీరు న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మలైకా సోదరి అమృత అరోరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అర్బాజ్, మలైకా ఎంతో కలివిడిగా పార్టీలో కనిపించారు. అందరితో కలిసి విందును ఆస్వాదించారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ వేడుకల్లో కనిపించడంతో మళ్లీ కలిసిపోయారన్న ప్రచారం మొదలైంది. ఇద్దరికీవున్న కామన్ ఫ్రెండ్స్ కారణంగా పార్టీకి వచ్చారా, నిజంగానే కలిసిపోయారా అన్నది మున్ముందు తెలుస్తుంది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వీరిద్దరికీ గత నవంబర్ లో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ నిర్వహించింది. దీంతో వీరిద్దరిలో మార్పు వచ్చివుండొచ్చని సన్నిహితులు అంటున్నారు. -
బాలీవుడ్‌కు విడాకుల నామ సంవత్సరం!
మరో నాలుగు రోజుల్లో గడిచిపోనున్న ఈ ఏడాది సినీ సెలబ్రిటీలకు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. లవర్స్ మాత్రమే కాదు దశాబ్దానికి పైగా వైవాహిక జీవితం అనంతరం కొన్ని జంటలు విడాకులు తీసుకున్నాయి. అందుకే ఈ 2016 ఏడాదిని బ్రేకప్ నామ సంవత్సరంగా భావించవచ్చు. ఫిల్మ్ మేకర్, నటుడు ఫర్హాన్ అక్తర్, అధునా అఖ్తర్ మొదలుకుని కరిష్మాకపూర్, సంజయ్ కపూర్ వరకు ఎన్నో జంటలు విడిపోయాయి. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ బ్రేకప్ వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మరికొన్ని ప్రేమ జంటలు ఇప్పటికీ తమ రిలేషన్ కొనసాగిస్తున్నాయి. కరిష్మాకపూర్- సంజయ్ కపూర్ బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి కరిష్మాకపూర్ వ్యాపావేత్త సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకుంది. గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన ఈ జంట.. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. చివరికి ఈ ఏడాది జూన్‌లో ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఫర్హన్ అక్తర్-అధునా అఖ్తర్ బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, ఆయన భార్య అధునా అఖ్తర్ తాము విడిపోతున్నట్టు గత జనవరిలో ప్రకటించారు. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ఓ మీడియా సంస్థకు చెప్పారు. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట బాలీవుడ్లోనే మోస్ట్ స్టైలిష్ జంటగా పేరొందింది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే విడిపోతున్నామని ఇద్దరు ప్రకటించారు. అర్బాజ్ ఖాన్-మలైకా అరోరా బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం త్వరలో ముగియనుంది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని గత మార్చిలో నిర్ణయించుకున్న ఈ జంట గత నెలలో బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. 1997లో వివాహం చేసుకున్న వీరికి సంతానం అర్హాన్(14) ఉన్నాడు. పులకిత్ సామ్రాట్-శ్వేతా రోహిరా మనస్పర్ధల కారణంగా మరో బాలీవుడ్ జంట పులకిత్ సామ్రాట్-శ్వేతా రోహిరా విడిపోయారు. ఫక్రీ ఫేమ్ పుల్కిత్ సామ్రాట్, శ్వేతా రోహిరాలు ప్రేమించుకుని 2014లో వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. సనమ్ రే, జనోనియత్ మూవీలలో పుల్కిత్ కో స్టార్ యామీ గౌతమ్ తో సాన్నిహిత్యం పెరగడం వీరి విడాకులకు దారితీసింది. శ్వేతా రోహిరా మాత్రం ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. పెళ్లయిన ఏడాది తర్వాత నుంచి వివాదం మొదలై చివరికి రెండేళ్ల కాలంలోనే పుల్కిత్, శ్వేతా తమ బంధాన్ని వదులుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-అంకితా భారత క్రికెటర్ ధోనీ కథాంశంతో తీసిన 'ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' మూవీలో ధోనీగా అలరించి ప్రేక్షకులలో స్థానం సంపాదించుకున్న నటుడు సుశాంత్. బుల్లితెర నటి అంకితా లొంఖాడే, సుశాంత్ ప్రేమికులుగా బాలీవుడ్ లో అందరికీ తెలుసు. అయితే సుశాంత్ తాగి గొడవ చేయడంతో అంకితా మనసు నొచ్చుకుందని, కృతిసనన్ తో లింక్ పెట్టి అంకితా తనను అనుమానించడంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. గత జనవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, మనస్పర్థల కారణంగా కొన్ని నెలల కింద ఈ ప్రేమ జంట విడిపోయింది. -
కిడ్నాపర్‌గా రాజ్‌తరుణ్
-
కిడ్నాపర్‌గా రాజ్‌తరుణ్
టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. సోలో సినిమాలతో పాటు మల్టీ స్టారర్లతోనూ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరోసారి తన మార్క్ కామెడీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కిడ్నాపర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే మనుషులు కిడ్నాపర్‌గా కాదు. కుక్కల కిడ్నాపర్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో తను మనుషులను కాకుండా కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో క్లియర్‌గా వివరించాడు హీరో. రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
కోర్టుకు హాజరైన బాలీవుడ్ జంట
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. అర్బాజ్, మలైకా 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉందని, దీంతో అర్బాజ్‌తో విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్టు గత మార్చిలో ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత మలైకా, అర్బాజ్ కలసిఉండేలా ఇరు కుటుంబాలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ నిన్న కోర్టుకు వచ్చారు. మ్యారేజి కౌన్సిలింగ్‌కు కలసి వచ్చిన ఇద్దరూ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత కోర్టు ఆరు నెలల సమయం ఇస్తుంది. అప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకుంటే విడాకులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మలైకా అర్బాజ్‌కు దూరంగా ఉంటోంది. -
పెదవి విప్పిన మలైకా అరోరా!
‘కెవ్వుకేక’ అంటూ గబ్బర్‌సింగ్‌లో ఐటెం సాంగ్‌తో అలరించిన మలైకా అరోరా వైవాహిక జీవితం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యువహీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉండటం వల్లే ఆమె వైవాహిక బంధం బీటలు వారిందని కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు మలైకా, అర్బాజ్‌ఖాన్ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ దంపతులు సామరస్యంగా విడిపోవాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తుండుగా.. సల్మాన్ ఖాన్ కుటుంబం మాత్రం వీరిని కలిపి ఉంచేందుకే ప్రయత్నిస్తున్నట్టు వినిపిస్తోంది. ఆ మధ్య వీడిపోయి కొన్నిరోజులు వేరువేరుగా ఉన్న మలైకా, అర్బాజ్ మళ్లీ కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. అర్జున్ కపూర్‌తో మలైకా సన్నిహితంగా ఉండటం నచ్చకపోవడం వల్లే ఆమె నుంచి విడిపోవాలని అర్బాజ్ భావిస్తున్నాడట. అర్జున్, మలైకా గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చినా ఇంతవరకు ఆ ఇద్దరూ ఈ విషయమై మాటమాత్రమైనా స్పందించలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలనూ తోసిపుచ్చారు. ఈ విషయం మీద స్పందిస్తే మీడియా మరింత దారుణంగా చిత్రిస్తుందేమోనని వెనుకాడరు. కానీ ఇప్పుడు అర్జున్ కపూర్ విషయమై తొలిసారి మలైకా అరోరా స్పందించారు. ‘అర్జున్ నాకు చాలామంచి స్నేహితుడు. కానీ ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. అది నిజం కాదు’ అని మీడియాకు చెప్పారు. మొత్తానికి మలైకా, అర్బాజ్ దంపతులు కోర్టులో విడాకులకు దాఖలుచేసినా వారికి ఇంకా ఆరు నెలల సమయముంది. ఈలోపు మళ్లీ ఈ దంపతులు కలిసిపోతే బాగుండు అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఇటు మలైకా, అటు అర్బాజ్ వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం వల్లే వారి మధ్య ఈ బ్రేకప్‌కు కారణమైందని రుమర్లు వినిపిస్తున్నాయి. -
విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్ జంట!
ముంబై: విభేదాల కారణంగా విడిపోయారని, కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక్కటయ్యారంటూ వార్తల్లో నిలిచిన బాలీవుడ్ జంట మలైకా అరోరా ఖాన్, అర్బాజ్ ఖాన్ వ్యవహారం చివరకు కోర్టుకు చేరింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ (49), మలైకా (43) పరస్పర అంగీకారంతో విడాకుల కోసం గతవారం కోర్టును సంప్రదించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గత మార్చిలో విడిపోతున్నామంటూ ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు కుటుంబాల సభ్యుల జోక్యంతో ఈ జోడీ అప్పట్లో కోర్టు వరకు వెళ్లలేదు. వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అర్బాజ్, మలైకా డిన్నర్, పార్టీలకు హాజరవడంతో మళ్లీ కలసిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ విడిపోవాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 1998లో అర్బాజ్, మలైకా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. అర్బాజ్, మలైకా పలు సినిమాల్లో నటించారు. -
ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు?
ముంబై: తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. తన భార్య మలైకా అరోరా స్నేహితురాలు యెల్లో మెహ్రాతో తాను సన్నిహితంగా ఉంటున్నట్టు ఇచ్చిన వార్తలను అతడు తోసిపుచ్చాడు. తన సినిమాల గురించి అడిగేందుకు అందరికీ అర్హత ఉందని, వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్బాజ్ ఖాన్ అన్నాడు. 'నా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్టు రూమర్లు రాశారు. మమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి సరిపోయింది. దీని ద్వారా కొంతవరకు మా వెర్షన్ వినిపించగలిగాం. యెల్లో మెహ్రా నాకు స్నేహితురాలు మాత్రమే. ఆమెతో కలిసి ఫొటో దిగితే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేస్తారా? నేను 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు తీసుకుంటే వారందరితో కూడా సంబంధం అంటగడతారా? స్నేహితులతో సంతోషంగా ఫొటో దిగే హక్కు నాకు లేదా? మెహ్రా స్నేహితుడిగా ఆమెను ప్రమోట్ చేసేందుకు, అండగా నిలిచేందుకే ఫొటో తీసుకున్నాను. మా స్నేహాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు రాశారు. ఒకవేళ మెహ్రాతో నాకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే ఆమెతో దిగిన ఫోటోలను ఎందుకు బయటపెడతాన'ని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. తెలుగులో వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో అతడు నటిస్తున్నాడు. 'జై చిరంజీవి' తర్వాత అర్బాజ్ ఖాన్ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. -
వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా?
ముంబై: బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడిపోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. తామిద్దరూ విడిపోతున్నట్టు మలైకా, అర్బాజ్ ప్రకటించారు కూడా. మలైకా తన కొడుకును తీసుకుని అర్బాజ్ ఇంటి నుంచి అమ్మనాన్నల దగ్గరకు వెళ్లిపోయింది. కాగా ఇటీవల అర్బాజ్, మలైకా ఓ లేట్ నైట్ డిన్నర్లో కనిపించి షాకిచ్చారు. అర్బాజ్.. మలైకా కుటుంబంతో కలసి బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. వీళ్ల వెంట మలైకా తల్లి జాయ్సె, సోదరి అమృతా అరోరా, షకీల్ లడక్ దంపతులు ఉన్నారు. రెస్టారెంట్లో అర్బాజ్, మలైకా చాలాసేపు గడిపారట. అయితే డిన్నర్ అయ్యాక వీళ్లిద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. అమృత, షకీల్.. అర్బాజ్‌తో కలసి వెళ్లగా, మలైకా మరో కారులో వెళ్లింది. మలైకా, అర్బాజ్ 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో విడిపోతామని ప్రకటించిన ఈ జంట విడాకుల వరకు వెళ్లకుండా రాజీపడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మనసు మార్చుకున్న మలైకా.. వివాహబంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్!
17 ఏళ్లు ఆనందంగా కొనసాగిన వైవాహిక జీవితం వారిది. కొన్ని నెలల కిందటే వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తాము విడిపోయామని బాలీవుడ్ దంపతులు ఆర్బాజ్ ఖాన్, మలైకా ఆరోరా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వేరువేరుగా ఉంటున్న ఈ జంట మళ్లీ రాజీ కుదుర్చుకొని కలిసిపోయే దిశగా ముందుకుసాగుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం (ఆగస్టు 4న) ఆర్బాజ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో మలైకా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పింది. ఆనందం ఎప్పుడూ ఆర్బాజ్ వెంటే ఉండాలని కోరుకుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆర్బాజ్తో కలిసి తాను కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఒకదానిని పోస్టు చేసింది. ఆర్బాజ్ ఖాన్-మలైకా ఆరోరా దంపతులకు 13 ఏళ్ల కొడుకు ఆర్హాన్ ఉన్నాడు. గతంలో వేరయిన ఈ ఇద్దరిని మళ్లీ కలిపేందుకు కుటుంబపరంగా అడుగుల పడుతున్నట్టు తెలుస్తోంది. రంజాన్ ఈద్ సందర్భంగా ఆర్బాజ్ కుటుంబంతో మలైకా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోలోనూ కనిపించింది. తాజాగా ఆర్బాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో బీటలువారిన వీరి వైవాహిక బంధం మళ్లీ నిలపుకొనేందుకు దంపతులు ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని సన్నిహితులు చెప్తున్నారు. -
ఆ వదంతులు నిజమే: సన్నీ లియోన్
ముంబయి: తనపై ఇటీవల వస్తున్న వదంతులపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చాలా సంతోషంగా ఉంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తో కలిసి సన్నీ నటించనుందని రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఆ వదంతులు నిజమేనని సన్నీ చెప్పింది. తన నెక్ట్స్ ప్రాజెక్టులో అర్బాజ్ ఖాన్ తో కలిసి నటిస్తున్నానని, ఆ పేరు తేరా ఇంతేజార్ అని వివరించింది. అతడితో కలిసి నటించనున్నందుకు తనకు చాలా ఉత్సాహంగా ఉందని అంటోంది. జీవితం ఎలా సాగుతుందో చెప్పలేమని, ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుందని సన్నీ లియోన్ వేదాంతం వల్లిస్తోంది. బాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని, ఆ నటులకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం అవుతుందని అభిప్రాయపడింది. రాజీవ్ వాలియా ఈ మూవీతో కొత్త దర్శకుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. వన్ నైట్ స్టాండ్, మస్తిజాడే మూవీలతో ఇటీవల సన్నీ మరింత జోష్ మీదున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెతో బాలీవుడ్ బాద్షా షారుక్ నటించగా, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఇప్పటికే సన్నీతో మూవీకి తానెప్పుడూ సిద్ధమేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీవితంలో ఎన్నో మలుపులు ఎదురవుతున్నాయని అవి తనకు సంతోషాన్ని ఇస్తున్నాయని సన్నీ పేర్కొంది. -
మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారు?
విడిపోతున్నామంటూ ప్రకటించిన బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాలు మనసు మార్చుకున్నారా? మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారా? అంటే బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. విడాకులు తీసుకునే విషయంలో అర్బాజ్, మలైకా పునరాలోచనలోపడ్డారని, కలసి జీవించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మలైకాతో కలసి జీవించడానికి అర్బాజ్ మొదట్నుంచి ఇష్టంగానే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే విబేధాల కారణంగా మలైకా అతనికి దూరమైంది. విడాకులు తీసుకోబోతున్నట్టు ఇటీవల ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. మలైకా తన పేరు చివరను ఖాన్ అన్న పదాన్ని కూడా తొలిగించింది. అయితే విడాకుల వరకు వెళ్లకుండా ఇద్దరూ రాజీపడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అర్బాజ్‌తో వివాహ బంధాన్ని కొనసాగించాలని మలైకాకు ఆమె తల్లి జాయ్సె, సోదరి, నటి అమృతా నచ్చచెప్పినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మనసు మార్చుకున్న మలైకా.. వివాహబంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆమె త్వరలోనే అర్బాజ్ ఇంటికి వెళ్లనున్నట్టు సమాచారం. -
విడిపోయిన భార్యకు ఓ సందేశం!!
17 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ చెరో దారి చూసుకున్నారు బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా. బాలీవుడ్లో అన్యోన్యమైన దంపతులుగా పేరొందిన వీరు గత ఏప్రిల్‌లో వేరయ్యారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా మగ్గుతున్న అర్బాజ్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ తాత్వికమైన వ్యాఖ్య పోస్టు చేశాడు. 'కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు వెనుదిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది నీకే అర్థమవుతుంది' అంటూ ఓ తాత్వికమైన సందేశాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. భార్యతో వీడిపోయిన బాధలో ఆయన కామెంట్ పెట్టి ఉంటారని అభిమానులు భావించారు. 'మీ మాటల వెనుక దాగున్న బాధను మేం అర్థం చేసుకోగలం.. మక్కీ భయ్యా మేం మీ వెంట ఉన్నాం' అంటూ ఓ అభిమాని ఈ పోస్టుపై కామెంట్ చేశాడు. ఇంతటి తాత్వికమైన కామెంట్‌ను సడన్‌గా అర్బాజ్ పోస్టు చేయడం వెనుక స్పష్టమైన కారణాలు బయటకు తెలియనప్పటికీ, భార్య మలైకతో ఇటీవల బ్రేకప్ అయిన నేపథ్యంలోనే దీనిని పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. తాము వీడిపోతున్నామని ఈ జంట సంయుక్తంగా గత ఏప్రిల్ నెలలో సంయుక్తంగా ఓ ప్రకటన చేసింది. మలైక లైఫ్‌స్టైల్ అర్బాజ్ కుటుంబానికి నచ్చకపోవడం, మలైకకు ఓ వ్యాపారవేత్తతో ఎఫైర్ ఉందని వదంతులు రావడం తదితర పరిణామాల వల్లే వీరి వైవాహిక బంధానికి బీటలు పడినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్-3' దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. 'దబాంగ్' సీరిస్ సినిమాలకు అతను గతంలో నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
'అవును మేమిద్దరూ విడిపోతున్నాం'
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విడిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 'అవును, మేమిద్దరమూ విడిపోతున్నాం' అంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అర్బాజ్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించింది. అర్బాజ్‌తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరింది. మలైకా, అర్బాజ్ విడిపోవడానికి పలు కారణాలున్నట్టు సమాచారం. మలైకా లైఫ్ స్టయిల్ ఖాన్ ఫ్యామిలీకి నచ్చలేదని, ఓ బిజినెస్‌మన్‌తో ఆమెకు ఎఫైర్ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిని మలైకా, అర్బాజ్ తోసిపుచ్చారు. తమపై వచ్చే రూమర్లను నమ్మవద్దని విన్నవించారు. -
విడాకుల కోసం లాయర్‌ను కలసిన నటి
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగింపు దశకు వచ్చింది.? అర్బాజ్‌తో విడాకులు తీసుకోవాలని మలైకా నిర్ణయించినట్టు సమాచారం. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. ఇటీవల ఓ ఫంక్షన్లో అర్బాజ్, మలైకా కనిపించడంతో ఈ జంట రాజీపడ్డారని బాలీవుడ్ వర్గాలు భావించాయి. అయితే సల్మాన్ రాజీ ప్రయత్నాలు ఫలించలేదని, అర్బాజ్‌తో కలసి జీవించేందుకు మలైకా సుముఖంగా లేదని తెలుస్తోంది. అర్బాజ్‌తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరుతోంది. వివాహ బంధం తనకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వలేదని, అర్బాజ్ కుటుంబం తాను గృహిణిగా ఉండాలని భావిస్తోందని, ఇది తనకు ఇష్టంలేదని మలైకా చెప్పినట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. మలైకా ఇంకా విడాకులకు దరఖాస్తు చేయకున్నా, ఏ రోజైనా నోటీసులు పంపే అవకాశముందని సమాచారం. -
విడాకుల బాటలో మలైకా అరోరా?
హిందీ సినీ గీతాల్లో ఇటీవల మాస్ నోట పదే పదే వినిపిస్తున్న గీతం - ‘మున్నీ బద్నామ్ హుయీ...’ ఆ పాట, ఆ పాటకు మలైకా అరోరా చేసిన డ్యాన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఒకప్పుడు వీడియో జాకీగా పేరున్న 42 ఏళ్ళ ఈ అందగత్తెకూ, ప్రత్యేక ఆకర్షణ నిండిన ఆమె నృత్య గీతాలకూ అంతటి అవినాభావ సంబంధం. ప్రముఖ నటుడు - నిర్మాత అర్బాజ్ ఖాన్, నటి మలైకాలు భార్యాభర్తలన్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరి మధ్య బంధం ఇప్పుడు బెడిసికొట్టిందా? పరిస్థితి విడాకుల దాకా వెళ్ళిందా? అవుననే అంటున్నారు - పరిశీలకులు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఫ్యాషన్ ప్రదర్శనలో మలైక అందమైన దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా, వినిపిస్తున్న విడాకుల వార్తల గురించి ప్రస్తావించగా, ఆమె మాత్రం చిరునవ్వులు చిందించారే తప్ప, పెదవి విప్పలేదు. దాంతో, ఇప్పుడీ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. నిజానికి, గడచిన కొద్ది నెలలుగా మలైకా, అర్బాజ్ ఖాన్ల వివాహం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ, 18 ఏళ్ళుగా వైవాహిక బంధంలో కొనసాగుతూ, 13 ఏళ్ళ కొడుకు (అర్హాన్) కూడా ఉన్న ఈ దంపతులు బాహాటంగా దాని గురించి నోరు విప్పలేదు. చివరకు, అర్బాజ్ ఖాన్ తండ్రి, ప్రసిద్ధ స్క్రిప్ట్ రచయిత అయిన సలీమ్ ఖాన్ (ఒకప్పుడు భారతీయ సినీసీమను ఏలిన సలీమ్ - జావేద్ జంటలో ఒకరు) సైతం కొడుకూ కోడళ్ళ గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. మొత్తానికి, వ్యవహారం చూస్తుంటే, ఏదో తేడాగానే ఉంది. నిప్పు లేనిదే ఇంత పొగ రాదు కదా! -
'లవ్.. బ్రేకప్స్ గురించి నన్ను అడగొద్దు'
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా చివరకు విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సయోధ్య కుదరక ఇక కలిసి సాగకూడదని అనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. ఆఖరికి సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మలైకాతో మాట్లాడిన ఆమె అతడి మాటలు వినేందుక ఆసక్తి చూపలేదని తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయించుకొని డైవర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అర్బాజ్ తండ్రి సలీం ఖాన్‌ను ప్రశ్నించగా 'నేనొక రచయితను. బ్రేకప్ ల గురించి, ప్రేమ వ్యవహారాల గురించి నన్ను అడగకండి. నా పిల్లల విషయాల్లో నేనెప్పుడూ తల దూర్చను. నాకు అసలు ఈ విషయంపై మాట్లాడాలని లేదు. మరోపక్క, మలైకా తల్లి జాయ్స్ పోలీకార్ప్ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 'వాళ్లిద్దరు ఎదిగినవారు. అది వారి వ్యక్తిగత వ్యవహారం. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. నాకు మీడియాతో మాట్లాడాలని కూడా లేదు' అని ఆమె చెప్పింది. -
విడాకులపై వెరైటీగా స్పందించిన అర్భాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ జంట మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ జంట విడిపోనున్నారనే వార్తలపై నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ వెరైటీగా స్పందించాడు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రూమర్లంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు.. కొంతమంది వాళ్ల పని వాళ్లు చూసుకోకుండా.. పని గట్టుకొని ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తారంటూ మండిపడ్డాడు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ చురకలంటించాడు. దీనికి సంబంధించి ఆర్భాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దబ్స్మాష్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశాడు. కుఛ్ తో లోగ్ కహేంగే...లోగోం కా కామ్ హై కహనా.. అనే పాపులర్ హిందీ పాటను దబ్స్మాష్ చేసి మరీ తన కోపాన్ని ప్రదర్శించాడు. కాగా బాలీవుడ్లో అన్యోన్యమైన జంట అర్భాన్, మలైకా విడిపోనున్నారని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేశాయి. 1998లో వివాహం చేసుకున్న వీళ్లిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాఫిక్. మలైకా ఇప్పటికే తన 14 ఏళ్ల కొడుకుతో వేరే అపార్ట్మెంట్లో విడిగా ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్న 'పవర్ కపుల్' లో కూడా కొన్ని రోజులుగా మలైకా కనిపించడం లేదనే కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.. Some people need to mind their business, stop talking and writing bullshit and concentrate on their own miserable lives 🙏🙏🙏 A video posted by Arbaaz Khan (@arbaazkhanofficial) on Feb 1, 2016 at 10:00pm PST -
మరో బాలీవుడ్ జంట కటీఫ్?
మరో బాలీవుడ్ జంట దూరంకాబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా దంపతుల మధ్య మనస్ఫర్థలు ఏర్పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ దంపతులు ఫర్హానా అక్తర్, ఆధున అక్తర్ ఇటీవల విడిపోయారు. కొన్ని నెలల క్రితం ముంబై బాంద్రాలోని ఇంటి నుంచి తన కొడుకు అర్హాన్‌తో కలసి వెళ్లిపోయిన మలైకా.. ఖేర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే మలైకా సోదరి, నటి అమృత అరోరా అత్తమామల నివాసం ఉంది. మలైకా బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనం. అర్బాజ్, మలైకా మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, ఇద్దరూ విడిపోతున్నట్టు పేర్కొంది. మలైకా తెలుగు సూపర్ హిట్ చిత్రం గబ్బర్‌సింగ్‌లో ఐటమ్ సాంగ్‌లో నర్తించిన సంగతి తెలిసిందే. -
'మా బ్రదర్స్ మధ్య కాంపిటిషనే లేదు'
'మా బ్రదర్స్ మధ్య ఎలాంటి కాంపిటేషన్ లేదు. సల్మాన్ ఎక్కడా? నేనెక్కడా? నిజాయితీగా చెప్తున్నా మా మధ్య పోటీ అన్న ముచ్చట లేదు' అంటున్నాడు నటుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్. ఆయన త్వరలోనే 'పవర్ కపుల్' టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు సల్మాన్ ఖాన్ 'బిగ్‌బాస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా షోతో మీ అన్న సల్మాన్ 'బిగ్‌బాస్'కు పోటీగా వస్తున్నారా? అని ప్రశ్నిస్తే అర్బాజ్ అదేమీ లేదంటూ సమాధానమిచ్చాడు. టీవీ కార్యక్రమాల విషయంలో తమ మధ్య పోటీ అనే ప్రసక్తే ఉండదని చెప్పాడు. అర్బాజ్, ఆయన భార్య మలైకా అరోరా ఖాన్ కలిసి సోనీ ఎంటర్టైన్ టెలివిజన్‌లో 'పవర్ కపుల్' షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. టీవీ వ్యాఖ్యాతగా కూడా విజయం సాధిస్తే అంతకన్నా కావాల్సిందేమిటంటూ ఆయన ముక్తాయించాడు. -
'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా'
ముంబయి : భార్య మలైకా అరోరా ఖాన్‌తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తెలిపారు. 'పవర్ కపుల్' అనే రియాల్టీ షోలో మలైకాతో కలిసి పాల్గొనుండటంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను నిర్వహించనున్న ఈ షో షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామనన్న అర్బాజ్ తెలిపాడు. ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును హుషారెత్తించే మలైకా టాలీవుడ్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన స్టెప్పులేసిన విషయం విదితమే. సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇజ్రాయెల్‌లో చేసిన కార్యక్రమానికి ఇది భారతీయ వర్షన్ అని అదే పేరుతోనే షో చేస్తున్నట్లు అర్బాజ్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలు ఏ మేరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు.. ఒకరి గురించి మరొకరికి ఏమేరకు తెలుసు అనే విషయంపై ఈ షో ఉంటుంది. పది జంటలు ఈ షోలో పాల్గొంటాయని, ఈ మేరకు కొన్ని లవ్లీ కపూల్స్ ను తాను కలుసుకున్నట్లు తెలిపాడు. భార్య మలైకాతో కలిసి ఈవెంట్ చేయనుండటం తనను చాలా థ్రిల్లింగ్ అవుతున్నట్లు అర్బాజ్ అంటున్నాడు. -
ఆగస్టు 4 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్నప్రముఖులు: బరాక్ ఒబామా (అమెరికా అధ్యక్షుడు);అర్బాజ్ ఖాన్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వీరు పుట్టిన తేదీ 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్, సైన్స్ రంగాలలోని విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఇతర దేశాలలో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది. లక్కీ నంబర్స్: 2,4, 5,6,7; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, రెడ్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు; సూచనలు: రోజూ రాత్రిపూట వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, రాహుజపం చేయించడం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
సల్మాన్ గురించి కొత్తగా చెప్పేదేముంది?
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై జీవిత చరిత్రను రూపొందిస్తున్నట్లు వచ్చిన వార్తలను దర్శకుడు అర్బాజ్ ఖాన్ ఖండించాడు. తాజాగా చోటు చేసుకున్న ఆ రూమర్లలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపాడు.' నేను సల్మాన్ జీవిత చరిత్రను వెండి తెరకు పరిచయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయినా సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా చూపించడానికి ఏముంది. ఒకవేళ సల్మాన్ అడిగితే మాత్రం అప్పుడు చూద్దాం'అని అర్భాజ్ స్సష్టం చేశాడు. ఇప్పటికే అతను పాపులర్ నటుడని.. అతని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఎవరి జీవిత చరిత్రలను తాను రూపొందించే ప్రయత్నాలు అయితే ఇప్పటివరకూ చేయలేదన్నాడు. కాగా, నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర మాత్రం కచ్చితంగా సవాల్ లాంటిదన్నాడు. అసలు ధోనీ గురించి ఏమీ తీస్తురనే దానిపై తామంతా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అర్బాజ్ తెలిపాడు. -
ఒకటి రెండేళ్లలో దబాంగ్-3
బాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచిన దబాంగ్ సిరీస్‌లో మూడో సినిమా తీయడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.. దర్శకుడు అర్బాజ్ ఖాన్. దబాంగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు ఆర్జించడంతో దబాంగ్2 సినిమాకు స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. ఈ రెండు సినిమాల్లో హీరోగా చేసిన తన సోదరుడితోనే మూడో భాగం కూడా తీసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు అర్బాజ్. అయితే అందుకోసం సల్మాన్, తాను కూర్చుని చర్చించాల్సి ఉందని చెప్పాడు. దీనికి ఒకటి రెండేళ్లు పడుతుందన్నాడు. ఈసారి మాత్రం దర్శకత్వాన్ని వేరే ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందని అర్బాజ్ చెప్పాడు. దబాంగ్ మొదటి పార్ట్ బ్రహ్మాండమైన హిట్ కాగా, దబాంగ్-2 మాత్రం ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో తాను మెగాఫోన్ పట్టుకుంటే అంతగా వర్కవుట్ అవ్వదని అర్థం చేసుకున్న అర్బాజ్.. ఆ పనిని వేరే ఎవరైనా సమర్థులకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. -
అర్బాజ్‌ను మలైకా ఎలా పడేసింది?
ప్రముఖ నటి.. నిర్మాత మలైకా అరోరా ఖాన్ తన ప్రేమకు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించబోతోంది. 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఆమె ఈ విషయాలు చెబుతుందట. తన భర్త అర్బాజ్‌ఖాన్‌తో ప్రేమలో పడేందుకు తాను వండిన వంటకాలు కూడా ఓ కారణమని మలైకా చెబుతోంది. ఆమె అర్బాజ్‌ఖాన్‌తో డేటింగ్లో ఉన్న సమయంలో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ప్రత్యేక వంటకాలు చేసి అతడికి రుచి చూపించిందట. అప్పటికి తనకు పెద్దగా వంట రాకపోయినా.. ఆ రుచి చూసే అర్బాజ్ ఖాన్ పడిపోయాడని, అదికూడా తమ ప్రేమ పండేందుకు ఓ కారణమని మలైకా చెబుతోంది. 1998లో అర్బాజ్, మలైకా పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అర్హాన్ అనే 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కలర్స్ చానల్లో ప్రసారమయ్యే 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఇలాంటివే మరికొన్ని రహస్యాలను మలైకా అరోరా ఖాన్ చెబుతుందట. -
మూడో ‘దబాంగ్’
‘దబాంగ్’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాల్లో చుల్బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. మూడో ‘దబాంగ్ ’ కిక్‌ను బాక్సాఫీస్‌కు రుచి చూపించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు ఈ కండల వీరుడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ధ్రువీకరించారు.ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తామని ఆయన తెలిపారు. సల్మాన్ ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధాన్ పాయో’, ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. -
తాగేసి సెట్లో చిందులు...
సోనమ్ కపూర్... పూటుగా తాగేసి సెట్టంతా చిందులు తొక్కారట. అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కూతురయ్యుండి... ఇంత చౌకబారుగా ప్రవర్తిస్తుందా? అని లొకేషన్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అయితే, ఇక్కడ ట్విస్టు వేరే ఉంది. ఏమిటంటే, ఈ ముద్దుగుమ్మ ‘డాలీ కి డాలీ’ అనే సినిమా చేస్తున్నారు. అభిషేక్ డోగ్రా దర్శకుడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ నిర్మాత. ఈ సినిమాలో కథ రీత్యా సోనమ్ తాగి తూలుతూ పాడే ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ నిమిత్తం నిజమైన విస్కీ బాటిల్‌ని తెప్పించారు దర్శకుడు. పాట షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే... షూటింగ్ పూర్తయ్యాక కూడా సోనమ్ ప్రవర్తనలో మార్పు లేదు. అది గమనించిన కొందరు... ‘ఇంకా పాత్ర నుంచి బయటకు రాలేదనుకుంట’ అనుకున్నారు. ఇంకేముంది! ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చూసి అర్బాజ్‌ఖాన్ కంగారు పడుతుండగా, అసలు విషయాన్ని అప్పుడు బయటపెట్టారు సోనమ్. కాసేపు అందర్నీ ఫూల్స్ చేయాలనిపించి అలా నటించినట్లు చెప్పింది. ఆమె చెప్పేది నిజమని సెట్లో చాలామంది నమ్మలేకపోయారు. అంత గొప్పగా నటించారట సోనమ్. ఎంతైనా గొప్ప నటుడి కూతురు కదా! -
జయహో ట్రైలర్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్